FrontAccounting-2.4.7/C2/Banking-and-General-Ledger-in-FrontAccounting/Telugu
Time | Narration |
00:01 | ఫ్రంట్ అకౌంటింగ్‌లో Banking and General Ledger పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
0:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని సృష్టించడం నేర్చుకుంటాము
General Ledger Classes (జనరల్ లెడ్జర్ క్లాసులు) |
00:13 | General Ledger Groups (జనరల్ లెడ్జర్ గ్రూప్ లు)
General Ledger Accounts (జనరల్ లెడ్జర్ అకౌంట్ లు). |
00:18 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04 |
00:26 | ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7 |
00:30 | ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ (జమ ఖర్చుల లెక్కలు వ్రాసే విధానం) |
00:40 | మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి. |
00:46 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
00:52 | మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి. |
00:58 | మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం. |
01:01 | బ్రౌజర్‌ను తెరిచి, localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
01:09 | login పేజీ కనిపిస్తుంది. |
01:12 | యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి. |
01:20 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది. |
01:23 | Banking and General Ledger ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
01:27 | Maintenance ప్యానెల్‌లో మనం ఈ ఎంపికలను చూడవచ్చు:
GL Accounts |
01:33 | GL Account Groups మరియు
GL Account Classes |
01:38 | మనము ఏదైనా లావాదేవీతో (ట్రాంజక్షన్) ప్రారంభించడానికి ముందు, మనము Charts of Accounts ను సెట్ చేయాలి. |
01:43 | FrontAccounting లో Charts of Accounts అనేది టైప్, క్లాస్, గ్రూప్
మరియు అకౌంట్ ద్వారా నిర్వచించబడింది. |
01:50 | అన్ని transactions ఒక Account, Group మరియు Classes కు వసూలు (చార్జ్) చేయబడతాయి. |
01:56 | reporting purposes కొరకు group transactions కు వీటిని ఉపయోగిస్తారు. |
02:00 | ఫ్రంట్ అకౌంటింగ్ లో, Account అనేది ఒక గ్రూప్ కు సంబందించినది మరియు Group అనేది ఒక Class కు సంబందించినది. |
02:06 | ఇది Account Group ప్రకారం Balance Sheet మరియు Profit and Loss account statements లో ప్రతిబింబిస్తుంది. |
02:13 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి మారండి. |
02:17 | మొదటి దశ అనేది General Ledger Account Classes ను సెట్ చేయడం. |
02:22 | Maintenance ప్యానెల్‌లోని GL Account Classes లింక్‌పై క్లిక్ చేయండి. |
02:27 | ఇక్కడ, అప్రమేయంగా Class Name మరియు Class Type అనేవి ఇలా నిర్వచించబడ్డాయి:
Assets (ఆస్తులు), Liabilities (బాధ్యతలు), Income (ఆదాయం) మరియు Expense (ఖర్చు). |
02:38 | అలాగే, ప్రతి Class Type కొరకు Class ID సెట్ చేయబడిందని మనం చూడవచ్చు. |
02:44 | Account Group ను సెట్ చేయడానికి ముందు మనం ఈ class ను సెట్ చేయాలి. |
02:49 | ఇప్పుడు మనం ఒక కొత్త class ను ఎలా జోడించాలో చూస్తాము. |
02:53 | Class ID ఫీల్డ్‌లో, 5 ని టైప్ చేయండి. Class ID అనేది ఒక ప్రత్యేక విలువగా ఉండాలి. |
03:00 | Class Name ఫీల్డ్‌లో, Equity అని టైప్ చేయండి. |
03:04 | Class Type డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
మనము డిఫాల్ట్ జాబితాను చూడవచ్చు: Assets (ఆస్తులు),Liabilities (బాధ్యతలు),Equity (ఈక్విటీ),Income (ఆదాయం), Cost of Goods Sold (అమ్మిన వస్తువుల ధర) మరియు Expense (ఖర్చు) |
03:21 | ఫ్రంట్ అకౌంటింగ్ ఈ Class Type ను బ్యాలెన్స్ షీట్ లో ప్రదర్శించడానికి అనుసరిస్తుంది. |
03:26 | Class Type ను Equity గా ఎంచుకోండి. |
03:29 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి. |
03:33 | New account class has been added అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
03:38 | ఇక్కడ, క్రొత్త క్లాస్ ఈక్విటీ అనేది మూడవ వరుసకు జోడించబడిందని మనం చూడవచ్చు. |
03:44 | ఇది ఎందుకంటే, డిఫాల్ట్ గా Class Type, Equity అనేది మూడవ సోపానక్రమం స్థాయిలో ఉంది కనుక. |
03:50 | కనుక, ఎప్పుడైనా ఒక క్రొత్త Class ని జోడించినప్పుడు, అది ఆ Class Type యొక్క డిఫాల్ట్ స్థానాన్ని తీసుకుంటుంది. |
03:56 | ఇప్పుడు, మనం GL Groups ను ఎలా జోడించాలో చూద్దాం. |
04:00 | Banking and General Ledger ట్యాబ్ కు వెళ్ళండి. |
04:03 | Maintenance ప్యానెల్ లో GL Account Groups లింక్ పై క్లిక్ చేయండి. |
04:08 | మనం డీఫాల్ట్ Group Name ను చూడవచ్చు, ఇది Class కిందన GL Account Groups ని చూపిస్తుంది. |
04:15 | క్లాస్ ఐడి ప్రకారం Group ID సెట్ చేయబడిందని కూడా మీరు చూడవచ్చు. |
04:20 | ID ఫీల్డ్ లో, కొత్త Group ID గా 12 ని టైప్ చేయండి. |
04:24 | Name ఫీల్డ్ లో, నేను Group Name గా Fixed Assets ను టైప్ చేస్తాను. |
04:29 | Group Name Fixed Assets అనేది ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏ subgroup కి చెందినది కాదు. |
04:35 | అందువల్ల, Subgroup ఫీల్డ్‌లో, ఫీల్డ్‌ను None గ ఉంచండి. |
04:40 | ఇప్పుడు, Class డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
04:44 | Charts of Accounts, Fixed Assets (స్థిర ఆస్తులు) అనేవి Assets యొక్క class కింద వస్తాయి.
కనుక Class ను Assets గా ఎంచుకోండి. |
04:53 | ఈ మార్పులను సేవ్ చేయడానికి, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి. |
04:59 | మనం This account Group ID is already in use అని చెప్పే ఒక ఎర్రర్ మెసేజ్ ను చూస్తాము. |
05:06 | కనుక ప్రతీ Group Name కు ఒక ప్రత్యేకమైన Class ID ని జోడించాలి. |
05:11 | మనం Group ID ను 13 కు మార్చుదాం. |
05:15 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి. |
05:19 | ఈసారి మనం New account type has been added అని చెప్పే ఒక సందేశాన్ని చూడవచ్చు. |
05:25 | క్రొత్త Group Name అనేది class Assets లోపల యాదృచ్ఛికంగా జోడించబడుతుంది. |
05:30 | అదేవిధంగా, మనం మన స్వంత Group Name ను జోడించవచ్చు. |
05:34 | ఇప్పుడు, మనం GL Accounts ను ఎలా జోడించాలో చూద్దాం. |
05:38 | Banking and General Ledger ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:42 | తరువాత Maintenance ప్యానల్ లో GL Accounts లింక్ పై క్లిక్ చేయండి. |
05:47 | ఇక్కడ కూడా మనం ఒక ప్రత్యేకమైన code ను టైప్ చేయాలి. ఇది తప్పనిసరి ఫీల్డ్. |
05:53 | Account Code ఫీల్డ్‌లో, నేను కోడ్‌గా 1100 ను టైప్ చేస్తాను. |
06:00 | మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా కోడ్ ను ఇవ్వవచ్చు. |
06:04 | Account Name ఫీల్డ్ పై క్లిక్ చేయండి.
Account Name గా Land and Building ను టైప్ చేయండి. |
06:11 | మీరు మీకు నచ్చిన ఏ పేరునైనా ఇవ్వవచ్చు. |
06:14 | Account Group డ్రాప్-డౌన్ బాక్స్‌లో, Account Group గా Fixed Assets ను ఎంచుకోండి |
06:20 | Charts of Accounts ప్రకారం Account Name Land and Building అనేది Group Fixed Assets కిందకు రావాలి. |
06:28 | తరువాత, Account status డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేయండి.
status గా Active ను ఎంచుకోండి. |
06:35 | తరువాత విండో దిగువభాగం వద్ద ఉన్న Add Account బటన్ పై క్లిక్ చేయండి. |
06:40 | New account has been added - అనే సందేశాన్ని మనం చూడవచ్చు. |
06:45 | ఇప్పుడు, ఎగువభాగం వద్ద ఉన్న New account డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
కొత్తగా జోడించిన Account ను ఇక్కడ మనం చూడవచ్చు. |
06:54 | ఇక్కడ చూపిన విధంగా ప్రతి సంస్థ వారి స్వంత account codes యొక్క సెట్ ను కలిగి ఉంటాయి. |
07:00 | అదేవిధంగా, పై దశలను అనుసరించడం ద్వారా, మీరు మీ స్వంత GL Accounts ను సృష్టించవచ్చు. |
07:06 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
సారాంశం చూద్దాం. |
07:12 | ఈ ట్యుటోరియల్‌లో, మనం సృష్టించడం నేర్చుకున్నవి
General Ledger Classes, General Ledger Groups మరియు General Ledger Accounts. |
07:22 | ఒక అసైన్మెంట్ గా,
కింది వివరాలతో ఒక కొత్త GL Accounts - Cash మరియు Capital ను సృష్టించండి. మార్పులను సేవ్ చేయండి. |
07:31 | ఇప్పుడు మనం మన Company కోసం కొత్త GL Accounts తో చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ ను సెట్ చేసాము. |
07:38 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
07:46 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
07:55 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
07:59 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
08:05 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |