Health-and-Nutrition/C2/Kangaroo-Mother-Care/Telugu
From Script | Spoken-Tutorial
00:00 | కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:05 | ఈ టుటొరియల్ లొ మనము నేర్చుకునేవి- |
00:08 | కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) అంటే ఏమిటి? |
00:10 | దానిలోని భాగాలు, ప్రాముఖ్యత మరియు. |
00:13 | కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) చేసే విధానం. |
00:17 | ముందుగా మనం కంగారూ మదర్ కేర్ పరిచయంతో ప్రారంభిద్దాం? |
00:22 | పేరు సూచించినట్లుగానే - |
00:24 | ఇది బిడ్డను తన చర్మంతో తల్లి చర్మాన్ని తాకేలా ఉంచుతుంది. |
00:29 | మరియు ఇది KMC గా ప్రసిద్ధి చెందింది. |
00:32 | గుర్తుంచుకోండి, KMC ను బిడ్డ పుట్టిన వెంటనే ఇవ్వాలి. |
00:39 | పుట్టుకతో తక్కువ బరువున్న శిశువులకు ఇది ప్రత్యేకంగా సిఫార్సు చేయబడింది- |
00:44 | అంటే 2.5 కిలోగ్రాముల కన్నాతక్కువ బరువు తో పుట్టిన బిడ్డలకు మరియు, |
00:48 | నిరంతర పర్యవేక్షణ అవసరం లేని వారికి |
00:52 | ఏమైనప్పటికి, దీన్ని సాధారణ, ఆరోగ్యకరమైన పూర్తి-కాల బిడ్డలందరికి కూడా ఉపయోగించవచ్చు. |
00:59 | KMC రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది: |
01:03 | తల్లి మరియు తన బిడ్డ మధ్య ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకుతూఉండటం అనేది నిరంతరం మరియు సుదీర్ఘ కాలం సాగుతుంది. |
01:09 | మరియు బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం. |
01:13 | ఈ భాగాలను వివరంగా చర్చిద్దాం. |
01:17 | మొదటి భాగం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్(ఒకరి చర్మంతో మరొకరి చర్మం తాకుతూఉండటం). |
01:21 | ఇది లెట్ డౌన్ రిఫ్లెక్స్‌ను మెరుగుపరుస్తుంది. |
01:24 | చివరకు తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది. |
01:28 | లెట్ డౌన్ రిఫ్లెక్స్ గురించి ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్ లో వివరించబడింది. |
01:34 | రెండవ భాగం బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడం. |
01:38 | గమనించండి- |
01:40 | బిడ్డకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వడాన్ని మొదటి 6 నెలల కొరకు సిఫార్సు చేస్తారు. |
01:45 | తరువాత, కంగారూ కేర్ (కంగారు సంరక్షణ) యొక్క ప్రాముఖ్యతను చర్చిద్దాం. |
01:50 | KMC సమయంలో తల్లీబిడ్డల చర్మ స్పర్శ అనేది ఎక్కువ సమయం కొనసాగటం వల్ల ఇది బిడ్డ శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉండటానికి సహాయపడుతుంది |
01:57 | మరియు బిడ్డకు చాలా భద్రతాభావం కలుగుతుంది. |
02:01 | KMC వీటిని కూడా తగ్గిస్తుంది - |
02:03 | తరచుగా వచ్చె అంటువ్యాధులు మరియు |
02:05 | బిడ్డలకు ఊపిరి ఆడకపొవడం (ఆప్నియా) వంటి సమస్యలు రావటాన్ని. |
02:09 | ఆప్నియా అంటే మధ్య మధ్య లో ఊపిరి ఆడకపొవడం. |
02:13 | ఇవే కాకుండా- |
02:15 | KMC అనేది తల్లి బిడ్డకు పాలిచ్చే వేళలను మరియు సమయాన్ని మెరుగుపరుస్తుంది. |
02:20 | ఇంకా ఇది తల్లి మరియు ఆమె బిడ్డ మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది. |
02:26 | KMC అనేది బిడ్డకు కూడా సహాయపడుతుంది- |
02:28 | ఇది బిడ్డ బరువు పెరగటానికి ఇటివంటి వేరే ఇతర సంప్రదాయ పద్ధతుల కంటే మంచిది. |
02:33 | బిడ్డను ప్రకాశవంతమైన వేడిలో ఉంచడం. |
02:36 | ఈ పద్దతి బిడ్డకు మరియు తల్లికి ఒత్తిడిని సృష్టిస్తుంది. |
02:40 | KMC ఇది తల్లిలో సంతృప్తి మరియు విశ్వాసాన్ని కూడా మెరుగుపరుస్తుంది- |
02:45 | ఆమె తన బిడ్డ కోసం అదనపు ప్రయత్నం చేస్తుంది. |
02:49 | ఆసక్తికరంగా, తల్లులే కాకుండా, KMC ను వీరి ద్వారా కూడా అందించవచ్చు- |
02:54 | తండ్రి లేదా |
02:56 | కుటుంబం లో ఎవరైనా పెద్దవారు కూడా. |
02:58 | మనము ఇప్పుడు బిడ్డకు KMC ను అందించేవారు అనుసరించాల్సిన అంశాలను చర్చిస్తాము: |
03:04 | బిడ్డకు KMC అందించేవారు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. |
03:09 | అతను లేదా ఆమె ఇటువంటి కనీస వ్యక్తిగత పరిశుభ్రత పద్ధతులను అనుసరించాలి- - |
03:14 | చేతులు కడుక్కోవడం, |
03:16 | రోజూస్నానం చేయడం,
గోళ్ళు కత్తిరించుకోవడం |
03:18 | జుట్టును కట్టి వేసి ఉంచడం |
03:20 | మరియు శుభ్రమైన బట్టలు |
03:22 | అతను లేదా ఆమె ఎటువంటి ఆభరణాలు, వాచీలు మరియు దారాలను ధరించకూడదు - |
03:26 | పరిశుభ్రతను పాటించడానికి ఇవి అవరోధాలుగా మారవచ్చు. |
03:31 | మరియు అవి బిడ్డకు గాయం కలిగించవచ్చు. |
03:35 | ఇప్పుడు, KMC సమయంలో దానిని అందించేవారు ధరించాల్సిన బట్టల గురించి చర్చిద్దాం.- |
03:42 | బట్టలు ముందు తెరచేలా మరియు తేలికైనవిగా ఉండాలి. |
03:46 | ఉదాహరణకు, చీర-జాకెట్టు లేదా ముందు తెరవడానికి వీలుగా ఉండే గౌను. |
03:51 | గమనించండి,
KMC ను అందించేవారు ఈ ముందు తెరవడానికి వీలుగా ఉండే గౌనును లేదా జాకెట్ ను KMC రాప్ చుట్టూ ధరించాలి. |
03:58 | కంగారూ బ్యాగులు లేదా బైండర్లను మార్కెట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. |
04:04 | ఒకవేళ KMC ను ఎక్కువ కాలం చేయవలసి వస్తే ఇవి ఉపయోగపడతాయి. |
04:09 | ప్రత్యామ్నాయంగా, KMC ను అందించేవారు మృదువైన శుభ్రమైన కాటన్ బట్టల్ని ఉపయోగించవచ్చు. |
04:16 | అయితే, KMCను అందిస్తున్నసమయంలో బిడ్డకు తప్పకుండ- |
04:19 | ఒక టోపీ మరియు న్యాపీ ని వేయాలి. |
04:22 | ఒకవేళ KMC సమయంలో బిడ్డ మలం లేదా మూత్ర విసర్జన చేస్తే అప్పుడు - |
04:27 | ఆమె బిడ్డను శుభ్రం చేసి చక్కగా ఆరేలా తుడవాలి. |
04:30 | తరువాత, మనము కంగారూ కేర్ (కంగారు సంరక్షణ) యొక్క విధానంలోకి వివరంగా వెళ్తాము. |
04:36 | మొదట, తల్లి నిటారుగా ఉండేలా నిలబడాలి. |
04:40 | తరువాత, ఒక ఆరోగ్య కార్యకర్త లేదా కుటుంబ సభ్యులెవరైనా ఈ క్రింది పనులను దశల వారీగా చేయాలి- |
04:48 | శిశువు యొక్క దిగువ భాగానికి మరియు తలకి మద్దతు ఇవ్వడం ద్వారా- |
04:51 | బిడ్డను నగ్నంగా ఉన్న తల్లి రొమ్ముల మధ్య నిటారుగా ఉండేలా ఉంచండి. |
04:56 | తర్వాత, బిడ్డ యొక్క తలను ఒక వైపుకు తిప్పండి. |
05:00 | శిశువు యొక్క తల కొద్దిగా వెనుకకు వంగి ఉంది అని నిర్ధారించుకోండి. |
05:04 | ఈ స్థితిలో ఉంచడం అనేది -
శిశువు యొక్క ముక్కు వాయుమార్గాలను తెరిచి ఉంచుతుంది. |
05:08 | మరియు బిడ్డను తన కళ్ళతో తల్లి కళ్ళలోకి చూడగలిగేల చేస్తుంది. |
05:14 | తర్వాత శిశువు యొక్క తుంటిని కొద్దిగా బయటికి వంచండి. |
05:18 | గుర్తుంచుకోండి -
శిశువు యొక్క చేతులను తల్లి స్తనాల పైన మరియు |
05:23 | కాళ్ళను తలి యొక్క స్తనాల కింద మరియు |
05:27 | తల్లి ఛాతీపై శిశువు యొక్క పొట్టను ఉంచడానికి. |
05:29 | బిడ్డను వస్త్రంతో చుట్టే ముందు- |
05:32 | ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే శిశువును దుప్పటితో కప్పండి. |
05:36 | ఇది శిశువు ను మరియు తల్లిని వెచ్చగా ఉంచుతుంది. |
05:39 | తర్వాత,
శిశువు మరియు తల్లి ఛాతీ ఇంకా పొట్ట చుట్టూ ఒక గుడ్డను చుట్టండి. |
05:45 | చుట్టేటప్పుడు వీటిని నిర్ధారించుకోండి - |
05:47 | గుడ్డ యొక్క మధ్య భాగం అనేది బిడ్డ పైన ఉండాలి. |
05:50 | ఇంకా గుడ్డ యొక్క రెండుచివరలు అనేవి - |
05:53 | తల్లి యొక్క చంకల గుండా వెళ్ళాలి. |
05:56 | ఇంకా వీపుభాగం వద్ద దాటిఉండాలి. |
05:59 | ఆ తరువాత గుడ్డ యొక్క చివరలను ముందుకు తీసుకుని రావాలి. |
06:03 | గుడ్డ యొక్క ఈ చివరలను బిడ్డ యొక్క దిగువ భాగం కింద బిడ్డకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ముడివేయాలి. |
06:09 | ఇది సౌకర్యవంతంగా ఉంటుంది మరియు బిడ్డకు ఆసరా ఇస్తుంది. |
06:14 | ఇంకా ఇది బిడ్డ జారిపోకుండా చూసుకుంటుంది. |
06:17 | గుర్తుంచుకోండి-
తల్లి సౌకర్యవంతంగా ఉన్నతర్వాత ఆమె తనకు తానే వస్త్రాన్నిచుట్టుకోవడం నేర్చుకోవాలి. |
06:24 | KMC చేసే సమయంలో స్వయంగా తనకు తానే కట్టుకోవడం అనేది ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో వివరించబడుతుంది. |
06:32 | ఇది తల్లి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఆమెను స్వతంత్రురాలిగా చేస్తుంది. |
06:37 | ఒకవేళ వస్త్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు తల్లికి అసౌకర్యంగా ఉంటే, అప్పుడు ఆమె సాగే బ్యాండ్‌ను ఉపయోగించవచ్చు. |
06:43 | ఇది ఉపయోగించడానికి సులభం మరియు సౌకర్యంగా ఉంటుంది. |
06:46 | సాగే బ్యాండ్ ని ఉపయోగిస్తున్నప్పుడు- |
06:49 | బిడ్డ తలకు ఆసరా అయ్యేలాగా బ్యాండ్ యొక్క అంచుని బిడ్డ యొక్క చెవికి పైన సర్దుబాటు చేయండి. |
06:54 | తర్వాత,బిడ్డ తలను కొద్దిగా వంచండి- |
06:57 | సులువుగా ఊపిరి పీల్చుకోవడానికి మరియు |
06:59 | ముందు వివరించిన విధంగా తన కళ్ళతో తల్లి కళ్ళలోకి చూస్తుండేలా చేయటానికి. |
07:04 | చుట్టిన వస్త్రం లేదా సాగే బ్యాండ్ మరీ బిగుతుగా లేదా చాలా వదులుగా ఉండకూడదు. |
07:11 | ఇది బిడ్డ సులువుగా ఊపిరి పీల్చుకునేంత సౌకర్యంగా ఉండాలి. |
07:15 | గుర్తుంచుకోండి, బిడ్డను KMC విధానంలో ఎత్తుకునిఉన్నపుడు, తల్లి వీటిని చేయగలిగేలా ఉండాలి- |
07:20 | నడవడం,నిలబడడం,కూర్చోవడం లేదా |
07:23 | వివిధ కార్యకలాపాలలో పాల్గొనడం. |
07:26 | ఒకవేళ తల్లి చాలా సౌకర్యంగా ఉన్నట్టయితే - |
07:29 | కంగారూ కేర్ సమయంలో ఆమె పడుకోవచ్చులేదా నడుము వాల్చి చేరబడవచ్చు. |
07:35 | ఇప్పుడు KMC సమయంలో శిశువుకు పాలు ఎలా పట్టించాలో చర్చించుకుందాం - |
07:40 | తల్లయినా బిడ్డకు పాలివ్వొచ్చు- |
07:43 | చుట్టిన వస్త్రాన్ని వదులు చేయడం ద్వారా మరియు |
07:46 | పాలివ్వడం కొరకు బిడ్డను సరైన స్థితిలో ఉంచడం ద్వారా. |
07:50 | లేదా ఆమె తానే స్తనాన్నినొక్కి పాలను బయటకి తీయవచ్చు ఇంకా |
07:54 | ఒక కప్పు లేదా చెంచాతో బిడ్డకు ఆ పాలను పట్టవచ్చు. |
07:57 | గుర్తుంచుకోండి,
ప్రతి రోజు శిశువు 25 నుండి 30 గ్రాముల బరువు పెరగాలి. |
08:03 | ఒక నెలలో శిశువు యొక్క ఆశించిన బరువు పెరుగుదల అనేది 900 నుండి 1,000 గ్రాముల వరకు ఉంటుంది. |
08:10 | అందువల్ల, తల్లి లేదా ఆరోగ్య కార్యకర్త తప్పనిసరిగా- |
08:13 | సాధారణ ఆరోగ్య తనిఖీ సమయంలో బిడ్డ యొక్క బరువును చూస్తుండాలి. |
08:17 | ఒకవేళ బిడ్డ తగినంత బరువు పెరగకపోతే- |
08:21 | ఆరోగ్య కార్యకర్త తల్లి పాలిచ్చే పద్ధతిని పర్యవేక్షించాలి లేదా |
08:25 | శిశువు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తుందో తనిఖీ చేయాలి. |
08:28 | అలాగే, పాలివ్వడానికి సరైన పద్దతిలో పట్టుకోవడం గురించి తల్లికి అవగాహన కల్పించాలి. |
08:32 | బిడ్డ స్తనాన్నిసరిగ్గా పట్టుకునే విధానం అనేది ఇదే సిరీస్ లోని మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది. |
08:39 | తరువాత,
మనం చుట్టిన వస్త్రం నుండి బిడ్డను ఎలా బయటకి తీయాలో నేర్చుకుందాం - |
08:44 | మొదట, తల్లి నిటారుగా ఉండే స్థితిలో కూర్చోవాలి. |
08:48 | తరువాత, ఒక చేతితో ముడి విప్పడం ప్రారంభించండి ఇంకా |
08:53 | చుట్టిన వస్త్రం బయటివైపు మరో చేత్తో బిడ్డ యొక్క కిందిభాగానికి ఆసరా ఇవ్వండి. |
08:58 | దాని తరువాత-
ముడిని విప్పడానికి ఇంతకుముందు ఉపయోగించిన అదే చేతితో చుట్టిన వస్త్రాన్ని వదులు చేయండి. |
09:04 | తరువాత-
బిడ్డ యొక్క కింది భాగానికి ఆసరా ఇస్తున్న చేతిని వస్త్రం కిందికి మార్చండి ఇంకా |
09:11 | వస్త్రం బయటవైపు నుండి బిడ్డ కిందిభాగానికి ఆసరా ఇవ్వడానికి మరో చేతిని ఉపయోగించండి. |
09:16 | తరువాత, బిడ్డను పైకి ఎత్తి, చుట్టిన వస్త్రం నుండి బిడ్డను తీయండి. |
09:21 | ఆ తరువాత, ఒక పద్దతిలో శిశువు తలని పట్టుకోవడం గుర్తుంచుకోండి- |
09:26 | ఇక్కడ బొటనవేలు ఒక చెవి వెనుక మరియు |
09:28 | మిగతా వేళ్లు మరో చెవి చుట్టూ ఉన్నాయి. |
09:30 | KMC ఇచ్చే సమయంలో కిందివి ఉంటె |
09:32 | తల్లి వెంటనే వైద్యుడిని మరియు ఆరోగ్య కార్యకర్తను తప్పనిసరిగా సంప్రదించాలి - |
09:37 | ఒకవేళ బిడ్డ అప్రమత్తంగా మరియు చురుగ్గా లేకపోతే |
09:41 | ఒకవేళ శిశువు చాలా వేగంగా ఊపిరి తీసుకుంటే లేదా ఊపిరి తీసుకోవడంలో ఎక్కువ విరామం తీసుకుంటుంటే. |
09:46 | ఒకవేళ బిడ్డ యొక్క పెదవులు లేదా నాలుక నీలం రంగులోకి మారితే |
09:50 | ఇంకా ఒకవేళ బిడ్డ పాదాలు చల్లగా ఉంటే |
09:53 | ఇంతటితో మనం కంగారూ మదర్ కేర్ (కంగారు తల్లి సంరక్షణ) అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాం. |
09:58 | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |