Health-and-Nutrition/C2/Vegetarian-recipes-for-7-month-old-babies/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 21:40, 21 December 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:00 7 నెలల వయస్సు గల పిల్లల కొరకు శాఖాహార వంటకాలపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్‌లో, మనం 7 నెలల వయస్సున్నపిల్లలకు పరిపూరకరమైన ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా
00:16 ఇటు వంటి శాఖాహార వంటకాలను ఎలా తయారు చేయాలి అనేవి నేర్చుకుంటాము.పనసగింజలతో (గంజి లేదా) జావ.
00:23 ఉలవలు తోటకూర ఆకులతో (గంజి లేదా) జావ
00:26 తోటకూర అలసందల (గంజి లేదా) జావ
00:28 మెంతి ఆకులు మరియు బీన్స్ (చిక్కుడు కాయలు) తో (గంజి లేదా) జావ ఇంకా అరికెలు కొమ్ముశనగల తో (గంజి లేదా) జావ.
00:35 మనం ప్రారంభిద్దాం, 1 వ సంవత్సరంలో, బిడ్డ పాకడం మరియు కదలడం ప్రారంభించినప్పుడు, తన పెరుగుదల వేగంగా ఉంటుంది.
00:43 బిడ్డ యొక్క శక్తి అవసరాలు కూడా పెరుగుతాయి.
00:48 6-8 నెలల వయస్సు ఉన్నపిల్లలకు పూరక ఆహరం నుండి 200 కేలరీలు అవసరం.
00:55 ఇచ్చిన ఆహరం యొక్క పరిమాణాన్ని క్రమంగా పెంచాలి.
00:59 ఇది కూడా గుర్తుంచుకోండి - తగినంత పరిపూరకరమైన ఆహారంతో పాటు తల్లి పాలివ్వడం చాలా ముఖ్యం.
01:07 అందువల్ల, బిడ్డకు ఏడు నెలలు నిండినతరువాత, రోజుకు మూడుసార్లు సగం కప్పు పరిపూరకరమైన ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించండి.
01:16 సగం కప్పు అంటే 125 మిల్లీలీటర్లు లేదా 8 టేబుల్ స్పూన్ల ఆహారం అని అర్ధం.
01:22 ఇప్పటికి శిశువు వివిధ ఆహార పదార్థాలతో సౌకర్యంగా ఉంది.
01:28 బిడ్డకు 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు పరిపూరకరమైన ఆహారాన్ని ప్రారంభించాం కనుక.
01:33 ఇప్పుడు బిడ్డకు ఆహారాల కలయికను పరిచయం చేయడం ప్రారంభించండి.
01:38 గమనించండి- గుజ్జుగా చేసినవి మరియు మెత్తగా చేసిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి.
01:44 బిడ్డకు ఇచ్చే ఆహరం అనేది అస్సలు పల్చగా ఉండకూడదు తగినంత చిక్కగా ఉందని నిర్దారించుకోండి.
01:52 బిడ్డ యొక్క ఆహారాన్ని తయారుచేసేటప్పుడు - ఎల్లప్పుడూ ఆ ప్రాంతంలో దొరికేవి ఇంకా కాలానుగుణంగా లభించే పదార్థాలను వాడండి.
01:59 ఇటువంటి వివిధ పోషకమైన పొడులను కూడా కలపాలని గుర్తుంచుకోండి- (కాయలు)గింజలు మరియు విత్తనాల పొడి

మొలకెత్తిన బీన్స్ పొడి

02:08 కరివేపాకు పొడి

మునగాకుల పొడి

02:11 ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో ఇది వివరించబడింది.
02:17 బిడ్డకు ఒక సంవత్సరం నిండేవరకు బిడ్డ యొక్క ఆహారంలో ఉప్పు వేయవద్దు.
02:21 బిడ్డకు రెండు సంవత్సరాలు అయ్యేవరకు బిడ్డ యొక్క ఆహారంలో చక్కెర, బెల్లం లను జోడించవద్దు.
02:27 ఇప్పుడు, మనం - శిశువుకు పరిపూరకరమైన ఆహారంగా ఉపయోగపడే కొన్ని శాఖాహార వంటకాలను చూస్తాము.
02:35 మన మొదటి వంటకం పనసగింజలతో (గంజి లేదా) జావ.
02:39 కావాల్సిన పదార్థాలు:15-20 పనసగింజలు

ఒక చిన్న అరటిపండు లేదా సగం అరటిపండు

02:48 కొబ్బరి పాలు లేదా తల్లి పాలు
02:50 ఒక టీస్పూన్ గింజలు మరియు విత్తనాల పొడి
02:53 పనసగింజల జావ తయారు చేయడానికి- పనసగింజలను బాగా కడగాలి.
02:59 ఒక స్టీల్ గిన్నెలో ఈ గింజలను తీసుకోండి.

గింజలు మునిగేంత వరకు నీరు పోయండి.

03:06 వీటిని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
03:09 ఈ గింజలను ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇంకా

కొంత సమయం వరకు వాటిని చల్లారనివ్వండి.

03:16 తరువాత వాటిని ఒలిచి పైన ఉన్న తొక్కను తీయండి.
03:20 తరువాత, మిక్సర్ లేదా రుబ్బురోలు ఉపయోగించి మెత్తని ముద్ద తయారు చేయండి.
03:25 దీనితో పాటుగా, ఒక పండిన అరటిపండు తోక తీసి ఒక చెంచాను ఉపయోగించి దానిని మాష్ చేయండి.
03:32 ఇప్పుడు మాష్ చేసిన అరటిపండును ఇంకా పనసగింజల ముద్ద రెండిటిని కలపాలి.
03:37 అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు లేదా తల్లి పాలు కలపండి.
03:42 అందులో గింజలు, విత్తనాల యొక్క పొడిని వేయండి.
03:45 దాన్ని బాగా కలపండి.
03:47 ఈ మిశ్రమాన్ని 3-4 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
03:52 పనసగింజల జావ సిద్ధంగా ఉంది.
03:56 ఈ పనసగింజల జావలో-.ప్రోటీన్
03:59 ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్
04:02 పొటాషియం మరియు ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి.
04:06 రెండవ వంటకం ఉలవలు తోటకూర ఆకులతో (గంజి లేదా) జావ.
04:11 దీన్న తయారుచేయడానికి, మనకు అవసరమైనవి: 2 టేబుల్ స్పూన్ల ఉలవపొడి

2 కప్పులు కడిగిన తోటకూర ఆకులు

04:19 ¼ టీస్పూన్ కరివేపాకు పొడి

½ టీస్పూన్ నెయ్యి

04:24 తయారీవిధానం: ముందుగా, ఉలవలను 7 నుండి 8 గంటలు నీటిలోనానబెట్టండి.
04:31 తరువాత వాటిని ఒక స్ట్రైనర్లో ఉంచండి ఇంకా వాటిని నీటితో బాగా కడగండి,
04:37 మొత్తం నీటిని బయటకు వంపేయండి.ఇప్పుడు వాటిని శుభ్రమైన కాటన్ వస్త్రంలో కట్టి, మొలకలువచ్చే వరకు పక్కన ఉంచండి.
04:47 ఈ మొలకెత్తిన ఉలవలను ఒకటి లేదా రెండు రోజులు ఎండలో ఆరబెట్టండి.
04:52 తక్కువ మంట మీద వాటిని 8-10 నిమిషాలు వేయించుకోవాలి.

వాటిని చల్లారనివ్వండి.

04:58 తరువాత వాటిని గ్రైండ్ చేసి పొడి తయారుచేయండి.

ఈ మొత్తం ప్రక్రియను మాల్టింగ్(మొలకెత్తించడం) అంటారు.

05:05 అదే సమయంలో, ఒక పాన్లో నెయ్యి వేడి చేయండి.
05:10 కడిగిన తోటకూర ఆకులను అందులో వేయండి.
05:13 దీన్ని 4-5 నిమిషాలు ఉడికించి చల్లారనివ్వండి
05:17 మిక్సర్ లేదా రుబ్బురోలు ఉపయోగించి మెత్తని ముద్ద తయారు చేయండి.
05:23 తరువాత, ఉలవపిండిలో 2 టేబుల్ స్పూన్ల నీరు కలపండి.
05:28 తరువాత దాన్ని ముద్దలుకట్టకుండా బాగా కలపండి.
05:32 ఈ పల్చని ముద్దను తక్కువ మంట మీద 6-7 నిమిషాలు ఉడికించాలి.
05:37 ఇప్పుడు, ఈ ఉలవల పేస్ట్‌లో తోటకూర ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి.
05:43 తరువాత దాన్ని తక్కువ మంట మీద 2-3 నిమిషాలు ఉడికించాలి.
05:48 అందులో కరివేపాకు పొడి వేసి మళ్ళీ కలపండి.
05:52 మంట మీదనుండి దీనిని తీసేస్తే మన ఉలవలు తోటకూర ఆకుల జావ సిద్ధంగా ఉంది.
05:59 ఈ జావ లో -ప్రోటీన్

ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్ కాల్షియం

06:06 ఫాస్పరస్ ఐరన్ ఇంకా పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
06:10 అటువంటి జావలను తయారు చేయడానికి స్థానికంగా లభించే ఏవైనా బీన్స్ మరియు ఆకు కూరలను ఎవరైనా ఉపయోగించవచ్చని దయచేసి గమనించండి.
06:20 బీన్స్‌ను ఎల్లప్పుడూ వేర్వేరు చిరుభన్యాలు మరియు జొన్న, రాగి, అరికెలు మొదలైనటువంటి ధాన్యాలతో కలపడానికి ప్రయత్నించండి.
06:31 ఈ కలయిక బిడ్డకు పూర్తి ప్రోటీన్ ను అందిస్తుంది.
06:35 మీరు ఈ ధాన్యాలు మరియు చిరుధాన్యాల యొక్క మొలకల పొడులను బిడ్డ యొక్క ఆహారంలో చేర్చవచ్చు లేదా
06:42 మీరు ఉడికించిన చిరుధాన్యాల మొలకలను మెత్తని ముద్దలా చేసి ఇటువంటి జావల్లో కలపవచ్చు
06:48 మూడవ వంటకం తోటకూర గింజలు అలసందల (గంజి లేదా) జావ
06:53 కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్లు తోటకూరగింజల మొలకల పొడి
06:59 2 టేబుల్ స్పూన్లు మొలకెత్తిన అలసందల ముద్ద మరియు

¼ టీస్పూన్ మునగాకుల పొడి

07:06 తయారీ విధానం: మాల్టెడ్ తోటకూరగింజల పొడిని తయారుచేయడానికి-

ఇదే ట్యుటోరియల్ యొక్క మునుపటి రెసిపీలో వివరించిన సూచనలను అనుసరించండి.

07:17 తరువాత, మొలకెత్తిన అలసందలను ఒక స్టీల్ గిన్నెలో తీసుకుని 4 నుండి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
07:26 ఇప్పుడు ఈ ఉడికించిన అలసందల యొక్క ముద్దని తయారు చేయండి.
07:30 తరువాత, ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల తోటకూరగింజల మొలకల పొడిని తీసుకోండి.

అందులో తగినన్ని నీళ్లు పోయండి.

07:38 ఉండలు కట్టకుండా ఉండటానికి దీన్ని బాగా కలపండి.
07:42 ఈ పల్చని తోటకూరగింజల యొక్కపేస్ట్ ను తక్కువ మంట మీద 2-3 నిమిషాలు ఉడికించాలి.

అందులో అలసందల ముద్దని వేయండి

07:52 దాన్ని బాగా కలిపి 4-5 నిమిషాలు ఉడికించండి. మంట మీదనుండి దాన్ని దించేయండి.
07:58 చివర్లో, ఈ వండిన జావలో ¼ టీస్పూన్ మునగఆకుల పొడిని వేయండి.

తోటకూర గింజలు అలసందల (గంజి లేదా) జావ సిద్ధంగా ఉంది

08:09 ఈ తోటకూర గింజలు అలసందల (గంజి లేదా) జావలో -

ప్రోటీన్ ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్

08:17 ఫాస్పరస్

మెగ్నీషియం

08:20 ఐరన్

పొటాషియం మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

08:24 ఇటువంటి జావలను తయారు చేయడానికి ఈ క్రింది మొలకెత్తిన పదార్ధాల కలయికను ఎవరైనా ఉపయోగించవచ్చు-

రాగులు జొన్నలు

08:32 పెద్ద పెసలు

శనగపప్పు మొదలైనవి.

08:37 నాల్గవ వంటకం - మెంతి ఆకులు మరియు బీన్స్ జావ.
08:41 కావాల్సిన పదార్థాలు: కడిగి తరిగిపెట్టిన మెంతి ఆకులు 2 కప్పులు

1 టీస్పూన్ నెయ్యి

08:49 తాజా కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు
08:52 మొలకెత్తిన బీన్స్ పొడి 2 టేబుల్ స్పూన్లు
08:56 బీన్స్ పొడి తయారుచేయడానికి- ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో చర్చించిన సూచనలను అనుసరించండి.
09:04 తయారీవిధానం: పాన్ లో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి.
09:09 మెంతి ఆకులను వేసి 2-3 నిమిషాలు వేయించాలి.
09:13 దానిని శుభ్రమైన ప్లేట్‌ లోకి మార్చండి, కొంచంసేపు దాన్నిచల్లారనివ్వండి.
09:18 తరువాత, గ్రైండర్ లేదా మిక్సర్ ఉపయోగించి దాన్ని మెత్తని ముద్ద చేయండి.
09:23 ఈ ముద్దని తక్కువ మంట మీద ఒక నిమిషం ఉడికించండి.

అందులో 2 టేబుల్ స్పూన్ల బీన్స్ పొడిని వేయండి

09:31 ఉండలు కట్టకుండా ఉండటానికి దీన్ని బాగా కలపండి.
09:35 ఒకవేళ అవసరమైతే, అందులో కొంచం కాచి చలార్చిన నీటిని జోడించండి.
09:40 ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్ వేయండి.
09:44 కొబ్బరి పేస్ట్ ని తయారుచేయడానికి- తాజాగా తురిమిన కొబ్బరికాయ తీసుకొని దాన్ని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి.
09:51 తరువాత ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద 7-8 నిమిషాల సేపు ఆపకుండా కలుపుతూ ఉడికించాలి.
09:58 మెంతి ఆకులు మరియు బీన్స్ జావ సిద్ధంగా ఉంది.
10:03 మెంతి ఆకులు మరియు బీన్స్ జావలో -

ప్రోటీన్ ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్

10:10 ఫోలేట్

ఐరన్

10:12 కాల్షియం

ఫాస్పరస్

10:14 జింక్ మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
10:16 ఈ రెసిపీని తయారుచేసేటప్పుడు ముందు వివరించిన విధంగా ధాన్యాలు కలపడం లేదా దానిని వేర్వేరు ధాన్యాలు మరియు చిరుధాన్యాలతో కలపడం మర్చిపోవద్దు.
10:27 అయిదవ వంటకం అరికెలు కొమ్ముశనగలతో (గంజి లేదా) జావ.
10:32 కావలసినవి: 2 టేబుల్ స్పూన్లు అరికెలు
10:35 2 టేబుల్ స్పూన్ల మొలకెత్తిన కొమ్ముశనగలు
10:38 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు

1 టీస్పూన్ నెయ్యి

10:43 తయారీవిధానం: ఒక స్టీల్ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల అరికెలు తీసుకోండి.
10:48 వాటిని బాగా కడగండి.

తరువాత, అందులో 3-4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేయండి.

10:55 వాటిని 3-4 విజిల్ లు వచ్చే వరకు ఉడికించాలి.
10:58 ఇంతలోపల,మొలకెత్తిన కొమ్ముశనగలను 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి..
11:04 తరువాత దానిని మెత్తనిముద్ద చేయండి
11:07 ఒక స్టీల్ గిన్నెలో 1 టీస్పూన్ నెయ్యిని వేసి వేడి చేయండి.
11:11 ఉడికించిన అరికెలను, కొమ్ముశనగల ముద్దను ఇంకా కొబ్బరిపాలు అందులో వేయండి.
11:18 తరువాత దానిని 4-5 నిమిషాలు ఉడికించి, చల్లారపెట్టండి

ఇప్పుడు అరికెలు కొమ్ముశనగలతో (గంజి లేదా) జావ సిద్ధంగా ఉంది.

11:27 ఈ జావలో- ప్రోటీన్, ఐరన్
11:30 ఫాస్పరస్

మెగ్నీషియం

11:33 కాల్షియం ఇంకా పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
11:36 ఇది 7 నెలల వయస్సున్న పిల్లల కోసం శాఖాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి మనలను తీసుకువస్తుంది.

పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya