Health-and-Nutrition/C2/Importance-of-breastfeeding/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:00 | తల్లి పాలివ్వడం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలిపే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని గురించి నేర్చుకుంటాము: |
00:09 | తల్లి పాలివ్వడం యొక్క ప్రాముఖ్యత. |
00:12 | తల్లి పాలివ్వడం వలన పిల్లలకు మరియు తల్లులకు కలిగే ప్రయోజనాలు. |
00:17 | తల్లి పాలివ్వడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. |
00:19 | ఇది ఓక బిడ్డ పుట్టినప్పటి నుండి ప్రారంభమయ్యి బిడ్డ యొక్క రెండవ పుట్టినరోజు వరకు లేదా అంతకుమించి కొనసాగుతుంది. |
00:26 | తల్లి పాలివ్వడం అనేది శిశువుకు జీవితం యొక్క ఒక ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని ఇస్తుంది. |
00:31 | ఇది తల్లి మరియు బిడ్డ యొక్క తక్షణ మరియు భవిష్యత్తు ఆరోగ్యాన్నీ నిర్ణయిస్తుంది. |
00:38 | దాని యొక్క ప్రయోజనాలు అనేవి వారిద్దరికీ జీవితకాలం పాటు ఉంటాయి. |
00:43 | పోషకాహార లోపం ఉన్న తల్లులు కూడా తమ బిడ్డకు తల్లిపాలు ఇవ్వగలరు. |
00:49 | గర్భధారణ సమయంలో, రొమ్ము పరిమాణం అనేది పెరుగుతుంది. |
00:53 | పాలను ఉత్పత్తి చేసే కణజాలాల యొక్క సంఖ్య పెరగడమే దీనికి కారణం. |
00:59 | ఏమైనప్పటికి, రొమ్ముల యొక్క తుది పరిమాణం ఉత్పత్తి అయ్యే పాలమొత్తాన్ని ప్రభావితం చేయదు. |
01:07 | బిడ్డ పుట్టిన 1 గంటలోనే తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించాలి. |
01:13 | ఇది తల్లి పాల యొక్క సరఫరాను వృద్ధి చేస్తుంది. |
01:17 | అందువల్ల, ప్రత్యేకంగా తల్లి పాలివ్వడం అనేది కూడా మొదటి 6 నెలల్లోనే పెరుగుతుంది. |
01:24 | తల్లి పాలివ్వడాన్ని 2 సంవత్సరాలకు మించి కొనసాగించడానికి ఇది మరింత సహాయపడుతుంది. |
01:31 | పుట్టిన 1 గంటలోనే తల్లి పాలివ్వబడిన శిశువులలో, పుట్టిన నెలలోపల సంభవించే (నియోనాటల్) మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుంది. |
01:39 | తల్లిపాలు ఇవ్వడాన్ని ఆలస్యం చేయడం అనేది నవజాత శిశువులలో వ్యాధుల యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. |
01:47 | ఉదాహరణకు, డయాబెటిస్, ఊబకాయం మరియు అధిక రక్తపోటు వంటివి. |
01:53 | తల్లి పాలివ్వడాన్ని ముందుగా ప్రారంభించడం వల్ల శిశువు కొలొస్ట్రమ్ ను పొందుతుందని కూడా నిర్దారణ అవుతుంది. |
02:00 | కొలొస్ట్రమ్ అంటే ప్రసవించిన తరువాత తల్లి నుండి స్రవించే మొదటి పాలు. |
02:07 | శిశువుల కొరకు, ఇది శక్తి మరియు పోషకాల యొక్క ప్రాధమిక వనరు. |
02:13 | ముఖ్యంగా వారి జీవితాల యొక్క ప్రారంభ రోజుల్లో వారికి ఇది చాలా ముఖ్యం. |
02:20 | ఇది పెద్ద సంఖ్యలో వ్యాధి సంక్రమణ-పోరాట మూలకాలను కలిగి ఉంటుంది, |
02:24 | వైటమిన్ A మరియు |
02:26 | మంచి కొవ్వులు. |
02:28 | కొలోస్ట్రమ్ లో ఎదుగుదల మరియు రక్షణ కారకాలు కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి. |
02:35 | కొలొస్ట్రమ్ లో పాత మలాన్ని వేగంగా తొలగించడానికి సహాయపడే గుణం ఉంది. |
02:42 | కొలొస్ట్రమ్ యొక్క వివరణాత్మక ప్రయోజనాలు అనేవి మరొక ట్యుటోరియల్‌లో చర్చించబడ్డాయి. |
02:48 | మరిన్ని వివరాల కోసం దయచేసి వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి. |
02:52 | ప్రత్యేకంగా తల్లి పాలను మాత్రమే ఇవ్వడాన్ని మొదటి 6 నెలల వరకు చేయాలి అని గుర్తుంచుకోండి. |
02:59 | తల్లి పాలు అనేవి ఒక ప్రత్యేకమైన సహజసిద్ధ ఆహారం, ఇది నకిలీ చేయబడదు. |
03:05 | శిశువుకు 6 నెలలు పూర్తికాగానే, పరిపూరకరమైన ఆహారాన్నిఇవ్వడం తప్పకుండా ప్రారంభించాలి. |
03:12 | దాన్ని తల్లి పాలివ్వడంతో పాటుగా ఇవ్వాలి. |
03:16 | తల్లి పాలివ్వడాన్ని బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేవరకు లేదా అంతకు మించి కొనసాగించాలి. |
03:22 | శిశువులకు తల్లి పాలివ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. |
03:27 | పోషకాలు మరియు తల్లి పాల యొక్క మేళనం అనేవి పిల్లలకు జీర్ణం కావడానికి అనువైనవి. |
03:34 | తల్లి పాల ద్వారా పిల్లలు యాంటీబాడీస్ ని పొందుతారు. |
03:38 | యాంటీబాడీస్ అనేవి శిశువు యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి మరియు అంటువ్యాధుల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తాయి. |
03:46 | అంతేకాకుండా, ఇది శిశువులలో అలెర్జీ ప్రతిచర్యలను నివారిస్తుంది. |
03:52 | తల్లి పాలు ఎదుగుదల కారకాలను కూడా కలిగి ఉంటాయి. |
03:56 | శిశువు యొక్క ప్రేగు యొక్క లైనింగ్ అభివృద్ధిలోనూ ఇవి సహాయపడతాయి. |
04:02 | ఇది శిశువు యొక్కప్రేగులో మంచి బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను వృద్ధిచేస్తుంది. |
04:08 | ఆవిధంగా, ఇది ప్రేగుల్లో మంట మరియు అందువ్యాధుల నుండి శిశువులను రక్షిస్తుంది. |
04:16 | అదేవిధంగా, ఇది శరీరంలోని అన్ని ఇతర అవయవాల యొక్క అభివృద్ధి లోను సహాయపడుతుంది. |
04:22 | తల్లిపాలు అతిసారం (డయేరియా) యొక్క ప్రమాదాన్నీ తగ్గిస్తాయి. |
04:27 | ఇంకా వాటివల్ల ఇతర ప్రయోజనాలు అనేవి చెవి ఇన్ఫెక్షన్లు |
04:31 | మరియు దంత క్షయం వంటివి రాకుండా నివారించడం. |
04:33 | దవడల అభివృద్ధి మరియు దంతాల యొక్క సరైన అమరిక అనేవి మరికొన్ని ఉదాహరణలు. |
04:41 | తరువాతి జీవితంలో కొన్ని వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం కూడా తగ్గుతుంది. |
04:48 | ఉదాహరణకు, డయాబెటిస్, ఊబకాయం, అధిక రక్తపోటు మరియు బ్లడ్ క్యాన్సర్. |
04:56 | ఉబ్బసం (ఆస్తమా), న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల యొక్క ప్రమాదం కూడా తగ్గుతుంది. |
05:04 | తల్లి పాలివ్వడం అనేది 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలను తగ్గిస్తుంది. |
05:14 | తల్లి పాలు తాగే శిశువులలో ఎటాపిక్ ఎగ్జిమా వచ్చే ప్రమాదం కూడా తక్కువే. |
05:22 | ఎగ్జిమా అనేది అనేది ఒక స్థితి అందులో చర్మం ఎర్రగా మారి, దురద మరియు కఠినమైన పాచెస్‌ను అభివృద్ధి చేస్తుంది. |
05:30 | తల్లిపాలు తాగే పిల్లలు అనారోగ్యం మరియు ఇన్ఫెక్షన్ల కొరకు ఆసుపత్రిలో చేరే అవకాశం కూడా తక్కువే. |
05:39 | తల్లిపాలు తాగే పిల్లలు వారి ఆకలిపై వారు మంచి నియంత్రణను కలిగి ఉంటారు. |
05:44 | తల్లి పాలు అనేవి ఆకలిని నియంత్రించే హార్మోన్లను కలిగి ఉంటాయి. |
05:48 | ఇటువంటి హార్మోన్లు అనేవి పిల్లలకు వారి శరీరం యొక్క ఆకలి మరియు సంతృప్తి సంకేతాలను వినడానికి సహాయపడతాయి. |
05:57 | తల్లి పాలు తాగని పిల్లలలో ఈ స్వీయ నియంత్రణ అనేది చెదిరిపోతుంది. |
06:03 | చివరికు ఇది అతిగా ఆహరం తీసుకోవడానికి దారితీస్తుంది, |
06:07 | దానివలన ఊబకాయం
ఇంకా ఆ తర్వాత డయాబెటిస్. |
06:11 | తల్లి పాలివ్వడం అనేది మెదడు పైన కూడా ప్రభావాన్నిచూపుతుంది. |
06:15 | తల్లి పాలలో మెదడు అభివృద్ధికి మరియు పరిపక్వతకు సహాయపడే భాగాలు ఉన్నాయి. |
06:23 | తల్లిపాలను తాగిన పిల్లలకు ఎక్కువ ఐక్యూ మరియు ఇతర నైపుణ్యాలు ఉంటాయి. |
06:28 | తల్లి పాలు అనేవి నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. |
06:34 | రొమ్ము వద్ద పాలను పీల్చటం అనేది అటువంటి పిల్లలలో శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. |
06:40 | ఇటవంటి పిల్లలకు ప్రేగుల్లో అంటువ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. |
06:47 | ఉదాహరణకు: డయేరియా మరియు నెక్రోటైజింగ్ ఏంటిరోకోలైటీస్ దీనిని NEC అని కూడా పిలుస్తారు. |
06:56 | NEC అనేది అంటువ్యాధి మరియు ప్రేగులు దెబ్బతినడం వలన సంభవించే ఒక తీవ్రమైన పరిస్థితి. |
07:05 | తల్లిపాలు అనేవి నెలలు నిండకుండా పుట్టిన శిశువులను ఈ అంటువ్యాధి నుండి రక్షిస్తాయి. |
07:11 | నెలలు నిండకుండా పుట్టిన శిశువుల యొక్క తల్లుల నుండి వచ్చే పాలలో అందువ్యాధులతో పోరాడే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. |
07:19 | అవి పేగులను రక్షించి వృద్ధిని పెంపుచేసే కారకాలను కూడా కలిగి ఉంటాయి. |
07:25 | అధిక సాంద్రత కలిగిన నిర్దిష్ట అమైనో ఆమ్లాలు మరియు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. |
07:33 | నెలలు నిండకుండా పుట్టిన శిశువులలో పెరుగుదల కొరకు ఈ అమైనో ఆమ్లాలు అనేవి అవసరం. |
07:40 | ఆవిధంగా, తల్లి పాలు అంటువ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడతాయి. |
07:43 | మరియు బరువు కూడా పెరుగుతుంది. |
07:46 | తల్లిపాలు నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం వలన కలిగే దీర్ఘకాలిక సమస్యలనూ తగ్గిస్తాయి. |
07:52 | ఉదాహరణకు, ఊరితిత్తులు మరియు కళ్ళ యొక్క సమస్యలు. |
07:57 | అందువల్ల, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు తల్లి పాలను ఎక్కువ మొత్తంలో పొందాలి. |
08:04 | కంగారూ మదర్ కేర్ దీన్ని KMC అని కూడా పిలుస్తారు, ఇది కూడా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ఉపయోగపడుతుంది. |
08:12 | ఇది వారిలో తల్లి పాలిచ్చే ఫ్రీక్వెన్సీని మరియు వ్యవధిని మెరుగుపరుస్తుంది. |
08:18 | KMC సమయంలో తల్లీబిడ్డల చర్మాలను తాకించడం అనేది శిశువు యొక్క శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. |
08:27 | ఇది శిశువు యొక్క హృదయ స్పందన మరియు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. |
08:35 | కంగారూ మదర్ కేర్ చేసే విధానం అనేది మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది. |
08:42 | పిల్లలకే కాకుండా, తల్లి పాలివ్వడం అనేది తల్లులకు కూడా మేలుచేస్తుంది. |
08:48 | ఈ ప్రయోజనాలు తక్షణమైనవి మరియు దీర్ఘకాలికమైనవి. |
08:53 | ప్రసవం తర్వాత వెంటనే తల్లి పాలివ్వడం వలన యోని రక్తస్రావాన్ని తగ్గించడానికి అది సహాయపడుతుంది. |
08:59 | అది శరీరంలో ఆగ్జిటోసిన్ హార్మోన్ యొక్క స్థాయిని పెంచుతుంది. |
09:05 | ఇది మావి శరీరం నుండి బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది. |
09:09 | దాని ఫలితంగా గర్భాశయ సంకోచాలు మెరుగుపడతాయి మరియు యోని రక్తస్రావం తగ్గుతుంది. |
09:17 | అలా, తల్లులలో రక్తహీనతను నివారించవచ్చు. |
09:21 | తల్లిపాలను ఇవ్వడం వలన తల్లులకు మానసిక ప్రయోజనాలూ ఉన్నాయి. |
09:27 | తరచుగా ఒకరి చర్మంతో మరొకరి చర్మాన్ని తాకించడం అనేది తల్లి మరియు ఆమె బిడ్డల మధ్య బంధాన్నిపెంచుతుంది. |
09:35 | ఈ బంధం అనేది తల్లిని పాలివ్వటానికి సిద్దమయ్యేలా చేస్తుంది. |
09:39 | అంతిమంగా, ఇది తల్లులలో ప్రసవానంతర ఒత్తిడి మరియు నిరాశను తగ్గిస్తుంది. |
09:46 | తల్లి పాలివ్వడం అనేది తల్లుల కొరకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. |
09:51 | ఇది తరువాతి వయస్సులో ఎముకలు బలహీనపడకుండా నిరోధిస్తుంది. |
09:56 | రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. |
10:02 | గర్భధారణ సమయంలో, మహిళలకు అంతర్గత శరీర అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. |
10:08 | పొట్ట, పేగులు మరియు కాలేయం వంటి వాటి చుట్టూ. |
10:12 | ఈ కొవ్వు అనేది బొడ్డు లేదా పొత్తికడుపు ప్రాంతంలో దాగి ఉంటుంది. |
10:18 | అధికంగా ఉండే ఈ కొవ్వు ఫలితం ఇన్సులిన్ నిరోధకత, |
10:23 | డయాబెటిస్ మరియు
ఊబకాయం వస్తాయి. |
10:26 | తల్లిపాలివ్వడం అనేది మహిళల్లో ఈ కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. |
10:31 | ఇది ఊబకాయం, రక్తపోటు మరియు గుండె జబ్బుల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. |
10:37 | ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక సహజ జనన నియంత్రణగా పనిచేస్తుంది. |
10:44 | ఏమైనప్పటికీ, ప్రసవించిన 6 వారాల తర్వాత భార్యాభర్తలు గర్భనిరోధకాన్ని ఉపయోగించాలి. |
10:50 | ఇది రెండు గర్భధారణల మధ్య దూరాన్ని ఉంచడంలో సహాయపడుతుంది. |
10:56 | తల్లి పాలివ్వడం వల్ల కొన్ని ఆర్థిక ప్రయోజనాలూ ఉన్నాయి. |
11:00 | తల్లి పాలు అనేవి ఉచితంగా లభిస్తాయి మరియు శిశువు కొరకు ఉత్తమమైనవి. |
11:07 | దీనికి ఫార్ములా పాలు, సీసాలు మరియు ప్లాస్టిక్ ఉరుగుజ్జులు (పాలపీకలు) కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని ఉండదు. |
11:14 | తల్లి పాలను తయారు చేయడానికి అదనపు సమయాన్ని కేటాయించాల్సిన పని కూడా లేదు. |
11:20 | తల్లి పాలను తయారు చేయడానికి వేడి నీరు, పాత్రలు మరియు కాచడానికి ఇంధనం అవసరం లేదు. |
11:28 | మురికి నీరు లేదా మురికిగా ఉండే పాల సీసాలు శిశువును అనారోగ్యానికి గురి చేస్తాయి. |
11:35 | ఈ రకంగా, భవిష్యత్తులో మున్ముందు రోజుల్లో తల్లి మరియు బిడ్డల ఆరోగ్య సంరక్షణ కొరకు ఖర్చులూ తక్కువగా ఉంటాయి. |
11:42 | తల్లి పాలివ్వడం వల్ల అనేక పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. |
11:47 | మొదటగా, తల్లి పాలివ్వడంలో ఎటువంటి ప్యాకింగ్ చేయడం లేదా రవాణా చేయడం ఉండదు. |
11:54 | ఇది ఎటువంటి వ్యర్థాలను ఉత్పత్తి చేయదు, |
11:57 | పొగ లేదా
శబ్దం వంటివి |
12:00 | ఇది ప్రపంచ వనరులను మరియు శక్తిని ఆదా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తుంది. |
12:06 | అందువలన, తల్లిపాలివ్వడం అనేది ఉత్తమమైన ఎంపిక. |
12:10 | బిడ్డ పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు బిడ్డ తల్లిపాలు తాగేలా తల్లులు చూడాలి. |
12:18 | ఇది శిశువు మరియు అలాగే తల్లి యొక్క మంచి ఆరోగ్యం కోసం. |
12:24 | తల్లి పాలివ్వటానికి తల్లిపాలిచ్చే సరైన పద్దతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. |
12:30 | దానితో పాటుగా, కుటుంబం నుండి తగిన సహాయం మరియు మార్గదర్శకత్వం కూడా అవసరం. |
12:38 | ఇవన్నీఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్ లో వివరించబడ్డాయి. |
12:44 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |