Synfig/C2/Bouncing-ball-animation/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Synfig ను ఉపయోగించి Bouncing Ball animation పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig యొక్క ఇంటర్‌ఫేస్ గురించి నేర్చుకుంటాము. |
00:12 | మనం వీటిని కూడా నేర్చుకుంటాము: ప్రాథమిక ఆకృతులను గీయడం మరియు రంగును నింపడం, |
00:16 | కీ ఫ్రేమ్‌లను మరియు వే పాయింట్‌లను జోడించడం, |
00:19 | స్క్వాష్ ఎఫెక్ట్ ను ఉపయోగించి ఒక బాల్ ని యానిమేట్ చేయడం, |
00:22 | అవుట్పుట్ ను gif ఫార్మాట్ లో తిరిగిఇవ్వడం. |
00:26 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ 14.04 ఆపరేటింగ్ సిస్టమ్, Synfig వర్షన్ 1.0.2 |
00:37 | డాష్ హోమ్ కు వెళ్లి, Synfig అని టైప్ చేయండి. |
00:40 | లోగో పై క్లిక్ చేయడం ద్వారా మీరు Synfig ను తెరవవచ్చు. |
00:44 | ఇది Synfig యొక్క ఇంటర్ఫేస్. |
00:46 | మెనూ బార్ ఎగువ భాగం వద్ద ఉంది. |
00:50 | స్టాండర్డ్ టూల్ బార్ అనేది మెనూ బార్ క్రిందన ఉంది. ఇక్కడ, మనం షార్ట్కట్ మరియు హ్యాండిల్స్ ఎంపికల యొక్క కొన్నింటిని చూస్తాము. |
00:58 | దీని తరువాత క్షితిజ సమాంతర మరియు నిలువు రూలర్స్ ఉంటాయి. |
01:02 | టూల్ బాక్స్ అనేది ఇంటర్ఫేస్ యొక్క ఎడమ భాగం పైన ఉంది. |
01:06 | టూల్ బాక్స్ క్రిందనే, రెండు బాక్స్ లు ఉన్నాయని గమనించండి. |
01:10 | ఎగువన ఉన్న బాక్స్ నలుపు రంగులో ఉంటుంది. మరియు ఇది Outline color అని టూల్-టిప్ చెప్తుంది. |
01:16 | దిగువన ఉన్న బాక్స్ తెలుపు రంగులో ఉంటుంది. మరియు ఇది Fill color అని టూల్-టిప్ చెప్తుంది. |
01:21 | మధ్య భాగంలో, కాన్వాస్ ఉంది. ఇక్కడే మనం మన యానిమేషన్ ను చేస్తాము. |
01:27 | కాన్వాస్ క్రిందన, యానిమేషన్ ప్యానెల్ ఉంది. |
01:30 | ఇక్కడ, యానిమేషన్‌కు సంబంధించిన బటన్ లను మనం చూడవచ్చు. |
01:35 | ఇంటర్ఫేస్ యొక్క దిగువ ఎడమ భాగం వద్ద పారామీటర్స్ ప్యానల్ ఉంది. |
01:39 | మనం కాన్వాస్ పైన ఒక ఆబ్జెక్ట్ ను సృష్టించిన తర్వాత పారామీటర్స్ అనేవి కనిపిస్తాయి. |
01:43 | దీనికి ప్రక్కనే, కీఫ్రేమ్స్ ప్యానెల్ ఉంది. ఇక్కడే మనం కీఫ్రేమ్స్ ను జోడిస్తాము. |
01:49 | ఈ ప్యానెల్ యొక్క కుడి వైపున, మనం టైమ్ ట్రాక్ ప్యానెల్ ను కనుగొనవచ్చు. |
01:54 | ఇక్కడే, మనం వే పాయింట్స్ మరియు యానిమేషన్ యొక్క కీ ఫ్రేమ్ సూచనలను చూడగలుగుతాము. |
02:01 | కాన్వాస్ పైన మనం ఒక ఆబ్జెక్ట్ ను సృష్టించిన తర్వాత వే పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. |
02:05 | ఇంటర్ఫేస్ యొక్క కుడి దిగువ భాగం వద్ద, లేయర్స్ ప్యానెల్ ఉంది. |
02:10 | లేయర్స్ ప్యానెల్ కు పైన, మనం టూల్ ఆప్షన్స్ ప్యానెల్ ను చూడవచ్చు. |
02:14 | మరియు ఈ ప్యానెల్ కు పైన, మీరు కాన్వాస్ బ్రౌజర్, |
02:19 | పాలెట్ ఎడిటర్, |
02:21 | నావిగేటర్ మరియు ఇన్ఫో ప్యానల్స్ లను కనుగొనవచ్చు. |
02:24 | మనం వీటితో వెళ్తున్నప్పుడు, ఇవన్నీ వాడటం మనం అలవాటు చేసుకోవచ్చు. |
02:28 | ఇప్పుడు, మనం మన మొదటి యానిమేషన్ తో ప్రారంభిద్దాం. |
02:31 | మొదట, మనం ఒక బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిస్తాము. |
02:34 | Tool box కు వెళ్ళండి. Rectangle toolపై క్లిక్ చేయండి. |
02:37 | Tool options panel లో మార్పును గమనించండి. |
02:41 | Layer Type కింద, మనం చాలా ఐకాన్ లను చూడవచ్చు. |
02:44 | Create a region layer ఐకాన్ ను ఎంచుకోండి. ఈ డెమో కోసం, మనం ఇతర సెట్టింగులను అలాగే ఉంచుతాము. |
02:51 | ప్రదర్శించినట్లుగా ఇప్పుడు కాన్వాస్ యొక్క 3/4 వ వంతు భాగాన్నికవర్ చేసేలాగ ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
02:57 | డిఫాల్ట్ ఫిల్ కలర్ అనేది తెలుపు రంగు ఉందని దయచేసి గమనించండి, ఒకవేళ మనం canvas కు వెలుపల గీసినట్లయితే, ఆబ్జెక్ట్ ను గుర్తించడం కష్టమని ఇది సూచిస్తుంది. |
03:07 | Layers Panel లో ఒక layer సృష్టించబడిందని గమనించండి. |
03:11 | Synfig అప్రమేయంగా దీనికి ఒక పేరును ఇస్తుంది. ఇక్కడ ఇది Rectangle060Region అని చెబుతుంది. |
03:18 | layers కు అర్ధవంతమైన పేర్లను ఇవ్వడం అనేది ఎల్లప్పుడూ మంచి పద్ధతి. |
03:21 | layers యొక్కపెద్ద లిస్ట్ నుండి ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను గుర్తించడానికి ఇది మనకు సహాయపడుతుంది. |
03:28 | మనం సంక్లిష్టమైన animations ను సృష్టించినప్పుడు మీరు దీని గురించి మరింత గొప్పగా తెలుసుకుంటారు. |
03:32 | Synfig ఇంటర్‌ఫేస్‌కు తిరిగి రండి. |
03:35 | నేను ఈ డిఫాల్ట్ layer పేరును Sky గా మారుస్తాను. |
03:39 | కనుక, పేరుపై క్లిక్ చేసి, Sky అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:43 | ఇపుడు ఈ layer యొక్కపేరు sky. |
03:46 | దయచేసి కర్సర్ చాలా సున్నితమైనదని గమనించండి. అందువల్ల, మునుపటి చర్య యొక్క నకిలీ ఏర్పడకుండా నిరోధించడానికి యాదృచ్ఛికంగా క్లిక్ చేయడం చేయకండి. |
03:55 | దీర్ఘచతురస్రం యొక్క పారామీటర్స్ అనేవి Parameters panel లో సృష్టించబడతాయి. |
04:00 | Color parameter ను కనుగొని, Value కాలమ్ పై డబుల్ క్లిక్ చేయండి. వెంటనే, ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
04:08 | RGB scrollers ను లాగడం ద్వారా రంగును నీలం రంగులోకి మార్చండి. |
04:13 | ఇప్పుడు, ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
04:15 | తరువాత, Transform tool పై క్లిక్ చేయండి. |
04:19 | తరువాత Sky layer ఎంపికను తీసివేయడానికి canvas కి బయట క్లిక్ చేయండి. |
04:24 | ఇప్పుడు మళ్ళీ Rectangle tool ని ఎంచుకోండి. |
04:26 | canvas యొక్క దిగువ భాగంలో మరొక దీర్ఘచతురస్రాన్ని సృష్టించండి. |
04:31 | ఇంతకు ముందు చూపిన విధంగా, లేయర్ పేరును Ground కు మరియు రంగును ఆకుపచ్చ కు మార్చండి. |
04:40 | Transform tool ని ఎంచుకొని లేయర్ ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చేయండి. |
04:46 | తరువాత, మనం ఒక బాల్ ని గీద్దాం.Toolbox లో, Circle tool పై క్లిక్ చేయండి. |
04:52 | Layer Type కింద, Create a region layer ను ఎంచుకోవాలి. |
04:57 | canvas యొక్క ఎగువ భాగంపై క్లిక్ చేసి, ఒక వృత్తాన్నిగీయండి. |
05:01 | Layers panel లో, ముందు చూపిన విధంగా లేయర్ కు, Ball గా పేరును మార్చండి. |
05:07 | రంగును ఎరుపుకు మార్చండి. |
05:11 | ఇప్పుడు మనం బాల్ ని యానిమేట్ చేయడం ప్రారంభిద్దాం. Transform tool ని ఎంచుకోండి. |
05:16 | Animation panel లో, Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి. |
05:22 | స్క్రీన్ పైన కనిపించే ఎరుపు దీర్ఘచతురస్రపు బోర్డర్ అనేది, మనం యానిమేషన్ మోడ్‌లో ఉన్నట్లు సూచిస్తుంది. |
05:29 | current frame బాక్స్‌లో 9 ని ఎంటర్ చేయండి. Enter నొక్కండి. |
05:34 | తరువాత, Keyframes panel పై క్లిక్ చేయండి. |
05:36 | ఇక్కడ, ఒక క్రొత్త keyframe ను జోడించడానికి పచ్చరంగులో ఉన్న ప్లస్ గుర్తు ఐకాన్‌పై క్లిక్ చేయండి. |
05:41 | canvas పై ఉన్న బాల్ ని ఎంచుకోండి. |
05:44 | బాల్ మధ్యలో ఉన్న ఒక ఆకుపచ్చ బిందువును గమనించండి. |
05:47 | బాల్ ని canvas యొక్క దిగువ భాగానికి తరలించడానికి ఈ ఆకుపచ్చ బిందువును లాగండి. |
05:52 | ప్రదర్శించినట్లుగా, బాల్ ని కింది నుండి కొద్దిగా పైకి తరలించండి. |
05:55 | లాగేటప్పుడు అది సరళ మార్గంలో వెళ్ళడానికి shift key ని ఉపయోగించండి. |
05:59 | Time track panel పైన waypoints అనేవి సృష్టించబడ్డాయని గమనించండి. |
06:04 | మనం 11 వ ఫ్రేమ్‌కు వెళ్దాం. మరొకసారి, ముందు చూపిన విధంగా ఒక క్రొత్త keyframe ను జోడించండి. |
06:12 | బాల్ భూమిని తాకుతున్నట్లుగా ఉండేలాగా బాల్ ని కొద్దిగా క్రిందికి తరలించండి. |
06:16 | బాల్ చుట్టూ నారింజ మరియు పసుపు రంగు చుక్కలను గమనించండి. వీటిని handles అంటారు. |
06:22 | స్క్వాష్డ్ ఎఫెక్ట్ ను ఇవ్వడానికి handles లోని నారింజ రంగు చుక్కలను ఉపయోగించి, ప్రదర్శించిన విధంగా బాల్ ని Resize చెయ్యండి. |
06:31 | Time cursor ను 13 వ ఫ్రేమ్‌కు తరలించండి. |
06:36 | Keyframes panel పైన 9 వ ఫ్రేమ్‌ను ఎంచుకోండి. |
06:39 | దిగువ భాగం వద్ద ఉన్న Duplicate ఐకాన్ పై క్లిక్ చేయండి. |
06:43 | Time cursor ను 24 వ ఫ్రేమ్‌కు తరలించండి. |
06:46 | Keyframes panel పైన సున్నా ఫ్రేమ్‌ను ఎంచుకోండి. |
06:50 | మళ్ళీ, దిగువ భాగం వద్ద ఉన్న Duplicate ఐకాన్ పై క్లిక్ చేయండి. |
06:53 | సున్నా ఫ్రేమ్‌కు వెళ్లండి. బాల్ ఎంపికను తీసివేయడానికి canvas కు బయట క్లిక్ చేయండి. |
06:59 | మనం సృష్టించిన animation ను చూడటానికి Play బటన్ పై క్లిక్ చేయండి. |
07:04 | ఇప్పుడు Pause బటన్ పై క్లిక్ చేయండి. |
07:07 | చివరగా, మనం ఫైల్ ను save చేద్దాం. |
07:09 | File కు వెళ్లి, Save పై క్లిక్ చేయండి. నేను Desktop లో సేవ్ చేస్తాను. |
07:14 | ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా Synfig ఫైల్‌కు డిఫాల్ట్ పేరును ఇస్తుంది. |
07:18 | నేను ఈ పేరును Bouncing-ball గా మారుస్తాను. |
07:22 | అందుబాటులో ఉన్న Synfig ఫైల్ extension లు అనేవి dot sifz, dot sif, dot sfg అని గమనించండి. |
07:31 | నేను dot sifz ఫార్మాట్ ను ఎంచుకుంటాను. |
07:34 | Save పై క్లిక్ చేయండి.ఇప్పుడు మనం యానిమేషన్‌ను రెండర్ చేద్దాం. |
07:39 | File కు వెళ్లి, Render పై క్లిక్ చెయ్యండి. |
07:42 | Render settings డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
07:45 | .Gif ఎక్స్టెన్షన్ తో, మీ ప్రాధాన్యత ప్రకారం ఫైల్ కు తగిన పేరును ఇవ్వండి. |
07:50 | save చేసే ప్రదేశాన్ని ఎంచుకోవడానికి Choose బటన్ పై క్లిక్ చేయండి. |
07:54 | నేను Desktop ను ఎంచుకుని, ఆపై OK పై క్లిక్ చేస్తాను. |
07:57 | Target డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, Magick++ ఎంచుకోండి. |
08:03 | Quality ను గరిష్ఠానికి పెంచండి, అంటే, ప్లస్ గుర్తుపై 9 ని క్లిక్ చేయడం ద్వారా. ఈ విలువ ఎప్పుడూ 3 కంటే తక్కువ ఉండకూడదు. |
08:11 | Image సెట్టింగులను అలాగే ఉంచేయండి. |
08:14 | Time టాబ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ, frame rate అనేది 24 fps గా ఉండాలి. |
08:20 | ఇది జర్క్స్ లేకుండా ఒక మృదువైన animation ను ఇస్తుంది. |
08:24 | మన animation 24 వ సెకనుతో ముగుస్తుంది కాబట్టి, End Time ను 24 కి మార్చండి. Enter నొక్కండి. |
08:31 | చివరగా, దిగువ భాగం వద్ద ఉన్న Render బటన్ పై క్లిక్ చేయండి. ఇది అవుట్‌పుట్‌ను తిరిగి అందించడానికి కొన్నిసెకన్లు పట్టవచ్చు. |
08:38 | ఇప్పుడు, నన్నుDesktop కి వెళ్లనివ్వండి, అక్కడే నేను నా.gif ఫైల్ ని సేవ్ చేసాను. |
08:44 | మనం Firefox ను గానీ లేదా ఏదైనా web browser ను ఉపయోగించి animation ను ప్లే చేయవచ్చు. |
08:48 | ఈ animation నుప్లే చేయడానికి మీకు internet connection అవసరం లేదని దయచేసి గమనించండి. |
08:54 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
08:57 | సారాంశం చూద్దాం. |
08:59 | ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig యొక్క ఇంటర్‌ఫేస్ గురించి నేర్చుకున్నాము. |
09:03 | మనం ఇవి కూడా నేర్చుకున్నాము: ప్రాథమిక ఆకృతులను గీయడం మరియు రంగును నింపడం, |
09:07 | కీ ఫ్రేమ్‌లను మరియు వే పాయింట్‌లను జోడించడం, |
09:10 | స్క్వాష్ ఎఫెక్ట్ తో ఒక బాల్ ని యానిమేషన్ చేయడం, |
09:13 | అవుట్పుట్ ను gif ఫార్మాట్ లో తిరిగిఇవ్వడం. |
09:16 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్ ఉంది. స్లాంటింగ్ పాత్ లో ఒక ball animation ను సృష్టించండి. |
09:23 | మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
09:27 | ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి. |
09:33 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. |
09:38 | ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాల కొరకు. దయచేసి మాకు రాయండి. |
09:44 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా? దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి. |
09:49 | మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి. |
09:52 | మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు. |
09:58 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్. |
10:02 | దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. |
10:08 | తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు. |
10:13 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ nmeict ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:23 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |