Synfig/C2/Animate-a-Toy-train/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Synfig ను ఉపయోగించి Animate a toy train అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం ఇంతకు ముందు సృష్టించిన టాయ్ ట్రైన్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము.
00:12 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:

ఉబుంటు లైనక్స్ 14.04 ఆపరేటింగ్ సిస్టమ్, Synfig వర్షన్ 1.0.2

00:21 మనం మన Train Synfig ఫైల్‌ను తెరుద్దాం.
00:25 దయచేసి మీ సిస్టమ్‌లో మీరు సేవ్ చేసిన మీ Train Synfig ఫైల్‌ను తెరవండి.
00:29 మనం యానిమేషన్‌తో ప్రారంభిద్దాం.
00:31 Engine group layer యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి.
00:36 ఏదైనా Wheel group layer ‌పై రైట్ క్లిక్ చేయండి.
00:39 Star లేయర్ ను ఎంచుకోండి.
00:41 మళ్ళీ రైట్ క్లిక్ చేసి, New layer పై క్లిక్ చేయండి.
00:45 తరువాత Transform పై క్లిక్ చేసి, ఆపై Rotate పై చెయ్యండి.
00:50 ఇప్పుడు Rotate effect అనేది వీల్ కి అనువర్తించబడింది.
00:54 యాంకర్ పాయింట్‌ను వీల్ యొక్క మధ్యభాగానికి తరలించండి.
00:58 Animation panel ‌లో, Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:05 Current frame బాక్స్‌లో 24 అని టైప్ చేయండి.
01:09 Parameters panel కు వెళ్లండి.
01:11 Amount parameter యొక్క విలువపై డబల్ - క్లిక్ చేసి, విలువను 360 కి మార్చండి.
01:18 Time track panel పై waypoints అనేవి సృష్టించబడ్డాయని గమనించండి.
01:23 ఆ 2 waypoints మధ్య Time cursor ను క్లిక్ చేసి లాగండి మరియు వీల్ యొక్క రొటేషన్ ను తనిఖీ చేయండి.
01:29 Ctrl + S ను నొక్కడం ద్వారా ఫైల్‌ను సేవ్ చెయ్యండి.
01:33 ఈ రొటేషన్ ఎఫెక్ట్ కొరకు ఇప్పుడు మనం టైమ్ లూప్‌ను క్రియేట్ చేద్దాం.
01:37 Rotate effect layer పై రైట్ క్లిక్ చేసి, New layer పై క్లిక్ చెయ్యండి.
01:42 తరువాత Other పైన ఆపై Time Loop పైన క్లిక్ చేయండి.
01:48 Parameters panel ‌లో, Only For Positive Duration యొక్క చెక్‌బాక్స్‌ను టిక్ చేయండి.
01:55 తరువాత, మనం అన్ని వీల్స్ కు Rotate & Time Loop ఎఫెక్ట్స్ ను జోడిద్దాం.
02:00 కనుక, Shift key ని ఉపయోగించి ఎఫెక్ట్ లేయర్స్ రెండిటినీ ఎంచుకోండి.
02:05 లేయర్స్ ను copy చేయడానికి Ctrl మరియు C కీలను నొక్కండి.
02:09 ఇప్పుడు, Wheel-1 group layer యొక్క డ్రాప్‌డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి.
02:13 లేయర్స్ ను పేస్ట్ చేయడానికి Ctrl మరియు V కీలను నొక్కండి.
02:17 అన్ని వీల్స్ కు అదే పద్ధతిని పునరావృతం చేయండి.
02:24 ఇప్పుడు టాయ్ ట్రైన్ యొక్క అన్ని వీల్స్ కు రొటేషన్ ఎఫెక్ట్ అనువర్తించబడింది.
02:29 Ctrl + S ను నొక్కడం ద్వారా ఫైల్‌ను మరోసారి సేవ్ చేయండి.
02:34 ఇప్పుడు మనం ట్రైన్ ను యానిమేట్ చేద్దాం.
02:37 Rail మినహా గ్రూప్ లేయర్స్ అన్నింటిని ఎంచుకోండి.
02:41 వాటన్నిటినీ కలిపి గ్రూప్ చేయండి, మరియు గ్రూప్ లేయర్ పేరును Train గా మార్చండి.
02:47 Time cursor సున్నా ఫ్రేమ్‌లో ఉందని నిర్ధారించుకోండి.
02:52 Shift కీని ఉపయోగించి, ట్రైన్ ను canvas కు బయట కుడి వైపుకు లాగండి.
02:57 Time cursor ను 100 వ ఫ్రేమ్‌కు తరలించండి.
03:01 Shift కీని ఉపయోగించి, ట్రైన్ ను canvas కు బయట ఎడమ భాగం వైపుకు లాగండి.
03:07 Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి.
03:11 Ctrl + S ను నొక్కడం ద్వారా ఫైల్‌ను సేవ్ చేయండి.
03:15 ఇప్పుడు మనం యానిమేషన్‌ను రెండర్ చేద్దాం.
03:18 దీని కొరకు, File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి.
03:22 File name ఫీల్డ్‌లో, extension ను avi కు మార్చండి. Target ను ffmpeg గా మార్చండి.
03:31 క్వాలిటీ ని 9 కి పెంచండి మరియు Render బటన్ పై క్లిక్ చేయండి.
03:36 ఇప్పుడు డెస్క్‌టాప్‌కు వెళ్లండి. avi ఫైల్ ‌పై రైట్ క్లిక్ చేసి, ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి ప్లే చెయ్యండి.
03:43 ఇప్పుడు మనం టాయ్ ట్రైన్ యానిమేషన్ చూడవచ్చు.
03:47 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
03:50 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో, మనం ఒక Toy train ‌ను యానిమేట్ చేయడం నేర్చుకున్నాము.
03:56 మీ కొరకు ఇక్కడొక అసైన్మెంట్ - మునుపటి అసైన్‌మెంట్‌లో సృష్టించిన బస్సును ఈ ట్యుటోరియల్‌లో చూపిన దశలను అనుసరించి యానిమేట్ చెయ్యండి.
04:06 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
04:09 ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
04:15 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది.
04:22 మరిన్ని వివరాల కొరకు. దయచేసి మాకు రాయండి.
04:24 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
04:29 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
04:35 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
04:39 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya