QGIS/C2/Digitizing-Map-Data/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | QGIS లో Digitizing Map Data పై ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకుంటాము- Point మరియు Polygon షేప్ ఫైల్స్ ను సృష్టించడం మరియు డిజిటైజ్ చేయడం. |
00:15 | పాయింట్ మరియు పోలిగాన్ (బహుభుజి) ఫీచర్స్ కొరకు స్టైల్ మరియు కలర్ ను మార్చడం. |
00:20 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను -
Ubuntu Linux OS వర్షన్ 16.04 QGIS వర్షన్ 2.18 |
00:32 | ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు బేసిక్ GIS మరియు QGIS interface తో పరిచయం ఉండాలి. |
00:41 | Digitizing అనేది ఒక ప్రక్రియ ఇది, ఒక మ్యాప్ నుండి, ఇమేజ్ లేదా డేటా యొక్క ఇతర సోర్సెస్ ను సమన్వయం చేస్తుంది
అవి డిజిటల్ ఫార్మట్ లోకి మార్చబడతాయి. |
00:52 | మార్చబడిన డేటా ను ఒక పాయింట్, లైన్ లేదా ఒక పోలిగాన్ (బహుభుజి) ఫీచర్ గా GIS లో నిల్వ చేయవచ్చు. |
01:00 | ఈ ట్యుటోరియల్ని ప్రాక్టీస్ చేయడానికి, మీరు Code files లింక్‌లో ఇచ్చిన Bangalore నగరం యొక్క నేపథ్య (థెమటిక్) మ్యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. |
01:09 | ఇది Bangalore నగరం యొక్క అభివృద్ధిని వివరించే ఒక మ్యాప్. |
01:15 | కోడ్ ఫైల్స్ ను డౌన్లోడ్ చేయడానికి దశలు. |
01:18 | ప్లేయర్ క్రింద ఉన్న Code files లింక్‌పై క్లిక్ చేసి, దాన్ని మీ ఫోల్డర్లో సేవ్ చేయండి. |
01:25 | డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్‌ను ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి. |
01:28 | ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్లో Bangalore.jpg ఫైల్‌ను గుర్తించండి. |
01:34 | నేను ఇప్పటికే Code file ను డౌన్లోడ్ చేసాను, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి Desktop పైన ఒక ఫోల్డర్లో సేవ్ చేసాను. |
01:41 | ఫోల్డర్‌ను తెరవడానికి దానిపై డబల్ క్లిక్ చేయండి. |
01:45 | Bangalore.jpg ఫైల్‌పై రైట్ క్లిక్ చేయండి. |
01:49 | కాంటెక్స్ట్ మెనూ నుండి, Open with QGIS Desktop ను ఎంచుకోండి. |
01:56 | QGIS ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది. |
01:59 | QGIS Tips డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. OK బటన్ పై క్లిక్ చేయండి. |
02:06 | Coordinate Reference System Selector డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
02:11 | Coordinate reference systems of the world అనే శీర్షిక కింద, WGS 84 ను ఎంచుకోండి. |
02:19 | WGS 84 అనేది ఎక్కువగా ఉపయోగించబడుతున్న భౌగోళిక సమన్వయ వ్యవస్థ అని గమనించండి. |
02:27 | డైలాగ్-బాక్స్ యొక్క దిగువ బాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి. |
02:32 | కాన్వాస్ పైన Bangalore యొక్కThematic map అనేది ప్రదర్శించబడుతుంది. |
02:38 | ఇప్పుడు మనం క్రొత్త షేప్ ఫైల్ లేయర్స్ ను సృష్టిద్దాం. |
02:42 | మెనూ బార్ పైన Layer మెనుపై క్లిక్ చేసి, Create Layer ఎంపికను ఎంచుకోండి. |
02:50 | సబ్ మెను నుండి, New Shapefile Layer ఎంపికను ఎంచుకోండి. |
02:55 | New Shapefile Layer విండో తెరుచుకుంటుంది. |
02:59 | ఇక్కడ మీరు ఫీచర్స్ యొక్క 3 రకాల ఎంపికలు, Point, Line మరియు Polygon లను చూడవచ్చు. |
03:10 | డీఫాల్ట్ గా Point ఎంపిక అనేది ఎంచుకోబడింది.
దాన్ని అలాగే వదిలేయండి. |
03:16 | CRS ను WGS 84 గా ఉండనివ్వండి. |
03:21 | విండో యొక్క దిగువ-కుడి మూలలో ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి. |
03:27 | Save Layer as.. డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
03:31 | ఫైల్‌కు మనం Point-1 అని పేరు పెడదాం. |
03:35 | ఫైల్‌ను సేవ్ చేయడానికి తగిన స్థానాన్ని ఎంచుకోండి.
నేను Desktop ను ఎంచుకుంటాను. |
03:42 | డైలాగ్-బాక్స్ యొక్క దిగువ-కుడి మూలలో ఉన్ Save బటన్ పై క్లిక్ చేయండి. |
03:48 | ఇక్కడ చూపిన విధంగా ఫైల్స్ డెస్క్‌టాప్‌లో సేవ్ చేయబడతాయి. |
03:53 | QGIS ఇంటర్ఫేస్కు తిరిగి వెళ్ళండి. |
03:56 | ఫైల్ స్వయంచాలకంగా Layers Panel లో లోడ్ అవుతుందని గమనించండి. |
04:02 | ఈ మ్యాప్ పైన, IT విభాగాలు స్థాపించబడిన ప్రదేశాలను మనం మార్క్ చేస్తాము. |
04;09 | జూమ్-ఇన్ చేయడానికి మౌస్ లో మధ్య బటన్‌ను స్క్రోల్ చేయండి. |
04:14 | IT సంస్థల కొరకు మ్యాప్ యొక్క దిగువ-కుడి మూలలో ఉన్న legend ను రిఫర్ చెయ్యండి. |
04:21 | IT సంస్థలు అనేవి జెండా చిహ్నంతో సూచించబడతాయి. |
04:26 | మ్యాప్‌లో IT సంస్థలను సూచించే పాయింట్లను లొకేట్ చెయ్యండి. |
04:32 | ఇక్కడ IT సంస్థలను సూచించే రెండు పాయింట్ లు ఉన్నాయి. |
04:37 | మ్యాప్‌లోని ఫీచర్స్ ను ఎడిట్ చేయడానికి లేదా మార్పు చేయడానికి, మనం Toggle editing tool ను ఎంచుకోవాలి. |
04:44 | Toggle Editing అనేది tool bar యొక్క ఎగువ-ఎడమ మూలలో అందుబాటులో ఉంది. |
04:51 | Toggle Editing టూల్ ని ఎంచుకోవడానికి దానిపై క్లిక్ చేయండి. |
04:55 | టూల్ బార్‌లోని Add Feature టూల్ పై క్లిక్ చేయండి. |
04:59 | కర్సర్ ఇప్పుడు crosshair ఐకాన్ గా ప్రదర్శించబడుతుంది. |
05:04 | మ్యాప్‌లోని IT సంస్థ సింబల్ పై క్లిక్ చేయండి. |
05:08 | ఒక ఇన్పుట్-బాక్స్ Point-1 Feature Attributes తెరుచుకుంటుంది. |
05:14 | Id టెక్స్ట్ బాక్స్‌లో 1 ని టైప్ చేయండి. OK బటన్ పై క్లిక్ చేయండి. |
05:21 | అదేవిధంగా రెండవ IT సంస్థపై క్లిక్ చేసి, ఫీచర్ ని 2 గా సేవ్ చేయండి.
OK బటన్ పై క్లిక్ చేయండి. |
05:31 | ఇప్పుడు ఎడిటింగ్ ను ఆపడానికి, మళ్ళీ టూల్ బార్‌లోని Toggle Editing టూల్ పై క్లిక్ చేయండి. |
05:38 | Stop editing డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
05:42 | Save బటన్ పై క్లిక్ చేయండి. |
05:45 | గమనించండి, మ్యాప్ పైన, రంగుతోఉన్న రెండు పాయింట్ ఫీచర్స్ అనేవి సృష్టించబడతాయి. |
05:51 | సృష్టించబడిన ఆ రెండు ఫీచర్స్ ను attribute table ను తెరవడం ద్వారా మనం తనిఖీ చేయవచ్చు. |
05:56 | Layers ప్యానెల్ పైన Point-1 లేయర్‌పై రైట్ క్లిక్ చేయండి. |
06:01 | కాంటెక్స్ట్ మెనూ నుండి, Open Attribute Table ఎంపికను ఎంచుకోండి. |
06:06 | Point-1: Features డైలాగ్-బాక్స్‌లో, id కాలమ్‌లో, రెండు పాయింట్స్ సృష్టించబడతాయి. |
06:13 | attribute table డైలాగ్-బాక్స్ ను మూసివేయండి. |
06:17 | స్పష్టంగా కనిపించడం కొరకు మనం ఈ పాయింట్ ఫీచర్స్ యొక్క స్టైల్ మరియు కలర్ లను మార్చవచ్చు. |
06:23 | Point-1పొరపై రైట్ క్లిక్ చేయండి. |
06:26 | context menu నుండి Properties ఎంపికను ఎంచుకోండి. |
06:31 | Layer Properties డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
06:35 | Color డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. |
06:38 | కలర్ ట్రయాంగిల్ ను రొటేట్ చేయడం ద్వారా ఒక రంగును ఎంచుకోండి. |
06:42 | Size టెక్స్ట్ బాక్స్ యొక్క చివరన ఉన్న అప్ వర్డ్ యారొ ట్రయాంగిల్ పై క్లిక్ చేయడం ద్వారా పరిమాణాన్ని పెంచండి. |
06:50 | డైలాగ్-బాక్స్ యొక్కదిగువ భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి. |
06:54 | Point ఫీచర్స్ కొరకు రంగు మరియు పరిమాణంలోని మార్పును గమనించండి. |
07:00 | ఇప్పుడు మనం Polygon ఫీచర్స్ ను కలిగి ఉన్న ఒక షేప్ ఫైల్‌ను సృష్టిద్దాం. |
07:05 | menu bar లోని Layer మెనుపై క్లిక్ చేయండి. Create Layer ఎంపికను ఎంచుకోండి. |
07:12 | సబ్ మెనూ నుండి, New Shapefile Layer ను ఎంచుకోండి. |
07:17 | New Shape File Layer విండో తెరుచుకుంటుంది. |
07:21 | Type ను Polygon గా ఎంచుకోండి. |
07:25 | New field Name టెక్స్ట్ బాక్స్ లో, area అని టైప్ చెయ్యండి. |
07:31 | Type ని Text data గానే ఉంచండి. |
07:35 | Add to fields list బటన్ పై క్లిక్ చేయండి. |
07:40 | Fields List టేబుల్ లో, మీరు area రో అనేది జోడించబడినట్లు చూస్తారు.
OK బటన్ పై క్లిక్ చేయండి. |
07:50 | Save layer as.. డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
07:54 | Fileపేరును Area-1 గా టైప్ చేయండి. |
07:58 | తగిన స్థానాన్ని ఎంచుకోండి. |
08:01 | నేను Desktop ను ఎంచుకుంటాను. Save బటన్ పై క్లిక్ చేయండి. |
08:07 | Area-1 layer అనేది Layers panel కు జోడించబడిందని గమనించండి. |
08:13 | మనం Corporation Area మరియు Greater Bangalore Area యొక్క సరిహద్దును మార్క్ చేస్తాము. |
08:20 | Corporation Area మరియు Greater Bangalore Area ను గుర్తించడానికి మ్యాప్ పైన Legend ను చూడండి. |
08:28 | టూల్ బార్‌లోని toggle editing టూల్ పై క్లిక్ చేయడం ద్వారా toggle editing ను ఆన్ చేయండి. |
08:35 | టూల్ బార్ నుండి Add Feature టూల్ పై క్లిక్ చేయండి. |
08:39 | కర్సర్‌ను మ్యాప్ దగ్గరకు తీసుకురండి. |
08:42 | ఏరియా ని గుర్తించడానికి, Corporation area యొక్క బౌండరీ పైన ఎక్కడైనా క్లిక్ చేయండి. |
08:48 | బౌండరీ పై క్లిక్ చేస్తూ ఉండండి. |
08:51 | ఒకవేళ లైన్ సెగ్మెంట్ లు అనేవి కలిస్తే కాన్వాస్ పైభాగంలో హెచ్చరిక సందేశాలు కనిపిస్తాయి.
దయచేసి ఈ సందేశాలను విస్మరించండి. |
09:02 | ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసి, మార్కింగ్ ప్రాసెస్ ను తిరిగి ప్రారంభించాలి అనుకుంటే, కీబోర్డ్ పైన Esc Key ని నొక్కండి. |
09:10 | మీరు మళ్ళీ ప్రాసెస్ ను ప్రారంభించవచ్చు. |
09:13 | మీరు బౌండరీ మొత్తాన్నివిస్తరించే వరకు బౌండరీపై క్లిక్ చేస్తూ ఉండండి. |
09:24 | మీరు బౌండరీ మొత్తాన్ని మార్క్ చేసిన తర్వాత, బహుభుజిని (పోలిగాన్) ముగించడానికి రైట్ క్లిక్ చేయండి. |
09:30 | Area-1- Feature Attributes ఇన్పుట్ బాక్స్ తెరుచుకుంటుంది. |
09:36 | Id టెక్స్ట్ బాక్స్‌లో 1 అని టైప్ చేయండి. |
09:40 | area టెక్స్ట్ బాక్స్‌లో Corporation Area అని టైప్ చేయండి. |
09:45 | OK బటన్ పై క్లిక్ చేయండి. |
09:48 | గమనించండి, మ్యాప్ పైన కొత్త polygon ఫీచర్ అనేది సృష్టించబడుతుంది. |
09:54 | ఇప్పుడు మనం మ్యాప్‌లోని Greater Bangalore ప్రాంతాన్ని డిజిటలైజ్ చేస్తాము. |
09:59 | ఇక్కడ చూపిన విధంగా Greater Bangalore ప్రాంతాన్ని డిజిటలైజ్ చేయడానికి బౌండరీపై క్లిక్ చేయండి. |
10:12 | మీరు డిజిటైజింగ్ పూర్తి చేసిన తర్వాత, బహుభుజిని (పోలిగాన్) ముగించడానికి రైట్ క్లిక్ చేయండి. |
10:18 | Area-1 Feature Attributes టెక్స్ట్ బాక్స్‌లోని, id టెక్స్ట్ బాక్స్‌లో 2 అని టైప్ చేయండి.
మరియు area టెక్స్ట్ బాక్స్‌లో Greater Bangalore అని. |
10:30 | OK బటన్ పై క్లిక్ చేయండి. |
10:33 | ఎడిటింగ్ ను ఆపడానికి టూల్ బార్‌లోని Toggle Editing టూల్ పై మళ్లీ క్లిక్ చేయండి. |
10:39 | Stop editing డైలాగ్ బాక్స్‌లోSave బటన్ పై క్లిక్ చేయండి. |
10:44 | attribute table ను తెరవడానికి Area-1 లేయర్‌పై రైట్ క్లిక్ చేయండి. |
10:49 | context menu నుండి Open Attribute Table ను ఎంచుకోండి. |
10:54 | కాలమ్స్ id మరియు area టైప్ తో 2 ఫీచర్లు అనేవి సృష్టించబడినట్లు మనం చూడవచ్చు.
attribute table ను మూసివేయండి. |
11:04 | రెండు బహుభుజి (పోలిగాన్) ఫీచర్లు సృష్టించబడినట్లు మనం చూడవచ్చు. |
11:09 | బహుభుజి (పోలిగాన్) ఫీచర్ యొక్క రంగు మరియు స్టైల్ ను మార్చడానికి, Area-1లేయర్ పై రైట్ క్లిక్ చేయండి.
Properties ఎంపికను ఎంచుకోండి. |
11:19 | Layer Properties డైలాగ్-బాక్స్‌లో, ఎడమ వైపు పానెల్ నుండి Style ఎంపికను ఎంచుకోండి. |
11:26 | drop down menu యొక్క ఎగువ ఎడమ మూలలోని, categorized ను ఎంచుకోండి. |
11:32 | కాలమ్ డ్రాప్ డౌన్ లో id ని ఎంచుకోండి.
Classify బటన్ పై క్లిక్ చేయండి. |
11:39 | లేయర్ పారదర్శకత స్లయిడర్‌ను 50% కి తరలించండి. |
11:44 | డైలాగ్-బాక్స్ యొక్క దిగువ భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి. |
11:49 | ఇప్పుడు మ్యాప్ పైన, వేర్వేరు రంగులలో ఉన్నరెండు Polygon features అనేవి మనం చూడవచ్చు. |
11:55 | ఫీచర్స్ లేబులింగ్ గురించిన వివరాలు, ఈ సిరీస్‌లోని రాబోయే ట్యుటోరియల్‌లలో చర్చించబడతాయి. |
12:03 | సారాంశం చూద్దాం. |
12:05 | ఈ ట్యుటోరియల్‌లో మనం Point మరియు Polygon షేప్ ఫైల్స్ ను సృష్టించడం మరియు డిజిటలైజ్ చేయడం నేర్చుకున్నాము. |
12:13 | Point మరియు Polygon ఫీచర్స్ కొరకు స్టైల్ ను మరియు కలర్ ను మార్చడం. |
12:18 | ఒక అసైన్మెంట్ గా, Banglaore thematic map (Bangalore.jpg) పైన,
Industrial Estates ను Digitize చెయ్యండి ఒక Polyline ఫీచర్ ని సృష్టించడం ద్వారా మ్యాప్ పైన (రోడ్స్) రహదారులను డిజిటైజ్ చేయండి. |
12:32 | మీరు పూర్తి చేసిన అసైన్మెంట్ ఇక్కడ చూపిన విధంగా ఉండాలి. |
12:37 | కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్లోడ్ చేసి చూడండి. |
12:45 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ ను నిర్వహించి ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి. |
12:57 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
13:01 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
13:13 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి, నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |