PERL/C2/Overview-and-Installation-of-PERL/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 PERL Overview మరియు పెర్ల్ యొక్క ఇన్స్టాలేషన్ పై Spoken Tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో, నేను మిమ్మల్ని
00:10 Ubuntu-Linux మరియు Windows operating system పై PERL ను ఇన్స్టాల్ చేసే దశలతో పాటుగా PERL overview ద్వారా తీసుకువెళతాను.
00:20 ఈ ట్యుటోరియల్ కొరకు: మీరు తప్పనిసరిగా ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
00:25 మీరు ఉబుంటు లైనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లను తప్పక కలిగి ఉండాలి.
00:30 ప్రదర్శన ప్రయోజనం కొరకు, నేను ఉబుంటు లైనక్స్ 12.04 మరియు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తాను.
00:39 ఉబుంటు లైనక్స్ ను ఇన్స్టాల్ చేయడం కొరకు, మీ సిస్టమ్‌లో మీరు సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
00:47 మీరు అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ను కలిగివుండాలి.
00:50 ఇంకా మీరు ఉబుంటులో టెర్మినల్ మరియు సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ను ఉపయోగించడం లో అవగాహన కూడా కలిగి ఉండాలి.
00:57 ఒకవేళ లేకపోతె, దయచేసి స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న లైనక్స్ సిరీస్ ను చూడండి.
01:03 నన్ను PERL లాంగ్వేజ్ యొక్క అవలోకనాన్ని మీకు ఇవ్వనివ్వండి.
01:07 PERL అనేది ప్రాక్టికల్ ఎక్స్‌ట్రాక్షన్ మరియు రిపోర్టింగ్ లాంగ్వేజ్ అనే సంక్షిప్త రూపం.
01:14 ఇది ఒక సాధారణ ప్రయోజన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
01:18 ఇది మొదట టెక్స్ట్ మానిప్యులేషన్ కొరకు అభివృద్ధి చేయబడింది.
01:23 ఇప్పుడు, ఇది వెబ్ డెవలప్మెంట్, నెట్‌వర్క్ ప్రోగ్రామింగ్, GUI డెవలప్మెంట్ మొదలైన వాటి కోసం ఉపయోగించబడుతుంది.
01:31 ఇది సరళమైనది ఇంకా అర్థం చేసుకోవడం చాలా సులభం.
01:35 ఇది C లేదా JAVA వంటి సంక్లిష్టమైన డేటా స్ట్రక్చర్స్ ను కలిగి ఉండదు.
01:41 ఇది పాటర్న్ మాచింగ్ కొరకు ప్రసిద్ది చెందింది.
01:45 ఇంకా చాల ముఖ్యంగా PERL అనేది ఒక ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్.
01:49 PERL, ఉబుంటు లైనక్స్ 12.04 OS లో ముందే లోడ్ చేయబడి వస్తుంది.
01:56 ఇక్కడ ఇన్స్టాలేషన్ కొరకు అనుసరించాల్సిన నిర్దిష్ట విధానం ఏది లేదు.
02:01 ఉబుంటు 12.04 లో ఇన్స్టాల్ చేయబడి ఉన్న PERL యొక్క వర్షన్ ను మనం తనిఖీ చేద్దాం.
02:07 కీబోర్డ్‌లో Ctrl + Alt + T లను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా టెర్మినల్‌ను తెరవండి.
02:15 తరువాత, perl hyphen v అని టైప్ చేయండి.
02:18 ఆపై ఎంటర్ నొక్కండి.
02:21 ఇక్కడ టెర్మినల్‌లో ప్రదర్శించినట్లుగా మీరు అవుట్పుట్ ను పొందుతారు.
02:26 ఈ అవుట్పుట్, ప్రస్తుతం ఇన్స్టాల్ చేయబడి ఉన్న PERL యొక్క వర్షన్ ను మనకు చూపిస్తుంది.
02:31 నా విషయంలో, ఇది PERL 5.14.2.
02:36 ఉబుంటు 12.04 పై అందుబాటులో ఉన్న డిఫాల్ట్ PERL ప్యాకేజీలను మనం తనిఖీ చేద్దాం.
02:43 మనం లాంచర్ బార్ కి వెళ్లి డాష్ హోమ్ పై క్లిక్ చేద్దాం.
02:48 సర్చ్ బార్ లో, Synaptic అని టైప్ చేయండి.
02:51 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ఐకాన్ కనిపిస్తుంది.
02:55 దానిపై క్లిక్ చేయండి.
02:57 (ఆధన్తికేషన్ పర్పస్) ప్రామాణీకరణ ప్రయోజనం కొరకు మీరు మీ అడ్మిన్ పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేయబడతారు.
03:03 మీ అడ్మిన్ పాస్వర్డ్ ను ఎంటర్ చేసి, ఆథేన్తికేట్ పై క్లిక్ చేయండి.
03:08 వెంటనే, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ప్యాకేజీ జాబితా ను లోడ్ చేస్తుంది.
03:13 మీ ఇంటర్నెట్ మరియు సిస్టమ్ వేగాన్ని బట్టి దీనికి కొంత సమయం పడుతుంది.
03:18 ఒకసారి లోడ్ అయిన తర్వాత, Quick Filter లో Perl అని టైప్ చేయండి.
03:22 మీరు ప్యాకేజీల యొక్క జాబితాను చూస్తారు.
03:25 పెర్ల్ ప్యాకేజీకి ముందు ఆకుపచ్చ రంగు తో నిండివున్న చెక్-బాక్స్ అనేది ఇది ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడిందని సూచిస్తుంది.
03:33 అదే స్టార్ మార్కులతో ఉన్న చెక్-బాక్స్‌లు అయితే మీకు ఈ ప్యాకేజీలు కూడా అవసరమని సూచిస్తాయి.
03:41 డాక్యుమెంటేషన్ సృష్టించడానికి లేదా ఒక PERL స్క్రిప్ట్‌ను డీబగ్ చేయడానికి ఇవి మీకు సహాయపడతాయి.
03:47 భవిష్యత్ లో మీ పెర్ల్ వినియోగాన్ని బట్టి ఈ ప్యాకేజీలలో కనపడనివి ఏవైనా ఇన్‌స్టాల్ చేయండి.
03:54 ఇప్పుడు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై పెర్ల్ ను ఇన్‌స్టాల్ చేసే దశల ద్వారా వెళ్దాం.
04:00 పెర్ల్ ట్యుటోరియల్స్ ను రికార్డ్ చేసే సమయంలో, విండోస్‌లో వెర్షన్ 5.14.2 అందుబాటులో ఉంది.
04:08 ఇప్పుడు, క్రొత్త PERL వర్షన్ అందుబాటులో ఉంది.
04:12 నేను క్రొత్త PERL వెర్షన్ 5.16.3 ను ఉపయోగించి ఇన్స్టాలేషన్ ను ప్రదర్శిస్తాను.
04:19 ట్యుటోరియల్లో చూపిన అన్ని PERL కమాండ్స్ క్రొత్త వర్షన్ లో కూడా ఖచ్చితంగా పని చేస్తాయి.
04:26 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్రౌజర్‌ను తెరచి,
04:30 చూపిన విధంగా అడ్రస్ బార్ లో, URL ను టైప్ చేయండి.
04:35 మీరు PERL యొక్క డౌన్‌లోడ్ పేజీకి మళ్ళించబడతారు.
04:39 మీ సిస్టమ్ స్పెసిఫికేషన్ల ప్రకారం డౌన్‌లోడ్ వెర్షన్ ను ఎంచుకోండి.
04:44 నా విషయంలో, ఇది PERL యొక్క 32 బిట్ వెర్షన్ అవుతుంది.
04:49 మీ కంప్యూటర్‌లో మీకు నచ్చిన ప్రదేశంలో Perl msi file ను సేవ్ చేయండి.
04:56 నేను ఇప్పటికే నా మెషీన్లో దానిని సేవ్ చేసాను.
05:00 మీరు PERL msi ఫైల్ ను డౌన్‌లోడ్ చేసిన ఫోల్డర్ ను తెరిచి, దానిపై డబుల్ క్లిక్ చేయండి.
05:07 తరువాత పాప్-అప్ విండోలో రన్ పై క్లిక్ చేయండి.
05:11 Setup Wizard విండోలో Next పై క్లిక్ చేయండి.
05:15 ప్రాంప్ట్ చేసినప్పుడు లైసెన్స్ అగ్రిమెంట్ ను అంగీకరించి, ఆపై Next పై క్లిక్ చేయండి.
05:21 ఇప్పుడు, కస్టమ్ సెటప్ విండో కనిపిస్తుంది.
05:25 ఈ విండో ఇన్‌స్టాల్ చేయబడే అన్ని PERL ఫీచర్స్ ను జాబితా చేస్తుంది.
05:31 ఇవి పెర్ల్
05:33 PPM యుటిలిటీ, ఇది పెర్ల్ మాడ్యూల్స్ ను డౌన్‌లోడ్ చేసి, విండోస్ పై ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగిస్తారు.
05:39 డాక్యుమెంటేషన్ ఇది పెర్ల్ మాడ్యూల్స్ కొరకు డాక్యుమెంటేషన్ అందిస్తుంది.
05:44 పెర్ల్ యొక్క ఉదాహరణలు.
05:47 ఈ డిఫాల్ట్ ఫీచర్స్ అన్నిటిని ఉంచండి ఇంకా నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
05:52 ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ మరియు ఫైల్ ఎక్స్‌టెన్షన్ లను సెట్ చేయడానికి పాపప్ విండో కనిపిస్తుంది.
05:59 ఇక్కడ చూపిన విధంగా చెక్-బాక్స్ చెక్ చేసి ఉంచండి.
06:03 Next పై క్లిక్ చేసి, ఆపై Install పై క్లిక్ చేయండి.
06:07 ఇది PERL యొక్క ఇన్స్టాలేషన్ ను ప్రారంభిస్తుంది.
06:11 మీ ఇంటర్నెట్ వేగాన్నిబట్టి దీనికి కొంత సమయం పడుతుంది.
06:16 ఒకసారి పూర్తయిన తర్వాత, Display release note చెక్-బాక్స్‌ను అన్ చెక్ చేసి, ఆపై Finish పై క్లిక్ చేయండి.
06:23 ఇది విండోస్‌లో PERL యొక్క ఇన్స్టాలేషన్ ను పూర్తి చేస్తుంది.
06:27 ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ ను ధృవీకరించుకుందాం.
06:32 కమాండ్ ప్రాంప్ట్ ను తెరవడానికి Start మెనూకి వెళ్లి cmd అని టైప్ చేయండి.
06:39 command prompt పై, perl space hyphen v అని టైప్ చేయండి.
06:44 ఇంకా Enter నొక్కండి.
06:46 మీరు ఇన్స్టాల్ చేయబడిన PERL యొక్క వర్షన్ ను చూస్తారు.
06:50 ఒకవేళ ఇది వర్షన్ ను చూపించకపోతే, పై ఇన్స్టాలేషన్ దశలను మరోసారి పునరావృతం చేయండి.
06:57 ఇప్పుడు ఒక సాధారణ హలో పెర్ల్ ప్రోగ్రామ్‌ను అమలు చేద్దాం.
07:02 ఈ ట్యుటోరియల్‌తో పాటు, ప్లేయర్ క్రింద ఉన్న కోడ్ ఫైల్స్ లింక్‌లో ఈ ఫైల్ మీకు అందించబడింది.
07:11 దయచేసి ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి.
07:14 నేను ఫైల్‌ను నా సిస్టమ్‌లోని users\Amol డైరెక్టరీలో సేవ్ చేసాను.
07:21 కనుక, మనం అక్కడికి వెళ్దాం.
07:23 తరువాత: perl sampleProgram.pl అని టైప్ చేయండి.
07:28 ఇంకా ఎంటర్ నొక్కండి.
07:30 చూపిన విధంగా Hello Perl అనేది కమాండ్ ప్రాంప్ట్‌లో ముద్రించబడుతుంది.
07:35 సారాంశం చూద్దాం.
07:37 ఈ ట్యుటోరియల్‌లో, మేము నేర్చుకున్నవి:
07:40 PERL యొక్క అవలోకనం మరియు
07:43 ఉబుంటు లైనక్స్ 12.04 మరియు విండోస్ 7 ల కొరకు PERL ఇన్స్టాలేషన్ యొక్క సూచనలు.
07:50 కింది లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియోను చూడండి.
07:54 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
07:58 ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసి చూడవచ్చు.
08:03 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
08:06 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
08:10 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:15 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
08:18 spoken hyphen tutorial dot org ను సంప్రదించండి.
08:23 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
08:29 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుతాయి.
08:38 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08:50 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
08:53 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి.
08:56 పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya