Git/C2/Merging-and-Deleting-branches/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Merging and deleting branches పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం Merging గురించి,
00:10 Merging తీసివేయుట, మరియు branches తొలగించడం గురించి నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04 ఉపయోగిస్తున్నాను.
00:20 అలాగే, Git 2.3.2 మరియు gedit Text Editor.
00:26 మీరు మీకు నచ్చిన editorను ఉపయోగించవచ్చు.
00:29 ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు Git commands మరియు Git లో branching గురించి అవగాహన ఉండాలి.
00:37 లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:42 ముందు సిరీస్ లో మనం, branches ను సృష్టించే విధానం నేర్చుకున్నాము.
00:47 ఇప్పుడు మనము రెండు branches ని ఎలా విలీనం చేయాలో నేర్చుకుందాం.
00:51 ఈ రేఖాచిత్రం new-module branch master branch తో ఎలా విలీనం అవుతుందో చూద్దాం.
00:58 ఇది C9 commit లో జరుగుతుంది.
01:01 విలీనం తర్వాత, new-module యొక్క commits master branch కు జోడించబడతాయి.
01:06 ఇది ఎలా పనిచేస్తుందో వివరిస్తాను.
01:09 మొదట, మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage ను తెరుస్తాము.
01:16 Terminal తెరవడానికి Ctrl + Alt + Tకీస్ లను కలిపి నొక్కండి.
01:20 మన Git repository లోకి వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:29 నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.
01:33 మీరు వేరే ఫైల్ టైప్ ని ఉపయోగించవచ్చు.
01:38 ఇక్కడ నుంచి, Terminal పై ప్రతి commandను టైప్ చేసిన తర్వాత Enter key ని నొక్కండి.
01:45 మనం Git branch లిస్ట్ న git space branch టైప్ చేసి తనిఖీ చేద్దాం.
01:51 మనం, master and new-chapter అను రెండు బ్రాంచెస్ ని చూడవచ్చు
01:57 new-chapter branch ఈ శ్రేణిలో ముందుగా సృష్టించబడింది మరియు master అనేది డిఫాల్ట్ branch.
02:05 ప్రస్తుతం, మనము master శాఖలో ఉన్నాము.
02:08 మనం Git space log space hyphen hyphen oneline టైప్ చేయడం ద్వారా Git log ను తనిఖీ చేస్తాము.
02:17 new-chapter branch కు వెళ్ళి, Git log తనిఖీ చేద్దాం.
02:21 git space checkout space new-chapter అని టైప్ చేయండి.
02:27 git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి.
02:33 ఇప్పుడు, మనము master మరియు new-chapter branches యొక్క commits పోల్చుదాము.
02:38 ఈ నాలుగు commits రెండు branches కు ఉమ్మడి బ్రాంచెస్.
02:42 Added story.html in new-chapter branch అనేది new-chapter బ్రాంచ్ లోనిది.
02:48 మరియు Added chapter two in history.html, master బ్రాంచ్ లోనిది.
02:54 మెర్జింగ్ చేసిన తరువాత, Added story.html in new-chapter branch commit master branch జోడించబడుతుంది.
03:02 ఇప్పుడు నేను merge ఎలా చేస్తారో వివరిస్తాను.
03:05 git space merge space master అని టైప్ చేయండి.
03:09 Commit message స్వీకరించడానికి, gedit స్వయంచాలకంగా ఓపెన్ అవుతుంది.
03:14 geditను Git యొక్క core editor గా ఆకృతీకరించామని గుర్తుకుతెచ్చుకొనండి.
03:20 మీరు మరొక editor ను ఆకృతీకరించి ఉంటే ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.
03:26 మీరు 1.9 కంటే తక్కువ Git వర్షన్ ను వాడుతుంటే, editor ఓపెన్ కాకపోవచ్చు.
03:33 కాబట్టి, మీరు తదుపరి దశను వదిలి వేయవచ్చు.
03:36 నేను డిఫాల్ట్ commit messageని అలాగే ఉపయోగిస్తాను.
03:40 మీరు, merging కు సంబంధించిన ఏదైనా ఇతర సందేశమును ఇవ్వాలనుకుంటే, వాటిని ఇక్కడ టైప్ చేయండి.
03:46 ఇప్పుడు, editorని save చేసి close చేయండి.
03:50 Git log ని మళ్ళీ తనిఖీ చేద్దాము.
03:54 మీరు Master branch లోని commits, new-chapter branch కి merge అయ్యిందని చూడవచ్చు.
04:00 మీరు merging కి సంబంధించిన commit సందేశం కూడా చూడవచ్చు.
04:04 తరువాత master branchకి వెళ్ళి commits తనిఖీ చేద్దాము.
04:09 git space checkout space master అని టైప్ చేయండి.
04:14 Git logను తనిఖీ చేద్దాం.
04:17 ఇక్కడ new-chapter commits తో పాటు master branch commits ని చూస్తాము.
04:22 కానీ, Git log master branch commits మాత్రమే చూపిస్తుంది.
04:27 నిజంగా చెప్పాలంటే, master branch కు new-chapter branch ను merge చేయాలి.
04:32 కానీ మనం మరొక విధంగా merge చేసాం.
04:36 అందువల్ల మనము Master branch లో merging commit ని చూడలేము.
04:41 ఈ merging ని తిరిగి ఎలా తీసివేయగలము?
04:45 దీని కోసం, new-chapter బ్రాంచికి తిరిగి వెళ్ళాలి.
04:50 git space checkout space new-chapter అని టైప్ చేయండి.
04:54 git space reset space hyphen hyphen hard space HEAD tilde టైప్ చేసి merge చేసినవి ని తిరిగి పొందవచ్చు.
05:04 లేటెస్ట్ రివిషన్ ను HEAD గాను మరియు లేటెస్ట్ minus 1 రివిషన్ HEAD tilde గాను పిలుస్తామని గుర్తుకు తెచుకొనండి.
05:12 కాబట్టి, మనం merging యొక్క మునుపటి రివిషన్ పొందడానికి, HEAD tilde ని ఉపయోగించాము.
05:18 మళ్ళీ ఒకసారి, Git log తనిఖీ చేద్దాం.
05:22 merging విస్మరించడం మనం చూడవచ్చు.
05:26 ఇప్పుడు మనము new-chapter branch ను master branch కు merge చేద్దాము.
05:31 మనము git space checkout space master అని టైప్ చేసి మొదటి master branch కి వెళ్ళుదాము.
05:38 మరల Git logని తనిఖీ చేద్దాం.
05:42 merge చేయడానికి, git space merge space new-chapter అని టైప్ చేద్దాము.
05:48 gedit లో మీ merging commit message ఇవ్వండి.
05:52 తరువాత ఎడిటర్ ని save చేసి close చేయండి.
05:55 మరల Git log ని తనిఖీ చేయండి.
05:58 master బ్రాంచ్ తో new-chapter బ్రాంచ్ విజయవంతముగా merge అవ్వడం చూడవచ్చు.
06:05 మళ్ళీ merge చేయడానికి ప్రయత్నించుదాం.
06:08 git space merge space new-chapter అని టైప్ చేయండి.
06:13 ఇప్పుడు, మనం Already up-to-date అనే సందేశాన్ని చూడవచ్చు.
06:17 Merge అయినది లేనిది ధృవీకరించడానికి ఇది మంచి మార్గం.
06:22 merging తరువాత, new-chapter శాఖను Git repository నుండి తొలగించవచ్చు.
06:28 git space branch space hyphen d space new-chapter టైప్ చేసి శాఖ ని తొలగించవచ్చు.
06:36 ఇప్పుడు, git space branch టైప్ చేసి branch list ని తనిఖీ చేద్దాం.
06:43 new-chapter బ్రాంచ్ ను తొలగించినందున మనం దానిని చూడలేము.
06:48 Merging చేయకుండా గా బ్రాంచ్ ని తొలగించేందుకు hyphen d చిన్న అక్షరాలకు బదులు hyphen D క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయండి.
06:56 దీనితో ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:00 ట్యుటోరియల్ సారాంశం.
07:02 ఈ ట్యుటోరియల్ లో, merging, merging తీసివేయటం మరియు branches తొలగించడం గురించి మనము తెలుసుకున్నాము.
07:09 ఒక అసైన్మెంట్ గా, మునుపటి కార్యక్రమంలో మనం సృష్టించిన branch chapter-two యొక్క commits తనిఖీ చేయండి.
07:16 దానిని, master branch తో merge చేసి, chapter-2 శాఖను తొలగించండి.
07:22 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
07:27 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
07:30 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:38 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
07:41 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:48 ఈ మిషన్ కి సంబంధించి మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
07:53 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్-వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india