Inkscape/C2/Text-tool-features/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Inkscape ను ఉపయోగించి Text tool features అను Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం వీటి గూర్చి నేర్చుకుంటాం,
00:09 మేన్యువల్ కెర్నింగ్, స్పెల్ చెకింగ్ (స్పెల్లింగ్ చెక్ చేయడం)
00:12 సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్.
00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను-
00:17 Ubuntu Linux12.04 OS
00:20 Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:24 నేను ఈ ట్యుటోరియల్ ను గరిష్ట రిజొల్యూషన్ మోడ్ లో రికార్డ్ చేస్తాను.ఇది ప్రదర్శించబడే అన్ని టూల్స్ కు స్థానం కల్పిస్తుంది.
00:33 Inkscape ను తెరుద్దాం.
00:35 ఈ సిరీస్ లో ఇంతకు ముందు, మనం Text tool ను ఉపయోగించి టెక్స్ట్ ను రూపొందించడం మరియు ఫార్మాట్ చేయడం నేర్చుకున్నాం.
00:40 ఇప్పుడు,మనం Text tool యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాల గూర్చి నేర్చుకుంటాం. దానిపై క్లిక్ చేయండి.
00:45 Manual kerning తో ప్రారంభిద్దాం.
00:48 Horizontal kerning,Vertical shift మరియు Character rotation వీటిని manual kerns అని పిలుస్తారు.
00:54 Spoken అనే పదాన్ని టైప్ చేయండి.
00:58 Sఅక్షరం తరువాత కర్సర్ ను ఉంచండి.
01:01 Horizontal kerning, ఎంచుకోబడిన అక్షరం తరువాత ఖాళీని జోడిస్తుంది.
01:05 అక్షరాలు S మరియు p మధ్య ఖాళీని పెంచడానికి లేదా తగ్గించడానికి అప్ మరియు డౌన్ బాణాలు క్లిక్ చేయండి.
01:13 S మరియు p అక్షరాల మధ్య మాత్రమే, జోడించిన ఖాళీ ఉంటుంది గమనించండి.
01:19 Horizontal kerning పారామీటర్ ను నేను 3 గా ఉంచుతాను.
01:24 తరువాతి ఐకాన్, అనగా Vertical shift, ఇది అక్షరాలను ఎంచుకున్న అక్షరం తరువాత పైకి లేదా కిందికి మారుస్తుంది.
01:30 అప్ మరియు డౌన్ బాణాలు క్లిక్ చేయండి.
01:34 కర్సర్ తరువాత ఉన్న అక్షరాలు పైకి కిందికి మార్చబడ్డాయని గమనించండి.
01:39 పారామీటర్ ని 15గా ఉంచండి.
01:42 తరువాత, Character rotation ను ఉపయోగించి మనం మన అక్షరాలను రొటేట్ చేద్దాం.
01:47 ఈ ఐకాన్ కర్సర్ తరువాత వచ్చే అక్షరాన్ని మాత్రమే రొటేట్ చేస్తుంది.
01:51 కనుక, కర్సర్ ను e అక్షరానికి ముందు ఉంచండి.
01:55 Character rotation యొక్క అప్ మరియు డౌన్ బాణాలపై క్లిక్ చేసి, e అక్షరం రొటేట్ అవడం గమనించండి.
02:02 ఒకటి కంటే ఎక్కువ అక్షరాలకు kerns వర్తింపజేయడానికి, ముందుగా అక్షరాలను ఎంచుకుని ఆపై వాటికి విలువలు ఇవ్వండి.
02:09 నేను, అక్షరాలు p మరియు o లను ఎంచుకుంటాను మరియు వాటికి Horizontal kerning పారామీటర్ ను 5 గా,
02:17 Vertical shift పారామీటర్ ను 10 గా మరియు
02:21 Character rotation పారామీటర్ ను 20 గా ఇస్తాను.
02:24 మార్పులను గమనించండి.
02:26 kerns ను తొలగించటానికి, Text menu కు వెళ్ళండి.
02:29 Remove Manual Kerns పై క్లిక్ చేయండి.
02:32 Manual Kerns, Regular text లో మాత్రమే ఉపయోగించవచ్చు.
02:35 Flowed text లో, ఈ ఎంపికలు డిసేబుల్ అవుతాయి.
02:39 దానిని చెక్ చేయడానికి, ఒక text box ను సృష్టించండి.
02:43 Manual kerns ఎంపికలు ఇప్పుడు డిసేబుల్ అయ్యాయని గమనించండి.
02:47 ఈ చర్యను రద్దు చేయటానికి Ctrl + Z ను నొక్కండి.
02:51 తరువాత, మనం Spell check (స్పెల్లింగ్ చెక్ చేయడం) అనే లక్షణం గూర్చి నేర్చుకుంటాం.
02:54 Spell check లక్షణాన్ని వివరించడానికి, నేను LibreOffice writer లో ఇప్పటికే సేవ్ చేసియున్న దానినుండి టెక్స్ట్ ను కాపీ చేస్తాను.
03:01 మొత్తం టెక్స్ట్ ను ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి. తరువాత దానిని కాపీ చేయడానికి Ctrl + C ని నొక్కండి.
03:08 ఇప్పుడు Inkscape కు తిరిగి రండి.
03:10 టెక్స్ట్ ను పేస్ట్ చేయడానికి కేన్వాస్ పైన క్లిక్ చేయండి మరియు Ctrl + V ని నొక్కండి.
03:15 Text menu కి వెళ్ళి Check Spelling ఎంపిక పై క్లిక్ చేయండి.
03:19 ఒక కొత్త డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:22 మొత్తం టెక్స్ట్ అది ఎంపిక చేయబడిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా తనిఖీ చేయబడుతుంది.
03:27 ఎప్పుడైనా ఒక అనుమానాస్పద పదం కనిపిస్తే, అది ఎరుపు రంగులో హైలైట్ చేయబడుతుంది మరియు కర్సర్ టెక్స్ట్ కి ముందు ఉంచబడుతుంది.
03:33 Http అనే పదం కొరకు ఒక సూచనల జాబితా కనిపిస్తుంది.
03:37 స్పెల్లింగ్ సరైనదే కనుక మనం ఆ పదాన్ని నిఘంటువుకు జోడిస్తాము.
03:41 ఆలా చేయటానికి, Add to Dictionary బటన్ పై క్లిక్ చేయండి.
03:45 ఇది ఆ పదం స్పెలింగ్ ఎల్లపుడు కరెక్ట్ గా వచ్చేలా చేయటానికి spell checker అంగీకరించేలా చేస్తుంది.
03:50 తరువాత, tutorial అనే పదం హైలైట్ అవుతుంది.
03:53 స్పెల్లింగ్ తప్పయినపుడు, ఏదయితే సూచనల జాబితా tutorial లో ఉందొ దానినుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
03:59 ఇప్పుడు Accept బటన్ పై క్లిక్ చేయండి.
04:02 ఒకవేళ మీరు Ignore పై క్లిక్ చేస్తే, డాక్యుమెంట్ లో అదేవిధమైన స్పెల్లింగ్ తో ఉన్న అన్నిఇతర పదాలు ఇగ్నోర్ చేయబడతాయి.
04:08 ఒకవేళ మీరు Ignore once పై క్లిక్ చేస్తే, ఆ పదం ఒకే ఒక్కసారి ఇగ్నోర్( విస్మరించబడుతుంది) చేయబడుతుంది. అదీ మొదటిసారి మాత్రమే.
04:14 ఒకవేళ మీరు స్పెల్లింగ్ ను చెక్ చేసే ప్రక్రియను ఆపివెయ్యాలి అనుకుంటే, Stop పై క్లిక్ చేయండి.
04:18 మనం Start బటన్ పై క్లిక్ చేసి ప్రక్రియను మళ్ళీ మొదలుపెట్టవచ్చు.
04:22 స్పెల్లింగ్ ను చెక్ చేయడం అనేది ఎగువ కుడివైపు ఉన్న టెక్స్ట తో ప్రారంభమవుతుంది మరియు కేన్వాస్ పై పని చేస్తుంది.
04:27 ఇప్పుడు మనం ఈ dialog box ను మూసివేద్దాము మరియు ఈ టెక్స్ట్ ను ఒక పక్కన పెడదాము.
04:32 తరువాత,మనం Superscript మరియు Subscript రాయడం నేర్చుకుంటాం.
04:36 గణితసూత్రము (a+b)2 = a2+b2+2ab అని టైప్ చేయండి.(a + b మొత్తం వర్గం అనేది a వర్గం, b వర్గం మరియు 2ab ల మొత్తానికి సమానం).
04:44 మనము నంబర్ 2 ను వర్గం గా మూడు స్థానాలలో మార్చవలసి ఉంటుంది.
04:48 మొదటి 2 ను ఎంచుకోండి.Tool controls bar కి వెళ్ళి Toggle, Superscript ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:56 ఇదే విధంగా, మిగిలిన 2 లు మార్చండి.
04:59 తరువాత, మనం సబ్ స్క్రిప్ట్ను ఉపయోగించి ఒక రసాయన సూత్రాన్ని రాద్దాం.
05:04 కనుక, H2SO4 అని టైప్ చేయండి.
05:07 ఇక్కడ 2 మరియు 4 లను సబ్స్క్రిఫ్ట్ గా రాయాలి.
05:11 ముందు 2 ను ఎంచుకోండి. Tool controls bar కి వెళ్ళి Toggle, Subscript ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:17 ఇదేవిధంగా, 4ను మార్చండి.
05:19 సారాంశం చూద్దాం.
05:21 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి-
05:24 మేన్యువల్ కెర్నింగ్, స్పెల్ చెకింగ్ (స్పెల్లింగ్ ని చెక్ చేయడం)
05:26 సూపర్ స్క్రిప్ట్ మరియు సబ్ స్క్రిప్ట్
05:29 ఇక్కడ మీకోసం 2 అసైన్మెంట్ లు-
05:31 How are you అనే టెక్స్ట్ ను రాయండి మరియు దాని ఫాంట్ సైజు ను 75 కు మార్చండి.
05:36 w కి తర్వాత కర్సర్ ను ఉంచండి. Horizontal kerning పారామీటర్ ను -20 కి మార్చండి.
05:42 are అనే పదాన్ని ఎంచుకోండి. Vertical shift పారామీటర్ ను 40 కి మార్చండి.
05:47 you అనే పదాన్ని ఎంచుకోండి.Character rotation పారామీటర్ ను-30 కి మార్చండి.
05:52 Sub-script మరియు Super-script ఎంపికలను ఉపయోగించి కిందన ఉన్న ఫార్ములాలను (సూత్రాలను)వ్రాయండి.
05:57 Silver sulfate - Ag₂SO₄.
06:00 a2−b2=(a−b)(a+b)
06:06 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
06:09 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
06:15 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
06:22 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org.
06:24 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
06:30 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:34 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06:36 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya