STEMI-2017/C2/Introduction-to-Maestros-Device/Telugu
|
|
00:01 | నమస్కారము Maestros స్టెమీ కిట్ పై ఈ ట్యూటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-
Maestros స్టెమీ కిట్ యొక్క భాగాలు మరియు దాని ప్రయోజనం. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయడానికి, మీకు అవసరమైన -
Maestros స్టెమీ కిట్. |
00:22 | ఈ కిట్ యొక్క ఆస్పత్రి నమూనా వీటిని కలిగి ఉంటుంది -
ఒక మెటల్ కేసింగ్ లో ఒక ఆన్డ్రోయిడ్ ట్యాబ్, Maestros పరికరం తో పాటు NIBP, ECG మరియు SPO2 మానిటర్ , అన్ని ఒకే పరికరం లో ఉన్నాయి. కిట్ లో, వై-ఫై ప్రింటర్, ట్రాలీ, పవర్ స్ట్రిప్ కూడా ఉన్నవి. |
00:46 | ఈ కిట్ యొక్క అంబులెన్స్ నమూనా, వీటిని కలిగి ఉంటుంది-
ఒక మెటల్ కేసింగ్ లో ఒక ఆన్డ్రోయిడ్ ట్యాబ్ తో పాటు NIBP, ECG మరియు SPO2 మానిటర్, అన్ని ఒకే పరికరం లో ఉన్నాయి . మరియు ఒక పవర్ స్ట్రిప్ కూడా ఉంది. |
01:05 | అంబులెన్స్ నమూనా లో ఒక వైఫై ప్రింటర్ లేదు మరియు అది ఒక ట్రాలీ పై మౌంట్ చేయబడదు. |
01:13 | అంబులెన్స్ నమూనా లో ట్యాబ్ యొక్క మెటల్ కేసింగ్ ఒక క్లమ్ప్ ద్వారా మౌంట్ చేయబడింది. |
01:20 | ఇక్కడ ఒక HP టాబ్లెట్ డేటా ఎంట్రీ యొక్క పరికరం.
ట్యాబ్ యొక్క పై భాగం లో పవర్ బటన్ ఉంది. రెండు మైక్రో USB పోర్టులు మరియు ఒక HDMI పోర్ట్ ట్యాబ్ దిగువన ఉన్నాయి. |
01:36 | రెండు USB పోర్టుల లో నుండి కుడి వైపు ఉన్నదానిని ట్యాబ్ని ఛార్జ్ చేయుటకు ఉపయోగిస్తారు . |
01:44 | ఆన్డ్రోయిడ్ ట్యాబ్ ని ఒక ప్రామాణిక మైక్రో USB ఛార్జర్ తో లేదా Maestros పరికరం నుండి వేలాడుతున్న USB కేబుల్ తో కూడా ఛార్జ్ చేయవచ్చు. |
01:58 | ఈ కేబుల్ని వాడినప్పుడు, ట్యాబ్ తన ఛార్జింగ్ కొరకు Maestros పరికరం నుండి విద్యుత్ని పొందుతుంది. |
02:06 | ట్యాబ్ ని చార్జ్ చేయుటకు ఒక పవర్ పాయింట్ లో ప్లగ్ చేసే అవసరం లేదు, అందుకే ఈ సౌకర్యం అందించబడుతుంది. |
02:15 | ట్యాబ్ ఛార్జ్ అవుతున్నప్పుడు కూడా పరికారిన్ని వాడవచ్చు. |
02:21 | ట్యాబ్ ఒక మెటల్ కేసింగ్ తో Maestros పరికారానికి జోడించబడింది. |
02:27 | ట్యాబ్ మరియు Maestros పరికరం వేరు వేరు పరికరాలు. |
02:32 | కానీ అవి ఒకే యూనిట్ గా పనిచేస్తాయి ఎందుకంటే, వాటి చుట్టూ ఉన్న మెటల్ కేసింగ్ ఒకటే కాబట్టి . |
02:39 | Maestros పరికరానికి 5 పోర్ట్స్ ఉన్నాయి
1 - చార్జింగ్ పోర్ట్ 2 - ఇసిజి పోర్ట్ 3 - బిపి పోర్ట్ 4 - SpO2 పోర్ట్ మరియు 5- టెంప్ |
02:51 | దానికి ఎడమ వైపున ఛార్జింగ్ పోర్ట్ తో పాటు ఒక పవర్ బటన్ ఉంది.. |
02:57 | ECG, బిపి మరియు SpO2 పోర్ట్ లు దానికి కుడి వైపున ఉన్నాయి.. |
03:04 | Maestros పరికరం యొక్క ఎడుమ వైపు పసుపుపచ్చ సూచిక LEDలు ఉన్నాయి.
ఒకటి Maestros పరికరం ని స్విచ్ ఆన్ చేసి నప్పుడు వెలుగుతుంది మరియు ఇంకొకటి పరికరం ఛార్జింగ్ మోడ్ లో ఉన్నపుడు వెలుగుతుంది. |
03:23 | ఇప్పుడు మనం Non Invasive Blood Pressure unit అనగా NIBP యూనిట్ గూర్చి తెలుసుకుందాం. |
03:32 | బి పి కఫ్ లో రెండు భాగాలూ ఉన్నాయి, బి పి కఫ్ కేబుల్ మరియు ఎక్స్టెన్షన్ కేబుల్. |
03:39 | మొదట బి పి కఫ్ కేబుల్ ఎక్స్టెన్షన్ కేబుల్ కి జోడించండ. |
03:46 | తదుపరి ఎక్స్టెన్షన్ కేబుల్ యొక్క అవతలి చివరిని B.P పోర్ట్ కి జోడించండి. |
03:52 | ముందు పేర్కొన్న విధంగా అది, Maestros పరికరం యొక్క ఎడమ దిగువ వైపున ఉంది. |
04:00 | ఇప్పుడు మనము B.Pని నమోదు చేయుటకు సిద్ధంగా ఉన్నాము. |
04:05 | తదుపరి SpO2 యూనిట్ గూర్చి తెలుసుకుందాం.
SpO2 కేబుల్ కి రెండు భాగాలూ ఉన్నాయి ఎక్స్టెన్షన్ కేబుల్ మరియు SpO2 ప్రోబ్ |
04:18 | ఇక్కడ చూపిన విధంగా SpO2 ప్రోబ్ని ఎక్స్టెన్షన్ కేబుల్ కి జోడించండి. |
04:24 | కనెక్టింగ్ కేబుల్లను సురక్షితమ్ చేయుటకు పారదర్శక కవర్ని స్నాప్ చేయండి. |
04:31 | ఎక్స్టెన్షన్ కేబుల్ యొక్క అవతలి చివరిని Maestros పరికరం కు జోడించండి. |
04:38 | దానిని Maestros పరికరం యొక్క పై ఎడుమ వైపు ఉన్న పోర్ట్ కి జోడించండి . |
04:45 | ఇప్పుడు మనం SpO2 ని కొలిచేందుకు సిద్ధంగా ఉన్నాము. |
04:50 | తదుపరి ECG యూనిట్ గూర్చి నేర్చుకుందాం.
ఇక్కడ చూపిన విధంగా Maestros పరికరం యొక్క పై ఎడుమ వైపు ఉన్న ECG పోర్ట్ ని ECGకేబుల్ కి జోడించండి. |
05:04 | కనెక్టర్ హెడ్ కు ఇరువైపుల ఉన్న స్క్రూ ల సహాయం తో కనెక్షన్ ని సురక్షితం చేయండి . |
05:11 | ఇప్పుడు మనం ECGతీసుకొనుటకు సిద్ధంగా ఉన్నాము. |
05:15 | ట్యుటోరియల్ సారాంశం. |
05:16 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-
Maestros స్టెమీ కిట్ తో పాటు వచ్చే వివిధ యూనిట్ ల గూర్చి మరియు వాటిని Maestros పరికరం తో ఎలా జోడించడం. |
05:29 | స్టేమీ ఇండియా,
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు |
05:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
06:00 | ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.
ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |