C-and-Cpp/C2/Functions/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:42, 25 June 2015 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00.01 C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00.06 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
00.09 ఫంక్షన్ అంటే ఏమి?
00.11 ఫంక్షన్ల సీన్ ట్యాక్స్ .
00.13 రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత.
00.16 వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం.
00.18 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం
00.22 ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి:
00.25 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10
00.29 "gcc" మరియు "g++" కంపైలర్ వర్షన్ "4.6.1"
00.35 ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం.
00.39 ఒక ఫంక్షన్తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం.
00.45 ప్రతి ప్రోగ్రాం లో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి.
00.49 ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చెయ్యబడిన్‌దో అక్కడికే తిరిగి వెళ్ళుతూండి
00.55 ఫంక్షన్ యొక్క సీన్ ట్యాక్స్ చూద్దాం.
00.59 ret-type ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది.
01.05 fun_name ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది.
01.09 parameters అనేవి వేరియ బుల్స్ మరియు వాటి రకాల జాబిత.
01.14 మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు.
01.18 ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు అంటారు.
01.21 మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు
01.26 vodi ఉపయోగించే ప్రోగ్రాం ని చూద్దాం.
01.29 నేను ముందుగానే ప్రోగ్రాం ను ఎడిటర్ లో టైప్ చేసి ఉంచాను.
01.32 దాన్ని తెరుస్తాను.
01.35 మన ఫైల్ పేరు ఫంక్షన్ అని గమనించండి.
01.38 మరియు .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేశాము .
01.43 కోడ్ను వివరిస్తాను.
01.45 ఇది మన "హెడ్డర్" ఫైల్.
01.47 ఉపయోగించే ముడుగానే ఫంక్షన్ను నిర్వచించి ఉండాలి.
01.51 ఇక్కడ add అనే ఫంక్షన్నునిర్వచించినము.
0 1.54 add ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి.
01.58 మరియు రిటర్న్ రకం “void”.
02.01 రెండు విధముల ఫంక్షన్లున్నవి:
02.03 యూసర్-డిఫైన్డ్ అంటే మన యాడ్ లాంటివి, మరియు
02.06 ప్రి - డిఫైన్డ్ (pre-difined) అంటే ప్రింట్ ఎఫ్ (printf) మరియు "మెయిన్"(main) ఫంక్షన్ల లాంటివి .
02.12 ఇక్కడ a మరియు bలకు 2 మరియు 3 విలువలకు ఇనీశ్యలైజ్ చేశాం .
02.19 ఇక్కడ "c" అనే వేరియబుల్ను ప్రకటించాము.
02.21 తదుపరి “a” మరియు “b”ల విలువలను జోడించాము
02.24 ఫలితం "c” లో నిలువ చేశాము
02.27 మన ఫలితాన్ని ముద్రిస్తాం.
02.29 ఇది మన "మెయిన్"ఫంక్షన్ .
02.32 ఇక్కడ యాడ్ ఫంక్షన్ను ఉపయోగిద్దామ్.
02.34 సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది.
02.39 సేవ్ పై క్లిక్ చేయండి.
02.42 ప్రోగ్రాం ను ఎక్సెక్యూట్ చేద్దాం.
02.45 Ctrl, Alt మరియు T కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02.53 gcc” ఫంక్షన్ డాట్ సి హైఫాన్ "o fun" టైప్ చేసి కంపైల్ చేయండి.
03.00 ఎక్సెక్యూట్ చేయుటకు ./fun (డాట్ స్లాష్ ఫన్ ) టైప్ చేయండి.
03.05 Sum of a and b is 5 అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
03.10 ఇపుడు మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
03.13 ఫంక్షన్ లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐదెటిఫయర్స్ ఉన్నవి.
03.20 ఆర్గ్యుమెంట్స్ తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం.
03.23 నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
03.27 int add(int a, int b) అని టైప్ చేయండి.
03.32 ఇక్కడ మనము ఒక్ క్రియ ఫంక్షన్ "add"(యాడ్)ను ప్రకటించాము .
03.36 int a మరియు int b ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్.
03.41 దీన్ని తొలగిద్దాం.
03.42 'a' మరియు 'b'ని ఇన్నీశ్యలైజ్ చేసే అవసరం లేదు.
03.46 "ప్రింట్ఎఫ్" వాక్యాను తొలగించండి.
03.49 "ఇంట్ మెయిన్()" (int main())టైప్ చేయండి.
03.52 ఇక్కడ sum అనే వేరియబుల్ని ప్రకటిద్దాం
03.54 int sum; టైప్ చేయండి.
03.57 తదుపరి sum = add(5,4); టైప్ చేయండి.
04.03 ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్ను ఆహ్వానించాం.
04.05 తరువాత “5” మరియు “4” ప్యారామీటర్లను పంపిస్తాము.
04.10 "a"లో '5' మరియు "b"లో '4' నిలువ చాయబడుతాయి.
04.14 సంకలన క్రియ జరుగును.
04.18 ఫలితమును ముద్రిద్దాం.
04.20 దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి
04.21 'printf(“Sum is %d\n”,sum);' .
04.27 ఫంక్షన్ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి.
04.32 return 0; టైప్ చేయండి.
04.36 వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి.
04.41 సేవ్ పై క్లిక్ చెయండి.
04.43 ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
04.45 టెర్మినల్కు తిరిగి రండి.
04.48 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చెయండి.
04.50 ఎక్సెక్యూట్ చేద్దాం.
04.52 Sum is 9 అని ఔట్ ప్రదర్శింపబడుతుంది.
04.57 ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం.
05.02 మన ప్రోగ్రాంకు వద్దాం
05.04 ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
05.07 ముందుగా Shift, Ctrl and Sకిలను ఏకకాలంలో నొక్కండి.
05.12 ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్ టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి.
05.18 సేవ్ పై క్లిక్ చెయండి.
05.19 ముందుగా " హెడ్డర్ " ఫైల్ను <iostream>కు మారుద్దామ్.
05.24 ఇక్కడ using వాక్యాన్ని ఉప్యోగిద్దాం
05.28 ఫంక్షన్ డిక్లరేషన్ C++ లో C లాగే ఉంటుంది.
05.32 అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు.
05.37 C++ లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను "cout" వాక్యం తో మారుద్దాం.
05.48 మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు.
05.52 కామా తొలగించండి.
05.54 ఇప్పుడు రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
05.58 sum తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి.
06.03 డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ న '\n' టైప్ చేయండి.
06.07 క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించండి.
06.09 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
06.11 ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం.
06.14 టర్మినల్కు తిరిగి వద్దామ్.
06.16 g++ function dot cpp hyphen o fun1 టైప్ చేయండి.
06.23 ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్పుట్ ఓవర్రైట్ చెయ్యకూడదని.
06.31 ఎంటర్ నొక్కండి.
06.34 ./fun1 టైప్ చేయండి.
06.38 Sum is 9 అనే ఔట్పుట్ ప్రదర్శిచబడుతుంది.
06.42 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం.
06.47 ఇక్కడ నేను "4” స్టాన్నం లో x టైప్ చేస్తాను.
06.51 మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను.
06.55 సేవ్ పై క్లిక్ చేయండి.
06.58 ప్రోగ్రాం ను కంపైల్ చేద్దాం.
07.02 పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
07.06 'x ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు.
07.09 ఎందుకంటే "x” ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి.
07.13 దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు.
07.15 మరియు మన యాడ్ (add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది.
07.21 తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది.
07.25 ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం.
07.27 తప్పును సరిదిద్దుదాం.
07.30 పదో వరసలో '4' టైప్ చేయండి.
07.32 సేవ్ పై క్లిక్ చేయండి.
07.35 మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
07.37 ప్రోమ్ప్ట్ ను క్లియర్ (clear) చేస్తాను.
07.40 ప్రోగ్రాం కంపైల్ చేయండి.
07.42 చూసారా సరిపోయింది.
07.45 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం.
07.50 ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి.
07.55 4 తొలగించండి.
07.56 సేవ్ పై క్లిక్ చేయండి.
07.58 టర్మినల్కు వెళ్దాం
08.00 కంపైల్ చేద్దాం.
08.01 పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
08.06 'int add (int, int)' ఫంక్షన్కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి .
08.11 ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి.
08.14 ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది
08.19 int a మరియు int b.
08.22 ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము.
08.25 అందుకే తప్పు అని చూపిస్తుంది.
08.27 తప్పునీ సరిదిద్దుదాం.
08.29 4 టైప్ చేయండి.
08.31 సేవ్ పై క్లిక్ చేయండి.
08.34 టర్మినల్ కు వద్దాం.
08.36 మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
08.39 పనిచేస్తున్నది.
08.42 మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం.
08.44 ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి:
08.49 ఫంక్షన్.
08.50 ఫంక్షన్ యొక్క సీన్ ట్యాక్స్(syntax)
08.51 ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్
08.53 ఉదాహరణకు void add()
08.55 ఆర్గ్యుమెంట్స్ఉన్న ఫంక్షన్స్
08.57 ఉదాహరణకు int add(int a and int b)
09.02 అస్సైంమెంట్ లా
09.03 ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్ను రాయడం.
09.07 ఈ లింక్ లోఉన్న వీడియోని చూడగలరు .
09.11 ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది .
09.14 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
09.18 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
09.21 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది
09.24 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
09.28 మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.org సంప్రదించండి.
09.35 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09.40 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09.47 ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది
09.52 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india