Health-and-Nutrition/C2/Cradle-Hold-for-Breastfeeding/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 తల్లి బిడ్డకు పాలివ్వడం కొరకు క్రాడల్ హొల్ద్ (ఉయ్యాల పట్టు) పై ఈ స్పొకెన్ ట్యుటొరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటొరియల్ లో మనం నేర్చుకునేది
00:09 తల్లి తనబిడ్డకు పాలివ్వడానికి సరైన పట్టుకునే విధానాన్ని ఎంపికచేసుకోవడం.
00:15 పాలివ్వడానికి ముందు తల్లి సిద్ధం అవ్వడం మరియు
00:18 క్రాడల్ హొల్ద్ (ఉయ్యాల పట్టు) లో ఎలా పట్టుకోవాలి
00:22 మనం ప్రారంభిద్దాం

ప్రపంచవ్యాప్తంగా, తల్లులు వివిధ రకాల పట్టుకునే పద్దతులను ఉపయోగించి తమ బిడ్డలకు తల్లిపాలు ఇచ్చారు మనం మునుపటి ట్యుటొరియల్ లో చర్చించినట్టుగా- ఒక తల్లి ఆమె బిడ్డకు పాలివ్వడం కొరకు పట్టుకోవడంలో వాటిలో ఉత్తమమైన పద్దతి ఏదంటే-

00:39 తల్లి పాలివ్వడం పూర్తయ్యేవరకు తల్లి మరియు బిడ్డ ఇద్దరూ సౌకర్యంగా ఉండడం
00:45 బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా పట్టుకుని ఉండగలగడం
00:50 మరియు బిడ్డ తగినన్ని పాలను పొందడం
00:54 పట్టుకునే విధానాలలో క్రాడల్ హొల్ద్ (ఉయ్యాల పట్టు) అని పిలువబడే ఒకదాని గురించి తెలుసుకుందాం.
00:59 తన బిడ్డకు పాలిచ్చే ముందు, తల్లి తప్పనిసరిగా తన చేతులను సబ్బు మరియు నీళ్ళతో కడుక్కోవాలి.
01:05 ఇంకా తన చేతులను తడిలేకుండా బాగా తుడుచుకోవాలి.
01:10 తర్వాత ఆమె తప్పనిసరిగా ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
01:15 పాలిచ్చే తల్లులకు దాదాపుగా ఒక రోజుకి750 నుండి 850 మిల్లిలీటర్ల పాలు వస్తాయి.
01:22 అందువల్ల, వారు రోజు తాగుతున్న నీళ్లు కంటే ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది.
01:27 తరువాత, మనం తల్లి ఏ భంగిమలో ఉండాలో చర్చిద్దాం.
01:31 తల్లి నేలపై కానీ లేదా మంచం పై కానీ కాళ్ళు మడచుకుని కూర్చొవాలి.
01:36 లేదా తన పాదాలు సమంగా నేలను తాకేలా పెట్టి కుర్చీపైన కూర్చోవాలి.
01:41 ఒకవవేళ కుర్చీ చాలా ఎత్తుగాఉండి ఆమె పాదాలు నేలను తాకక పోతె అప్ప్పుడు
01:47 ఒక చిన్న పీటను లేదా దిండును నేలపై ఉంచి, వాటిపై ఆమె తన పాదాలను సమంగా ఉంచవచ్చు.
01:53 వెన్ను నొప్పి రాకుండా నివారించడానికి, ఆమె కూర్చునేటప్పుడు తన వెన్ను నిటారుగా ఉందని నిర్ధారించుకోవాలి.
02:00 ఆమె భుజాలు ఎత్తినట్లు లేదా వంచినట్టు లేకుండా వదులుగా ఉండాలి.
02:05 ఇలా విశ్రాంతిగా ఉన్న ఈ భంగిమను తల్లి పాలిచ్చే సమయం అంతటా కొనసాగించాలి.
02:12 ఇప్పుడు తల్లి తన బిడ్డకు ఏ స్తనం నుంచి పాలివ్వాలి అనుకుంటుందో ఆ వైపు వస్త్రాన్ని తొలగించాలి.
02:18 ఆమె తన బ్రా లేదా బ్లౌజ్ వలన తన రొమ్ము మీద ఒత్తిడి పడటంలేదని నిర్దారించుకోవాలి.
02:25 తల్లి సౌకర్యవంతంగా కూర్చున్నతర్వాత, బిడ్డను తల్లి దగ్గరకు తీసుకొని రావాలి.
02:29 తల్లి తాను ఏ వైపు నుండి పాలిస్తుందో ఆ వైపు గల చేతితొ తన బిడ్డను పట్టుకొవాలి.
02:37 బిడ్డ యొక్క తల, ఆ చేయి యొక్క మోచేయి లోపలి వంపులో సౌకర్యవంతంగా ఉండేలా చూసుకొవాలి.
02:44 అదే చేతితొ, తల్లి తన బిడ్డ యొక్క తల, మెడ మరియు మొండేనికి ఆసరా ఇవ్వాలి.
02:51 ఈ చిత్రంలో ఉన్న తల్లి, తన కుడి వైపు స్తనం నుండి తన బిడ్డకు పాలిస్తుంది.
02:56 అందువల్ల, బిడ్డ యొక్క తల, మెడ మరియు మొండెంకు మద్దతు ఇవ్వడానికి ఆమె తన కుడి చేయిని ఉపయోగిస్తోంది
03:04 బిడ్డ యొక్క తల ఆమె కుడి మోచేయి లోపలి వంపులో విశ్రాంతి తీసుకుంటుంది.
03:10 ఒకవేళ బిడ్డను ఎత్తడానికి తల్లి అదనపు మద్దతును కోరుకుంటే, ఆమె బిడ్డ కింద ఒక దిండును ఒళ్ళో ఉంచుకొవచ్చు.
03:19 తల్లి ఎప్పుడూ కూడా తన వెన్నును వంచి స్తనాన్ని బిడ్డకు అందేలా చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి.
03:25 ఇది ఆమెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది మరియు వెన్నునొప్పికి కారణమవుతుంది.
03:30 ఆమె ఎల్లప్పుడూ తన వెన్నును నిటారుగా ఉంచి, బిడ్డ తన రొమ్ము దగ్గరకు చేరేలా బిడ్డను పైకి ఎత్తాలి.
03:36 తరువాత, బిడ్డను సరైన భంగిమలో ఎలా ఉంచాలో తెలుసుకుందాం.
03:42 శిశువు యొక్క కడుపు తల్లి శరీరం చేత సున్నితంగా నొక్కబడాలి.
03:47 వారి శరీరాల మధ్య తక్కువ దూరం ఉంటె అది రొమ్మును చేరుకోవడానికి శిశువు చేసే ప్రయత్నాన్ని తగ్గిస్తుంది.
03:54 మరియు దానివల్ల బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకోవడం సులభం అవుతుంది.
04:00 తర్వాత, రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే శిశువు యొక్క మొత్తం శరీరం పట్టుకొని ఉంచబడిన దిశ.
04:08 మీరు దానిని గమనించి ఉండవచ్చు –

మనం ఆహారం తినేటప్పుడు, మన తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉంటాయి.

04:16 కానీ, పాలిచ్చేటప్పుడు, చాలా మంది తల్లులు బిడ్డ తలను తరచుగా పక్కకి తిప్పుతుంటారు.
04:23 దీని వల్ల బిడ్డకు పాలు తాగడానికి అసౌకర్యం కలగవచ్చు.
04:28 తల్లి పాలిచ్చేటప్పుడు శిశువు తల, మెడ మరియు శరీరం ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉండాలి.
04:35 ఇది శిశువుకు పాలు మింగడాన్ని సులభం చేస్తుంది.
04:41 ఇప్పుడు మనము బిడ్డ శరీరాన్ని ఎలా ఉంచాలి అనేదానిలో మూడవ అంశానికి వచ్చాము.
04:46 తల్లి తన బిడ్డ యొక్క తల, మెడ మరియు మొండెంకు ఆసరా ఇవ్వాలి.
04:51 లేకపోతే, బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకుని ఉండటానికి చాలా శ్రమ పడవలసిఉంటుంది.
04:58 తరువాత, బిడ్డ యొక్క ముక్కు మరియు గడ్డం ఎలా ఉంచాలో చూద్దాం.
05:03 బిడ్డ ముక్కు మరియు చనుమొన ఒకే రేఖ లో ఉండాలి.
05:07 ఇంకా తన గడ్డం ముందుకి ఉండి స్తనానికి చాలా దగ్గరగా ఉండాలి.
05:13 బిడ్డ తల్లి రొమ్మును నోటితో పట్టుకునేటపుడు అరియోలా యొక్క దిగువ భాగాన్ని ఎక్కువగా తీసుకుంటుందని ఇది నిర్ధారిస్తుంది.
05:19 అందువల్ల, ఎక్కువ పాలను బాగా త్రాగడానికి ఇది కింది దవడను ఉపయోగిస్తుంది.
05:26 దయచేసి గమనించండి అరియోలా అంటే చనుమొన చుట్టూ ఉండే నల్లని ప్రదేశం.
05:32 ఇప్పుడు, బిడ్ద సరైన స్థితి లొ ఉంచబదడింది.
05:35 మనం స్తనాన్ని ఎలా పట్టుకొవాలో నేర్చుకుందాం.
05:39 ఖాళీగా ఉన్నచేతి వేళ్లను ఉపయోగించి, తల్లి తన స్తనాన్ని U ఆకారం లొ ఉండెలా పైనుండి పట్టుకొవాలి.
05:48 ఇక్కడ ఈ చిత్రం లో తల్లి తన ఎడమ చేతిని తన కుడి స్తనాన్ని పట్టుకొడానికి ఉపయోగిస్తుంది.
05:55 బొటనవేలు మరియు మిగిలిన వేళ్లను సరిగ్గా ఎలా పెట్టాలో అర్థం చేసుకోవడానికి, చనుమొనను తల్లి యొక్క కుడి రొమ్ముపై గడియారానికి కేంద్రంగా ఊహించుకోండి.
06:04 ఈ గడియారంలో తల్లి తన ఎడమ బొటనవేలును 3 గంటల సమయం స్థానం వద్ద ఉంచాలి.
06:10 ఆమె తన ఎడమ చూపుడు వేలు మరియు మధ్య వేలును గడియారపు 9 గంటల స్థానం వద్ద ఉంచితే.
06:18 తల్లి యొక్క వేళ్ళు, ఎల్లప్పుడూ బిడ్డ యొక్క పెదవుల దిశలో స్తనాన్ని పట్టుకుంటాయి.
06:25 ఇలా ఎందుకు?

ఒక సరళమైన ఉదాహరణను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం.

06:30 మనం వడా పావ్ లేదా బర్గర్‌ను తినేటప్పుడు మన పెదవులు అడ్డంగా తెరచుకుంటాయి.
06:35 ఒక పెద్ద ముక్కను కొరకడానికి మనం వడా పావ్ లేదా బర్గర్‌ను అడ్డంగా పట్టుకుంటాము.
06:40 ఇక్కడ, బొటనవేలు మరియు మిగతా వేళ్లు పెదవుల యొక్క దిశలో ఉంచబడతాయి.
06:46 ఒకవేళ మనం వడా పావ్ లేదా బర్గర్‌ ను నిలువుగా పట్టుకుంటే మనం దాని పెద్ద ముక్కను కొరకలేము.
06:53 అదేవిధంగా, శిశువు యొక్క పెదవుల దిశను గమనించండి.

పెదవులు ఇక్కడ నిలువుగా ఉంటాయి.

07:00 అందువల్ల, వేళ్లు మరియు బొటనవేలు కూడా రొమ్ముపై నిలువుగా ఉంచాలి.
07:06 ఇది బిడ్డ దిగువ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది.
07:13 శిశువు యొక్క పెదవుల దిశలో ఉండటమే కాకుండా, తల్లి బొటనవేలు మరియు మిగతా వేళ్లు ఎల్లప్పుడూ చనుమొన నుండి 3 వేళ్ల దూరంలో ఉండాలి.
07:23 మళ్ళీ, వడా పావ్ లేదా బర్గర్ ను తినేటప్పుడు,

ఒకవేళ మనం దానిని చాలా దగ్గరగా పట్టుకుంటే, మన వేళ్లు పెద్ద ముక్కను కొరకనివ్వకుండా మన నోటికి అడ్డుపడతాయి.

07:34 ఒకవేళ మనం దాన్ని చాలా దూరంగా పట్టుకుంటే, దాని ఆకారం సరిగ్గా మన నోటిలోకి సరిపోయేలా ఉండదు.
07:41 అందువల్ల, పెద్ద ముక్కను కొరకడానికి మనం దానిని సరైన దూరం వద్ద పట్టుకుంటాము.
07:47 అదేవిధంగా బిడ్డ కొరకు కూడా సరైన దూరం అంటే చిత్రం లొ చూపిన విధంగా చనుమొన నుండి 3 వేళ్ల దూరం.
07:55 ఈ దూరం అనేది బిడ్డ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి తల్లి వేళ్ళు అడ్డు రావు అని నిర్దారిస్తుంది.
08:05 చాల తక్కువ పాలను ఇస్తుంది కనుక తల్లి ఒక్క చనుమొనను మాత్రమే నొక్కదు.
08:11 ఎక్కువపాలు బయటకు వచ్చేలా చేయడానికి, తల్లి అరియోలా కింద ఉన్న పెద్ద పాల నాళాలపై నొక్కుతుంది.
08:17 మరియు బిడ్డ నోటితో లోతుగా పట్టుకోవడానికి సహాయపడేలా తల్లి స్థనం అనేది సరైన ఆకారంలో ఉంటుంది.
08:23 తల్లి బొటనవేలు అనేది ప్రస్తుతం బిడ్డ గడ్డం ఉన్న స్తనభాగం వైపు ఉండాలి అని గుర్తుపెట్టుకోండి.
08:30 మరియు ఆమె 2 వేళ్లు ప్రస్తుతం శిశువు యొక్క ముక్కు ఉన్న స్తనభాగం వైపు ఉండాలి.
08:36 వడా పావ్ లేదా బర్గర్ యొక్క ఉదాహరణకి మనం తిరిగి వెళ్దాం.
08:41 వాడా పావ్ లేదా బర్గర్‌ను సరిగ్గా పట్టుకున్న తరువాత,ఎప్పుడూ కూడా పెద్ద ముక్కను కొరకడానికి మనం దాన్ని నొక్కుతాము.
08:48 అదేవిధంగా, తల్లి పై నుండి U ఆకారంలో తన స్తనాన్ని పట్టుకుని తేలికగా నొక్కాలి.
08:54 ఇది బిడ్డకు దిగువ అరియోలా యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోనికి తీసుకోవడానికి సహాయపడుతుంది.
09:01 కానీ గుర్తుంచుకోండి, తల్లి తన రొమ్మును తిరగేసిన V ఆకారంలో పట్టుకుని నొక్కకూడదు.
09:07 V ఆకారం లో నొక్కడం అనేది రొమ్మును గిచ్చుతుంది మరియు చనుమొన నుండి మాత్రమే పాలు తాగడానికి కారణమవుతుంది.
09:14 స్తనం పై బొటనవేలు మరియు మిగతావేళ్ళ యొక్క వత్తిడి అనేది సమానంగా ఉందని నిర్ధారించుకోండి.
09:21 లేకపోతే, చనుమొన అనేది కుడివైపుకు లేదా ఎడమ వైపుకు మారిపోతుంది.
09:27 ఇంకా బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకోలేదు.
09:32 గుర్తుంచుకోండి,

బిడ్డ వైపున రొమ్మును పక్కకు నెట్టడం ద్వారా దానిని ఎప్పుడూ బిడ్డ వైపుకు తీసుకురాకూడదు.

09:39 ఎల్లప్పుడూ బిడ్డనే రొమ్ము వైపు తీసుకురండి.
09:43 ఇప్పుడు, బిడ్డ పాలను త్రాగేందుకు తల్లి రొమ్మును పట్టుకోవడానికి క్రేడిల్ హోల్డ్ లో సిద్ధంగా ఉంది
09:49 బిడ్డ స్తనాన్నిసరిగ్గా పట్టుకునే విధానం అనేది ఇదే సిరీస్ లోని మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
09:58 బిడ్డ స్తనాన్ని నోటితో లోతుగా పట్టుకున్న వెంటనే ఒకవేళ ఆ స్తనం అనేది భారంగా లెకపోతే అప్పుడు-
10:05 తల్లి తన రొమ్మును తన చేతి నుండి వదిలిపెట్టాలి.
10:09 మరియు బిడ్డకు ఆసరా ఇవ్వడానికి ఆ చేతిని బిడ్డ కిందకు తీసుకురండి.
10:14 ఈ స్థితిలో, తల్లి తన రెండు చేతులను తన శరీరానికి చాలా దగ్గరగా తీసుకురావాలి.
10:21 ఇది బిడ్డకు పాలను పట్టించే సమయంలో తల్లిని సౌకర్యంగా ఉంచుతుంది.
10:26 దీనితొమనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
10:29 పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya