LibreOffice-Suite-Calc/C2/Working-with-data/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్రేఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం - డేటాతో పనిచేయుట. |
00:06 | ఈ ట్యుటోరియల్లో మనము ఈ క్రింది విషయాలను నేర్చుకుంటాము: |
00:09 | Fill Tools మరియు Selection lists ఉపయోగించి వేగమును పంచడం. |
00:13 | షీట్ల మధ్య కంటెంట్ను పంచడం. |
00:16 | డేటాను తొలగించడం, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని ఒక భాగమును మార్చడము. |
00:23 | మనము ఉబంటు (Ubuntu)10.04 ను మన ఆపరేటింగ్ సిస్టంగా మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము. |
00:32 | ఒక స్ప్రెడ్షీట్లో డేటాను ఎంటర్ చేయడం శ్రమతో కూడినది, కాని దానిని సులభతరము చేయుటకు క్యాల్క్ ఎన్నో టూల్స్ అందిస్తుంది. |
00:42 | ఒక సెల్లో ఉన్న విషయాలను మరొక సెల్కు చేర్చుటకు మౌస్తో డ్రాగ్ మరియు డ్రాప్ చేయుట చాలా ప్రాధమికమైన సామర్ధ్యము. |
00:49 | కాని ఇన్పుట్ను ఆటోమేట్ చేయుటకు, ముఖ్యంగా పునరావృత చెందే విషయాల కొరకు క్యాల్క్లో ఎన్నో ఇతర టూల్స్ ఉన్నాయి. |
00:57 | ఈ టూల్స్ల Fill Tool మరియు Selection Lists అనే పేరుతో ఉన్నాయి. |
01:01 | ఇవి ఒకే డాక్యుమెంట్ యొక్క అనేక షీట్లలోనికి సమాచారమును చేర్చగాలవు. |
01:06 | వీటిలో ఒకదాని తరువాత మరొకటి గురించి నేర్చుకుందాము. |
01:09 | మనము మన Personal-Finance-Tracker.ods ఫైల్ తెరుద్దం. |
01:14 | ఒక షీట్లో విషయాలను నకలు చేయుటకు Fill టూల్ ఎంతో ఉపయోగకరమైన పద్ధతి. |
01:19 | మన Personal-Finance-Tracker.ods ఫైల్లో, Cost అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటాను పక్క సెల్స్లోనికి కాపీ చేయాలనుకుంటే, |
01:30 | ముందుగా 6000 అనే ఎంట్రీ కలిగి ఉన్న సెల్పైక్లిక్ చేసి, కాపీ చేయవలసిన డేటాను ఎంచుకోండి. |
01:38 | ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, మౌస్ను 2000 అనే ఎంట్రీ కలిగిన సెల్ చివరికి వరకు డ్రాగ్ చేయండి. |
01:46 | ఇంకా డేటాను మనము ఎక్కడ కాపీ చేయాలని అనుకుంటామో ఆ సెల్స్ను కూడా ఎంచుకోండి. |
01:51 | ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ను వదలండి. |
01:53 | మెనూబార్లో Edit ఎంపిక పై క్లిక్ చేసి తరువాత Fill ఎంపిక పై క్లిక్ చేయండి. |
01:59 | పాప్ అప్ మెనూలో, Right ఎంపిక పై క్లిక్ చేయండి. |
02:03 | Cost అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా పక్క సెల్స్లోనికి కాపీ అవడము మీరు చూస్తారు. |
02:09 | మార్పులను అన్డూ చేద్దాము. |
02:12 | Fill టూల్ యొక్క క్లిష్టమైన ఉపయోగము, కొన్ని సిరీస్ షీట్లు లో డేటాను పూరించేందుకు ఉపయోగిస్తారు. |
02:20 | వారంలో ని రోజుల, సంవత్సరములోని నెలల పూర్తి మరియు అబ్రివేట్ చేయబడిన డీఫాల్ట్ జాబితాను క్యాల్క్ అందిస్తుంది. |
02:27 | ఇది వినియోగదారులకు తన సొంత జాబితాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది |
02:34 | ఇప్పుడు మన షీట్లో Days అనే ఒక కొత్త హెడ్డింగ్ చేర్చుదాం. |
02:38 | దీని క్రింద, వారములోని ఏడు రోజులను స్వయంచాలకంగా చూపుతాము. |
02:43 | Days అనే హెడ్డింగ్ క్రింద ఉన్న మొదటి ఏడు సెల్స్ను ఎంచుకోండి. |
02:48 | ఇప్పుడు మెనూబార్లోని Edit ఎంపిక పై క్లిక్ చేసి, తరువాత Fill ఎంపిక కు వెళ్ళండి. |
02:53 | మెనూలోని Series ఎంపిక పై క్లిక్ చేయండి. |
02:57 | Fill Series అనే హెడ్డింగ్తో ఒక డైలాగ్ బాక్స్ను చూస్తారు. |
03:02 | ఇప్పుడు Series Type అనే హెడ్డింగ్ క్రింద, Auto Fill ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:07 | Start Value ఫీల్డ్లో, మనము వారము యొక్క మొదటి రోజును టైప్ చేస్తాము, అంటే Sunday అని టైప్ చేస్తాము. |
03:13 | ఇదివరకే ఇంక్రిమెంట్ 1 గా సెట్ చేయబడింది. ఇప్పుడు OK బటన్పై క్లిక్ చేయండి. |
03:18 | సెల్స్లో రోజులు స్వయంచాలకంగా ఎంటర్ అవడము మీరు చూస్తారు. |
03:23 | మీరు వారముల రోజులు, నెల లేక సంవత్సరంలాను ఇదే పద్ధతిలో ఎంటర్ చేయవచ్చు. ఎందుకంటే అవి క్యాల్క్లో ముందుగానే నిర్వచించబడినవి. |
03:32 | వరుసక్రమంలో డేటాను ఆటో-ఫిల్లింగ్ చేయుటకు మరొక పద్ధతి ఈ క్రింద చెప్పబడింది: |
03:37 | ఒక సెల్లో Sunday అని టైప్ చేసి మరియు ఎంటర్ ప్రెస్ చేయండి. దీని వలన కాలంలోని తరువాతి
సెల్కు ఫోకస్ మారుతుంది. |
03:46 | Sunday అని టైప్ చేయబడిన సెల్ వద్దకు తిరిగి వెళ్ళండి. సెల్ యొక్క క్రింది భాగములో కుడి చేతి వైపు మూలకు ఒక చిన్న నల్లని బాక్స్ మీకు కనిపిస్తుంది. |
03:55 | మౌస్తో ఈ బాక్స్పై క్లిక్ చేయండి. |
03:57 | కుడి వైపున డిస్ప్లే బాక్స్లో Saturday అని చూసే వరకు దానిని డ్రాగ్ చేయండి. |
04:04 | మౌస్ బటన్ను వదలండి. |
04:06 | సెల్స్లో వారము యొక్క రోజులు సెల్స్ స్వయంచాలకంగా నింపబడతాయి. |
04:10 | ఈ కిటుకు క్రమముగా ఉన్న ఏ డేటాకైనా పని చేస్తుంది. మార్పులను అన్డూ చేద్దాము. |
04:17 | మొదలు, చివర మరియు ఇంక్రిమెంట్ విలువలను ఎంటర్ చేసి సంఖ్యలకు వన్ టైం పూరక సీరీస్ను సృష్టించవచ్చు. |
04:24 | దీనిని ప్రదర్శించేందుకు, సెల్స్ A1 నుండి A7 లో ఎంటర్ చేసిన సీరియల్ సంఖ్యలను తొలగిస్తాము |
04:33 | సంఖ్యలను తొలగించిన తరువాత, A2 నుండి A7 అని రెఫరెన్స్ చేయబడిన సెల్స్ను ఎంచుకోండి. |
04:40 | ఇప్పుడు మెనూబార్లో Edit పై క్లిక్ చేసి తరువాత Fill మరియు Series ఎంపికల క్లిక్ చేయండి |
04:46 | ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. డీఫాల్ట్చే ఎంచుకొనబడకపోతే, Series type క్రింద ఉన్న Linear ఎంపిక పై న క్లిక్ చేయండి. |
04:57 | Start value ఫీల్డ్లో, మొదటి సీరియల్ నంబర్ 1 టైప్ చేద్దాం. |
05:03 | End value ఫీల్డ్లో, చివరిగా ఎంటర్ కావలసిన విలువ 6 టైప్ చేద్దాం. |
05:08 | ఇప్పుడు Increment విలువను 1 అని సెట్ చేస్తాము మరియు చివరిగా OK బటన్పై క్లిక్ చేస్తాము. |
05:14 | అన్నీ సెల్స్ స్వయంచాలకంగా వరుసక్రమంలో సీరియల్ సంఖ్యలతో నింపబడట మీరు చూడవచ్చు. |
05:21 | ఈ సందర్భములన్నింటిలో, Fill టూల్ సెల్స్ మధ్య ఒక క్షణికమైన సంబంధము సృష్టిస్తుంది.
ఒకసారి అన్నీ సెల్స్ నిండిన తర్వాత, సెల్స్ మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. |
05:32 | Fill టూల్స్ కాకుండా Selection Lists అనే మరొక వేగవంతము చేసే టూల్ ఉంది.
ఇది టెక్స్ట్ వాడకమునకు మాత్రమే పరిమితి అయ్యింది. |
05:40 | దీని గురించి మనము ఈ సీరీస్ యొక్క తరువాతి ట్యుటోరియల్స్లో చర్చిద్దాము. |
05:45 | Fill Tool మరియు Selection Lists గురించి నేర్చుకున్నాకా , మనము ఇప్పుడు షీట్ల మధ్య విషయమును ఎలా పంచాలి అనే అంశమును నేర్చుకుందాము. |
05:52 | కాల్క్ ద్వారా ఒకే సమాచారమును అనేక షీట్లలో ఒకే సెల్లో ఎంటర్ చేయవచ్చు. |
05:58 | అంటే, ప్రతి షీట్లో వేరువేరుగా ఒకే జాబితాను ప్రవేశ చేయుటకు బదులు, మీరు అన్ని షీట్లలో ఒకే సారి ప్రవేశ చేయవచ్చు. |
06:07 | మన Personal-Finance-Tracker.ods ఫైల్లోని, మొత్తం డేటా అంతా షీట్ 1 పై ఉంది. |
06:14 | ఇప్పుడు షీట్ 1 చూపుతున్న సమాచారమే షీట్ 2 మరియు షీట్ 3 లు కూడా చూపాలి. |
06:21 | కాబట్టి మెను బార్ లో Edit ఎంపికను క్లిక్ చేసి, Sheet ఎంపిక పైన క్లిక్ చేస్తాము. |
06:27 | ఇప్పుడు Select పై క్లిక్ చేయండి |
06:30 | ఇప్పుడు కనిపించే డైలాగ్ బాక్స్లో, షిఫ్ట్ కీ ఉపయోగిస్తూ, మనము షీట్ 1, షీట్ 2 మరియు షీట్ 3 అనే ఎంపికలను ఎంచుకుంటాము, |
06:40 | తరువాత OK బటన్పై క్లిక్ చేస్తాము. |
06:42 | దీనితో మనము షీట్ 1 వద్దకు తిరిగి వస్తాము. |
06:45 | ఇప్పుడు షీట్ 1లో కొంత డేటాను ఎంటర్ చేద్దాము. |
06:49 | ఉదాహరణకు, F12 అని రిఫరెన్స్ కలిగిన సెల్లో, This will be displayed on multiple sheets. అని టైప్ చేస్తాము. |
06:57 | ఇప్పుడు షీట్ 2 మరియు షీట్ 3 టాబ్లపై ఒకదాని తరువాత ఒకటిగా క్లిక్ చేయండి. |
07:02 | ఈ షీట్లలో F12 అని సెల్ రెఫర్ చేయబడిన సెల్లో ఒకే డేటా ఉండటము చూడగలము. |
07:09 | మార్పులను అన్డూ చేద్దాము. |
07:12 | తరువాత, సెల్స్లో డేటాను తొలగించుట మరియు ఎడిట్ చేయుటకు ఉన్న వివిధ పద్ధతుల గురించి నేర్చుకుందాము. |
07:18 | సెల్ యొక్క ఫార్మటింగ్ తొలగించకుండా డేటాను తొలగించుటకు, సెల్ను ఎంచుకోండి. |
07:25 | సెల్ యొక్క డేటా Input Line ఫీల్డ్లో కనిపించడము మీరు చూస్తారు. |
07:30 | ఇప్పుడు కీబోర్డుపై Backspace బటన్ నొక్కండి. |
07:35 | డేటా అంతా తొలగించపడ్డం మీరు చూడవచ్చు. |
07:37 | మార్పులను అన్డూ చేద్దాము. |
07:39 | సెల్లో డేటాను రీప్లేస్ చేయుటకు, సెల్ను ఎంచుకోండి మరియు పాత డేటాపై టైప్ చేయండి. |
07:46 | కొత్త డేటా అసలు ఫార్మాటింగ్ కలిగి ఉంటుంది.
మార్పులను అన్డూ చేద్దాము. |
07:52 | ఒక సెల్లో డేటాలోని కొంత భాగమును మార్చుటకు, విషయాల అన్ని తొలగించకుండా, సెల్పైడబల్ క్లిక్ చేయండి. |
08:01 | ఇప్పుడు కర్సర్ను కదిలిస్తూ, మీరు మీకు కావలసిన విధంగా సెల్ను ఎడిట్ చేయవచ్చు. |
08:07 | మార్పులను అన్డూ చేద్దాము. |
08:09 | దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
08:15 | సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము, |
08:17 | Fill టూల్స్ మరియు Selection Lists ఉపయోగించి వేగవంతము చేయడము. |
08:20 | షీట్ల మధ్య విషయమును పంచడము. |
08:23 | డేటాను తొలగించడము, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని కొంత భాగమును మార్చడము. |
08:29 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
08:32 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. |
08:35 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. |
08:40 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
08:43 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది. |
08:46 | ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను జారీచేస్తుంది. |
08:50 | మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాసి సంప్రదించండి. |
08:57 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము |
09:04 | ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు. |
09:13 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము వద్ద అందుబాటులో ఉంది |
09:18 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు |