Health-and-Nutrition/C2/General-guidelines-for-Complementary-feeding/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:02 పరిపూరకమైన ఆహరం కొరకు సాధారణ మార్గదర్శకాలపై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము.
00:14 6నెలల వయస్సుగల శిశువులకు పరిపూరకమైన ఆహారాన్ని ప్రారంభించడం యొక్క ప్రాముఖ్యత
00:19 మరియు 6 నుండి 24 నెలల వయస్సు గల పిల్లల కొరకు పరిపూరక ఆహారాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు.
00:27 మనం ప్రారంభిద్దాం.
00:29 ఒక బిడ్డకు పుట్టిన సమయం నుండి 6 నెలల వయస్సు వరకు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వాలి.
00:37 6నెలల వయస్సు అంటే శిశువు జీవితంలో 6 వ నెల యొక్క ప్రారంభం అనే అర్ధం కాదు.
00:45 ఆమె తన జీవితంలో 6 నెలలు పూర్తి చేసి, 7 వ నెలను ప్రారంభించింది అని అర్ధం.
00:52 ఈ వయస్సులో, ఒక బిడ్డకు ప్రత్యేకంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం సరిపోదు.
00:59 తల్లిపాలతో పాటు, పౌష్టికమైన ఇంట్లో వండిన ఆహారాన్ని శిశువుకు ఇవ్వాలి.
01:06 ఈ ఆహారాన్ని పరిపూరకమైన ఆహారం అంటారు.
01:11 దీనిని ఒక బిడ్డకు 6 నెలల వయస్సు నుండి 24 నెలల వయస్సు వరకు తప్పకుండా ఇవ్వాలి.
01:18 బిడ్డను పొడవుగా, ఆరోగ్యంగా మరియు తెలివైనవాడిగా చేయడంలో ఇది కీలక పాత్రను పోషిస్తుంది.
01:26 6 నెలల వయస్సులో పరిపూరకమైన ఆహారాన్ని ప్రారంభించడం చాలా ముఖ్యం.
01:33 లేకపోతే, శిశువు యొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.
01:39 తరువాతి వయస్సులో శిశువు ఘనపదార్ధ ఆహారాన్ని తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి.
01:47 గుర్తుంచుకోండి, పరిపూరకమైన ఆహారం అనేది తల్లి పాలివ్వడానికి సహాయం ఇస్తుంది.
01:53 అందువల్ల, కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తల్లి పాలివ్వడాన్ని కొనసాగించాలి.
02:00 రకం,
02:02 చిక్కదనం
02:04 మరియు పరిపూరకమైన ఆహారం యొక్క పరిమాణం అనేవి శిశువు యొక్క వయస్సుతో పాటు మారుతాయి.
02:10 ప్రతి వయస్సు వారి కొరకు నిర్దిష్టమైన సిఫార్సులు ఉన్నాయి.
02:16 ఇదే సిరీస్‌లోని మరొక ట్యుటోరియల్‌లో అవి వివరంగా చర్చించబడ్డాయి.
02:23 ఇప్పుడు, మనం అన్ని వయసులవారి కొరకు పరిపూరకమైన ఆహారం యొక్క ముఖ్యమైన మార్గదర్శకాలను చర్చిద్దాం.
02:31 ఏదైనా కొత్త ఆహారన్ని శిశువుకు మొదట విడిగా ఇవ్వాలి.
02:37 ఆ తరువాత దానిని ఇతర ఆహారాలతో కలిపి ఇవ్వాలి.
02:42 శిశువుకు ఒక నిర్దిష్ట ఆహారానికి సంబంధించి అలెర్జీ ఉందో లేదో అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది.
02:48 మంచి పోషకాలు పొందడానికి రకరకాల ఆహారాలు తినడం చాలా అవసరం.
02:54 ప్రతి 4వ రోజు, శిశువు యొక్క ఆహారంలో ఒక కొత్త రకం ఆహారాన్ని జోడించండి.
03:01 మునుపు ఇచ్చిన ఆహారంతో పాటు 1 టేబుల్ స్పూన్ కొత్త ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించండి.
03:08 క్రమంగా ప్రతిరోజూ దాని పరిమాణాన్నిపెంచండి.
03:12 మొత్తం 8 రకాల ఆహార వర్గాల నుండి పౌష్టికమైన ఆహారాన్ని క్రమంగా చేర్చాలి.
03:20 మొదటి ఆహార వర్గం అనేది ధాన్యాలు, వేర్లు (మూలాలు) మరియు దుంపలు.
03:27 చిక్కుళ్ళు, విత్తనాలు మరియు కాయలు అనేవి రెండవ వర్గం.
03:32 మూడవ వర్గం పాల ఉత్పత్తులు.
03:37 నాల్గవ వర్గం మాంసం, చేపలు మరియు చికెన్.
03:42 గుడ్డు అనేది ఐదవ వర్గం.
03:46 విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు అనేవి ఆరవ వర్గం.
03:52 ఏడవ వర్గం అనేది ఇతర పండ్లు మరియు కూరగాయలు.
03:57 చివరగా, తల్లి పాలివ్వడం అనేది ఎనిమిదవ వర్గం కాని ఇది అతి ముఖ్యమైనది.
04:04 ఇది ఇతర ఆహార వర్గాలతో పాటు ప్రతిరోజూ తప్పనిసరిగా చేర్చబడాలి.
04:11 ఇంచుమించుగా, శిశువు యొక్క ఆహారంలో మొత్తం 8 ఆహార వర్గాలు ఉండాలి.
04:17 ఒకవేళ శిశువు యొక్క ఆహారంలో, ఈ వర్గాలలో 5 కన్నా తక్కువ ఉంటే, అది తీవ్రమైన సమస్య అవుతుంది.
04:24 దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలి.
04:28 కొంతమంది శిశువులు తల్లి పాలను పొందే అవకాశాన్నిఅస్సలు కలిగి ఉండరు.
04:33 ప్రతిరోజూ మిగిలిన 7 వర్గాల నుండి ఆహారాన్ని అటువంటి వారి ఆహారంలో చేర్చండి.
04:40 అలాగే, వారికి ఒక రోజుకు 500 మి.లీ జంతువుల పాలు మరియు అదనంగా 2 సార్లు భోజనాన్ని ఇవ్వండి.
04:49 జంతువుల పాలను శిశువుకు ఇచ్చే ముందు ఎల్లప్పుడూ వాటిని మరగబెట్టండి.
04:55 ఇప్పుడు, మనం ఒక శిశువు యొక్క ఆహారంలో కొత్త ఆహార వర్గాలను చేర్చే క్రమాన్ని చర్చిద్దాం.
05:02 తల్లి పాలివ్వడంతో పాటు, మొదటి 5 ఆహార వర్గాల నుండి పరిపూరకమైన ఆహారాన్ని ఇవ్వడాన్ని ప్రారంభించండి.
05:09 6నెలల వయస్సు తర్వాత ఒక బిడ్డకు ఎక్కువ మొత్తంలో పోషకాలు అనేవి అవసరం.
05:16 ఏదేమైనా, ప్రారంభించిన మొదటి రోజుల్లో ఇవ్వగలిగే ఆహార పరిమాణం అనేది చాలా తక్కువ.
05:24 అందువల్ల, మొదటి 5 ఆహార వర్గాల నుండి పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వవచ్చు.
05:31 ఈ ఆహారాలలో ప్రోటీన్ మరియు మంచి కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
05:38 శిశువు యొక్క ఎత్తు మరియు కండరాల పుష్టి పెరగడానికి అవి ముఖ్యమైనవి.
05:45 శిశువు యొక్క మెదడు అభివృద్ధికి మంచి కొవ్వులు అనేవి ముఖ్యమైనవి.
05:50 ఈ ఆహారాల తరువాత, కూరగాయలు మరియు పండ్లు ఇవ్వడం ప్రారంభించండి.
05:57 కూరగాయలు మరియు పండ్లలో వైటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి.
06:03 అయినప్పటికీ, అవి మొదటి 5 ఆహార వర్గాల మాదిరిగా ప్రోటీన్ మరియు కొవ్వులు ఎక్కువగా కలిగి ఉండవు.
06:11 అందువల్ల, బరువు నిలిచిపోవడం లేదా తగ్గిపోవడాన్నినివారించడానికి వాటిని తరువాత ప్రారంభిస్తారు.
06:18 అలాగే, పండ్లు రుచికి తియ్యగా ఉంటాయి.
06:23 పిల్లలు తీపి రుచి కంటే ముందు వేరువేరు రకాల రుచులను ప్రయత్నించడం ముఖ్యం.
06:31 విభిన్న రుచులను ప్రయత్నించడం అనేది పిల్లలు ఎక్కువ రకాల ఆహారాలను ఇష్టపడటానికి సహాయపడుతుంది.
06:37 ఇది వారు తరువాత కాలంలో ఎంచుకుని (పిక్కీ) తినేవారిగా మారే అవకాశాలను తగ్గిస్తుంది.
06:44 అందువలన, అన్ని ఇతర రకాల ఆహారాలను చేర్చిన తర్వాతనే పండ్లు శిశువు యొక్క ఆహారంలో చేర్చబడతాయి.
06:51 తాజావి, కాలానుగుణంగా, స్థానికంగా లభించే పండ్లను రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఇవ్వడం మంచిది.
06:59 పండ్లను సాధారణ భోజనం తర్వాత ఫలాహారంగా (డెజర్ట్‌గా) ఇవ్వవచ్చు.
07:05 పండ్లతో చేసిన ప్యూరీని శిశువు యొక్క సాధారణ భోజనంతో కలపకూడదు.
07:11 ఈ వయస్సులో పిల్లలకు పండ్ల రసం సిఫారసు చేయబడలేదు.
07:16 ఇంట్లో తయారుచేసినవి మరియు రెడీమేడ్ గా దొరికే పండ్ల రసాలు రెండూ ఇందులోకే వస్తాయి.
07:23 గుర్తుంచుకోండి, 2 సంవత్సరాల వయస్సు వరకు తల్లి పాలివ్వడాన్ని కొనసాగించాలి.
07:28 హార్డ్ ఫుడ్స్ (గట్టి ఆహారాలు) ఇవ్వడాన్ని మానేయండి అవి శిశువును ఉక్కిరిబిక్కిరి చెయ్యవచ్చు.
07:34 పూర్తి గింజలు, ద్రాక్ష, శనగలు మరియు పచ్చి క్యారెట్ ముక్కలు అనేవి అటువంటి ఆహారాలకు ఉదాహరణలు.
07:44 తాజాగా వండిన ఇంట్లో తయారుచేసిన ఆహారం, పరిశుభ్రంగా తయారుచేయడం, శిశువుకు ఉత్తమమైనది.
07:51 ఒకవేళ శిశువు ఆహారాన్ని నిల్వ చేయవల్సివస్తే, దయచేసి సురక్షితంగా నిల్వచేయడం పై మా ట్యుటోరియల్ చూడండి.
07:57 శిశువు ఆహారాన్ని సురక్షితంగా తయారుచేయడం మరియు అందించడం కూడా అదే ట్యుటోరియల్‌లో చర్చించబడింది.
08:06 మరిన్ని వివరాల కొరకు దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
08:10 ఆహారంతో పాటు, మరిగించి చల్లార్చిన నీటిని కూడా 6 నెలల శిశువుకు ఇవ్వవచ్చు.
08:18 రోజుకు రెండుసార్లు చొప్పున 30 నుండి 60 మి.లీ నీటితో ప్రారంభించండి.
08:25 ఇది వేడి వాతావరణంలో మరియు శిశువు యొక్క అవసరాన్ని బట్టి పెంచాలి.
08:31 తల్లి పాలు మరియు నీరు అనేవి ఒక శిశువుకు ఉత్తమమైన పానీయాలు.
08:37 అయితే, అవి సమయానుసారంగా సరిగ్గా ఉండాలి.
08:42 భోజనానికి ముందు శిశువుకు తల్లిపాలు లేదా నీళ్లు ఇవ్వకండి.
08:48 ఆకలితో ఉన్న శిశువు కొత్త ఆహారాల్ని ప్రయత్నించే అవకాశం ఎక్కువ ఉంటుంది.
08:54 బిడ్డకు భోజనానికి 20 నుండి 30 నిమిషాల ముందు లేదా తర్వాత తల్లిపాలు లేదా నీరు ఇవ్వవచ్చు.
09:02 శిశువు బాగా ఎదగడానికి తగిన పరిపూరకమైన ఆహారాన్ని ఇవ్వడం అవసరం.
09:08 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Simhadriudaya