PERL/C2/Conditional-statements/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | PERL లో if and if-else conditional statements పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము, |
00:09 | if స్టేట్మెంట్ మరియు |
00:11 | పెర్ల్ లో if-else స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాము.
నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:20 | నేను gedit Text Editor కూడా ఉపయోగిస్తున్నాను. |
00:24 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు. |
00:28 | మీకు Perl లో వేరియబుల్ మరియు comments గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:33 | Perl లో for, foreach, while మరియు do-while లూప్ ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం. |
00:40 | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:45 | Perl క్రింది కండిషనల్ స్టేట్మెంట్స్ ను అందిస్తుంది. |
00:49 | if, if-else, |
00:51 | if-elsif-else మరియు |
00:53 | switch.
ఈ ట్యుటోరియల్ లో మనం if మరియు if-else స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము. |
00:59 | Perl లో if స్టేట్మెంట్ ను, |
01:01 | పేర్కొన్న కండిషన్ సంతృప్తిపడినప్పుడు కొంత కోడ్ ను అమలు చేయడానికి ఉపయోగిస్తారు. |
01:07 | if కండిషనల్ స్టేట్మెంట్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది. |
01:11 | if space open bracket condition close bracket space open curly bracket అని టైప్ చేసి, |
01:19 | Enter మరియు కండిషన్ నిజమైనప్పడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్. |
01:25 | Enter మరియు close curly bracket. |
01:29 | if స్టేట్మెంట్ లోపల ఉన్న కోడ్ condition నిజమైనప్పుడు మాత్రమే అమలు అవుతుంది. |
01:36 | ఇప్పుడు, మనం if స్టేట్మెంట్ ను ఒక ఉదాహరణతో చూద్దాం. |
01:40 | టెర్మినల్ ను తెరవండి. |
01:43 | gedit conditionalBlocks dot pl space & (ampersand) అని టైప్ చేసి, |
01:49 | Enter ను నొక్కండి. |
01:52 | ఇది conditionalBlocks.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
01:57 | స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
02:02 | ఇక్కడ మనకు వేరియబుల్ count యొక్క విలువను తనిఖీ చేస్తున్న కండిషన్ ను if లో ఉపయోగించాము. |
02:09 | ఇక్కడ equal to equal to గుర్తును గమనించండి. ఇది comparison ఆపరేటర్. |
02:15 | $count equal to equal to 5 అనే కండిషన్ వేరియబుల్ count విలువను తనిఖీ చేస్తుంది. |
02:23 | ఇది 5 కు సమానం అయినప్పుడు, if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలవుతుంది. |
02:28 | ఇప్పుడు, ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి. |
02:32 | తరువాత టెర్మినల్ కు మారండి. |
02:36 | మీరు మీ ఫైల్ ను సేవ్ చేసిన డైరెక్టరీలోనే ఉన్నారని నిర్ధారించుకోండి. |
02:41 | కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ని తనిఖీ చేయడానికి, |
02:46 | perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి, |
02:53 | Enter నొక్కండి. |
02:55 | క్రింద లైన్ టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుంది. |
02:59 | conditionalBlocks.pl syntax OK. |
03:04 | ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందువలన, మనము పెర్ల్ స్క్రిప్ట్ ను |
03:10 | perl conditionalBlocks dot pl అని టైప్ చేసి, |
03:14 | Enter నొక్కి అమలు చేద్దాం. |
03:16 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది. |
03:19 | I am inside if statement. |
03:23 | తిరిగి gedit కు మారండి. |
03:26 | ప్రత్యామ్నాయంగా, మనము పైన పేర్కొన్న if స్టేట్మెంట్ ను వ్రాయవచ్చు. |
03:31 | print space double quotes I am inside if statement backslash n close double quotes space if space open bracket dollar count space equal to equal to space 5 close bracket semicolon. |
03:57 | ఇప్పుడు, మనం if-else స్టేట్మెంట్ ను చూద్దాం. |
04:01 | ఈ స్టేట్మెంట్ యూజర్ |
04:06 | కండిషన్ True అయినప్పుడు ఒక కోడ్ను మరియు |
04:09 | కండిషన్ False అయినప్పుడు మరొక కోడ్ను అమలు చేయాలనుకున్నప్పుడు ఉపయోగించబడుతుంది. |
04:13 | If-else యొక్క సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది. |
04:17 | if space open bracket condition close bracket space open curly bracket మరియు Enter నొక్కండి. |
04:27 | if కండీషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్ |
04:29 | సెమికోలన్ |
04:32 | Enter నొక్కండి. |
04:34 | close curly bracket space else space open curly bracket Enter. |
04:41 | if కండీషన్ ఫాల్స్ అయినప్పుడు అమలు కావలసిన కోడ్ |
04:43 | సెమికోలన్ |
04:47 | Enter నొక్కండి మరియు close curly bracket. |
04:51 | ఇప్పుడు, మళ్ళీ మనము gedit లో ఇప్పటికే సృష్టించిన conditionalBlocks.pl ఫైలుకు వెళ్దాం. |
04:58 | count వేరియబుల్ కు 4 ను కేటాయించండి. తరువాత if బ్లాక్ చివరిలో space |
05:07 | else |
05:09 | space open curly bracket అని చేసి, Enter నొక్కండి. |
05:14 | print space double quotes I am inside else statement backslash n double quotes complete semicolon. |
05:30 | Enter నొక్కండి మరియు close curly bracket. |
05:34 | ఇక్కడ $count వేరియబుల్ కు 4 కేటాయించబడింది. |
05:38 | count వేరియబుల్ విలువ 5 కు సరిపోలేదు కనుక, |
05:43 | if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడదు. |
05:47 | బదులుగా, else బ్లాక్ లోని కోడ్ అమలు చేయబడుతుంది. |
05:52 | ఫైల్ save చేయడానికి Ctrl+S ను నొక్కండి. |
05:56 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి. |
05:59 | కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ తనిఖీ చేయుటకు perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి, |
06:11 | Enter నొక్కండి. |
06:13 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
06:17 | conditionalBlocks.pl syntax OK |
06:20 | కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందువలన మనం ఇప్పుడు Perl script ను |
06:27 | perl conditionalBlocks dot pl అని టైప్ చేసి, |
06:33 | Enter నొక్కి అమలు చేద్దాం. |
06:35 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది. |
06:39 | I am inside else statement. |
06:44 | మనం సారాంశం చూద్దాం. |
06:46 | ఈ ట్యుటోరియల్ లో మనము, |
06:49 | పెర్ల్ లో if మరియు if-else కండిషనల్ స్టేట్మెంట్స్ ను |
06:53 | నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకున్నాం. |
06:55 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్- |
06:57 | డిక్లేర్ చేయబడిన వేరియబుల్ విలువ perl అయినప్పుడు |
07:01 | “It is an open source language” ను |
07:04 | కానప్పుడు “It s a proprietary language” ను ముద్రించండి. |
07:08 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
07:11 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం చేస్తుంది. |
07:15 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:20 | Spoken Tutorial ప్రాజెక్టు బృందం, |
07:22 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
07:26 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
07:31 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
07:37 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
07:42 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
07:50 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
08:00 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
08:04 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను స్వామి. |
08:06 | మీకు ధన్యవాదాలు. |