PERL/C3/Referencing-and-Dereferencing/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Referencing మరియు Dereferencing in Perl పై Spoken Tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము Scalar References, Array References Hash References, Dereferences మరియు array ఇంకా hash references యొక్క elements లను జోడించడం, తొలగించడం, పొందడం నేర్చుకుంటాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను: Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit Text Editorను ఉపయోగిస్తున్నాను. |
00:33 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:37 | మీకు Perl ప్రోగ్రామింగ్ Array functions మరియు Hash functions గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి. |
00:43 | ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి. |
00:49 | Reference అంటే ఏమిటి? |
00:51 | reference అనేది ఒక pointer లేదా variable కు address, array, hash లేదా ఒక subroutine. |
00:58 | ఇది నేరుగా డేటాను కలిగి ఉండదు. |
01:01 | Reference అనేది ఒక సులభమైన, కాంపాక్ట్ scalar విలువ. |
01:05 | పెద్ద డేటా డేటా స్ట్రక్చర్ లను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు Reference అనేది Perl కోడ్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క పనితనంను అభివృద్ధి చేస్తుంది. |
01:12 | ఇది subroutine కు విలువను పంపకుండా reference ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది. |
01:18 | సంక్లిష్టమైన Perl డేటా స్ట్రక్చర్ లను నిర్వహించడం సులభం. |
01:22 | మనం referenceను ఎలా సృష్టించాలో చూద్దాం. |
01:25 | మనము backslash (\) ను ఏదైనా variable, subroutine లేదా value ముందు ఉంచడం ద్వారా వాటికి reference లను సృష్టించవచ్చు. |
01:33 | ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ ($)గుర్తు ద్వారా scalar variable reference చేయబడుతుంది. |
01:39 | array variable బాక్ స్లాష్ మరియు at the rate(@)గుర్తు ను ఉపయోగించి, reference చేయబడుతుంది. |
01:45 | ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా ఒక hash variable బాక్ స్లాష్ మరియు percentage(%) గుర్తు ను ఉపయోగించి, reference చేయబడుతుంది. |
01:53 | dereference అంటే ఏమిటి? |
01:55 | ఒక reference ను dereference చేసినప్పుడు దాని అసలు విలువ రిటర్న్ అవుతుంది. |
02:00 | Dereference అనేది కర్లీ బ్రాకెట్లలో reference వేరియబుల్ ను ఉంచుట ద్వారా చేస్తాము. |
02:06 | అదేవిధంగా, ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు reference రకాన్ని సూచిస్తూ, ఒక క్యారెక్టర్ ఇవ్వాలి. |
02:12 | మనం వేరియబుల్స్ ను dereference ఎలా చేయాలో చూద్దాము. |
02:16 | డాలర్ గుర్తు($) మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా scalar వేరియబుల్ dereference చేయబడుతుంది. |
02:21 | array వేరియబుల్ at the rate(@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది. |
02:27 | hash వేరియబుల్ percentage(%) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది. |
02:33 | మనం Scalar reference మరియు dereference కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము. |
02:38 | నన్ను gedit Text editor లో ఒక నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. |
02:43 | terminal ను తెరచి, gedit scalarRef dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:50 | స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
02:55 | నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
02:57 | మొదటి లైన్ scalar variable $a ను డిక్లేర్ చేసి, 10 విలువతో ఇనిష్యలైజ్ చేస్తుంది. |
03:03 | ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్ reference చేయబడుతుంది. |
03:10 | ఈ లైన్ referenceగా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను ప్రింట్ చేస్తుంది. |
03:16 | వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి, variable, కర్లీ బ్రాకెట్ల ముందు $ ద్వారా dereference చేయబడుతుంది. |
03:23 | ఇక్కడ ref() ఫంక్షన్ reference రకాన్ని అనగా scalar లేదా array లేదా hash రిటర్న్ చేస్తుంది. |
03:30 | ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+ S ను నొక్కండి. |
03:34 | మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
03:36 | Terminal కు మారి, perl scalarRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:43 | అవుట్ పుట్ చూపబడిన విధంగా ప్రదర్శింపబడుతుంది. |
03:46 | మొదటి లైన్ విలువ 10 నిల్వ చేసిన memory address ను చూపిస్తుంది. |
03:51 | రెండవ లైన్, వాస్తవ విలువ 10 ని రిటర్న్ చేస్తుంది. |
03:55 | Ref() ఫంక్షన్ "SCALAR" ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది. |
03:59 | తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array కు reference మరియు dereference లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం. |
04:07 | నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి. |
04:13 | Terminal లో gedit arrayRef dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:20 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను క్రింది విధంగా arrayRef dot pl ఫైల్ లో టైప్ చేయండి. |
04:26 | ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
04:28 | ఇక్కడ మొదటి లైన్ లో నేను @color అను array ను మూడు విలువలతో డిక్లేర్ చేశాను. |
04:35 | ఇది backslash @color తో reference చేయబడి, $colorRef కు కేటాయించబడింది. |
04:42 | print స్టేట్మెంట్ reference విలువను మరియు dereference విలువను ముద్రిస్తుంది. |
04:47 | ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి. |
04:51 | మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
04:53 | తిరిగి terminal కు మారి, perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:00 | ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
05:04 | మొదటి లైన్ referenceగా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను అవుట్ పుట్ గా చూపిస్తుంది. |
05:10 | రెండవ లైన్ వాస్తవ విలువను అంటే dereferenced ను చూపిస్తుంది. |
05:16 | తరువాత, మనం array కు ఒక direct referenceను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము. |
05:21 | తిరిగి మన ప్రోగ్రాం కు వద్దాం. |
05:24 | array కు direct reference ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను. |
05:29 | మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కు direct referenceలను సృష్టించవచ్చు. |
05:35 | dereference కు arrow operator (->) ను ఉపయోగించండి. |
05:39 | print స్టేట్మెంట్ "Green" ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది. |
05:43 | ఇక్కడ, print స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది, అంటే మన ప్రోగ్రాం లో Green అని అర్ధం. |
05:50 | ఫైల్ ని సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి. |
05:54 | తిరిగి terminal కు మారి, ఎగ్జిక్యూట్ చేయడానికి perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:03 | అదే కోడ్ ఫైల్ లో, direct hash reference ను ఎలా ఉపయోగించాలో ఒక ఉదాహరణతో చూపిస్తాను. కాబట్టి geditకు మారండి. |
06:11 | ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కు direct reference ను సృష్టించవచ్చు. |
06:18 | దీనిని dereference చేయడానికి arrow operator (->) ని ఉపయోగించండి. “Name” అనేది hash key. |
06:24 | ఈ బ్లాక్ కోడ్ ను అమలు చేస్తే, రెండూ print స్టేట్మెంట్ లు "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి. |
06:31 | తరువాత మనం array referenceకు elements ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం. |
06:39 | నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి. |
06:45 | terminal ను తెరచి, gedit arrayRefadd dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:54 | arrayRefadd.pl ఫైల్ ఇప్పుడు gedit లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి. |
07:02 | మొదటి లైన్ array కు విలువలను అందిస్తుంది. |
07:06 | మనము ఇప్పుడు backslash @numarray తో ఒక అర్రే ను రిఫరెన్స్ చేసి, దానిని $ref కు కేటాయించాము. |
07:13 | ఇప్పుడు, మనం array reference నుండి ఒక ప్రత్యేక element ను ఎలా పొందాలో చూద్దాం. |
07:19 | మనం ప్రత్యేక విలువను ను పొందడానికి మనం array index ను స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉపయోగించి, దానిని dereference చేయడానికి arrow operator (“->”)ను ఉపయోగించాలి. |
07:28 | print స్టేట్మెంట్ ఇండెక్స్ [0] యొక్క విలువను ముద్రిస్తుంది. |
07:32 | push() ఫంక్షన్ elements ను array reference యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది. మన కేసు లో 5, 6, 7 లు ప్రస్తుత array 1, 2, 3, 4 యొక్క చివరిస్థానం వద్ద జోడించబడతాయి. |
07:47 | array reference కు జోడించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది. |
07:53 | pop() ఫంక్షన్ elementను array reference యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది. |
07:58 | మన ఉదాహరణలో, array reference నుండి 7 తొలగించబడుతుంది. |
08:03 | array reference నుండి తొలగించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది. |
08:08 | ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి. |
08:11 | మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
08:14 | తిరిగి terminal కు మారి, perl arrayRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
08:22 | ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
08:26 | ఇప్పుడు మనం hash reference యొక్క elements ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం. |
08:34 | terminal పై, gedit hashRefadd dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. |
08:42 | ఇది hashRefadd.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
08:47 | నన్ను నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి. |
08:50 | నేను scalar వేరియబుల్ $weektemp ను నిల్వ చేయగల direct hash referenceను డిక్లేర్ చేశాను. |
08:57 | నేను hash reference ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు dereference ను సూచించడానికి arrow operator ను ఉపయోగిస్తాను. |
09:04 | ఈ కోడ్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉష్ణోగ్రత విలువలను నిల్వ చేస్తుంది. |
09:09 | నేను “keys” built-in functionను, హాష్ కీస్ ద్వారా లూప్ కు ఉపయోగిస్తాను. |
09:15 | print స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది. |
09:19 | ఇక్కడ చూపించిన విధంగా మనం element యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు. |
09:25 | print స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది. |
09:29 | ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయండి. |
09:32 | టెర్మినల్ కు మారి, అవుట్ పుట్ చూడడానికి perl hashRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
09:41 | hash keys మరియు hash values యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి. |
09:46 | ప్రదర్శించబడిన అవుట్పుట్ అవి జోడించిన క్రమానికి సంబంధించినవి కావు. |
09:52 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. మనం సారాంశం చూద్దాం. |
09:57 | ఈ ట్యుటోరియల్ లో మనము Scalar References, Array References, Hash References Dereferences మరియు array ఇంకా hash references కు elements ను జోడించడం, తొలగించడం, పొందడం నేర్చుకుంటాము. |
10:14 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్, మన hashRefadd dot pl file లో, weektemp హాష్ కు కొత్త కీస్ “Saturday” మరియు “Sunday” లను జోడించండి. |
10:24 | చివరికి “Saturday” కీ ని డిలీట్ చేయండి. |
10:27 | హాష్ weektempను ముద్రించండి. |
10:30 | ప్రోగ్రాం ను Save మరియు execute చేయండి. ఇప్పుడు ఫలితాన్ని పరీక్షించండి. |
10:35 | క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
10:42 | మేము వర్క్ షాప్ లను నిర్వహిస్తాము మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తాము. మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. |
10:51 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
11:02 | ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మాతో చేరినందుకు మీకు ధన్యవాదాలు. |