FrontAccounting-2.4.7/C2/Taxes-and-Bank-Account-in-FrontAccounting/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 19:16, 28 May 2020 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 ఫ్రంట్‌అకౌంటింగ్‌లో టాక్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని ఎలాచేయాలి నేర్చుకుంటాం

ఒక కొత్త Tax ను జోడించడం

00:12 Bank Accounts ను సెటప్ చేయడం

Deposits ను జోడించడం

00:16 నగదును Bank Account లోకి బదిలీ చేయడం మరియు

Bank Account ను తిరిగి సరిచేసుకోవడం

00:22 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:

ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04

00:30 ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7
00:35 ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ ఇంకా
00:42 ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్
00:45 మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి.
00:51 ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
00:57 మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి.
01:03 మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం.
01:07 ఒక వెబ్ బ్రౌజర్‌ను తెరిచి,

localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి.

01:16 login పేజీ కనిపిస్తుంది.
01:19 యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.

తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి.

01:26 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది.

Setup టాబ్ పై క్లిక్ చేయండి.

01:33 Company Setup ప్యానెల్‌లో, Taxes లింక్‌పై క్లిక్ చేయండి.

మనం Tax గా ఒక డిఫాల్ట్ entry ను చూడవచ్చు.

01:42 Percentage, Sales GL Account మరియు Purchasing GL Account అనేవి

ఇక్కడ చూపిన విధంగా పేర్కొనబడ్డాయి.

01:51 మనం మన వ్యాపారం చేత ఉపయోగించే ప్రతి tax కు GL accounts ను కేటాయించాలి.
01:57 విండో యొక్క ఎగువభాగం వద్ద, మనం ఒక సందేశాన్ని చూడవచ్చు.
02:00 ప్రతి tax కు ఒక ప్రత్యేక Sale and purchase GL account ను కేటాయించాలని సిఫార్సు చేయబడింది.
02:09 మన company కొరకు GST మరియు Service tax ను ఎలా జోడించాలో మనం చూద్దాం.
02:15 డిఫాల్ట్ entry Tax వరుసలోని Edit ఐకాన్ పై క్లిక్ చేయండి.
02:20 మా company డిఫాల్ట్entry Tax ను ఉపయోగించనందున, నేను Tax ను GST కు సవరిస్తాను.
02:28 నేను డిస్క్రిప్షన్ ను GST కు మరియు పర్శంటేజ్ ను 12 కు మారుస్తాను.
02:35 నేను Sales GL account మరియు Purchase GL Account లను Sales tax గా ఉంచుతాను.
02:42 విడో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Update బటన్ పై క్లిక్ చేయండి.
02:46 మనం డిఫాల్ట్ ఎంట్రీ Tax ను GST కు విజయవంతంగా మార్చాము.
02:52 ఇప్పుడు మనం Service tax ను చేర్చుదాం.

దానికంటే ముందు మనం Service tax కొరకు ఒక GL Account ను సృష్టించాలి.

03:00 Banking and General Ledger టాబ్ పై క్లిక్ చేయండి.
03:04 Maintenance ప్యానెల్‌లో, GL Accounts లింక్‌పై క్లిక్ చేయండి.
03:09 చూపిన విధంగా విలువలను టైప్ చేయండి:

తరువాత విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add Accounte బటన్ పై క్లిక్ చేయండి.

03:17 ఇప్పుడు, Setup టాబ్ పై క్లిక్ చేసి, ఆపై Taxes లింక్ పై క్లిక్ చేయండి.
03:22 మనం Tax Types కింద Service tax ను చేర్చుదాం.
03:27 చూపిన విధంగా విలువలను టైప్ చేయండి.
03:30 Sales GL Account డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
03:35 Current Liabilities కిందన ఉన్న Service Tax ను ఎంచుకోండి.
03:39 అదేవిధంగా, Purchase GL Account కొరకు Service Tax ను ఎంచుకోండి.
03:46 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి.
03:50 ఇప్పుడు రెండు taxes జోడించబడినట్లు మనం చూడవచ్చు.
03:55 ఫ్రంట్ అకౌంటింగ్ యొక్క Sales మాడ్యూల్‌లో ఈ taxes అనేవి ఎలా లెక్కించబడుతున్నాయో మనం చూద్దాం.
04:03 మొదట మనం కంపెనీ కొరకు ఒక Bank Account ను సెటప్ చేస్తాము.
04:07 Banking and General ledger టాబ్ పై క్లిక్ చేయండి.
04:11 Maintenance ప్యానెల్‌లో, Bank Accounts లింక్‌పై క్లిక్ చేయండి.
04:16 ఈ ఎంపిక అనేది bank మరియు cash accounts లను సెటప్ మరియు కాన్ఫిగర్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
04:22 డిఫాల్ట్ గా, మీరు Current account మరియు Petty Cash account వివరాలను చూడవచ్చు.
04:29 Currency కాలమ్ అనేది US Dollar లో ఉంది.

దీన్ని మనం Indian currency కు మార్చుకుందాం.

04:38 Current account row లోని, Edit ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:43 Account type ను Chequing Account కు మార్చండి.
04:48 Bank account currency ను Indian Rupees కు మార్చండి.
04:53 తరువాత దిగువభాగం వద్ద ఉన్నUpdate బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ మార్పులను అప్ డేట్ చేయండి.
04:59 అదేవిధంగా, Petty Cash account ను కూడా Indian Rupees కు మార్చండి.

మరియు మార్పులను అప్ డేట్ చేయండి.

05:11 తరువాత ST Company Pvt. Ltd. bank account కు కొంత నగదు మొత్తాన్ని చేర్చుదాం.
05:17 Banking and General ledger టాబ్‌కు వెళ్లండి.

Transactions ప్యానెల్‌లో, Deposits లింక్‌పై క్లిక్ చేయండి.

05:25 కస్టమర్ల నుండి వచ్చిన డిపాజిట్లు, వివిధరకాల అమ్మకాలు మొదలైనవి ఇక్కడ ఎంటర్ చేయవచ్చు.
05:31 field' ఫీల్డ్‌ను Miscellaneous గా ఉంచండి.

చూపిన విధంగా నేను డబ్బును జమ చేసిన వ్యక్తి యొక్క పేరును నమోదు చేస్తాను.

05:41 Account description ఫీల్డ్‌లో, Cash ను ఎంచుకోండి.
05:45 Amount ఫీల్డ్‌లో, 3 lakhs అని టైప్ చేయండి.
05:49 Memo ఫీల్డ్‌లో, డిపాజిట్ యొక్క ప్రయోజనాన్ని టైప్ చేయండి.
05:54 తరువాత రో యొక్క కుడి చివర ఉన్న Add item బటన్ పై క్లిక్ చేయండి.
05:59 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Process Deposit బటన్ పై క్లిక్ చేయండి.
06:04 క్రొత్త విండోలో, deposit ఎంటర్ చేయబడింది అనే సందేశాన్నిమనం చూడవచ్చు.
06:10 తరువాతి లింక్ అనేది View the GL postings for this Deposit.దానిపై క్లిక్ చేయండి.
06:17 డిపాజిట్ చేసిన నగదు యొక్క ట్రాంజక్షన్ వివరాలతో ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది.
06:24 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నClose లింక్ పై క్లిక్ చేయండి.
06:28 ఒకవేళ మీరు మరొక deposit ను ఎంటర్ చేయాలనుకుంటే, అప్పుడు Enter Another Deposit లింక్ పై క్లిక్ చేయండి
06:34 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి.
06:41 తరువాత మనం bank account నుండి cash లేదా మరొక account కు నగదును ఎలా బదిలీ చేయాలో చూద్దాం.
06:49 Transactions ప్యానెల్‌లో, Bank Account Transfers లింక్‌పై క్లిక్ చేయండి.
06:55 Bank Balance అనేది ఇక్కడ మూడు లక్షల రూపాయలుగా చూపబడిందని గమనించండి.

గుర్తుచేసుకోండి, ఈ మొత్తం ఇంతకు ముందు డిపాజిట్ చేయబడింది.

07:05 To Accountఫీల్డ్‌లో, Petty Cash account ను ఎంచుకోండి.
07:10 Amount ఫీల్డ్ లో, 20,000 ను ఎంటర్ చేయండి.
07:14 Memo ఫీల్డ్‌లో, చూపిన విధంగా టైప్ చేయండి.
07:17 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Enter Transfe బటన్ పై క్లిక్ చేయండి.
07:22 క్రొత్త విండోలో, మనం Transfer has been entered - అనే ఒక సందేశాన్ని చూడవచ్చు.
07:27 తరువాతి లింక్ అనేది View The GL Journal Entries for this Transfer.

entries ను చూడటానికి దానిపై క్లిక్ చేయండి.

07:35 బదిలీ చేయబడిన నగదు యొక్క transaction వివరాలతో ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది.
07:42 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నClose లింక్ పై క్లిక్ చేయండి.
07:46 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి.
07:53 తరువాత, మనం Bank Statements ను తనిఖీ చేస్తాము.
07:57 Transactions' ప్యానెల్‌లో, కుడి వైపు భాగంపైన, Reconcile Bank Accoun లింక్‌పై క్లిక్ చేయండి.
08:04 ఇది company accounts లోని deposits తో Bank statement' లో ఉన్న వాటితో సరిపోల్చుతుంది.
08:10 మనము Account total, Bank Deposits మరియు Fund transferవివరాలను చూడవచ్చు.
08:17 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం.
08:22 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము,

ఒక కొత్త Tax ను జోడించడం

08:27 Bank Accounts ను సెటప్ చేయడం
08:30 Deposits ను జోడించడం
08:32 నగదును Bank Account లోకి బదిలీ చేయడం మరియు
08:35 Bank Account ను తిరిగి సరిచేసుకోవడం
08:39 ఒక అసైన్మెంట్ గా

Deposits ఎంపికను ఉపయోగించి Petty Cash account లోకి Rs.10,000 ను deposit చేయండి.

08:48 From ఫీల్డ్‌లో Miscellaneous ను ఎంచుకోండి

Name ను Mr. Rahul గా ఎంటర్ చేయండి.

08:54 Petty Cash account కొరకు Reconcile Bank Account క్లిక్ చేయండి.
08:59 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
09:07 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

09:18 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌.&nbsp లో పోస్ట్ చేయండి.
09:22 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.


09:28 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya