Difference between revisions of "Drupal/C2/Installation-of-Drupal/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి-
+
| ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్  చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.  
వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్  చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.  
+
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30

Revision as of 17:01, 14 October 2016

Time Narration
00:01 ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.
00:17 ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.
00:30 ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం.
00:38 ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ల అవగాహన ఉండాలి.
00:45 ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకుఅనేక మార్గాలు ఉన్నాయి.
00:48 ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను.
00:57 Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్.
01:05 కనీసం 256 MB RAM.
01:08 కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
01:13 TCP/IP ప్రోటోకాల్ మద్దతు.
01:16 ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్లు:
01:20 ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
01:24 ఏదైనా ఒక 32- బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012.
01:41 ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.
01:46 మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని తెరిచి చూపిన URLకి వెళ్దాం.
01:53 క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ చేద్దాం.
02:01 మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవాలి.
02:06 నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను.
02:11 మీరు గనక ఒక విండోస్ యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి.
02:17 ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం.
02:22 డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
02:29 ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
02:36 మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు.
02:39 కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
02:43 ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
02:50 ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి.
02:53 వెంటనే, ఇన్‌స్టాలర్ యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్పై క్లిక్ చేయండి.
03:01 క్రింది సంస్థాపన సోపానలు విండోస్ మరియు లినక్స్ OSల కోసం సమానమే.
03:07 మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి.
03:15 డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చెయ్యబడిన ఇన్‌స్టాలర్ ఫైల్ని తెరవండి.
03:20 ఈ ఇన్‌స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి.
03:25 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Run as administrator' ఎంపిక ఎంచుకోండి.
03:33 మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Properties' ఎంచుకోండి.
03:40 తదుపరి 'Permissions' టాబ్ పై క్లిక్ చేసి 'Allow executing file as program' ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
03:48 ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
03:52 ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
03:55 సంస్థాపన మొదలవుతుంది. Next బటన్పై క్లిక్ చేయండి.
04:01 ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు.
04:06 ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి.
04:12 నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్పై క్లిక్ చేయండి.
04:18 ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి.
04:24 నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను.
04:27 విండోస్ లో అది డీఫాల్ట్ గా C colon(C:)లో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది.
04:34 Next బటన్పై క్లిక్ చేయండి.
04:36 ఇప్పుడు మనం ఒక ద్రుపల్ అడ్మిన్ ఖాతాని సృష్టించాలి.
04:40 నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
04:47 ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి.
04:50 ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను.
04:56 దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి.
05:00 తరువాత, నిర్వాహకుని కోసం, ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
05:07 లాగిన్ యూజర్ నేమ్ లో నేను 'అడ్మిన్' టైప్ చేస్తాను.
05:11 పాస్వర్డ్ రంగం లో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి.
05:17 మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్ మరియు పాస్వర్డ్ నైనా టైప్ చేయవచ్చు.
05:22 Next బటన్పై క్లిక్ చేయండి.
05:24 లినక్స్ లో, Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQL కోసం అది 3306.
05:34 విండోస్ లో, ఇది 80 మరియు 3306.
05:39 ఆ పోర్ట్లు, ఇదివరకే ఇతర అప్లికేషన్ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది.
05:47 ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
05:54 నేను 3307 వేస్తాను.
05:57 Next బటన్పై క్లిక్ చేయండి.
05:59 ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8గా పేరు టైప్ చేస్తాను.
06:06 మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు.
06:10 Next బటన్పై క్లిక్ చేయండి.
06:12 ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను.
06:19 కాబట్టి, దానిని డి-సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను.
06:23 తదుపరి Next బటన్పై క్లిక్ చేయండి.
06:26 ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్పై క్లిక్ చేయండి.
06:31 సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
06:36 సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack' తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి.
06:43 Finish బటన్పై క్లిక్ చేయండి.
06:46 Bitnami ద్రూపల్ స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
06:51 అన్ని రన్నింగ్ సర్వీస్లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి.
06:56 ఇక్కడ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
07:02 ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి.
07:11 మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్.
07:16 అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది.
07:23 కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.
07:26 మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
07:33 Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
07:36 ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి.
07:42 బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది.
07:46 ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్సైట్కు మళ్ళించబడుతాము.
07:54 వెబ్సైట్ పేరు 'Drupal 8'అని గమనించండి.
07:58 వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి.
08:03 మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం.
08:11 ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
08:14 చిరునామా బార్ లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా //localhost:8080/Drupal/user/1 చూడగలం.
08:27 తరువాతి ట్యుటోరియల్ లో, మనము /user/1 ఆంటే ఏమిటో నేర్చ్కుంటాము.
08:32 ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా '127.0.0.1', చూపవచ్చు.
08:42 తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు. localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal. ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే.
08:57 తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం.
09:03 మీరు ఒక లినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
09:07 ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
09:10 ఎడమ సైడ్బార్ లో, Places కింద Home క్లిక్ చేయండి.
09:15 ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folderపై డబుల్ క్లిక్ చేయండి.
09:23 ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.
09:33 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Toolకు వెళ్ళండి.
09:44 Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది.
09:48 మీరు ద్రూపల్ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి.
09:54 దీని తో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము.
09:57 ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టంల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
10:07 క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి.
10:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
10:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు NVLI,సాంస్కృతిక శాఖ, భారతదేశం ప్రభుత్వంద్వారా నిధులను పొందుతుంది.
10:36 ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya