Synfig/C2/E-card-animation/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Synfig ను ఉపయోగించి E-card animation పై ఈ Spoken Tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో, మనం కొన్ని png ఇమేజెస్ ను ఉపయోగించి ఒక E-card animation ను సృష్టించడం నేర్చుకుంటాము. |
00:11 | ఇక్కడ, మనం వీటిని కూడా నేర్చుకుంటాం- png ఫార్మాట్ ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేయడం, |
00:16 | ఆ ఇమేజెస్ ను యానిమేట్ చేయడం, |
00:18 | టెక్స్ట్ యానిమేషన్ చేయడం, |
00:20 | యానిమేషన్ ని ప్రివ్యూ చేయడం, |
00:22 | యానిమేషన్ ని avi ఫార్మాట్ లో రెండర్ చేయడం. |
00:25 | ఈ ట్యుటోరియల్ కొరకు, నేను ఉపయోగిస్తున్నాను: ఉబుంటు లైనక్స్ 14.04 OS, |
00:32 | Synfig వర్షన్ 1.0.2 |
00:35 | మనం Synfig ను తెరుద్దాం. |
00:38 | డాష్ హోమ్ కు వెళ్లి, Synfig అని టైప్ చేయండి. |
00:42 | లోగో పై క్లిక్ చేయడం ద్వారా మీరు Synfig ను తెరవవచ్చు. |
00:47 | ఇప్పుడు, మనం ఇ-కార్డ్ యానిమేషన్ ను సృష్టించడం ప్రారంభిద్దాం. |
00:52 | మొదట మనం మన Synfig ఫైల్ ను save చెయ్యాలి. |
00:56 | File కు వెళ్లి, Save పై క్లిక్ చేయండి. |
00:59 | సేవ్ చేయవలసిన ఫోల్డర్‌ను ఎంచుకోండి. |
01:02 | ఫైల్ పేరును E-card-animation అని టైప్ చేసి, Save బటన్ పై క్లిక్ చేయండి. |
01:07 | మొదట మనం Toolbox కు వెళ్లి, Rectangle టూల్ పై క్లిక్ చేస్తాము. |
01:12 | ప్రదర్శించినట్లుగా canvas పై ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
01:17 | import చేసిన ఇమేజ్ అనేది canvas లోపలికి సరిపోయే విధంగా మనం సెట్టింగులను మారుస్తాము. |
01:23 | అలా చేయడానికి, Edit కు వెళ్లండి. Preferences పై క్లిక్ చేసి, ఆపై Misc పై క్లిక్ చెయ్యండి. |
01:30 | Scaling new imported image to fix canvas ఎంపికపై క్లిక్ చేయండి. |
01:35 | ఇప్పుడు, Ok పై క్లిక్ చేయండి. ఈ ఎంపిక అనేది canvas లో సరిపోయే ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేస్తుంది. |
01:44 | దయచేసి గమనించండి: మనం png ఫార్మాట్లోని ఇమేజెస్ నే దిగుమతి చేసుకోవాలి. |
01:49 | ఇది ఎందుకంటే jpg / jpeg వంటి ఇతర ఇమేజ్ ఫార్మట్ లు అనేవి Synfig canvas పై భిన్నంగా ప్రవర్తిస్తాయి. |
01:58 | అలాగే, రెండరింగ్ చేసిన తరువాత, అవుట్‌పుట్ క్వాలిటీ అనేది png ఇమేజెస్ ను ఉపయోగించినప్పుడు బాగుంటుంది. |
02:05 | మనం Synfig ఇంటర్ఫేస్కు తిరిగి వద్దాం. |
02:09 | File కు వెళ్లి, Import పై క్లిక్ చేయండి. |
02:12 | నేను అవసరమైన ఇమేజ్ లను, నా Documents ఫోల్డర్లోపల E-card-animation folder లో సేవ్ చేసాను. |
02:20 | ఈ ఇమేజ్ లు ఈ వెబ్పేజీలోనే Code files లింక్‌లో అందించబడ్డాయి. |
02:26 | దయచేసి Code files లింక్ ను కనుగొని ఆ ఇమేజెస్ ను మీ మెషీన్లో save చెయ్యండి. |
02:31 | ఇప్పుడు, నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. |
02:34 | Bg ఇమేజ్ ను ఎంచుకుని, Import పై క్లిక్ చేయండి. |
02:37 | మనం canvas పైన Bg ఇమేజ్ ను పొందుతాము. |
02:41 | ఆ ఇమేజ్ ను resize చేయాలంటే - Bg ఇమేజ్ ను canvas కు సరిపోయేలా చేయడానికి, మొదట నారింజరంగు బిందువును లేదా నారింజరంగు డక్ ను పట్టుకుని, చూపినవిధంగా mouse ను లోపల లేదా బయట కదపండి. |
02:55 | ఇప్పుడు, ఫోల్డర్‌లోని Cake ఇమేజ్ ను ఎంచుకుని, Import పై క్లిక్ చెయ్యండి. |
03:00 | మనం మన canvas పైన Cake ఇమేజ్ ను పొందుతాము. అదే విధంగా, మిగిలిన అన్ని ఇమేజెస్ ను కూడా import చెయ్యండి. |
03:08 | గమనించండి, మనం - Cake, Flowers మరియు Balloons అనే పేర్లుగల మూడు కొత్త లేయర్స్ ను కలిగియున్నాము. |
03:14 | ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ ను resize చేద్దాం. Layers panel కు వెళ్లండి. |
03:19 | మొదట Cake లేయర్ ను ఎంచుకోండి. ఎంపికచేసుకున్నదానిపై, రీసైజ్ హ్యాండిల్స్ అనేవి canvas పైన కనిపిస్తాయి. |
03:27 | నారింజరంగు బిందువు పై క్లిక్ చేసి, Cake ఇమేజ్ ను రీసైజ్ చెయ్యండి. |
03:32 | అదే విధానాన్ని పునరావృతం చేసి మిగిలిన రెండు ఇమేజెస్ ని కూడా రీసైజ్ చెయ్యండి. |
03:38 | ఇప్పుడు, ఇమేజెస్ ను కదిపి, ప్రదర్శించినట్లుగా వాటిని canvas కు బయట ఉంచండి. |
03:45 | తర్వాత Animation panel ప్యానెల్‌కు వెళ్లండి. Turn on animate editing mode icon పై క్లిక్ చేయండి. |
03:52 | Time cursor ను 30th ఫ్రేమ్‌లో ఉంచండి. |
03:56 | Cake లేయర్ ను ఎంచుకోండి. |
03:58 | చూపిన విధంగా, Cake ఇమేజ్ ను canvas యొక్క ఎడమవైపు దిగువభాగానికి తరలించండి. |
04:05 | తరువాత, Balloons లేయర్ ను ఎంచుకోండి. |
04:08 | Time cursor ను 30th ఫ్రేమ్‌లో ఉంచండి. |
04:11 | Keyframes panel కు వెళ్లి Add a keyframe పై క్లిక్ చెయ్యండి. |
04:16 | ఇప్పుడు, Time cursor ను 48th ఫ్రేమ్‌లో ఉంచండి. |
04:21 | Keyframes panel కు వెళ్లి Add a keyframe పై క్లిక్ చెయ్యండి. |
04:27 | Balloons ఇమేజ్ ను canvas యొక్క మధ్య- ఎడమభాగం వైపుకు తరలించండి. |
04:31 | మళ్ళీ, Time cursor ను 60th ఫ్రేమ్‌లో ఉంచండి. |
04:36 | Keyframes panel కు వెళ్లి Add a keyframe పై క్లిక్ చెయ్యండి. |
04:41 | Flowers ఇమేజ్ ను canvas యొక్క కుడి దిగువభాగానికి తరలించండి. |
04:47 | తరువాత, ఈ యానిమేషన్‌తో వెళ్ళడానికి మనం టెక్స్ట్ యొక్క ఒక లైన్ ని జోడిస్తాము. |
04:52 | దీనికంటే ముందు, నన్ను యానిమేషన్‌ను స్విచ్ ఆఫ్ చేయనివ్వండి. |
04:57 | అలా చేయడానికి, Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి. |
05:02 | మనం టెక్స్ట్ ని జోడిద్దాం. డిఫాల్ట్ Fill colour అనేది తెలుపు ఉంది కాబట్టి, తెలుపురంగు బాక్గ్రౌండ్ పైన టెక్స్ట్ మనకి కనిపించదు. |
05:12 | కనుక, నేను ఈ రంగును నలుపుకు మారుస్తాను. |
05:16 | ఇప్పుడు, Toolbox కు వెళ్లి, Text Tool పై క్లిక్ చేయండి. |
05:20 | తరువాత canvas పైన ఎక్కడైనా క్లిక్ చేయండి. మనం ఒక Input text డైలాగ్ బాక్స్ ను పొందుతాము. |
05:27 | ఇక్కడ, మనం Happy Birthday అనే టెక్స్ట్ ను టైప్ చేస్తాము. |
05:32 | Ok పై క్లిక్ చేయండి. |
05:36 | ఇప్పుడు canvas పైన టెక్స్ట్ ని మనం చూడగలమని గమనించండి. |
05:40 | ఇప్పుడు, Layers ప్యానెల్‌కు వెళ్లి, text layer ని ఎంచుకోండి. |
05:45 | తరువాత Parameters panel కు వెళ్లి, Size పై క్లిక్ చెయ్యండి. |
05:51 | దానియొక్క విలువను 80 పిక్సెల్స్ కు మార్చండి, ఆపై colour విలువను వైలెట్ కు మార్చండి. |
05:57 | Toolbox కు వెళ్లి, Text Tool పై క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి canvas పై క్లిక్ చేయండి. |
06:04 | మనకు మరొక Input text డైలాగ్ బాక్స్ వస్తుంది. |
06:09 | ఈ టెక్స్ట్ బాక్స్ లో, Have a wonderful, happy, healthy birthday now and forever అని టైప్ చేయండి. |
06:21 | ఆపై Ok పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం canvas పైన ఈ టెక్స్ట్ ను కూడా చూడవచ్చు. |
06:27 | Parameters panel కు వెళ్లి, Size పై క్లిక్ చేయండి. |
06:32 | విలువను 30 పిక్సెల్స్ కు మార్చండి మరియు colour ను నలుపుకు మార్చండి. |
06:38 | ఇప్పుడు, మనం Layers panel కు వెళ్దాం. |
06:41 | మొదటి text layer పై క్లిక్ చేసి, ఆ layer పేరును Happy Birthday కు మార్చండి. |
06:48 | అదేవిధంగా, మరొక text layer పై క్లిక్ చేసి, ఆ layer పేరును Now and Forever కు మార్చండి. |
06:56 | లేయర్స్ కు తగినట్లుగా పేరును పెట్టడం అనేది మంచి అలవాటు. |
07:01 | భవిష్యత్తులో వాటిని సులభంగా గుర్తించడానికి ఇది మనకు సహాయపడుతుంది. |
07:06 | ఇప్పుడు, ప్రదర్శించిన విధంగా text layers ను canvas వెలుపలకు తరలించండి. |
07:13 | Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి. |
07:18 | తర్వాత, Layers panel కి వెళ్లండి. Happy Birthday లేయర్ ను ఎంచుకోండి. |
07:24 | ఇప్పుడు, Time cursor ను 72 వ ఫ్రేమ్ పై ఉంచండి. |
07:29 | Keyframes panel కు వెళ్లి, Add a keyframe పై క్లిక్ చేయండి. ప్రదర్శించిన విధంగా టెక్స్ట్ ను తరలించండి. |
07:37 | తరువాత, Layers panel కు వెళ్లి, Now and forever లేయర్ ను ఎంచుకోండి. |
07:44 | తర్వాత Time cursor ను 90th ఫ్రేమ్ పై ఉంచండి. |
07:48 | మరొకసారి Keyframes panel కు వెళ్లి, Add a keyframe పై క్లిక్ చేయండి. |
07:55 | ఇప్పుడు, canvas కు వెళ్లి, ప్రదర్శించిన విధంగా Now and forever టెక్స్ట్ ను తరలించండి. |
08:02 | ఇప్పుడు మన Synfig ఫైల్ ను save చేద్దాం. |
08:05 | File కు వెళ్లి Save పై క్లిక్ చెయ్యండి. |
08:09 | ఇప్పుడు మనం ను preview తనిఖీ చేద్దాం. File కు వెళ్లి, ఆపై Preview పై క్లిక్ చేయండి. |
08:15 | quality ను 0.5 గా మరియు Frame per second ను 24 గా సెట్ చేయండి. |
08:24 | Preview బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత Play బటన్ పై క్లిక్ చేయండి. |
08:29 | మనం యానిమేషన్ యొక్క ప్రివ్యూను screen పైన చూడవచ్చు. |
08:33 | Preview విండోను మూసివేయండి. |
08:35 | చివరగా, మన యానిమేషన్‌ను రెండర్ చేద్దాం. |
08:38 | అలా చేయడానికి, File పై క్లిక్ చేసి, ఆపై Render పై క్లిక్ చేయండి. |
08:43 | Render setting విండోకు వెళ్ళండి. |
08:46 | Choose పై క్లిక్ చేయండి. Save render as విండోను తెరవండి. |
08:50 | Document పై క్లిక్ చేయండి. E-card-animation folder పై క్లిక్ చేయండి. |
08:55 | పేరును E-card-animation.avi కు మార్చండి. |
09:00 | Target డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేయండి. extension ను ffmpeg గా ఎంచుకోండి. |
09:06 | Time టాబ్‌పై క్లిక్ చేసి, End time ను110 కు మార్చండి. తర్వాత Render పై క్లిక్ చెయ్యండి. |
09:20 | మన యానిమేషన్‌ను తనిఖీ చేద్దాం. Documents కు వెళ్లండి. |
09:24 | E- card-animation ఫోల్డర్‌పై డబల్ క్లిక్ చెయ్యండి. |
09:26 | E- card-animation.avi ను ఎంచుకోండి. |
09:30 | రైట్ క్లిక్ చేసి Firefox వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి యానిమేషన్‌ను ప్లే చెయ్యండి. |
09:39 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
09:44 | సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్‌లో, మనం E-card యానిమేషన్‌ను సృష్టించడం నేర్చుకున్నాము. |
09:50 | మనం ఇవి కూడా నేర్చుకున్నాము: ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేయడం, |
09:54 | ఇమేజెస్ ను యానిమేట్ చేయడం, టెక్స్ట్ యానిమేషన్ ను చేయడం, |
09:57 | యానిమేషన్‌ను ప్రివ్యూ చేయడం మరియు యానిమేషన్‌ను .avi ఫార్మట్ లో రెండర్ చేయడం. |
10:04 | మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్. Code files లింక్‌లో అందించబడిన Flower ఇమేజ్ ను కనుగొనండి. |
10:11 | ఈ ఫ్లవర్ ఇమేజెస్ ను ఉపయోగించి, ఇదేవిధమైన ఒక యానిమేషన్‌ను సృష్టించండి. |
10:16 | కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని చూడండి. |
10:23 | మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
10:31 | దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
10:35 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
10:42 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |