LibreOffice-Suite-Base/C4/Database-Design-Purpose-OrganizeTables/Telugu
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00:00 | LibreOffice Base .నందు Spoken tutorial కు స్వాగతం |
| 00:04 | ఈ ట్యుటోరియల్ లో మనం డేటాబేస్ డిజైన్ పై ఈ క్రింది అంశాలను నేర్చుకుందాం |
| 00:09 | మన డేటాబేస్ ప్రయోజనం నిర్ణయించడం, |
| 00:12 | అవసరమైన సమాచారాన్ని గుర్తించడం మరియు నిర్వహించడం, |
| 00:15 | సమాచారాన్ని పట్టికలుగా విభజించడం, |
| 00:19 | Database Design అంటే ఏమిటి ? |
| 00:21 | Database design డేటాబేస్ యొక్క వివరణాత్మక సమాచార నమూనాను ఉత్పత్తి చేసే ప్రక్రియ. |
| 00:28 | ఒక మంచి డిజైన్ తో, ఒక డేటాబేస్ |
| 00:32 | రోజువారీ సమాచారము, ఖచ్చితమైన, మరియు పూర్తి సమాచారమును ఇస్తుంది |
| 00:37 | దీని అర్థం- మన సమాచారం యొక్క వివిధ స్థాయిలలో సమగ్రతను నిర్ధారించగలము, |
| 00:43 | మన డేటా ప్రోసెస్సింగ్ మరియు రిపోర్టింగ్ లకు కావలసిన అవసరాలను తీర్చగలము. |
| 00:48 | మరియు సులభంగా మార్పులను చూపగలము. |
| 00:51 | డేటాబేస్ డిజైన్ క్రింది సోపానాలను కలిగి ఉంటుంది |
| 00:57 | మన డేటాబేస్ యొక్క ప్రయోజనాన్ని నిర్ధారించడం, |
| 01:00 | అవసరమైన సమాచారాన్ని కనుగొని, నిర్వహించడం, |
| 01:04 | సమాచారాన్ని tables గా విభజించడం, |
| 01:07 | సమాచారాన్ని columns గా మార్చడం |
| 01:11 | primary keys ను పేర్కొనడం, |
| 01:14 | table relationship s ను నిర్వహించడం, |
| 01:17 | డిజైన్‌ను మెరుగుపరచడం, |
| 01:20 | normalization నియమాలను వర్తింపచేయడం, |
| 01:23 | చివరిగా, పరీక్షించి డాటాబేస్‌ను run చేసి, నిర్వహించడం. |
| 01:28 | ముందు మనం మొదటి సెటప్ కు వెళదాం |
| 01:32 | డేటాబేస్ పద్దతిని పేర్కొనడం |
| 01:35 | సులభమైన Library Application ను చూద్దాం. |
| 01:38 | గ్రంధాలయంలో పుస్తకాలుంటాయి |
| 01:41 | ఈ పుస్తకాలు రిజిస్టర్ అయిన వాళ్లకు మాత్రమే ఇస్తారు |
| 01:45 | కాబట్టి దీని కొరకు మనకు Library application కావాలి. |
| 01:51 | ఈ పుస్తకాలకు వాటి సభ్యులకు జారీ చేయడాన్ని ట్రాక్ కూడా చేయాలి |
| 01:56 | మొదటిగా అవసరమైన సమాచారం కనుగొని, నిర్వహించాలి |
| 02:01 | ఇక్కడ మనం,డేటాబేస్ లో రికార్డ్ చేయడానికి కావలసిన సమాచారాన్ని సేకరిస్తాము |
| 02:09 | ఇప్పుడు మనం Library application అవసరం తెలుసు కాబట్టి, ఇక్కడ అంశాలను గుర్తించండి. |
| 02:17 | అక్కడ పుస్తకాలున్నవి |
| 02:19 | ఒక Book , title , author , publisher మరియు price లను కలిగి ఉంటుంది |
| 02:24 | మరియు మనం రచయిత గురించిన సమాచారం, అనగా date of birth మరియు country మొదలైనవి కూడా భద్రపరుస్తాం. |
| 02:33 | మనం ప్రచురణకర్త పేరు , చిరునామా , ఫోన్ కూడా భద్రపరుస్తాము. |
| 02:38 | Library సభ్యుల వద్ద కూడా పేర్లు , ఫోన్ నంబరు , చిరునామా ఉంటుంది |
| 02:45 | ఇప్పుడు ఒక పుస్తకం జారీ చేసినప్పుడు, |
| 02:49 | పుస్తకం జారీ చేసిన తేదీ, రిటర్న్ తేదీ, అసలు రిటర్న్ చేయవలసిన తేదీ మరియు checked -in స్థితి ఉంటాయి. |
| 02:56 | ఈ ఐటమ్ లను attribute s అని అంటారు |
| 03:01 | ఒక్కొక్క attribute, table లోని ఒక్కొక్క column ను సూచిస్తుంది |
| 03:08 | ఇక్కడ మనం ప్రశ్నలను తయారు చేయవచ్చు |
| 03:12 | ప్రచురణకర్త ద్వారా లైబ్రరీకి సరఫరా చేయబడిన తాజా పుస్తకాల సమితి గురించిన సమాచారాన్ని మనం ఎలా జోడించాలి ? |
| 03:20 | మనం సభ్యుల వివరాలను ఎలా నిర్వహించాలి ? |
| 03:25 | ఒకవేళ సభ్యులు వెళ్ళిపోవాలనుకున్నా లేదా చిరునామా మార్చాలన్నా ఎలా సంభవం? |
| 03:32 | ఒక సభ్యుడి ద్వారా ఒక పుస్తకం తిరిగి వచ్చినప్పుడు మనం సమాచారాన్ని ఎలా నవీనకరిస్తాము? |
| 03:38 | మనం ఎలాంటి report ను పొందుపరచాలి ? |
| 03:42 | సభ్యులు ఎక్కువగా ఎటువంటి పుస్తకాలు చదువుతున్నారు? |
| 03:46 | తీసుకున్న పుస్తకాలకు రుసుము చెల్లించవలసిన పుస్తకాల జాబితాను ఎలా రూపొందించగలము. |
| 03:55 | ఇప్పుడు మనవద్ద కొన్ని వివరాలున్నవి, ఈ సమాచారాన్ని పట్టికలుగా ఎలా విభజించాలో మనం చూద్దాం |
| 04:02 | మనం మన వద్ద ఉన్న సమాచార అంశాలు లేదా లక్షణాలను, ముఖ్య entities లేదా subjectsగా విభజించాము. |
| 04:11 | ప్రతి సబ్జెక్ట్ ఒక పట్టికగా మారుతుంది |
| 04:14 | కాబట్టి ప్రాధమిక పట్టిక జాబితా, తెరపై చిత్రం రూపంలో కనిపిస్తాయి. |
| 04:21 | ఇక్కడ చూపించబడిన ప్రధాన సబ్జక్ట్స్ లేదా entities books మరియు members మాత్రమే. |
| 04:26 | కాబట్టి రెండు పట్టికలు ఒకటి books మరొకటి members లతో మొదలు పెట్టాలని తెలుస్తుంది. |
| 04:33 | ఇప్పుడు Books పట్టిక గురించి వివరంగా తెలుసుకుందాం. |
| 04:37 | ఇది ముందుగా నిర్వచించిన 10 attributes లేదా columns లను కలిగి ఉంది: |
| 04:43 | Title, Author, Publisher, PublisherAddress, PublisherCity, PublisherPhone, PublishYear, Price, AuthorBirthDate మరియు AuthorCountry . |
| 04:58 | పట్టికలో డేటా ఎలా కనిపిస్తుందో చూద్దాం. |
| 05:03 | ప్రతి వరుస లేదా columns లో,పుస్తకం, రచయిత, మరియు ప్రచురణకర్త గురించిన వివరాలు ఉంటాయి |
| 05:13 | ఇప్పుడు, ఈ నమూనాలో రెండు లోపాలు ఉన్నాయి. |
| 05:17 | ఒకే రచయిత లేదా ప్రచురణకర్త నుండి వివిధ పుస్తకాలుండవచ్చు |
| 05:23 | కాబట్టి ప్రతి వరుసలో రచయితా లేదా ప్రచురణకర్త గురించిన సమాచారం పునరావృత్తం అవుతుందని గమనించాలి |
| 05:31 | ఇది కంప్యూటర్ డిస్క్ మెమరీ ను వ్యర్థం చేస్తుంది. |
| 05:34 | ఈ డిజైన్‌లోని మరొక సమస్యేమిటంటే, |
| 05:38 | ఇది డేటాబేస్‌లో anomalies లను కలుగచేసే చేసే ప్రమాదానికి దారితీస్తుంది. |
| 05:44 | anomaly అంటే ఏమిటి? |
| 05:47 | ఇది కేవలం డేటాబేస్‌లో లోపం లేదా అస్థిరత. |
| 05:53 | మూడు రకాలైన anomalies ఉన్నాయి: |
| 05:57 | మొదటిది insertion anomaly |
| 06:01 | కొత్త రికార్డు చేర్చినప్పుడు కలుగుతుంది |
| 06:06 | లేడా కొన్ని లక్షణాలను ఇతర లక్షణాల ఉనికి లేకుండా డేటాబేస్‌లో చేర్చలేనప్పుడు కలుగుతుంది. |
| 06:14 | ఉదాహరణకి Penguin అనే కొత్త Publisher ఉంది అని అనుకుందాం. |
| 06:21 | ఇప్పుడు మన డిజైన్, మన లైబ్రరీ, పెంగ్విన్ పబ్లిషర్స్ నుండి కనీసం ఒక్క పుస్తకానైనా పొందే వరకు, దాని గురించిన వివరాలు ఇన్సర్ట్ చేయనివ్వదు, |
| 06:34 | రెండోది deletion anomaly |
| 06:39 | ఇది రికార్డు తొలగించేటప్పుడు కలుగుతుంది |
| 06:43 | ఇక్కడ row లేదా record తొలగించినప్పుడు మనం అనుకున్నదానికంటే ఎక్కువ సమాచారం తొలిగిపోతుంది |
| 06:51 | ఉదాహరణకి Orient Publishers కేవలం Paradise Lost’ అనే ఒకే పుస్తకం కలిగి ఉంటారు |
| 07:01 | ఒకవేళ మనం ఈ రికార్డు మొత్తం తొలగిస్తే ఓరియంట్ ప్రచురణకర్త యొక్క మొత్తం సమాచారం తొలిగిపోతుంది |
| 07:10 | మరియు రచయిత జాన్ మిల్టన్ గురించిన సమాచారం కూడా మనం కోల్పోతాం. |
| 07:16 | చివరిగా Update Anomaly అంటే ఏమిటో తెలుసుకుందాం. |
| 07:21 | ఇది రికార్డు కు మార్పులు చేస్తున్నప్పుడు కలుగుతుంది |
| 07:26 | ఉదాహరణకి కేంబ్రిడ్జ్ ప్రచురణదారుల వద్ద కొత్త చిరునామా ఉందనుకుందాం. |
| 07:32 | ఈ Publisher కొరకు Address వరుసను ని అప్డేట్ చెయడానికి మనం చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది |
| 07:40 | మన విషయంలో ఐతే రెండు చోట్ల. |
| 07:43 | ఒకవేళ కేంబ్రిడ్జ్ వెయ్యి పుస్తక్కలు పంపిస్తే, ఆ వేయి రికార్డుల చిరునామాలు మార్చవలసి ఉంటుంది |
| 07:54 | మనం అనుకోకుండా ఒకచోట చిరునామా మార్చి మరొక చోట మర్చిపోతే, |
| 08:02 | ఇది డేటా ఖచ్చితత్వం ను, data integrity ను కోల్పోడానికి కారణం అవుతుంది |
| 08:11 | మనం ఈ సమస్యలను ఎలా సాధించాలి. |
| 08:14 | మనం దీనిని మరల డిజైన్ చేయడం వలన,ప్రతీ రికార్డ్ ను ఒక్కసారి ఇస్తే సరిపోతుంది |
| 08:20 | ఒకవేళ ఒకే సమాచారం పునరావృత్తం అయితే దాన్ని ఒక ప్రత్యేక table లో పెడితే సరిపోతుంది |
| 08:29 | ఇప్పుడు చూద్దాం |
| 08:31 | ఇప్పుడు మనం Books ను Books, Authors మరియు Publisher గా విభజిద్దాం |
| 08:38 | ప్రతి పట్టికలో వరుస కేవలం సమాచారం లేదా entity గురించిన వివరాలు మాత్రమే భద్రపరుస్తుంది అని గమనించండి. |
| 08:47 | ఈ విధంగా మనం ప్రచురణకర్త గురించిన సమాచారం కేవలం ఒక్కసారి మాత్రమే Publisher పట్టికలో ఉంచవచ్చు. |
| 08:55 | అదేవిధంగా Authors పట్టిక ఉండడం వలన రచయితా గురించిన సమాచారం కేవలం ఒక్కసారి మాత్రమే రికార్డు అవుతుంది |
| 09:04 | మనం ఈ పట్టికలను Books పట్టికకు తరువాత ట్యూటోరియాల్లో ఎలా లింక్ చేస్తామో చూద్దాం |
| 09:12 | ఇది మనల్ని LibreOffice ట్యుటోరియల్, Database Design మొదటి భాగం యొక్క చివరకు తీసుకొస్తుంది |
| 09:19 | దీన్ని సంగ్రహించడానికి మనం డేటాబేస్ డిజైన్ లోని అంశాలను అనుసరించాలి |
| 09:25 | మన డేటాబేస్ ప్రయోజనం నిర్ణయించడం, |
| 09:28 | కావలసిన సమాచారాన్ని వెతికి నిర్వహించడం, |
| 09:32 | సమాచారాన్ని పట్టికలుగా విభజించడం. |
| 09:36 | Spoken Tutorial అనే ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్టు లోని ఒక భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
| 09:48 | ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది. |
| 09:54 | ఇదే విషయంలో మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
| 09:58 | దీనిని అనువదించినది హరి. చేరినందుకు ధన్యవాదాలు. |