C-and-Cpp/C3/String-Library-Functions/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:33, 14 July 2016 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 "స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఇన్ సి" పై స్పోకన్ టుటోరియల్ స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో మనం,
00:09 స్ట్రింగ్ లైబ్రరి ఫంక్షన్లను నేర్చుకుంటాం.
00:11 వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
00:15 ఈ టుటోరియల్ రికార్డ్ చేసేందుకు, నేను
00:18 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 మరియు
00:22 జీసీసీ కంపైలర్ వర్షన్ 4.6.1 వాడుతున్నాను.
00:27 స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ పరిచయంతో ప్రారంభిద్దాం.
00:31 ఇవి స్ట్రింగ్ పై చేసే క్రియలను అమలుపరిచే ఫంక్షన్ల సమూహం.
00:36 ప్రతిని చేయుట, జోడించుట, వేతకుట ఇలా వివిధ రకాయల క్రియలకు మద్దతు ఇస్తాయి.
00:44 కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్లను చూద్దాం.
00:48 ఇక్కడ మనకు "strncpy"( స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్ ఉంది.
00:52 దీనికి సింటాక్స్ strncpy(char str1, char str2, మరియు int n );
01:02 ఇది str2 స్ట్రింగ్ లోని మొదటి 'n' అక్షరాలను str1 స్ట్రింగ్ లో కాపీ చేస్తుంది.
01:09 ఉదాహరణకు: char strncpy(char hello, char world, 2);
01:16 ఔట్ పుట్ Wollo కనిపిస్తుంది.
01:21 ఇక్కడ స్ట్రింగ్ 2 నుండి Wo మరియు మిగతా అక్షరాలు స్ట్రింగ్ 1 నుండి వచ్చినవి.
01:29 ఇప్పుడు, strncmp ఫంక్షన్ చూద్దాం. దీని వాక్యనిర్మాణం strncmp(char str1, char str2, మరియు int n);
01:42 ఇది స్ట్రింగ్ 1 తో స్ట్రింగ్ 2 మొదటి 'n' అక్షరాలను సరిపోల్చుతుంది.
01:48 ఉదాహరణ: int strncmp(char ice, char icecream, మరియు 2);
01:55 ఔట్ పుట్ సున్నా వస్తుంది.
01:58 ఇప్పుడు స్ట్రింగ్ లైబ్రరి ఫంక్షన్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం.
02:02 నేను కొన్ని సామాన్యంగా ఉపయోగించే స్ట్రింగ్ ఫంక్షన్లను చూపిస్తాను.
02:07 నేను ప్రోగ్రాంను ఎడిటర్లో రాసి ఉంచాను.
02:10 దాన్ని తెరుస్తాను.
02:12 ఇక్కడ, స్ట్రింగ్ లెంగ్త్ ఫంక్షన్ ఉంది.
02:15 మన ఫైల్ పేరు strlen.c అని గమనించండి.
02:20 ఇందులో, స్ట్రింగ్ యొక్క పొడవు కనుకుంటాం.
02:23 ఇక్కడ stdio.h మరియు string.h. హెడ్డర్ ఫైళ్ళు ఉన్నవి.
02:29 ఇది మెయిన్ ఫంక్షన్.
02:31 ఇక్కడ ఒక క్యారెక్టర్ వేరియబల్ “arr” కనిపిస్తుంది.
02:35 ఇందులో Ashwini అనే పేరు నిల్వ చేసి ఉంది.
02:38 తరువాత ఒక పూర్ణాంక వేరియబల్ len1 ఉంది.
02:42 ఇక్కడ strlen ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్ యొక్క పొడవు కనుకుంటాం.
02:48 ఫలితం 'len1'లో నిల్వ చేయబడును.
02:52 తదుపరి స్ట్రింగ్ మరియు స్ట్రింగ్ లెంత్ ముద్రిస్తాం.
02:56 మరియు ఇది రిటర్న్ స్టేట్మెంట్.
02:59 ప్రోగ్రాంను అమలుపరుచుదాం.
03:01 టర్మినల్ విండో తెరవండి.
03:04 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కండి.
03:09 కంపైల్ చేసేందుకు gcc స్పేస్ strlen.c స్పేస్ -o స్పేస్ str1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:19 డాట్ స్లాష్ str1 (./str1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:24 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
03:26 string = Ashwini, Length = 7
03:30 మీరూ అక్షరాలను లెక్కపెట్టవచ్చు 1,2,3,4,5,6, మరియు 7.
03:37 మరొక string ఫంక్షన్ చూద్దాం.
03:40 ఇక్కడ స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ ఉంది.
03:43 మన ఫైల్ పేరు strcpy.c అని గమనించండి.
03:48 ఇందులో, సోర్స్ స్ట్రింగ్ ని టార్గెట్ స్ట్రింగ్ లోకి కాపీచేస్తాం.
03:53 ఇక్కడ మూల స్ట్రింగ్ లో ఉన్న 'Ice' అక్షరాలు మరొక్క స్ట్రింగ్ కి కాపీచేయబడుతాయి.
03:59 ఇది మన strcpy(స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్.
04:02 ఇక్కడ సోర్స్ స్ట్రింగ్ మరియు టార్గెట్ స్ట్రింగ్ ని ముద్రిస్తాం.
04:07 కోడ్ ని అమలుపరిచి చూద్దాం.
04:09 టర్మినల్కు వద్దామ్.
04:11 కంపైల్ చేసేందుకు, gcc స్పేస్ strcpy.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:20 డాట్ స్లాష్ str2 (./str2 ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:24 ఇది ఔట్ పుట్:
04:26 source string = Ice
04:29 target string = Ice
04:32 ఇప్పుడు మరొక స్ట్రింగ్ ఫంక్షన్ చూద్దాం.
04:34 స్ట్రింగ్ కంపర్ ఫంక్షన్ చూద్దాం.
04:37 మన ఫైల్ పేరు strcmp.c అని గమనించండి.
04:42 ఇందులో, రెండు స్ట్రింగ్లను పోల్చుతాము.
04:46 ఇక్కడ str1 మరియు str2 అనే క్యారెక్టర్ వేరియబల్లు ఉన్నవి.
04:52 "str1" "ice" విలువని నిలువ చేస్తుంది మరియు "str2" "cream" విలువని నిలువ చేస్తుంది.
04:58 ఇక్కడ i మరియు j పూర్ణాంక వేరియబల్లు ఉన్నవి.
05:03 strcmp ఫంక్షన్ ఉపయోగించి స్ట్రింగ్లను పోల్చుతాం.
05:08 ఇక్కడ str1 అంటే “ice”ని “hello”తో పోల్చుతాం.
05:14 ఫలితం iలో నిల్వ చేస్తుంది.
05:16 ఇక్కడ స్ట్రింగ్2 అంటే creamను creamతో పోల్చుతాం.
05:23 ఫలితం jలో నిల్వ చేసి ఉంటుంది.
05:25 ఇక్కడ రెండూ ఫలితాలని ముద్రిస్తాం.
05:28 మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
05:31 ప్రోగ్రాంను అమలుపరుచుదాం.
05:33 టర్మినల్కి వద్దామ్.
05:35 కంపైల్ చేసేందుకు gcc స్పేస్ strcmp.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str3 టైప్ చేసి,
05:46 ఎంటర్ నొక్కండి.
05:47 డాట్ స్లాష్ str3 (./str3) టైప్ చేయండి.
05:50 ఫలితం 1, 0 అని కనిపిస్తుంది.
05:54 ప్రోగ్రాంకి వద్దాం.
05:56 ఇక్కడ మనకు 1 వస్తుంది మరియు ఇక్కడ 0 వస్తుంది.
06:01 మన స్లయిడ్లకు వద్దాం.
06:04 సారాంశం చూద్దాం.
06:06 ఈ టుటోరియల్లో మనం,
06:07 స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్లు అనగా-
06:09 * strlen()
06:11 * strcpy()
06:13 * strcmp()
06:14 * strncpy()
06:16 *మరియు strncmp()లను నేర్చుకున్నాం.
06:19 అసైన్మెంట్ లా:
06:21 స్ట్రింగ్ “best ” మరియు స్ట్రింగ్ “bus”ను జోడించేందుకు ఒక C ప్రోగ్రాం రాయండి.
06:25 హింట్: strcat(char str1, char str2);
06:32 అలాగే, ఇతర స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ లను అన్వేషించగలరు.
06:36 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
06:39 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం.
06:42 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
06:46 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
06:49 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
06:52 ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
06:56 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
07:03 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
07:08 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
07:15 దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.
07:20 ఈ టుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి,
07:24 మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india