Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Outliner/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 331: Line 331:
 
|-
 
|-
 
||08:32  
 
||08:32  
బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద దృశ్యంతో పని చేస్తున్నప్పుడు, దృశ్యంలో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
+
||బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద దృశ్యంతో పని చేస్తున్నప్పుడు, దృశ్యంలో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  
 
|-
 
|-

Revision as of 12:52, 8 September 2017

Time Narration
00:03 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Outliner window గురించి ఉంటుంది.
00:16 ఈ లిపి స్నేహ డియోరుఖర్ మరియు భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది.
00:28 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనము:
00:33 Outliner window అంటే ఏమిటి;
00:36 Outliner window లో Eye, arrow మరియు camera icons అంటే ఏమిటి మరియు
00:43 Outliner window లో display menu అంటే ఏమిటో నేర్చుకుంటాము.
00:49 Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
00:54 లేకపోతే, దయచేసి మా మునుపటి Basic Description of the Blender Interface ట్యుటోరియల్ ను చూడండి - .
01:03 Outliner అనేది బ్లెండర్లో data యొక్క ఒక flowchart జాబితా.
01:09 డిఫాల్ట్ గా, ఇది 'Blender Interface' యొక్క ఎగువ కుడి మూలలో ఉంది.
01:15 అవుట్ లైనర్ విండో ని resize చేద్దాం.
01:20 దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి దాన్ని క్రిందికి లాగండి.
01:26 ఎడమఅంచున లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి.
01:36 ఇప్పుడు 'Outliner window' లో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు.
01:41 బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి , మన ట్యుటోరియల్-
01:47 How to Change Window Types in Blender ని చుడండి.
01:59 View ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:03 ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి-
02:06 Show Restriction Columns',
02:09 Show Active,
02:11 Show or Hide One level,
02:14 Show Hierarchy,
02:17 Duplicate area into New window మరియు * Toggle full screen.
02:25 Show Restriction Columns ను డే ఆక్టివేట్ చేయండి.
02:30 ఇది 'outliner' విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను దాస్తుంది.
02:42 మళ్ళీ, View ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:46 వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని చూపుటకు Show Restriction Columns ను ఆక్టివేట్ చేయండి.
02:56 'Outliner window' లో Cube యొక్క ఎడమకు plus గుర్తు ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:03 ఒక cascade జాబితా కనిపిస్తుంది.
03:05 ఇది ఎంచుకున్న object యొక్క లక్షణాల జాబితాను చూపుతుంది.
03:11 మనం వీటిని తరువాతి ట్యుటోరియల్ లో వివరాలు చర్చించుకుంటాం.
03:16 కన్ను మీ ఆబ్జెక్ట్ ని 3D view లో చూపించవచ్చు లేదా చూపించలేకపోవచ్చు.
03:24 ఉదాహరణకు, cube కోసం eye లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:29 cube ఇకపై '3D view' లో కనిపించదు.
03:35 మళ్ళీ cube కోసం eye ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:41 ఇప్పుడు, క్యూబ్ను 3D- వ్యూలో చూడవచ్చు.
03:48 Arrow మీ object ని 3D- వ్యూలో ఎంచుకోదగినదిగా లేదా ఎంచుకోలేనిదిగా చేస్తుంది.
03:56 ఉదాహరణకు, cube కోసం arrow లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:02 3D-view లో cube రైట్ క్లిక్ చేయండి. క్యూబ్ ఎంచుకోబడదు.
04:10 మళ్ళీ, 'Outliner’ విండోలో క్యూబ్ కోసం arrow లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:17 3D-view లో cube' రైట్ క్లిక్ చేయండి.
04:21 క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది.
04:28 Camera మీ వస్తువును రెండర్ లేదా నాన్-రెండర్ చేయగలదు.
04:34 క్యూబ్ కోసం Camera' ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:38 దృశ్యాన్ని ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై f12 నొక్కండి .
04:46 cube రెండర్లో కనిపించదు.
04:51 3D-view కు తిరిగి వెళ్లడానికి మీ కీబోర్డ్ పై Esc నొక్కండి.
04:56 మళ్ళీ, 'Outliner’ విండోలో క్యూబ్ కోసం Cameraను లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:03 దృశ్యాన్ని ప్రదర్శించడానికి f12 నొక్కండి.
05:09 ఇప్పుడు క్యూబ్ ను రెండర్ లో చూడవచ్చు.
05:15 3D-view కు తిరిగి వెళ్లడానికి Esc నొక్కండి.
05:21 'Outliner window' లో 'Search' bar ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:28 ఒకవేళ మీ దృశ్యం బహుళ ఆబ్జెక్ట్ లు కలిగి ఉంటే, ఈ శోధన సాధనం సన్నివేశంలో ఇటువంటి సమూహాల ఆబ్జెక్ట్ లు లేదా ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది.
05:40 'Outliner window' యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్నScene మీ 'Blender scene' ని మరియు వాటి సంబంధిత అంశాలలోని అన్ని వస్తువుల జాబితా చేస్తుంది.

'

05:51 All Scenes ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:55 ఈ డ్రాప్-డౌన్ జాబితా display menu.
05:59 ఇది Outliner panel కోసం ప్రదర్శన ఎంపికలను కలిగి ఉంటుంది.
06:04 Current Scene ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:08 మీరు Outliner window' లో జాబితా చేయబడిన ప్రస్తుత దృశ్యం లో ఉన్న అన్ని వస్తువులను చూడవచ్చు.
06:18 ప్రదర్శన మెనుని తెరవడానికి Current Sceneను లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:26 Visible Layersను లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:30 చురుకైన లేయర్ లేదా లేయర్లలో ఉన్న అన్ని వస్తువులు 'Outliner window'లో జాబితా చేయబడ్డాయి.
06:38 తరువాత ట్యుటోరియల్లో Layers గురించి వివరంగా తెలుసుకుంటాం.
06:44 ప్రదర్శన మెనుని తెరవడానికి Visible Layers లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:52 Selected లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:55 Outliner 3D-వ్యూలో ఎంపిక చేయబడిన ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది.
07:04 ప్రదర్శన మెనుని తెరవడానికి Selectedను లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:09 Active ను క్లిక్ చేయండి.
07:12 Outliner 3D-view లో కేవలం ఇటీవల ఎంచుకున్న ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది.
07:22 display menu ని తెరవడానికి Active ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:28 Same Types ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:31 పేరు సూచించినట్లుగా, Same Type ఎంపిక ఒకే రకమైన వర్గానికి చెందిన అన్ని వస్తువులను 'Outliner window' లో జాబితా చేస్తుంది.
07:41 ఉదాహరణకు, cube డిఫాల్ట్గా 3D- వ్యూలో ఎంపిక చేయబడింది.
07:47 కాబట్టి Outliner దృశ్యం లో అన్ని mesh objects జాబితా చేస్తుంది.
07:51 ఈ సందర్భంలో, క్యూబ్ అనేది దృశ్యంలో mesh object మాత్రమే.
07:58 mesh objects గురించి మరింత వివరంగా మరింత ఆధునిక ట్యుటోరియల్లో బ్లెండర్లో Animation గురించి తెలుసుకుందాం.
08:08 display menu ని తెరవడానికి Same Types ను లెఫ్ట్ క్లిక్ చేయండి.


08:14 Groups దృశ్యంలోని అన్ని సమూహ వస్తువులను జాబితా చేస్తుంది.
08:20 ఇక్కడ కొన్ని ఇతర ఎంపికలు ఉన్నాయి, ఇవి మనం తరువాతి ట్యుటోరియల్స్ లో కవర్ చేస్తాము.
08:27 కాబట్టి, ఇది outliner window యొక్క విచ్ఛేదం.
08:32 బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద దృశ్యంతో పని చేస్తున్నప్పుడు, దృశ్యంలో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
08:45 ఇప్పుడు, కొత్త ఫైలు సృష్టించండి,Outliner లో జాబితా ఎంపికచేయండి మరియు క్యూబ్ ని అన్ రెండబుల్ చేయండి.
08:58 ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది.
09:07 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది
09:12 oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.
09:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
09:30 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:34 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:38 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
09:45 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india