Drupal/C4/Hosting-a-Drupal-website/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 స్పోకన్ ట్యుటోరియల్ లో Hosting a Drupal website ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం, మన కోడ్ మరియు డేటాబేస్ లను మన వెబ్-సైట్ కు సిద్ధం చేయుట,
00:13 ద్రుపల్ వెబ్-సైట్ ను హోస్ట్ చేయుట మరియు లోకల్ డేటా ను ఈ వెబ్-సైట్ కు అప్-లోడ్ చేయుట నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు నేను ఉబుంటు లినక్స్ 16.04 మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ ను ఉపయోగిస్తున్నాను.
00:28 మీరు మీకు ఇష్టమైన ఏ బ్రౌసర్-ను అయిన ఉపయోగించవచ్చు.
00:32 ఈ ట్యుటోరియల్ను సాధన చేయుటకు మనకు పనిచేస్తున్న Internet connection,
00:37 cPanel వంటి ఒక వెబ్ హోస్టింగ్ కంట్రోల్ ప్యానెల్ మరియు ఒక డొమైన్ నేమ్ అవసరం.
00:43 మీకు ద్రుపల్ పై ప్రాధమిక అవగాహన కూడా అవసరము.
00:47 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ లింక్ ను సందర్శించండి.
00:53 ముందుగా, మనం ద్రుపల్ వెబ్-హోస్టింగ్ సర్వీసెస్ గురించి నేర్చుకుందాం.
00:57 మనకు Godaddy, Bigrock మరియు HostCats వంటి చాలా web హోస్టింగ్ సర్వీసెస్ అందుబాటు లో ఉన్నాయి.
01:06 ఈ సర్వీస్ ప్రొవైడర్లు cPanel ఆధారిత, auto installer script తో పాటు అందుబాటు లో ఉంటాయి.
01:12 కావలసినవారు ఈ ప్రొవైడర్స్ నుండి కొంత స్పేస్ ను కొనాలి.
01:17 ఒక వెబ్-సైట్ ను హోస్ట్ చేయుటకు, మీ లోకల్ Drupal websiteయొక్క కోడ్ మరియు డేటాబేస్ అవసరం.
01:24 హోస్ట్ చేయాలనుకున్న, మన లోకల్ Drupal website ను తెరవండి.
01:29 ముందుగా, కాష్ ను క్లియర్ చేయాలి. అలాచేయుటకు, configuration మెనూ పై క్లిక్ చేయండి.
01:35 Development నందు , Performance ఎంపిక పై క్లిక్ చేయండి.
01:40 ఇక్కడ, Aggregate CSS files మరియు Aggregate JavaScript files ఎంపికల చెక్ మార్క్ లను తొలగించాలి.
01:48 Save configuration బటన్ పై క్లిక్ చేయండి.
01:52 Clear all caches బటన్ పై క్లిక్ చేస్తే, caches క్లియర్ అవుట చూడవచ్చు.
02:00 మన కోడ్ ను సిద్ధం చేద్దాం. అలాచేయుటకు File browser ను తెరవండి.
02:06 లోకల్ లో మనం ద్రుపల్ స్థాపన చేసిన ఫోల్డర్ కు వెళ్ళండి.
02:11 ఇప్పుడు apps -> drupal -> htdocs ఫోల్డర్ కు వెళ్ళండి.
02:16 ఈ htdocs ఫోల్డర్ లోపల, మన లోకల్ వెబ్-సైట్ యొక్క కోడ్ ఉంటుంది. దీనిని కంప్రెస్ లేదా జిప్ చేద్దాం.
02:25 నేను నా మెషిన్ పై డౌన్లోడ్స్ ఫోల్డర్ లో సేవ్ చేస్తాను.
02:30 ఇప్పుడు మన కోడ్ సిద్ధం అయినది.
02:32 తరువాత, మన డేటాబేస్ ను సిద్ధం చేద్దాం. మన లోకల్ వెబ్-సైట్ లో గల phpMyAdmin ను తెరవండి.
02:41 bitnami_drupal8 అను పేరు గల డేటాబేస్ పై క్లిక్ చెయ్యండి.
02:46 టాప్ ప్యానెల్ లో Export బటన్ పై క్లిక్ చెయ్యండి.
02:50 తరువాత, Export method గా Custom ను ఎంచుకోండి .
02:54 Object creation options విభాగంలో, Add DROP TABLE ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి.
03:01 స్క్రోల్ చేసి, క్రిందన Go బటన్ పై క్లిక్ చేయండి.
03:06 సేవ్ చేయుటకు OK బటన్ పై క్లిక్ చేయండి.
03:09 డిఫాల్ట్ Downloads ఫోల్డర్ తెరచి, ఎక్స్-పోర్ట్ చేసిన sql మరియు htdocs.zip ఫైల్స్ ను చూడండి.
03:18 తరువాత, cPanel ను సెటప్ చేయుట నేర్చుకుందాం. ఇది చేయుటకు Set Up బటన్ పై క్లిక్ చేయండి.
03:25 ఇక్కడ మన డొమైన్ నేమ్ ఎంచుకొనాలి. నేను ఇప్పటికే codingfordrupal.info అను డొమైన్ నేమ్ ను కొన్నాను.
03:33 మీరు మీ సొంత డొమైన్ నేమ్ ఎంచుకొనండి.
03:37 డొమైన్ నేమ్ ఎలా కొనాలి అను వివరాలు ఈ ట్యుటోరియల్ యొక్క Additional Material లింక్ లో ఇవ్వబడ్డాయి.
03:43 నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి.
03:46 ఇక్కడ మనం ఒక డేటా సెంటర్ ను ఎంచుకొనాలి. నేను Asia పై క్లిక్ చేసి, నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేస్తాను.
03:53 cPanel username లో మనం username ఇవ్వాలి.
03:58 password కొరకు, నేను Generate a password బటన్ పై క్లిక్ చేస్తాను.
04:03 మీరు, మీకు నచ్చిన username మరియు password లను ఇవ్వవచ్చు.
04:07 ఈ లాగిన్ వివరాలను గుర్తు కొరకు ఎక్కడైనా వ్రాసుకొనండి.
04:11 తరువాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి.
04:14 దీని తరువాత, అది వెబ్-సైట్ నిర్మాణం కొరకు wordpress అవసరమా? అని అడుగుతుంది.
04:20 మనం ద్రుపల్ వెబ్-సైట్ ను హోస్ట్ చేయాలనుకుంటున్నాము కావున,
04:23 No, not now పై క్లిక్ చేసి, తరువాత Finish బటన్ పై క్లిక్ చేయండి.
04:28 అది సెటప్ పూర్తిచేయుటకు కొన్ని నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది.
04:32 సెటప్ పూర్తి అయిన తరువాత, మనం ఇటువంటి విండో ను చూడగలము. ఇక్కడ Manage బటన్ పై క్లిక్ చేయండి.
04:40 ఇప్పడు, మన cPanel ముఖ్య విండో తెరుచుకుంటుంది. మనం Website Name, IP Address మొదలైన వాటిని చూడవచ్చు.
04:48 దయచేసి, ఈ పేజీ నందు గల ఎంపికలను పూర్తిగా చదివి, అన్వేషించండి.
04:53 తరువాత, మనం cPanel నందు డేటాబేస్ ను తయారుచేయాలి.
04:57 File browser ను తెరిచి, Bitnami Drupal Stack ను స్థాపన చేసిన ఫోల్డర్ వద్దకు వెళ్ళండి.
05:04 ఇప్పడు apps -> drupal -> htdocs-> sites -> default -> settings.php కు వెళ్ళండి.
05:13 settings.php ఫైల్ ఎడిటర్ లో తెరవబడును.
05:18 ఫైల్ చివర వరకు స్క్రోల్ చేస్తే, డేటాబేస్ వివరాలు చూడగలము.
05:24 మీరు ఈ వివరాలను cPanel లో డేటాబేస్ ను సృష్టించుటకు ఉపయోగించాలి.
05:30 cPanel యొక్క ముఖ్యమైన విండో కు మారండి.
05:33 Databases నందు, MySQL Database Wizard పై క్లిక్ చేయండి.
05:37 ఇప్పుడు, settings.php ఫైల్ నుండి డేటాబేస్ పేరు కాపీ చేసి,
05:42 MySQL Database Wizard నందు, డేటాబేస్ పేరు గా పేస్ట్ చెయ్యండి.
05:47 Next Step బటన్ పై క్లిక్ చెయ్యండి.
05:50 username మరియు password లను కాపీ చేసి, పేస్ట్ చేయండి.
05:55 Create User బటన్ పై క్లిక్ చేయండి.
05:57 ALL PRIVILEGES ఎంపికపై చెక్ మార్క్ ఉంచండి.
06:01 Next Step బటన్ పై క్లిక్ చేయండి.
06:04 Return to MySQL Databases పై క్లిక్ చేయండి.
06:08 ఇక్కడ మనం సృష్టించిన డేటాబేస్ మరియు యూసర్ లను చూడవచ్చు.
06:13 తరువాత cPanel లో ద్రుపల్ ను స్థాపన చేయడం గురించి నేర్చుకుందాం. టాప్ ప్యానెల్ నందు Home బటన్ పై క్లిక్ చేయండి.
06:21 Web Applications నందు Drupal పై క్లిక్ చేయండి.
06:24 కుడివైపున గల install this application బటన్ పై క్లిక్ చేయండి.
06:29 Location నందు మీరు డొమైన్ నేమ్ ను చూడవచ్చు.
06:33 Version నందు, మీరు లోకల్ మెషిన్ పై స్థాపన చేసిన వర్షన్ ను ఎంచుకొనండి. నేను 8.2.6 ను ఎంచుకుంటాను
06:41 Settings నందు అడ్మినిస్ట్రేటర్ కొరకు మనకు నచ్చిన username మరియు password లను ఇవ్వాలి.
06:48 భవిష్యత్తు అవసరాలకు లాగిన్ వివరాలను వ్రాసుకొనండి.
06:52 Advanced విభాగం నందు మనం డేటాబేస్, email మరియు బ్యాక్-అప్ లను సెట్ చేయగలము.
06:58 నేను Let me manage these settings ను ఎంచుకుంటాను.
07:02 Database Management లో Let me choose an existing database ఎంపికను ఎంచుకొనండి.
07:07 Database Name లో మీరు ఇంతకు ముందు సృష్టించిన డేటాబేస్ ను ఎంచుకొనండి .
07:12 Database Username మరియు Password లకు వివరాలను settings.php నుండి ఇవ్వండి.
07:19 Table Prefix లో ఫీల్డ్ ను ఖాళీ గా వదిలివేయండి.
07:23 ఇప్పుడు Install బటన్ పై క్లిక్ చేయండి.
07:26 ఇన్స్టలేషన్ పూర్తి అయిన తరువాత, మనం మన website పేరు చూడవచ్చు. దానిపై క్లిక్ చెయ్యండి.
07:33 మన website విజయవంతంగా హోస్ట్ చేయబడినది.
07:36 కాని మనం దానిని మన లోకల్ విషయాలతో update చెయ్యాలి. కాబట్టి వెబ్-సైట్ ను లోకల్ విషయాలతో update చేయుట నేర్చుకుందాం.
07:45 cPanel యొక్క మెయిన్ విండోకు, మారి(వెళ్ళి), టాప్ ప్యానెల్ లోని Home బటన్ పై క్లిక్ చేయండి.
07:51 మనం cPanel లోని File Manager ను తెరవాలి.
07:55 Web Root ఎంపిక ఎంచుకొనబడిఉన్నదని నిర్దారించుకొని, Go బటన్ పై క్లిక్ చేయండి.
08:01 ఇప్పుడు మనం public_html ఫోల్డర్ లో ఉన్నాము. టాప్ ప్యానెల్ లో upload బటన్ పై క్లిక్ చేయండి.
08:09 Browse బటన్ పై క్లిక్ చేసి downloads ఫోల్డర్ లోని htdocs.zip ఫైల్ ఎంచుకొనండి. ఆ ఫైల్ విజయవంతంగా అప్లోడ్ చేయబడినది.
08:19 ఒక వేళ ఫైల్ సైజు పెద్దదిగా ఉన్నట్లయితే అప్లోడ్ కొరకు Filezilla లేదా ఏదైనా SSH client ను ఉపయోగించండి.
08:27 ఇప్పుడు ఈ విండో ను మూసివేయండి.
08:29 File Manager విండో నందు, htdocs.zipకు వెళ్ళి, దానిపై క్లిక్ చేయండి.
08:36 ఇప్పుడు ఈ ఫైల్ ను వెలికితీసేందుకు టాప్ ప్యానెల్ లోని Extract బటన్ పై క్లిక్ చేయండి.
08:41 వచ్చిన పాప్-అప్ విండో నందు Extract File బటన్ పై క్లిక్ చేయండి.
08:47 ఫైల్ extract అయిన తరువాత htdocs ఫోల్డర్ పై క్లిక్ చేయండి.
08:52 ఇప్పుడు Sites ఫోల్డర్ కు వెళ్ళండి.
08:55 ఇక్కడ మనం డిఫాల్ట్ ఫోల్డర్ యొక్క పర్మిషన్ ను మార్చగలము.
08:59 ఇది చేయుటకు Permissions కాలమ్ పై క్లిక్ చేసి, దానిని 755 కు మార్చండి.ఇది యూసర్ కు write permission ఇస్తుంది.
09:08 తరువాత డిఫాల్ట్ ఫోల్డర్ కు వెళ్ళి, settings.php ఫైల్ లో permissions ను మార్చండి.
09:16 తిరిగి Permissions కాలమ్ పై క్లిక్ చేసి, దానిని 600 కు మార్చండి.
09:22 ఇది యూసర్ కు write permission ను ఇస్తుంది. అయితే మనం settings.php ను మార్చగలము.
09:29 settings.php ఫైల్ ను తెరుచుటకు టాప్ ప్యానెల్ లో Code Editor బటన్ పై క్లిక్ చెయ్యండి.
09:35 Edit బటన్ పై క్లిక్ చెయ్యండి.
09:37 ఫైల్ చివరకు వెళ్తే, ఇక్కడ మనం డేటాబేస్ వివరాలు చూడవచ్చు.
09:43 unix_socket వరుసను తొలగించండి.
09:46 టాప్ ప్యానెల్ లో ఉన్న Save Changes బటన్ పై క్లిక్ చెయ్యండి.
09:50 టాప్ ప్యానెల్ లో Up One Level బటన్ పై క్లిక్ చేయండి.
09:54 మళ్ళీ, Up One Level బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనము ఈ కంటెంట్ ను public_html కు తరలించాలి.
10:04 ఫైల్స్ మరియు ఫోల్డర్స్ ఎంచుకొనుటకు, Select All బటన్ పై క్లిక్ చేయండి.
10:09 టాప్ ప్యానెల్ లో Move button పై క్లిక్ చేయండి.
10:12 file path, లో htdocs ను తొలగించండి.
10:16 Move Files బటన్ పై క్లిక్ చేయండి.
10:18 ప్రక్క ప్యానెల్ లో, public_html ఫోల్డర్ పై క్లిక్ చేయండి.
10:24 ఇప్పుడు public_html ఫోల్డర్ మన లోకల్ website లోని కోడ్ తో భర్తీ చేయబడును.
10:32 తరువాత, లోకల్ డేటాబేస్ ను మన లైవ్ వెబ్-సైట్ లోనికి ఇంపోర్ట్ చేయాలి. ఆలా చేయుటకు cPanel మెయిన్ విండోకు మారుదాం.
10:41 Databases నందు phpMyAdmin పై క్లిక్ చేయండి.
10:45 ప్రక్క ప్యానెల్ లో, ఇంతకు ముందే సృష్టించిన డేటాబేస్ పై క్లిక్ చేయండి.
10:50 టాప్ ప్యానెల్లో Import బటన్ పై క్లిక్ చేయండి.
10:54 ఆపై, బ్రౌజ్ బటన్ పై క్లిక్ చేయండి.
10:56 లోకల్ ద్రుపల్ నుండి మనం ఎక్స్-పోర్ట్ చేసిన sql ఫైల్ ను ఎంచుకొనండి.
11:02 చివరగా Go బటన్ పై క్లిక్ చేస్తే, sql ఫైల్ విజయవంతంగా ఇంపోర్ట్ కావడం మనం చూడవచ్చు.
11:10 ఇప్పుడు బ్రౌసర్ లో క్రొత్త టాబ్ తెరిచి, అడ్రస్-బార్ లో మీ డొమైన్ నేమ్ టైప్ చెయ్యండి. మన ద్రుపల్ వెబ్-సైట్ విజయవంతంగా హోస్ట్ కావడం గమనించవచ్చు.
11:20 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
11:24 ఈ ట్యుటోరియల్ సారాంశం; ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది,మన కోడ్ ను, డేటాబేస్ ను వెబ్-సైట్ కు సిద్ధం చేయుట, మన Drupal website ను హోస్ట్ చేయుట మరియు మన లోకల్ మెషిన్ పైగల విషయాలను వెబ్-సైట్ కు అప్లోడ్ చేయుట.
11:38 ఈ క్రింది లింక్ Spoken Tutorial project యొక్క సారాంశం ను ఇస్తుంది. దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి.
11:46 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్-షాప్ లను కండక్ట్ చేసి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్స్ కూడా ఇస్తుంది.
11:57 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD భారత ప్రభుత్వం మరియు NVLI, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.
12:09 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india