Synfig/C2/Create-a-star-animation/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Synfig ను ఉపయోగించి Star animation పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని సృష్టించడం నేర్చుకుంటాము: గ్రేడియంట్ కలర్ యానిమేషన్,
00:12 గ్రూప్ లేయర్స్ మరియు స్టార్ యానిమేషన్.
00:16 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:

ఉబుంటు లైనక్స్ 14.04 OS,

00:22 Synfig వర్షన్ 1.0.2
00:26 మనం Synfig ను తెరుద్దాం.
00:28 నేను నా Documents ఫోల్డర్‌లో ఒక బ్రాంచ్ ఇమేజ్‌ని సృష్టించాను.
00:33 ఆ చిత్రం మీకు Code files లింక్‌లో అందించబడింది. దాన్నిమనం import చేద్దాం.
00:38 File ‌కు వెళ్లండి. Import పై క్లిక్ చేయండి. బ్రాంచ్ ఇమేజ్ ని ఎంచుకోండి.
00:44 Layers panel ‌కు వెళ్లండి. Branch layer ని ఎంచుకోండి.
00:48 ఇప్పుడు handle కనిపిస్తుంది.
00:51 నారింజరంగు బిందువుపై క్లిక్ చేసి, చూపిన విధంగా ఇమేజ్ ను రీసైజ్ చెయ్యండి.
00:55 ఆకుపచ్చరంగు బిందువుపై క్లిక్ చేసి, దానిని canvas యొక్క దిగువభాగానికి తరలించండి.
01:00 ఇప్పుడు మనం మన ఫైల్ ను save చేద్దాం. File కు వెళ్లండి. Save పై క్లిక్ చేయండి.

నేను ఫైల్‌ను Desktop ‌లో సేవ్ చేస్తాను.

01:08 డిఫాల్ట్ పేరును Star hyphen animation కు మార్చండి.

Save పై క్లిక్ చెయ్యండి.

01:15 తరువాత, మనం కొన్ని నక్షత్రాలను సృష్టిద్దాం.
01:18 ఇప్పుడు Tool box ‌కు వెళ్లండి. Star too ‌పై క్లిక్ చేయండి.
01:22 canvas లో బ్రాంచ్ కు పైన ఉన్న ఖాళీ ప్రదేశంలో 10 నక్షత్రాలను సృష్టించండి.
01:31 Layers panel ‌కు వెళ్లండి. shift కీని ఉపయోగించి అన్ని స్టార్ layers ను ఎంచుకోండి.
01:37 ఇప్పుడు వాటిని గ్రూప్ చేయడానికి దిగువభాగం వద్ద ఉన్న group icon పై క్లిక్ చేయండి.
01:41 గ్రూప్ లేయర్ కు Stars అని పేరు మార్చండి. Stars group layer ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చెయ్యండి.
01:49 తరువాత, మనం ఒక గ్రేడియంట్ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం.

Tool box ‌కు వెళ్లండి. Gradient tool పై క్లిక్ చేయండి.

01:56 Tool options panel ‌లో, Create a linear gradient ఎంపిక అనేది ఎంచుకోబడిందో లేదో తనిఖీ చేయండి.
02:03 canvas యొక్క పైభాగంలో ఉన్న mouse పై క్లిక్ చేసి, దాన్నిదిగువభాగం వరకు లాగండి.
02:08 ఒక బ్లాక్ అండ్ వైట్ (నలుపు మరియు తెలుపు) gradient అనేది canvas పైన కనిపిస్తుందని గమనించండి.
02:14 Parameters panel ‌కు వెళ్లండి.

Gradient value పై డబల్ క్లిక్ చేయండి. ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.

02:21 ఇక్కడ దిగువభాగం వద్ద ఉన్నబాక్స్ లో ప్రతి చివర వద్ద 2 Color stop icons అనేవి ఉన్నాయని గమనించండి.
02:27 ఈ ఐకాన్స్ గ్రేడియంట్ యొక్క 2 రంగులను సూచిస్తాయి.
02:31 ఎడమవైపు Color stop icon అనేది default చేత ఎంపిక చేయబడింది. రంగును లేత నీలం రంగులోకి మార్చండి.
02:38 తరువాత, కుడివైపు Color stop icon ను ఎంచుకోండి. రంగును తెలుపురంగుకు మార్చండి.

డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.

02:46 canvas లో రంగు మార్పును గమనించండి.
02:50 Animation panel ‌లో, Turn on Animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి.
02:55 తరువాత 25th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel ‌లో ఒక కొత్త keyframe ను జోడించండి.
03:01 Parameters panel కు వెళ్ళండి.

Gradient parameter విలువ పై క్లిక్ చెయ్యండి.

03:08 ఎడమవైపు రంగును నలుపుకు మరియు కుడివైపు రంగు ముదురు నీలం రంగులోకి మార్చండి.
03:15 Time track panel పైన waypoints అనేవి సృష్టించబడ్డాయని గమనించండి.
03:20 canvas ‌లో రంగు మార్పును గమనించడానికి సున్నామరియు 25th ఫ్రేమ్‌ల మధ్య Time cursor ను లాగండి.
03:28 మన ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
03:32 మనం గ్రేడియంట్ బ్యాక్ గ్రౌండ్ ను దిగువభాగానికి తరలించాలి.
03:36 కనుక, Layers panel ‌కు వెళ్లండి. Lower layer బటన్‌ పై రెండుసార్లు క్లిక్ చేయండి.
03:41 తరువాత మనం నక్షత్రాల యొక్క ఆల్ఫా విలువను యానిమేట్ చేద్దాం. కనుక, Stars group layer ను ఎంచుకోండి.
03:48 సున్నా ఫ్రేమ్‌కు వెళ్లండి.
03:51 Parameters panel లో, Amount parameter యొక్క విలువ పై డబల్ క్లిక్ చెయ్యండి.
03:56 విలువను సున్నాకి మార్చండి. Enter ను నొక్కండి.
04:00 నక్షత్రాలు అనేవి ఇప్పుడు కనిపించవని గమనించండి.
04:04 తరువాత 25th ఫ్రేమ్‌కు వెళ్లండి. మళ్ళీ Amount parameter విలువను 0 కి మార్చండి.
04:10 తరువాత 40th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel ‌లో ఒక కొత్త keyframe ను జోడించండి.
04:17 Parameters panel లో, Amount parameter విలువను 1 కి మార్చండి.
04:23 తరువాత 55th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel ‌లో, 25th ఫ్రేమ్‌ను ఎంచుకోండి. Duplicate icon పై క్లిక్ చేయండి.
04:32 తరువాత 70th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel ‌లో, 40th ఫ్రేమ్‌ను ఎంచుకోండి. Duplicate icon పై క్లిక్ చేయండి.
04:41 మన ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
04:45 చివరగా మనం ఇప్పుడు మన యానిమేషన్ ను రెండర్ చేస్తాము.
04:49 File ‌కు వెళ్లండి. Render పై క్లిక్ చేయండి.
04:53 extension ను avi కి మార్చండి. టార్గెట్ ను ffmpeg కు మార్చండి.

Render పై క్లిక్ చెయ్యండి.

05:03 ఇప్పుడు మనం Desktop కి వెళ్లి, ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించి యానిమేషన్‌ను ప్లే చేద్దాం.
05:10 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.

సారాంశం చూద్దాం.

05:15 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని సృష్టించడం నేర్చుకున్నాము: గ్రేడియంట్ కలర్ యానిమేషన్,

గ్రూప్ లేయర్స్ మరియు స్టార్ యానిమేషన్.

05:24 మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్.

సన్ రైజ్ యానిమేషన్‌ను సృష్టించండి. Code files లింక్‌లో ఈ ఇమేజ్ మీకు అందించబడుతుంది.

05:33 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
05:37 కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.

05:45 మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
05:52 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
05:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
06:02 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya