Inkscape/C2/Align-and-distribute-objects/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Inkscape ను ఉపయోగించి Align and distribute objects అను Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి-
00:09 వివిధ ఆబ్జెక్ట్ లను సమలేఖనం మరియు పంపిణీ చేయడం.
00:12 ఆబ్జెక్ట్ లను అడ్డు మరియు నిలువు వరుసలలో అమర్చడం
00:16 ఆబ్జెక్ట్ ల మధ్య ఖాళీని సర్దుబాటు చేయడం మరియు ఒక టైల్ పాటర్న్ ను సృష్టించడం.
00:22 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను-
00:24 Ubuntu Linux 12.04 OS
00:27 Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:31 Dash home కి వెళ్ళి Inkscape అని టైప్ చేయండి.
00:35 logo పై క్లిక్ చేయండి.
00:37 నేను ఇప్పటికే సేవ్ చేసియున్న Inkscape డాక్యుమెంట్ ను తెరుస్తాను.
00:44 ఇక్కడ మనం కేన్వాస్ పైన యాదృచ్చికంగా ఉంచిన 5 విభిన్న ఆకారాలను చూడవచ్చు.
00:50 మీ Inkscape కేన్వాస్ పై, దయచేసి ఈ 5 ఆకారాలను గీయండి మరియు ఇక్కడ చూపిన విధంగా వాటిని ఉంచండి.
00:55 ఇప్పుడు, ఆబ్జెక్ట్ లను క్రమపరచడం ప్రారంభిద్దాం.
00:59 Object మెనూ కి వెళ్ళి Align and Distribute పై క్లిక్ చేయండి.
01:04 interface యొక్క కుడివైపున Align and Distribute డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
01:09 రెండు రకాల స్థానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
01:12 Align అనేది ఆబ్జెక్ట్ ల కేంద్రాలు లేదా అంచులను ఒక దానితో ఒకటి సమలేఖనం చేస్తుంది.
01:18 Distribute అనేది ఆబ్జెక్ట్ లను (క్షితిజ సమాంతర) అడ్డు లేదా నిలువు దిశలో వాటి కేంద్రాలు లేదా అంచులపై ఆధారపడి పంపిణి చేస్తుంది.
01:29 మనం ఈ ఎంపికలను మరియు వాటి ఉప-ఎంపికలను ఉపయోగించి ఆబ్జెక్ట్ లను వివిధ పద్దతులలో సమలేఖనం చేయవచ్చు.
01:36 ఇక్కడ మరొక ముఖ్యమైన లక్షణం, Relative to ఉంది.
01:39 దీన్ని ఉపయోగించి, మనం ఆబ్జెక్ట్ లను ఏదయినా విషయానికి సమన్వయం చేస్తూ క్రమపరచవచ్చు.
01:44 ఇక్కడ ఉన్న ఎంపికలను చూడడానికి డ్రాప్-డౌన్ జాబితాపై క్లిక్ చేయండి.
01:47 కనుక, మనం Last selected, First selected, Biggest object, Smallest object, Page, Drawing మరియు Selection లను కలిగియున్నాము.
02:00 అప్రమేయంగా, ఆబ్జెక్ట్ లు Page కి సంబంధించి సమలేఖనం చేయబడతాయి.
02:04 అంటే ఎంచుకోబడిన ఆబ్జెక్ట్ లు మీ Page కొలతలకు అనుగుణంగా Align and Distribute ఆపరేషన్స్ కు స్పందిస్తాయి.
02:13 canvas పైన అన్ని ఆబ్జెక్ట్ లను ఎంచుకోవడానికి Ctrl + A ని నొక్కండి.
02:17 మొదటి 5 చిహ్నాలు నిలువు దిశలో ఆబ్జెక్ట్ లను సమలేఖనం చేస్తాయి.
02:22 నేను మొదటి ఐకాన్ పై క్లిక్ చేస్తాను.
02:25 టూల్ టిప్ చెప్పినట్లుగా, ఆబ్జెక్ట్ ల యొక్క కుడి అంచులు అనేవి anchorయొక్క ఎడమ అంచుకు సమలేఖనం అవుతాయి.
02:32 దయచేసి గుర్తుంచుకోండి, Relative to ఎంపిక ఒక Page అయినట్లే, ఇక్కడ anchor point అనేది కూడా ఒక page అవుతుంది.
02:38 రెండు ఆబ్జెక్ట్ లు ఇప్పుడు ఒకదానితో మరొకటి అతిపాతం అయ్యాయని గమనించండి.
02:43 గత అమరికలో వస్తువుల సన్నిహితం పై ఆధారపడి ఓవర్లాప్ సంభవించవచ్చు.
02:48 మనం దీనిని Distribute ఎంపిక కిందనయున్న Remove overlaps ఎంపికపై క్లిక్ చేసి సరిచేయవచ్చు.
02:56 ఇప్పుడు, అతిపాతం తొలగించబడింది.
02:58 ఆబ్జెక్ట్ ల మధ్య సమాంతర మరియు నిలువు దిశలలో అంతరాలను సర్దుబాటుచేయడానికి, H మరియు V ఎంపికలను ఉపయోగించండి.
03:06 ఇప్పుడు, Align కింద ఉన్న ఎంపికలపై క్లిక్ చేసి, ఆబ్జెక్ట్ లు ఏ విధంగా సమలేఖనం చేయబడతాయో గమనించండి.
03:14 అమరికను సరిగ్గా అర్థం చేసుకోవడానికి undo ఎంపిక CTRL + Z ను ఉపయోగించండి.
03:21 అమరికను అర్థం చేసుకొనుటకు టూల్ టిప్స్ (చిట్కాలు) చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
03:28 చివరి ఐకాన్ టెక్స్ట్ ల పైన మాత్రమే పని చేస్తుంది.కనుక మనం దీని గూర్చి వేరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాం.
03:35 తరువాత, మనం Distribute ఎంపికను ఉపయోగించి ఆబ్జెక్ట్ లలోని ఖాళీలను సర్దుబాటు చేద్దాం.
03:40 ఆబ్జెక్ట్ లు నిలువు దిశలో ఉన్నందున, మనం Distribute ఎంపిక కింద చివరి నాలుగు చిహ్నాలను ఉపయోగించాలి.
03:48 నేను వాటిని ముందు, మధ్య కు సమలేఖనం చేస్తాను.
03:51 ఇప్పుడు, Distribute కింద ఉన్న ఎంపికలపై క్లిక్ చేసి, ఆబ్జెక్ట్ లు ఎలా వాటంతట అవే సమలేఖనం అవుతాయో గమనించండి.
03:58 మరొక్క సారి undo ఎంపిక CTRL + Z ను ఉపయోగించి అమరిక గురించి బాగా అర్ధం చేసుకోవచ్చు
04:07 అమరికను పూర్తిగా అర్థంచేసుకోవటంలో సహాయం కొరకు టూల్ టిప్స్ ని చూడండి.
04:13 Relative to కింద,Treat selection as group అనే ఒక ఎంపిక ఉందని గమనించండి.
04:19 ఇది మొత్తం ఆబ్జెక్ట్ లను ఒక పూర్తి సమూహంగా క్రమపరుస్తుంది.
04:22 చెక్ -బాక్స్ పై క్లిక్ చేయండి.
04:24 ఇప్పుడు, ఒకదాని తరువాత ఒక ఐకాన్ పై క్లిక్ చేసి ఆబ్జెక్ట్ లు ఒక సమూహంగా చేయండి మరియు అవి క్రమపర్చబడ్డాయి, విడివిడిగా కాదు అని గమనించండి.
04:34 బాక్స్ ను అన్ చెక్ చేద్దాం.
04:36 ఇప్పుడు, ఆబ్జెక్ట్ లు ఒక్కొక్కటిగా క్రమపర్చబడతాయి.
04:40 తరువాత, మనం ఆబ్జెక్ట్ లను Last selected కు అనుగుణంగా సమలేఖనం మరియు పంపిణి చేద్దాం.
04:45 Relative to ఎంపికను Last selected గా మార్చండి.
04:49 దానికోసం, canvas లోపలి అన్ని ఆబ్జెక్ట్ లను తీసుకువచ్చి వాటిని యాదృచ్చికంగా ఉంచండి.
05:01 ఆబ్జెక్ట్ లను ఒకదాని తర్వాత ఒకటి ఎంచుకోండి. వృత్తాన్ని చివరకు ఎంచుకోండి.
05:06 ఆబ్జెక్ట్ లను ముందులాగే ఒకదాని తర్వాత ఒకటి ఎంచుకోండి.
05:10 చివరగా ఎంచుకోబడింది వృత్తం గనక, ఆబ్జెక్ట్ లు వృత్తానికి అనుగుణంగా క్రమపర్చబడ్డాయని గమనించండి.
05:19 అదేవిధంగా, మీరు Relative to జాబితాలో ఉన్న అన్ని ఎంపికలను ప్రయత్నించవచ్చు మరియు ఆబ్జెక్ట్ ల అమరికను గమనించవచ్చు.
05:26 మనం తరువాతి ట్యుటోరియల్స్ లో, Align and Distribute డైలాగ్ బాక్స్ లోని అధునాతన ఎంపికల గూర్చి నేర్చుకుంటాము.
05:32 కనుక, మనం ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం.
05:37 తరువాత, మనం ఆబ్జెక్ట్ లను అడ్డు మరియు నిలువు వరుసలలో అమర్చడం నేచుకుంటాం.
05:41 Object మెనూ కి వెళ్ళండి.
05:43 Rows and Columns పై క్లిక్ చేయండి.
05:46 Rows and Columns డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
05:50 ఈ ఎంపికను ఉపయోగించి, మనం ఆబ్జెక్ట్ లను కావలసినంత ఖాళీని ఇచ్చి అడ్డు మరియు నిలువు వరుసలలో అమర్చవచ్చు.
05:57 canvas పైన ఆబ్జెక్ట్ లను యాదృచ్చికంగా అమర్చండి.
06:01 ఇప్పుడు, ఆబ్జెక్ట్ లను 2 అడ్డు వరుసలు మరియు 3 నిలువు వరుసలలో అమర్చుదాం.
06:05 అయితే, Row పారామీటర్ ను2 కు మార్చండి.
06:09 గమనించండి- Row పారామీటర్ మారినపుడు, Column పారామీటర్ కూడా స్వయంచాలకంగా మారుతుంది.
06:15 దిగువ కుడివైపు ఉన్న Arrange బటన్ పై క్లిక్ చేయండి.
06:19 Align ఎంపిక, ఆబ్జెక్ట్ లను, కుడివైపు కు, మధ్యలోకి మరియు ఎడమవైపుకు సమలేఖనం చేయడానికి సహాయం చేస్తుంది.
06:29 వాటిని ఒకదాని తర్వాత ఒకటిని చెక్ చేయండి మరియు మార్పులను గమనించండి.
06:37 Set spacing ఎంపికను ఉపయోగించి మనం అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల కొరకు, ఆబ్జెక్ట్ ల మధ్య ఖాళీని సర్దుబాటుచేయవచ్చు.
06:45 ఇప్పుడు, అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల కొరకు స్పేస్ పారామీటర్ ను 5 గా మార్చండి.
06:50 Arrange బటన్ పై క్లిక్ చేయండి.
06:53 ఆబ్జెక్ట్ ల మధ్య ఖాళీని గమనించండి.
06:56 నేను మీకు Align and Distribute ను ఉపయోగించి ఒక పాటర్న్ ని ఎలా సృష్టించాలో చూపిస్తాను.
07:01 నా వద్ద ఒక కొత్త Inkscape ఫైల్లో భిన్నమైన పరిమాణాలు మరియు రంగులతో కూడిన నాలుగు చతురస్రాలు ఉన్నాయి.
07:06 అన్ని చతురస్రాలు ఎంచుకొని వాటిని తిప్పండి, అవి చూడటానికి డైమండ్ ఆకారంలో కనిపించాలి.
07:12 Align and Distribute డైలాగ్ బాక్స్ ను తెరవండి.
07:15 Centre on vertical axis పై క్లిక్ చేయండి.
07:18 Centre on horizontal axis పై క్లిక్ చేయండి.
07:22 ఒక tile పాటర్న్ ఇప్పుడు కేన్వాస్ పై ఏర్పడుతుంది.
07:25 సృజనాత్మకంగా ఈ ఎంపికలను ఉపయోగించడం వల్ల, మనం అనేక ప్రత్యేకమైన (పాటర్న్స్) నమూనాలను రూపొందించవచ్చు.
07:30 సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి,
07:34 వివిధ ఆబ్జెక్ట్ లను సమలేఖనం మరియు పంపిణీ చేయడం.
07:37 ఆబ్జెక్ట్ లను అడ్డు మరియు నిలువు వరుసలలో అమర్చడం
07:40 ఆబ్జెక్ట్ ల మధ్య ఖాళీని సర్దుబాటు చేయడం మరియు ఒక టైల్ పాటర్న్ ను సృష్టించడం.
07:45 ఇక్కడ మీకోసం 2 అసైన్మెంట్లు,
07:47 కింద సూచించిన కొలతలు ఉండేలా 5 వృత్తాలను రూపొందించండి.
07:54 వాటిని కేన్వాస్ పైన యాదృచ్చికంగా సర్దుబాటుచేసి అన్నిటిని ఎంచుకోండి.
07:59 Align and Distribute ను ఉపయోగించి Relative to ఎంపికను Biggest object కు మార్చండి.
08:04 Align left edges పై క్లిక్ చేయండి.
08:06 Centre on horizontal axis పై క్లిక్ చేయండి.
08:10 100 * 100 పిక్సల్స్ కొలతతో నీలం రంగులో 6 చతురస్రాలు రూపొందించండి.
08:17 అన్ని చతురస్రాలు ఎంచుకుని Rows and columns ను తెరవండి.
08:21 వాటిని 2 అడ్డు వరుసలు మరియు 3 నిలువు వరుసలలో అమర్చండి.
08:25 నిలువు మరియు సమాంతర స్పేస్ పారామీటర్ లను 20 కి సెట్ చేయండి.
08:29 మీ పూర్తి అయిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
08:35 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
08:43 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
08:51 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org.
08:54 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
09:03 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
09:07 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:09 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya