FrontAccounting-2.4.7/C2/Taxes-and-Bank-Account-in-FrontAccounting/Telugu
Time | Narration |
00:01 | ఫ్రంట్‌అకౌంటింగ్‌లో టాక్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని ఎలాచేయాలి నేర్చుకుంటాం
ఒక కొత్త Tax ను జోడించడం |
00:12 | Bank Accounts ను సెటప్ చేయడం
Deposits ను జోడించడం |
00:16 | నగదును Bank Account లోకి బదిలీ చేయడం మరియు
Bank Account ను తిరిగి సరిచేసుకోవడం |
00:22 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04 |
00:30 | ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7 |
00:35 | ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ ఇంకా |
00:42 | ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ |
00:45 | మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి. |
00:51 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
00:57 | మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి. |
01:03 | మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం. |
01:07 | ఒక వెబ్ బ్రౌజర్‌ను తెరిచి,
localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
01:16 | login పేజీ కనిపిస్తుంది. |
01:19 | యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి. |
01:26 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది.
Setup టాబ్ పై క్లిక్ చేయండి. |
01:33 | Company Setup ప్యానెల్‌లో, Taxes లింక్‌పై క్లిక్ చేయండి.
మనం Tax గా ఒక డిఫాల్ట్ entry ను చూడవచ్చు. |
01:42 | Percentage, Sales GL Account మరియు Purchasing GL Account అనేవి
ఇక్కడ చూపిన విధంగా పేర్కొనబడ్డాయి. |
01:51 | మనం మన వ్యాపారం చేత ఉపయోగించే ప్రతి tax కు GL accounts ను కేటాయించాలి. |
01:57 | విండో యొక్క ఎగువభాగం వద్ద, మనం ఒక సందేశాన్ని చూడవచ్చు. |
02:00 | ప్రతి tax కు ఒక ప్రత్యేక Sale and purchase GL account ను కేటాయించాలని సిఫార్సు చేయబడింది. |
02:09 | మన company కొరకు GST మరియు Service tax ను ఎలా జోడించాలో మనం చూద్దాం. |
02:15 | డిఫాల్ట్ entry Tax వరుసలోని Edit ఐకాన్ పై క్లిక్ చేయండి. |
02:20 | మా company డిఫాల్ట్entry Tax ను ఉపయోగించనందున, నేను Tax ను GST కు సవరిస్తాను. |
02:28 | నేను డిస్క్రిప్షన్ ను GST కు మరియు పర్శంటేజ్ ను 12 కు మారుస్తాను. |
02:35 | నేను Sales GL account మరియు Purchase GL Account లను Sales tax గా ఉంచుతాను. |
02:42 | విడో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Update బటన్ పై క్లిక్ చేయండి. |
02:46 | మనం డిఫాల్ట్ ఎంట్రీ Tax ను GST కు విజయవంతంగా మార్చాము. |
02:52 | ఇప్పుడు మనం Service tax ను చేర్చుదాం.
దానికంటే ముందు మనం Service tax కొరకు ఒక GL Account ను సృష్టించాలి. |
03:00 | Banking and General Ledger టాబ్ పై క్లిక్ చేయండి. |
03:04 | Maintenance ప్యానెల్‌లో, GL Accounts లింక్‌పై క్లిక్ చేయండి. |
03:09 | చూపిన విధంగా విలువలను టైప్ చేయండి:
తరువాత విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add Accounte బటన్ పై క్లిక్ చేయండి. |
03:17 | ఇప్పుడు, Setup టాబ్ పై క్లిక్ చేసి, ఆపై Taxes లింక్ పై క్లిక్ చేయండి. |
03:22 | మనం Tax Types కింద Service tax ను చేర్చుదాం. |
03:27 | చూపిన విధంగా విలువలను టైప్ చేయండి. |
03:30 | Sales GL Account డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
03:35 | Current Liabilities కిందన ఉన్న Service Tax ను ఎంచుకోండి. |
03:39 | అదేవిధంగా, Purchase GL Account కొరకు Service Tax ను ఎంచుకోండి. |
03:46 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి. |
03:50 | ఇప్పుడు రెండు taxes జోడించబడినట్లు మనం చూడవచ్చు. |
03:55 | ఫ్రంట్ అకౌంటింగ్ యొక్క Sales మాడ్యూల్‌లో ఈ taxes అనేవి ఎలా లెక్కించబడుతున్నాయో మనం చూద్దాం. |
04:03 | మొదట మనం కంపెనీ కొరకు ఒక Bank Account ను సెటప్ చేస్తాము. |
04:07 | Banking and General ledger టాబ్ పై క్లిక్ చేయండి. |
04:11 | Maintenance ప్యానెల్‌లో, Bank Accounts లింక్‌పై క్లిక్ చేయండి. |
04:16 | ఈ ఎంపిక అనేది bank మరియు cash accounts లను సెటప్ మరియు కాన్ఫిగర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
04:22 | డిఫాల్ట్ గా, మీరు Current account మరియు Petty Cash account వివరాలను చూడవచ్చు. |
04:29 | Currency కాలమ్ అనేది US Dollar లో ఉంది.
దీన్ని మనం Indian currency కు మార్చుకుందాం. |
04:38 | Current account row లోని, Edit ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:43 | Account type ను Chequing Account కు మార్చండి. |
04:48 | Bank account currency ను Indian Rupees కు మార్చండి. |
04:53 | తరువాత దిగువభాగం వద్ద ఉన్నUpdate బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ మార్పులను అప్ డేట్ చేయండి. |
04:59 | అదేవిధంగా, Petty Cash account ను కూడా Indian Rupees కు మార్చండి.
మరియు మార్పులను అప్ డేట్ చేయండి. |
05:11 | తరువాత ST Company Pvt. Ltd. bank account కు కొంత నగదు మొత్తాన్ని చేర్చుదాం. |
05:17 | Banking and General ledger టాబ్‌కు వెళ్లండి.
Transactions ప్యానెల్‌లో, Deposits లింక్‌పై క్లిక్ చేయండి. |
05:25 | కస్టమర్ల నుండి వచ్చిన డిపాజిట్లు, వివిధరకాల అమ్మకాలు మొదలైనవి ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. |
05:31 | field' ఫీల్డ్‌ను Miscellaneous గా ఉంచండి.
చూపిన విధంగా నేను డబ్బును జమ చేసిన వ్యక్తి యొక్క పేరును నమోదు చేస్తాను. |
05:41 | Account description ఫీల్డ్‌లో, Cash ను ఎంచుకోండి. |
05:45 | Amount ఫీల్డ్‌లో, 3 lakhs అని టైప్ చేయండి. |
05:49 | Memo ఫీల్డ్‌లో, డిపాజిట్ యొక్క ప్రయోజనాన్ని టైప్ చేయండి. |
05:54 | తరువాత రో యొక్క కుడి చివర ఉన్న Add item బటన్ పై క్లిక్ చేయండి. |
05:59 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Process Deposit బటన్ పై క్లిక్ చేయండి. |
06:04 | క్రొత్త విండోలో, deposit ఎంటర్ చేయబడింది అనే సందేశాన్నిమనం చూడవచ్చు. |
06:10 | తరువాతి లింక్ అనేది View the GL postings for this Deposit.దానిపై క్లిక్ చేయండి. |
06:17 | డిపాజిట్ చేసిన నగదు యొక్క ట్రాంజక్షన్ వివరాలతో ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది. |
06:24 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నClose లింక్ పై క్లిక్ చేయండి. |
06:28 | ఒకవేళ మీరు మరొక deposit ను ఎంటర్ చేయాలనుకుంటే, అప్పుడు Enter Another Deposit లింక్ పై క్లిక్ చేయండి |
06:34 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి. |
06:41 | తరువాత మనం bank account నుండి cash లేదా మరొక account కు నగదును ఎలా బదిలీ చేయాలో చూద్దాం. |
06:49 | Transactions ప్యానెల్‌లో, Bank Account Transfers లింక్‌పై క్లిక్ చేయండి. |
06:55 | Bank Balance అనేది ఇక్కడ మూడు లక్షల రూపాయలుగా చూపబడిందని గమనించండి.
గుర్తుచేసుకోండి, ఈ మొత్తం ఇంతకు ముందు డిపాజిట్ చేయబడింది. |
07:05 | To Accountఫీల్డ్‌లో, Petty Cash account ను ఎంచుకోండి. |
07:10 | Amount ఫీల్డ్ లో, 20,000 ను ఎంటర్ చేయండి. |
07:14 | Memo ఫీల్డ్‌లో, చూపిన విధంగా టైప్ చేయండి. |
07:17 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Enter Transfe బటన్ పై క్లిక్ చేయండి. |
07:22 | క్రొత్త విండోలో, మనం Transfer has been entered - అనే ఒక సందేశాన్ని చూడవచ్చు. |
07:27 | తరువాతి లింక్ అనేది View The GL Journal Entries for this Transfer.
entries ను చూడటానికి దానిపై క్లిక్ చేయండి. |
07:35 | బదిలీ చేయబడిన నగదు యొక్క transaction వివరాలతో ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది. |
07:42 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నClose లింక్ పై క్లిక్ చేయండి. |
07:46 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్లడానికి విండో యొక్క దిగువనభాగం వద్ద ఉన్నBack లింక్‌పై క్లిక్ చేయండి. |
07:53 | తరువాత, మనం Bank Statements ను తనిఖీ చేస్తాము. |
07:57 | Transactions' ప్యానెల్‌లో, కుడి వైపు భాగంపైన, Reconcile Bank Accoun లింక్‌పై క్లిక్ చేయండి. |
08:04 | ఇది company accounts లోని deposits తో Bank statement' లో ఉన్న వాటితో సరిపోల్చుతుంది. |
08:10 | మనము Account total, Bank Deposits మరియు Fund transferవివరాలను చూడవచ్చు. |
08:17 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం. |
08:22 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము,
ఒక కొత్త Tax ను జోడించడం |
08:27 | Bank Accounts ను సెటప్ చేయడం |
08:30 | Deposits ను జోడించడం |
08:32 | నగదును Bank Account లోకి బదిలీ చేయడం మరియు |
08:35 | Bank Account ను తిరిగి సరిచేసుకోవడం |
08:39 | ఒక అసైన్మెంట్ గా
Deposits ఎంపికను ఉపయోగించి Petty Cash account లోకి Rs.10,000 ను deposit చేయండి. |
08:48 | From ఫీల్డ్‌లో Miscellaneous ను ఎంచుకోండి
Name ను Mr. Rahul గా ఎంటర్ చేయండి. |
08:54 | Petty Cash account కొరకు Reconcile Bank Account క్లిక్ చేయండి. |
08:59 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
09:07 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
09:18 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్.  లో పోస్ట్ చేయండి. |
09:22 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
|
09:28 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |