PERL/C3/Downloading-CPAN-module/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Downloading CPAN modulesపై Spoken Tutorialకు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన CPAN modulesను Ubuntu Linux Operating System మరియు Windows Operating System లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుంటాము. |
00:17 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయుటకు నేను:
|
00:32 | మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:36 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి. |
00:41 | ఒక వేళ లేక పొతే, అప్పుడు సంభందిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:48 | ముందుగా, మనం CPAN modulesను Ubuntu Linux OS లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుందాం. |
00:55 | టెర్మినల్ కు మారండి. |
00:57 | sudo space cpan అని టైప్ చేసి Enter నొక్కి, అవసరమైతే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. |
01:06 | ఒక వేళ మీ సిస్టం లో cpan ఇంస్టాల్ కాకపోతే, ఇది ఇన్స్టాలేషన్ ప్రక్రియ కొరకు మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తుంది. |
01:13 | దయచేసి దశలను కొనసాగించండి. ఇన్స్టాలేషన్ ప్రక్రియ కోసం మీ కంప్యూటర్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యిఉండాలి. |
01:21 | ప్రాంప్ట్ cpanకు మారడాన్ని మనం చూడవచ్చు. |
01:26 | ఉదాహరణకు, నేను CSV ఫైల్ నుండి కొంత డేటాను సేకరించాలనుకుంటున్నాను మరియు నా Perl ప్రోగ్రామ్లో ఉపయోగించాలనుకుంటున్నాను. |
01:35 | దీని కొరకు, మనము Text colon colon CSV మాడ్యూల్ ను ఉపయోగిస్తాము. |
01:40 | ఉపయోగించడానికి ముందు, మనము Text colon colon CSV మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయాలి. |
01:46 | టెర్మినల్ కు మారండి. |
01:48 | install Text colon colon CSV అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:55 | ఈ మాడ్యూల్ యొక్క సంబంధిత ఇన్స్టాలేషన్ ప్యాకేజీల ను మనం చూడవచ్చు. |
02:00 | మీ ఇంటర్నెట్ వేగం ఆధారంగా ఇన్స్టాలేషన్ పూర్తవడానికి కొంత సమయం పడుతుంది. |
02:06 | ఇప్పుడు, మనం మాడ్యూల్ విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందో లేదో తనిఖీ చేద్దాం. |
02:12 | Cpan నుండి నిష్క్రమించడానికి q కీని నొక్కండి. |
02:16 | "instmodsh" అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:23 | అన్ని ఇన్స్టాల్ మాడ్యూళ్ళను జాబితా చేయడానికి l అని టైప్ చేయండి. |
02:28 | ఇక్కడ, మనము Text colon colon CSV ను చూడవచ్చు, ఇది మన సిస్టం లో మాడ్యూల్ ఇన్స్టాల్ చేయబడిందని చూపిస్తుంది. |
02:38 | నిష్క్రమించడానికి q అని టైపు చేయండి. |
02:41 | ఇప్పుడు, నేను ఇప్పటికే సేవ్ చేసిన candidates.csv ను తెరుస్తాను. |
02:47 | gedit candidates.csv అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:53 | ఇక్కడ, మనము అభ్యర్థుల పేరు, వయస్సు, లింగం మరియు ఇమెయిల్ వివరాలను కామా తో వేరు చేయబడుతూ చూడవచ్చు. |
03:02 | ఇప్పుడు నేను ఈ మాడ్యూల్ ను ఉపయోగించి Perl ప్రోగ్రామ్ వ్రాసిన csvtest.pl ఫైల్ ను తెరుస్తాను. |
03:11 | ఈ ప్రోగ్రాం, csv ఫైల్ లో నిల్వ చేసిన name field విలువలను extract చేస్తుంది. |
03:18 | use స్టేట్మెంట్ Text colon colon CSV మాడ్యూల్ ను లోడ్ చేస్తుంది. |
03:23 | నేను "candidates.csv" ఫైల్ ను local variable dollar file కు డిక్లేర్ చేస్తాను. |
03:29 | తరువాత స్టేట్మెంట్ ఫైల్ ను READ మోడ్లో తెరుస్తుంది. |
03:34 | Text colon colon CSV అనేది ఒక class. దీనిని new తో constructorను పిలిచి instance ను సృష్టించవచ్చు. |
03:42 | ఈ లైన్ కామాను విభజన (,) గా సెట్ చేస్తూ object ను సృష్టిస్తుంది. |
03:48 | ఇక్కడ, "while" లూప్ "getline()" methodను ఉపయోగించి data ను ఒక్కక్క లైన్ గా తీసుకుంటుంది. |
03:54 | "getline" method arrayకు ఒక reference ను రిటర్న్ చేస్తుంది. |
03:58 | విలువను పొందడం కోసం మనము దీనిని de-reference చేయాలి. |
04:02 | csv ఫైలులో సున్నా Index name field ను సూచిస్తుంది. |
04:07 | Print స్టేట్మెంట్ csv నుండి పేర్లను ముద్రిస్తుంది. |
04:11 | ఇప్పుడు, ఫైల్ save చేయడానికి Ctrl+S ను నొక్కండి. |
04:15 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
04:18 | టెర్మినల్ కు మారి, perl csvtest.pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:27 | ఇక్కడ, మనము పేర్ల ఫీల్డ్ ను అవుట్పుట్గా చూడవచ్చు. |
04:32 | తరువాత, మనం Windows Operating System లో CPAN మాడ్యూళ్లను ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. |
04:39 | Perl ఇన్స్టాల్ అయినప్పుడు, PPM అనగా Perl Package Module స్వయంచాలకంగా ఇన్స్టాల్ అవుతుంది. |
04:48 | PPM ని ఉపయోగించడానికి, మీ కంప్యూటర్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి. |
04:53 | దీనిని మాడ్యూల్ శోధన, Windows Operating System పై అవసరమైన మాడ్యూల్స్ ఇన్స్టాల్, తొలగించడం మరియు నవీకరణ కోసం ఉపయోగించవచ్చు. |
05:04 | ఇప్పుడు, మనం Windows OS లో కమాండ్ విండోను తెరుద్దాం. |
05:09 | command window ను తెరవడానికి Start పై క్లిక్ చేసి, "cmd" అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:17 | మీ Windows OS మెషిన్ పై Perl ఇన్స్టాల్ ను తనిఖీ చేయడానికి perl hyphen v అని టైప్ చేయండి. |
05:25 | మీరు మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడిన Perl వెర్షన్ సంఖ్యను చూస్తారు. |
05:30 | ఒక వేళ పెర్ల్ ఇన్స్టాల్ కాకపోతే, ఈ వెబ్ సైట్ పై Perl Installation ట్యుటోరియల్ ను చుడండి. |
05:36 | ఇది మీకు Perlను Windows OS పై ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తుంది. |
05:41 | “DOS” ప్రాంప్ట్ వద్ద ppm install Text colon colon CSV అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:49 | module పేర్లు కేస్ సెన్సిటివ్ అని గమనించండి. |
05:53 | ఇన్స్టలేషన్ ప్రక్రియ ప్రారంభం కావడాన్ని మనం చూడవచ్చు. ఇన్స్టలేషన్ పూర్తయ్యే వరకు వేచి ఉండండి. |
06:00 | నేను candidates.csv మరియు csvtest.pl ఫైళ్లను ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీకి కాపీ చేసాను. |
06:08 | ఇప్పుడు మనం Perl ప్రోగ్రాం ని execute చేద్దాం. |
06:11 | command windowలో, perl csvtest.pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:18 | ఇది అవుట్పుట్. |
06:21 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం. |
06:26 | ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన CPAN modules ను Linux మరియు Windows లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకున్నాము. |
06:34 | ఇక్కడ మీకొక అసైన్మెంట్.
Date colon colon Calc మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించండి. మాడ్యూల్ శోధన కోసం ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఉపయోగించుకోండి. |
06:47 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం ను చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
06:54 | "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
07:03 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
07:06 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
07:18 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |