PERL/C3/Access-Modifiers-in-PERL/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Access Modifiers in PERL పై Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము వేరియబుల్స్ పరిధి, Private వేరియబుల్స్, Dynamically scoped వేరియబుల్స్, Global వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము.
00:19 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టంను Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:32 మీరు, మీకు నచ్చిన text editor ను ఉపయోగించవచ్చు.
00:36 మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:40 ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:47 మనం స్కోప్ అఫ్ వేరియబుల్స్ పరిచయం తో ప్రారంభిద్దాం.
00:51 వేరియబుల్ యొక్క scope అనేది ఆ వేరియబుల్ ను పొందగల కోడ్ యొక్క ప్రాంతం.
00:58 మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క విసిబిలిటీ ను సూచిస్తుంది.
01:03 ముందుగా మనం Perl లో my, local మరియు our modifiers ల గురించి చర్చిద్దాం.
01:10 my అంటే Private variables అని అర్ధం,
01:13 local అంటే Dynamically scoped variables అని అర్ధం,
01:17 our అంటే Global variables అని అర్ధం.
01:20 my కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్, అవి డిక్లేర్ చేయబడిన block వెలుపల పరిధిని కోల్పోతాయి.
01:28 మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు my $fvalue semicolon.
01:37 మీరు వేరియబుల్ కు విలువను కేటాయిస్తూ కూడా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
01:43 my $fValue = 1 semicolon.
01:48 my $fname = డబుల్ కోట్స్ లోపల Rahul semicolon.
01:55 వివిధ వేరియబుల్స్ ను ఒకే my స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది.
02:02 my బ్రాకెట్ తెరిచి $fname comma $lname comma $age బ్రాకెట్ ను మూసి సెమికోలన్.
02:12 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి private వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం.
02:17 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని gedit Text editor లో తెరుస్తాను.
02:24 terminal ను తెరచి, gedit scope hyphen my dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
02:34 ఇప్పుడు Scope-my dot pl ఫైల్ gedit లో తెరుచుకుంటుంది.
02:39 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను.
02:46 ఇక్కడ, నేను my కీ వర్డ్ తో private వేరియబుల్ $fname ను డిక్లేర్ చేస్తాను.
02:52 దీనికి "Raghu"అనే విలువను కేటాయించాను.
02:56 ఈ బ్లాక్ లోపల, print స్టేట్మెంట్ fname వేరియబుల్ లో విలువ అనగా "Raghu" ను ముద్రిస్తుంది.
03:04 తరువాత బ్లాక్ లో, నేను అదే private వేరియబుల్ $fname కు "Other" విలువను కేటాయించాను.
03:11 కాబట్టి print statement "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది.
03:17 ఈ ప్రోగ్రాం లో చివరి print statement ఏ అవుట్ పుట్ ను ముద్రించదు.
03:23 ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధి వెలుపల, fnameకు ఏ విలువను దీనికి కేటాయించ లేదు.
03:32 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు Ctrl+S ను నొక్కండి.
03:37 ఇప్పుడు మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:40 తిరిగి terminal కు మారి perl scope hyphen my dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
03:49 అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:

Block 1: Raghu, Block 2: Other, Outside Block లో ఏ అవుట్ పుట్ లేదు.

03:59 అందువల్ల my variable యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ఉంటుంది.
04:06 ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా మారుద్దాం.
04:10 మనం చివరి print స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల my $fname = double quotes లో John semicolon అని జోడించి, మార్పులను సేవ్ చేద్దాం.
04:23 తిరిగి terminal కు మారి, మునుపటివలె ఎగ్జిక్యూట్ చేద్దాం.
04:28 ప్రదర్శించబడిన అవుట్ పుట్ ను విశ్లేషించండి.
04:32 my ను ఉపయోగిచుకుని బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల వేరియబుల్ పరిధి గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాను.
04:41 తరువాత మనం Perlలో dynamically scoped variable గురించి చూద్దాం.
04:47 Local కీవర్డ్ global వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది.
04:52 ఇది ఒరిజినల్ బ్లాక్ నుండి పిలువబడే, ఏ ఫంక్షన్ కు అయినా విసిబుల్ గా ఉండును.
04:58 మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు. local $fValue = 100 semicolon local $fname = డబుల్ కోట్స్ లో "Rakesh" సెమికోలన్
05:13 మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
05:17 terminal ను తెరిచి, gedit scope hyphen local dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
05:27 ఇది scope hyphen local dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
05:33 స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ వివరిస్తాను.
05:40 ఇక్కడ, మనం మొదటి లైన్ లో $fname వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం.
05:47 Welcome() ఫంక్షన్ లోపల, మనం local వేరియబుల్ ను పై పేరు $fname తో డిక్లేర్ చేస్తాం.
05:54 వేరియబుల్ పేరు ముందు local కీ వర్డ్ ను గమనించండి.
05:59 మనము ఈ వేరియబుల్ కు "Rakesh"విలువను కేటాయించాము.
06:03 కాబట్టి, ప్రధానంగా, Welcome() ఫంక్షన్ లోపల, $fname తాత్కాలిక క్రొత్త local వేరియబుల్ గా మార్చబడింది. తరువాత, Hello() ఫంక్షన్ లో call చేయబడుతుంది.
06:15 ఇది Hello() ఫంక్షన్ యొక్క నిర్వచనం.
06:18 ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ Welcome() మరియు Hello() లను పిలుస్తాము.
06:25 ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు Ctrl + S ను నొక్కండి.
06:29 మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
06:31 తిరిగి terminalకు మారి, perl scope hyphen local.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:41 అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింపడుతుంది:

"Hello, Rakesh"! "Hello, Welcome to Spoken tutorials!"

06:48 మనం అవుట్ పుట్ ను అర్ధం చేసుకుందాం.
06:51 Welcome() ఫంక్షన్ ను పిలిచినప్పుడు, దాని లో ఉన్న Hello() ఫంక్షన్, local వేరియబుల్ ను access చేస్తుంది.
06:59 Welcome() లోపల $fname "Rakesh" విలువను కలిగి ఉంటుంది.
07:04 దీని తరువాత Hello() ఫంక్షన్ మళ్ళీ ఒకసారి $fname ను access చేస్తుంది.
07:11 కానీ ఈ సారి, $fname "Welcome to spoken tutorials" తో ఇనిష్యలైజ్ చేయబడిబడినది.
07:19 ఇది స్థానిక వేరియబుల్ $fnameను Welcome() ఫంక్షన్ లోపల పొందదు.
07:25 అంటే దీని అర్ధం, Welcome() బ్లాక్ ను వదిలేసిన తరువాత కూడా స్థానిక వేరియబుల్ scope ను తిరిగి నిల్వ చేస్తుంది.
07:32 తరువాత మనం Perl లో global వేరియబుల్స్ గురించి చూద్దాం.
07:38 global variable ను ప్రోగ్రామ్ లో ఎక్కడైనా పొందగలము.
07:43 Global variables our కీ వర్డ్ తో డిక్లేర్ చేయబడతాయి.
07:47 ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. our $fvalue = 100 semicolon </nowiki> our $fname =డబుల్ కోట్స్ లో Priya semicolon.
08:01 ఇప్పుడు మనం global వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం.
08:06 తిరిగి terminal కు మారి, gedit scope hyphen our dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
08:16 ఇది scope hyphen our.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
08:22 నేను వ్రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరిస్తాను.
08:27 నేను package main ను మరియు our $i ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసి, దానికి 100ను ఇనిష్యలైజ్ చేస్తాను.
08:37 package First డిక్లరేషన్ ను గమనించండి.
08:40 ఒక package అనేది సొంత namespace ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ.
08:46 Namespace packages లలో variable name మధ్య collisions ను నిరోధిస్తుంది.
08:51 భవిష్యత్ ట్యుటోరియల్లో package మరియు namespace ల గురించి మరింత చూస్తాము.
08:56 package First లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 10 కేటాయించబడుతుంది.
09:02 package Second లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 20 కేటాయించబడుతుంది.
09:08 main package package First variable మరియు package Second variable రెండింటిని ఉపయోగిస్తుంది.
09:15 నా ప్రోగ్రాం లో, నేను అన్ని packages లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేస్తాను. .
09:21 package variable package name colon colon variable name ద్వారా ప్రస్తావించబడింది.
09:29 మన ఉదాహరణలో, ఇది $First colon colon i, $Second colon colon i.
09:39 మనము ఒక ఫైలులో బహుళ packages ను కలిగిఉంటాము మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని packages ద్వారా ప్రాప్తి చేయబడుతుంది.
09:47 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేయండి.
09:51 అందుకు తిరిగి terminalకు మారి, perl scope hyphen our dot pl టైప్ చేసి, Enter నొక్కండి.
09:59 terminal పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
10:03 variable iకు విలువ ఎలా అసైన్ చేయబడినదో అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి.
10:11 ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. మనం సారాంశం చూద్దాం.
10:16 ఈ ట్యుటోరియల్ లో మనము, వేరియబుల్స్ పరిధి, Private variables, Dynamically scoped variables మరియు global variablesల డిక్లరేషన్లను ఉదాహరణలతో నేర్చున్నాము.
10:29 కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు local కంటే my ను ఉపయోగించడం మంచిది.
10:35 ఇక్కడ మీకొక అసైన్మెంట్.
10:37 క్రింద అస్సైన్మెంట్ కు కోడ్ వ్రాయండి మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయండి.
10:42 FirstModuleఅను ఒక package ను డిక్లేర్ చేయండి.
10:46 $age ను our వేరియబుల్ గా డిక్లేర్ చేసి, 42 విలువను కేటాయించండి.
10:52 SecondModule అను మరొక ప్యాకేజీ ని డిక్లేర్ చేయండి.
10:56 $age వేరియబుల్ ను our గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల "Forty-Two" విలువను కేటాయించండి.
11:05 First() అను ఒక subroutine ను డిక్లేర్ చేయండి.
11:08 subroutine లోపల, local మరియు my కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి.
11:16 local $age = 52 సెమికోలన్
11:20 my $ageword = డబుల్ కోట్స్ లోపల Fifty-two semicolon
11:27 మరొక subroutine Result() ను పిలవండి.
11:31 ఫంక్షన్ లోపల $age మరియు $ageword విలువలను ముద్రించండి.
11:37 Subroutine ను ముగించండి.
11:39 Result() subroutine ను డిక్లేర్ చేయండి.
11:42 మళ్ళీ $age మరియు $ageword విలువలను ముద్రించండి.
11:47 Subroutine ను ముగించండి.
11:49 First() ఫంక్షన్ ను పిలవండి.
11:51 క్రింది విధంగా Package First మరియు Package Second లను ముద్రించండి:
11:57 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
12:05 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.
12:18 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది
12:31 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india