FrontAccounting-2.4.7/C2/Installation-of-FrontAccounting-on-Linux-OS/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై FrontAccounting యొక్క ఇన్‌స్టాలేషన్ అను స్పోకన్ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి -

XAMPP ని ఇన్‌స్టాల్ చేయడం

00:13 ఫ్రంట్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడం
00:15 డేటాబేస్ సెటప్ ను చేయడం మరియు

లైనక్స్ OS లో ఫ్రంట్ అకౌంటింగ్ ను ఇన్స్టాల్ చేయడం.

00:22 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:

ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04

00:29 XAMPP 5.5.19 ద్వారా పొందిన Apache, MySQL మరియు PHP
00:36 ఫ్రంట్ అకౌంటింగ్ 2.4.7
00:40 Firefox వెబ్ బ్రౌజర్ మరియు పనిచేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్.
00:45 మీరు మీకు నచ్చిన ఏ ఇతర వెబ్ బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
00:50 ఫ్రంట్ అకౌంటింగ్ అనేది ఒక సర్వర్ ఆధారిత అకౌంటింగ్ సిస్టమ్ (వ్యవస్థ).
00:54 కనుక మనం మన మెషీన్లో వెబ్ సర్వర్ ను సెటప్ చేయడానికి XAMPP ను ఉపయోగిస్తాము.
00:59 ఒక వెబ్ బ్రౌజర్‌ ను తెరవండి.

అడ్రస్ బార్ లో, ఈ URL ను టైప్ చేసి, Enter నొక్కండి.

01:06 ఇది మనల్ని XAMPP డౌన్‌లోడ్ పేజీకి తీసుకెళుతుంది.
01:10 ఇక్కడ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌ల కొరకు డౌన్‌లోడ్ చేయడానికి XAMPP అందుబాటులో ఉంటుంది.
01:15 ఈ ఆకుపచ్చ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా XAMPP యొక్క లేటెస్ట్ (తాజా) వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
01:20 ఏదేమైనా, మీ సాఫ్ట్‌వేర్ అవసరాన్ని బట్టి, మీకు XAMPP యొక్క వేరే వర్షన్ అవసరం కావచ్చు.
01:27 నా విషయంలో నాకు XAMPP వర్షన్ 5.5.19 అవసరం.
01:33 స్క్రోల్ చేసి, XAMPP లైనక్స్ ను ఎంచుకోండి.
01:37 తిరిగి మళ్లించబడిన పేజీ ఇప్పటి వరకు ఉన్న అన్ని XAMPP వర్షన్ లను ప్రదర్శిస్తుంది.
01:42 ఈ ఇన్‌స్టాలేషన్ కొరకు, నేను XAMPP వర్షన్ 5.5.19 ను ఎంచుకుంటాను.
01:49 నా సిస్టమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్.కనుక నేను, xampp-linux-x64-5.5.19-0-installer.run ను డౌన్‌లోడ్ చేస్తాను.
02:05 ఇప్పుడు, Save file బటన్ పై క్లిక్ చేసి, ఆపై OK బటన్ పై క్లిక్ చేయండి.
02:10 నా మెషీన్‌లో, ఇది Downloads ఫోల్డర్‌లో సేవ్ చేయబడింది.
02:14 Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా మనం టర్మినల్ ను తెరుద్దాం.
02:21 టర్మినల్ పై cd space Downloads అనే కమాండ్ ను టైప్ చేసి Enter నొక్కండి.
02:27 ఇది ప్రస్తుత వర్కింగ్ డైరక్టరీ ను Downloads గా మారుస్తుంది.
02:31 తరువాత చూపిన విధంగా కమాండ్ ని టైప్ చేసి, Enter నొక్కండి.
02:36 ఇప్పుడు installer ఫైల్‌ ను run చేయడానికి, చూపిన విధంగా కమాండ్ ని టైప్ చేసి, Enter నొక్కండి.

ఒకవేళ ప్రాంప్ట్ చేయబడితే అడ్మిన్ పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి.

02:46 ఇప్పుడు Setup wizard డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
02:50 ప్రాంప్ట్ చేయబడినపుడల్లా Next బటన్ పై క్లిక్ చేసి, చూపిన విధంగా ఇన్స్టాలేషన్ దశలను అనుసరించండి.
02:56 Learn more about Bitnami for XAMPP చెక్ బాక్స్ ను అన్ చెక్ చేయండి.

తరువాత Next బటన్ పై క్లిక్ చేయడం ద్వారా కొనసాగించండి.

03:05 ఒకసారి ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, Launch XAMPP చెక్ బాక్స్‌ను అన్ చెక్ చేయండి.
03:10 చివరగా, Finish బటన్ పై క్లిక్ చేయండి.
03:13 ఇప్పుడు మనం మన మెషీన్ లో XAMPP విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందా లేదా అని తనిఖీ చేయాలి.
03:19 టర్మినల్ లో sudo స్పేస్ స్లాష్ opt స్లాష్ lampp స్లాష్ lampp స్పేస్ start అని టైప్ చేయడం ద్వారా XAMPP service ను ప్రారంభించండి.
03:31 ప్రాంప్ట్ చేసినప్పుడు అడ్మిన్ పాస్వర్డ్ ను టైప్ చేసి, Enter ను నొక్కండి.
03:36 ఇక్కడ చూపిన విధంగా మీకు ఒక మెసేజ్ (సందేశం) రావచ్చు

ఇది మీ సిస్టమ్‌లో XAMPP ఇన్‌స్టాల్ చేయబడిందని మరియు మీరు సర్వీస్ (సేవ) ను ప్రారంభించారు అని సూచిస్తుంది.

03:46 ఒకవేళ మీకు Command not found అని చెప్పే ఒక మెసెజ్ (సందేశం) వచ్చినట్లయితే, అప్పుడు మీ మెషీన్‌లో' XAMPP ఇన్‌స్టాల్ చేయబడలేదు అని అర్ధం.
03:54 మీరు ఇటువంటి కొన్ని ఎర్రర్ మెసేజ్ లను పొందవచ్చు:

Apache shutdown unexpectedly

లేదా

04:00 Port 80 in use for Apache Server

లేదా

04:05 Unable to connect to any of the specified MySQL hosts for MySQL database.
04:13 ఇలా జరగటానికి కారణం ఏంటంటే, Apache మరియు MySQL కు కేటాయించిన డిఫాల్ట్ ports అనేవి మరొక సాఫ్ట్‌వేర్ ద్వారా తీసుకోబడ్డాయి.
04:21 Apache కొరకు port డిఫాల్ట్ నంబర్ అనేది 80 మరియు MySQL కొరకు అది 3306.
04:30 ఈ ports ను మార్చడానికి, ఈ ట్యుటోరియల్ యొక్క Additional Reading Material ను చూడండి.
04:36 ఇంకా ముందుకు కొనసాగే ముందు సరైన port సంఖ్యలను కేటాయించండి. ఉదాహరణకు: 8080
04:44 ఇప్పుడు, Firefox web browser ను తెరవండి.

address bar లో,localhost అని టైప్ చేసి, Enter ను నొక్కండి.

04:52 మనం XAMPP స్క్రీన్ ను చూడగలగాలి.
04:56 ఒకవేళ భాషా ఎంపిక కోసం ప్రాంప్ట్ చేయబడితే, English ను ఎంచుకోండి.
05:01 ఇప్పు మనం XAMPP homepage లో ఉన్నాము.
05:04 స్క్రీన్ యొక్క ఎడమ వైపున ఉన్న మెనులో నుండి, PHPinfo పై క్లిక్ చేయండి.
05:10 ఇప్పుడు Ctrl + F కీలను నొక్కి DOCUMENT underscore ROOT కొరకు వెతకండి.
05:18 Apache Environment టేబుల్ లో అది కనిపిస్తుంది.
05:22 DOCUMENT underscore ROOT యొక్క విలువ అనేది స్లాష్ opt స్లాష్ lampp స్లాష్ htdocs కావొచ్చు లేదా స్లాష్ var స్లాష్ www కావొచ్చు.
05:35 నా మెషిన్ లో, ఇది స్లాష్ opt స్లాష్ lampp స్లాష్ htdocs.
05:41 దయచేసి ఈ పాత్ ను నోట్ చేసి పెట్టుకోండి.

ఇక్కడ మనం FrontAccounting ను ఇన్స్టాల్ చేయబోతున్నాము.

05:47 మనం FrontAccounting ను డౌన్‌లోడ్ చేయడం ప్రారంభిద్దాం.
05:50 వెబ్ బ్రౌజర్ లో మరొక టాబ్ ను తెరిచి, ఈ URL కి వెళ్ళండి.
05:57 Frontaccounting-2.4.7.tar.gz పై క్లిక్ చేయండి.
06:04 వెంటనే, డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది.

Save file బటన్ పై క్లిక్ చేసి, ఆపై OK బటన్ పై క్లిక్ చేయండి.

06:12 టర్మినల్ కు తిరిగి మారండి.
06:15 తరువాత, మనం డౌన్‌లోడ్ చేసిన tar.gz ఫైల్‌లోని కంటెంట్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేయాలి.
06:22 కనుక, sudo స్పేస్ tar స్పేస్ హైఫన్ zxvf స్పేస్ frontaccounting హైఫన్ 2.4.7.tar.gz అని టైప్ చేయండి.
06:39 ఒకవేళ ప్రాంప్ట్ చేయబడితే admin password ను టైప్ చేసి Enter నొక్కండి.
06:44 ఒకసారి ఎక్స్ట్రాక్ట్ అయిన తరువాత, ఎక్స్ట్రాక్ట్ అయిన FrontAccounting ఫోల్డర్ కు నేను account గా పేరు ను మారుస్తాను.
06:50 ఈ కమాండ్- mv స్పేస్ frontaccounting స్పేస్ account ని టైప్ చేసి Enter నొక్కండి.
06:58 ఫోల్డర్ పేరు ను మార్చడం అనేది ఐచ్ఛికం, అయితే

ఒక మెషీన్ పై ఇన్‌స్టాల్ చేయబడిన FrontAccounting యొక్క బహుళ సందర్భాలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.

07:08 టర్మినల్‌కు తిరిగి మారండి.
07:11 ఇప్పుడు మనం ఈ account ఫోల్డర్‌ను apache home directory లోకి తరలించాలి.
07:17 account ఫోల్డర్ ‌ను apache home directory లోనికి తరలించడానికి,

sudo స్పేస్ mv స్పేస్ account స్పేస్ /opt/lampp/htdocs/ అని టైప్ చేసి Enter ను నొక్కండి.

07:34 ఇప్పుడు, మనం apache home డైరక్టరీకి వెళ్దాం.
07:37 అలా చేయడానికి, cd స్పేస్ / opt / lampp / htdocs / అని టైప్ చేసి,Enter ను నొక్కండి.
07:47 account ఫోల్డర్ permission ను మార్చడానికి,

sudo స్పేస్ chmod స్పేస్ -R స్పేస్ 777 స్పేస్ account స్లాష్ అని టైప్ చేసి, Enter ను నొక్కండి.

08:01 మనం XAMPP సర్వర్‌ను విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసాము.
08:05 FrontAccounting installer అనేది వెబ్ సర్వర్ యొక్క రూట్ డైరక్టరీ లో ఉందని నిర్ధారించుకోండి.
08:11 తరువాత ముందుకు కోనసాగడానికి మనం FrontAccounting కొరకు ఒక database ను సృష్టించాలి.
08:17 మనము దీన్ని phpmyadmin లో చేస్తాము, ఇది MySQL కొరకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్.

ఇది XAMPP ఇన్స్టాలేషన్ తో పాటు వస్తుంది.

08:28 మనం బ్రౌజర్ లోని XAMPP పేజీకి తిరిగి వెళ్దాం.

XAMPP పేజీలో, ఎడమ వైపున ఉన్న మెనులో, phpMyadmin పై క్లిక్ చేయండి.

08:39 ఎగువ భాగంలో మెనూలోని Users పై క్లిక్ చేసి, ఆపై Add User పై క్లిక్ చేయండి.
08:47 తెరుచుకున్న క్రొత్త విండోలో మీకు నచ్చిన ఒక username ను ఎంటర్ చేయండి.

నేను నా username గా frontacc ను టైప్ చేస్తాను.

08:56 Host డ్రాప్-డౌన్ జాబితా నుండి, Local ను ఎంచుకోండి.
09:01 పాస్‌వర్డ్ టెక్స్ట్-బాక్స్‌లో మీకు నచ్చిన పాస్‌వర్డ్ ను ఎంటర్ చేయండి.
09:06 నేను నా పాస్ వర్డ్ గా admin123 ను టైప్ చేస్తాను.
09:11 Re-type టెక్స్ట్ బాక్స్ లో అదే పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
09:16 ప్రస్తుతానికి Generate Password prompt పై క్లిక్ చేయవద్దు.
09:21 Database for user క్రింద, మనం ఈ ఎంపికను చూడవచ్చు.

Create database with the same name and grant all privileges.

09:29 మనము ఆ ఎంపికను తనిఖీ చేసి స్క్రోల్ చేస్తాము.
09:33 తరివాత పేజీ యొక్క దిగువ కుడి వైపున ఉన్నGo బటన్ ను క్లిక్ చేయండి.
09:38 మనం You have added a new user అనే ఒక సందేశాన్ని చూస్తాము.

frontacc అనే పేరుతో మరియు ఒక user frontacc తో ఒక కొత్త database సృష్టించబడింది అని దీని అర్థం.

09:50 ఈ username మరియు password అనేవి డేటాబేస్ లాగిన్ ప్రయోజనం కొరకు మాత్రమే.
09:56 ఈ username, password మరియు database పేర్లను రాసిపెట్టుకోండి.
10:01 FrontAccounting ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయడానికి ఇవి తరువాత అవసరం అవుతాయి.
10:06 దయచేసి గమనించండి Database పేరు మరియు username ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు.
10:11 వేర్వేరు పేర్లను కలిగి ఉండటానికి, మొదట డేటాబేస్ ను సృష్టించండి, ఆపై ఆ డేటాబేస్ కోసం ఒక యూజర్ ను సృష్టించండి.
10:18 అలాగే, పేరును పెట్టే పద్దతి ప్రకారం, username అనేది మధ్యలో ఎటువంటి ఖాళీలు కలిగి ఉండకూడదు.
10:25 ఇప్పుడు మనకు రన్ అవుతున్న XAMPP ఉంది ఇంకా మన డేటాబేస్ సిద్ధంగా ఉంది.
10:29 ఇప్పుడు మనం Front Accounting ను ఇన్స్టాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
10:33 web browser లో ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.

అడ్రస్ బార్ లో localhost/account అని టైప్ చేసి Enter నొక్కండి.

10:44 Step 1: System Diagnostics అని చూపించే FrontAccounting వెబ్ పేజీని మనం చూడవచ్చు.
10:51 Select install wizard language అనేది English అని నిర్ధారించుకోండి.
10:56 స్క్రోల్ చేసి పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేయండి.
11:02 తదుపరి వెబ్ పేజీ యొక్క శీర్షిక అనేది

Step 2: Database Server Settings

11:08 ఇక్కడ, నేను server port ను ఖాళీగా ఉంచుతాను.
11:12 ఒకవేళ మీరు MySQL డిఫాల్ట్ port సంఖ్యను 3306 కాకుండా మార్చినట్లయితే, అప్పుడు ఆ port సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేయండి.
11:21 మనము ఇంతకుముందు సృష్టించిన కింది వివరాలను ఎంటర్ చేయండి

database Name ను frontacc గా

database user ను frontacc గా
11:33 database password ను admin123 గా
11:38 మిగిలిన ఎంపికలను విస్మరించి, దిగువభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేయండి.
11:45 తరువాత, మీరు మీ స్వంత కంపెనీ వివరాలను ఉంచాలి.

అది ఎలా చేయాలో నేను ప్రదర్శిస్తాను

11:53 Company Name ఫీల్డ్ లో, నేను ST Company Pvt Ltd అని టైప్ చేస్తాను
11:59 నేను Admin Login ను admin గా ఉంచుతాను.
12:02 తరువాత నేను Admin password గా spoken ను టైప్ చేస్తాను.

మీరు మీకు నచ్చిన ఏ పాస్ వర్డ్ ని అయినా ఇవ్వవచ్చు

12:10 అదే పాస్‌వర్డ్ ను మళ్ళీ ఎంటర్ చేయండి.

ఇది లాగిన్ పాస్వర్డ్ అని గుర్తుంచుకోండి.

12:16 తరువాత మనం Charts of Accounts కొరకు రెండు ఎంపికలను చూస్తాము.
12:21 నేను Standard new company American COA ను ఎంచుకుంటాను.
12:26 Default Language గా English ను ఎంచుకోండి.
12:30 Install బటన్ పై క్లిక్ చేయండి.
12:34 మనం మన స్క్రీన్ పైన FrontAccounting ERP విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడింది అనే చివరి సందేశాన్ని చూడవచ్చు.

ఇది మన ఇన్‌స్టాలేషన్ విజయవంతమైందని నిర్ధారిస్తుంది.

12:46 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు లాగిన్ అవ్వడానికి Click here to start లింక్ పై క్లిక్ చేయండి.
12:53 లాగిన్ స్క్రీన్‌లో, కింది వివరాలను ఎంటర్ చేయండి:

User name గా admin Password గా spoken

13:03 Company గా ST Company Pvt. Ltd.

Login బటన్ పై క్లిక్ చేయండి.

13:11 మనం Front Accounting Administration పేజీకి తీసుకెళ్ళబడతాము. ఈ పేజీలో మనం వివిధ ట్యాబ్‌లను చూడవచ్చు.
13:18 వీటిల్లో చాలావాటిని ఎలా ఉపయోగించాలి అనేది ఈ సిరీస్‌లో తరువాత మనం నేర్చుకుంటాము.
13:23 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

సారాంశం చూద్దాం.

13:28 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకున్నవి - XAMPP ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం.
13:34 FrontAccounting సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం.
13:38 మరియు Linux OS లో database setup ను చేయడం.
13:42 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

13:50 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

14:00 ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?

దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి.

14:05 మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి

మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి

14:12 మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు.
14:15 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్.

దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.

14:25 ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.

తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.

14:34 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
14:40 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya