Synfig/C3/Rocket-animation/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:00 | Synfig ను ఉపయోగించి Rocket animation పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని సృష్టించడం నేర్చుకుంటాము:
ఫైర్ ఎఫెక్ట్, |
00:11 | కటౌట్ ఎఫెక్ట్, |
00:13 | slope & offset పారామీటర్స్ ను మార్చడం మరియు ఫెదర్ ఎఫెక్ట్. |
00:19 | పైవాటి నన్నిటిని ఉపయోగించి రాకెట్ యానిమేషన్ ను చేయడం కూడా నేర్చుకుంటాము. |
00:24 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ 14.04 OS, Synfig వర్షన్ 1.0.2 |
00:34 | మనం Synfig ను తెరుద్దాం. |
00:36 | నేను నా Documents ఫోల్డర్‌లో ఒక రాకెట్ ఇమేజ్ ను కలిగియున్నాను. |
00:40 | నేను ఈ ఇమేజ్ ను Inkscape లో సృష్టించాను. |
00:43 | ఆ ఇమేజ్ ను మనం import చేద్దాం. Fileకు వెళ్లండి. Import పై క్లిక్ చేయండి. |
00:49 | Rocket ఇమేజ్ ను ఎంచుకోండి. Import పై క్లిక్ చేయండి. |
00:53 | rocket ఇమేజ్ ను గ్రూప్ చేయండి. group layer కు Rocket గా పేరును పెట్టండి. |
00:59 | హ్యాండిల్‌లోని నారింజరంగు బిందువును ఉపయోగించి, చూపిన విధంగా ఇమేజ్ యొక్క సైజ్ ను తగ్గించండి. |
01:06 | మన ఫైల్‌ను save చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
01:11 | నేను ఫైల్‌ను డెస్క్‌టాప్‌లో సేవ్ చేస్తాను. ఫైల్ పేరును Rocket hyphen animation కు మార్చండి. |
01:20 | Save పై క్లిక్ చేయండి. ఇప్పుడు, మనం ఫైర్ ను సృష్టిద్దాం. |
01:23 | Fill color ను నలుపు రంగుకు మరియు Outline color ను తెలుపు రంగుకు మార్చండి. |
01:31 | Layers panel కు వెళ్లండి. Rocket group లేయర్‌పై రైట్ క్లిక్ చేయండి. |
01:36 | New layer ను ఎంచుకోండి, Gradient పై క్లిక్ చేసి, ఆపై Noise Gradient పైన. |
01:43 | ఒక బ్లాక్ అండ్ వైట్ noise gradient అనేది canvas పైన సృష్టించబడింది. |
01:47 | Tool box కు వెళ్ళండి. Gradient tool పై క్లిక్ చేయండి. |
01:52 | Tool options లో, create a linear gradient పై క్లిక్ చెయ్యండి. |
01:57 | ఇప్పుడు, పైభాగం నుండి క్రింది వరకు canvas పైన క్లిక్ చేసి లాగండి. |
02:02 | ఒక బ్లాక్ అండ్ వైట్ linear gradient అనేది canvas పైన సృష్టించబడిందని గమనించండి. |
02:08 | Transform tool ని ఎంచుకోండి.
లేయర్ పేరును BW-Gradien కు మార్చండి. |
02:16 | Parameters panel లో, Blend method ను Subtract కు మార్చండి. |
02:22 | Rectangle tool ని ఎంచుకోండి. canvas మొత్తాన్ని కప్పేలాగా ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
02:29 | Transform tool పై క్లిక్ చేసి, layer పేరును Orange కు మార్చండి. |
02:35 | ఇప్పుడు, మనం దీర్ఘచతురస్రం యొక్క రంగును ముదురు నారింజ రంగులోకి మారుద్దాం. |
02:40 | Parameters panel లో, Color parameter పై క్లిక్ చేయండి. |
02:45 | RGB విలువలను వరుసగా 100, 55 మరియు 10 కి మార్చండి.
డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
02:56 | మళ్ళీ Parameters panel లో, Blend method ను Color కు మార్చండి. |
03:01 | Noise gradient లేయర్ ను గ్రూప్ చెయ్యండి. పేరును Moving-base కు మార్చండి. |
03:10 | Parameters panel లో, Origin పై క్లిక్ చేయండి. |
03:14 | Convert పై క్లిక్ చేసి, ఆపై Linear పై చెయ్యండి. |
03:19 | Origin యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి. |
03:22 | Slope విలువలను 0 మరియు -100 కు ఇంకా Offset విలువలను 0 మరియు 100 కు వరుసగా మార్చండి. |
03:32 | ఇప్పుడు ఫైర్ ఎఫెక్ట్ సృష్టించబడింది.
ఎఫెక్ట్ ను తనిఖీ చేయడానికి Play బటన్ పై క్లిక్ చేయండి. |
03:38 | తరువాత, రాకెట్ యొక్క సైజ్ కి అనుగుణంగా ఎఫెక్ట్ ను తగ్గించుకుందాం. |
03:43 | ఇప్పుడు Rocket layer మినహా అన్ని లేయర్స్ ను గ్రూప్ చెయ్యండి. |
03:47 | పేరును Fire కు మార్చండి. |
03:50 | ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
03:54 | Tool box కు వెళ్లండి, Cutout tool ని ఎంచుకోండి. |
03:58 | చూపిన విధంగా ఫైర్ ఎఫెక్ట్ ను తగ్గించండి. గ్రూప్ లేయర్ పేరు Fire cut కు మార్చబడిందని గమనించండి. |
04:06 | Transform tool ని ఎంచుకోండి. |
04:09 | handle యొక్క నారింజరంగు బిందువును ఉపయోగించి, ఫైర్ యొక్క సైజ్ ను తగ్గించండి. |
04:14 | ఈ లేయర్ ను Rocket layer కిందికి తరలించండి. |
04:19 | డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి. Mask layer ను ఎంచుకోండి. ఇప్పుడు మనం nodes ను సర్దుబాటు చేయవచ్చు. |
04:27 | Parameters panel లో, Feather parameter ను 25 కు మార్చండి. |
04:33 | ఫెదర్ ఎఫెక్ట్ అనేది ఫైర్ కు అనువర్తించబడింది అని గమనించండి. |
04:38 | ఇప్పుడు మనం ఫైర్ ను యానిమేట్ చేస్తాము. Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:44 | 3rd ఫ్రేమ్‌కి వెళ్లండి. Keyframes panel లో ఒక keyframe ను జోడించండి. |
04:49 | చూపిన విధంగా ఫైర్ యొక్క nodes ను సర్దుబాటు చేయండి. |
04:56 | ఇప్పుడు 6th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel లో, zeroeth frame ను డూప్లికేట్ చేయండి. |
05:03 | తరువాత, మనం ఈ ఫైర్ యానిమేషన్ ను లూప్ చేస్తాము. కనుక, Fire cut group layer పై రైట్ క్లిక్ చేయండి. |
05:10 | New layer పై క్లిక్ చేయండి, తర్వాత Other పై క్లిక్ చేసి ఆపై Time loop పైన చేయండి. |
05:17 | Parameters panel లో, Duration parameter ను 12 కు మార్చండి. |
05:24 | యానిమేషన్‌ను తనిఖీ చేయడానికి Play బటన్ పై క్లిక్ చేయండి. |
05:33 | తరువాత, మనం రాకెట్‌ను యానిమేట్ చేద్దాం. కనుక, అన్ని layers ను గ్రూప్ చెయ్యండి. |
05:39 | Group layer పేరును Rocket కు మార్చండి. |
05:42 | zeroth frame కు వెళ్లండి. చూపిన విధంగా రాకెట్‌ను కాన్వాస్ యొక్క దిగువభాగానికి తరలించండి. |
05:48 | ఇప్పుడు, 100th ఫ్రేమ్‌కు వెళ్లండి. రాకెట్‌ను canvas యొక్క పైభాగానికి తరలించండి. |
05:55 | ఇప్పుడు rocket animation అనేది పూర్తయింది. |
05:58 | ఇప్పుడు మనం, నేను Inkscape లో సృష్టించిన బాక్గ్రౌండ్ ఇమేజ్ ను చేర్చుదాం. |
06:03 | నేను ఈ ఇమేజ్ ను Documents ఫోల్డర్‌లో సేవ్ చేసాను. |
06:06 | File కి వెళ్ళండి. Import పై క్లిక్ చేయండి. |
06:11 | ఈ లేయర్ ను Rocket group layer క్రిందకి తరలించండి |
06:15 | ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
06:18 | చివరగా మనం యానిమేషన్ ను రెండర్ చేస్తాము.
File కు వెళ్లండి. Render పై క్లిక్ చేయండి. |
06:25 | నేను అవుట్పుట్ను Desktop లో సేవ్ చేస్తాను.
extension ను avi కు మార్చండి. Target ను fmpeg కు. |
06:34 | ఇప్పుడు Render పై క్లిక్ చేయండి. |
06:37 | ఇప్పుడు మనం మన యానిమేషన్‌ను తనిఖీ చేస్తాము.
డెస్క్‌టాప్‌కు వెళ్లండి. output file పై రైట్ క్లిక్ చేసి మన యానిమేషన్ ను play చెయ్యండి. |
06:45 | మన రాకెట్ యానిమేషన్ చూడటానికి ఇలా ఉంది. |
06:48 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
సారాంశం చూద్దాం. |
06:53 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము Fire ఎఫెక్ట్ ను సృష్టించడం, |
06:58 | Cut out ఎఫెక్ట్,
slope & offset పారామీటర్స్ ను మార్చడం, Feather ఎఫెక్ట్. |
07:02 | మనం రాకెట్ యానిమేషన్ ను చేయడం కూడా నేర్చుకున్నాము. |
07:05 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్ ఉంది - ఒక వుడ్ ఫైర్ యానిమేషన్ ను సృష్టించండి. |
07:10 | వుడ్ ఇమేజ్ మీకు Code files లింక్‌లో అందించబడింది. |
07:14 | మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
07:18 | ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి. |
07:23 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి. |
07:32 | దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
07:35 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
07:45 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |