Java-Business-Application/C2/Creating-a-Java-web-project/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | Creating a Java web project పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:09 | Java Web Project ను సృష్టించడం, |
00:12 | Deployment Descriptor గురించి, మరియు |
00:15 | web.xml ఫైల్ ల గురించి నేర్చుకుంటాము. |
00:19 | ఇక్కడ మనము Ubuntu వెర్షన్ 12.04 |
00:23 | Netbeans IDE 7.3 |
00:26 | JDK 1.7 |
00:28 | Firefox web-browser 21.0 ను ఉపయోగిస్తాము. |
00:32 | మీకు నచ్చిన ఏ web-browser ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:35 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు |
00:39 | Core Java ఉపయోగించి Netbeans IDE మరియు |
00:42 | HTML గురించి అవగాహన ఉండాలి. |
00:44 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:50 | ఇప్పుడు, మనం ఒక సాధారణ Java web projectను NetBeans IDEను ఉపయోగించి ఎలా సృష్టించాలో చూద్దాం. |
00:56 | దీని కొరకు మనం NetBeans IDE కు మారాలి. |
01:01 | IDE యొక్క ఎగువ ఎడమ మూలలో, File పై క్లిక్ చేసి, New Project పై క్లిక్ చేయండి. |
01:08 | ఒక New Project విండో తెరుచుకుంటుంది. |
01:12 | Categories నుండి, Java Web ను మరియు Projects నుంచి Web Applicationను ఎంచుకోండి. |
01:18 | తరువాత Next పై క్లిక్ చేయండి. |
01:20 | తరువాత తెరుచుకున్న window పై, |
01:23 | Project Name ను MyFirstProject గా టైప్ చేయండి. |
01:27 | Project location మరియు Project Folder ను అలానే వదిలివేయండి. |
01:31 | తరువాత Next పై క్లిక్ చేయండి. |
01:35 | GlassFish Server ను Server గా ఎంచుకోండి. |
01:39 | ఇక్కడ MyFirstProject అనేది Context Path అని గమనించండి, ఇది మన Project పేరు మాదిరిగానే ఉంటుంది. |
01:47 | మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాము. |
01:50 | ఇప్పుడు, Next పై క్లిక్ చేసి, తరువాత Finish పై క్లిక్ చేయండి. |
01:55 | Projects టాబ్ పై క్లిక్ చేయండి. |
01:58 | మనం, ఇక్కడ అనేక nodeలను మరియు My First Project పేరుతో ఒక web applicationను సృష్టించడంను చూడవచ్చు. |
02:08 | ఇప్పుడు మనం ఈ nodeల అన్నింటి గురించి ప్రస్తుతం ఆలోచించవలసిన అవసరం లేదు. |
02:11 | కానీ దానియందు ఏమీ ఉందో క్లిక్ చేసి చూద్దాం. |
02:16 | ఇప్పుడు, మనము Deployment Descriptor అంటే ఏమిటో తెలుసుకుందాము. |
02:21 | web application యొక్క deployment descriptor, |
02:25 | application యొక్క configuration,classes, resources గురించి మరియు |
02:31 | వెబ్ requestsను సర్వ్ చేయడానికి, వాటిని web server ఎలా ఉపయోగిస్తుందో వివరిస్తుంది. |
02:37 | web server, application కొరకు ఒక request ను స్వీకరిస్తుంది. |
02:42 | ఇది deployment descriptor ను request యొక్క URL కు మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తుంది. |
02:48 | ఇది request ను నిర్వహించగలిగే కోడ్ కు URLను మ్యాప్ చేస్తుంది. |
02:52 | deployment descriptor అనేది web.xml పేరు గల ఫైల్. |
02:57 | ఇప్పుడు మనం IDEకు తిరిగి వెళ్దాము. |
03:00 | మనం web.xml ఫైల్ ను ఇక్కడ అందుబాటులో ఉన్న nodes నుండి కనుగొనలేకపోయాము. |
03:07 | దీన్ని గుర్తించడానికి, IDE కు పైన ఎడమవైపున, File పై క్లిక్ చేసి, తరువాత New File పై క్లిక్ చేయండి. |
03:16 | Categories నుండి, Webను ఎంచుకుని, |
03:19 | File Types నుండి Standard Deployment Descriptor (web.xml) ను ఎంచుకోండి. |
03:25 | తరువాత Next పై క్లిక్ చేసి, |
03:27 | Finish పై క్లిక్ చేయండి. |
03:30 | IDE కు ఎడమ వైపున ఉన్న Files టాబ్ పై క్లిక్ చేయండి. |
03:34 | web.xml అనేది Web node యొక్క WEB-INF ఫోల్డర్ క్రింద కనిపిస్తుంది అని గమనించండి. |
03:42 | మీరు ఇప్పుడు source-codeను చూడవచ్చు. |
03:46 | మనకు ఇక్కడ ఒక xml header ఉన్నది. |
03:50 | అదేవిధంగా web-app node కూడా ఉన్నది. |
03:53 | ఇప్పుడు, మనం applicationను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం. |
03:57 | అలా చేయుటకు, MyFirstProject పై రైట్ క్లిక్ చేయండి. |
04:02 | Clean and Build పై క్లిక్ చేయండి. |
04:04 | ఇది గతంలో కంపైల్ చేసిన ఫైళ్ళను మరియు ఇతర build output ల ను తొలగిస్తుంది. |
04:10 | ఇది applicationను మళ్ళీ కంపైల్ చేస్తుంది. |
04:14 | మళ్ళీ, MyFirstProject పై right క్లిక్ చేసి, తరువాత Run పై క్లిక్ చేయండి. |
04:20 | అప్పుడు, సర్వర్ అప్ అయి, రన్ అవుతుంది మరియు ఇది My first Project ను deploy చేస్తుంది. |
04:27 | ఒక బ్రౌజర్ window తెరచుకుని, అందులో Hello World అని ప్రదర్శిస్తుంది. |
04:32 | ఇలా ఎందుకంటే మనం project ను run చేస్తున్నప్పుడు, web application చూపబడిన page ను రెండర్ చేస్తుంది. |
04:39 | ఇప్పుడు, ఇక్కడ pageను రెండర్ చేసిన URL ను చూద్దాం. |
04:44 | ఇది localhost colon 8080 slash MyFirstProject. |
04:49 | కాబట్టి, ఎప్పుడైతే MyFirstProject ను అమలు చేస్తామో HelloWorld! అని చెప్పే JSP పేజీని మనం డిఫాల్ట్ గా పొందుతాము. |
04:57 | ఇప్పుడు, మన IDE కు తిరిగి వెళ్ళండి. |
05:00 | మనం WEB-INF folder క్రింద index.jsp ను చూడవచ్చు. |
05:07 | index.jsp పై డబల్ క్లిక్ చేయండి. |
05:10 | మనం ఇక్కడ source code ను చూడవచ్చు. |
05:12 | ఇది HTML tags తో సాధారణ JSP page మాత్రమే. |
05:17 | ఇది title JSP Pageను మరియు heading Hello World ను కలిగి ఉంటుంది. |
05:24 | మనం web applicationను run చేస్తున్నపుడు, సర్వర్ index.jspను డిఫాల్ట్ గా అందిస్తుంది. |
05:30 | మనం ContextPath గురించి ముందు తెలుసుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి. |
05:36 | మనం ContextPath ను MyFirstProject గా సెట్ చేసాము. |
05:41 | ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి వెళ్ళండి. |
05:44 | URLను localhost colon 8080 గా టైప్ చేసి, Enter నొక్కండి. |
05:50 | మనం Glassfish Server యొక్క Home page ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. |
05:56 | ఇక్కడ, 8080 అనేది సర్వర్, మెషిన్ పై అమలు చేసే డిఫాల్ట్ పోర్ట్. |
06:01 | ఈ Glassfish Server instance దానిపై run అయ్యే చాలా applicationలను కలిగి ఉండవచ్చు. |
06:08 | ఒక ప్రత్యేకమైన applicationను పొందడానికి ఆ అప్లికేషన్ పేరును URL లో టైప్ చేయండి. |
06:15 | కాబట్టి, మనము ప్రత్యేక application ను instance పై అమలు చేయబడే విధంగా టైప్ చేయాలి. |
06:21 | కాబట్టి, మనము slash MyFirstProject ను టైప్ చేసి, Enter నొక్కండి. |
06:26 | మనం Hello World ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు. |
06:31 | ఇప్పుడు సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనము: |
06:35 | సాధారణ Java Web project ను సృష్టించుట, |
06:38 | web ప్రాజెక్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడం మరియు |
06:41 | web.xml ఫైల్ గురించి నేర్చుకున్నాము. |
06:44 | ఈ spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాల లు తెలుసుకొనుటకు, |
06:46 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో ను చూడండి. |
06:50 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
06:54 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:58 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: |
07:00 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపు లను నిర్వహిస్తుంది. |
07:04 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:07 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:13 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:17 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:23 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
07:27 | http://spoken-tutorial.org/NMEICT- Intro |
07:34 | ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది. |
07:44 | వారు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కంటెంట్ ను ధృవీకరించారు. |
07:48 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |