Drupal/C3/Menu-and-Endpoints/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 మెనూ అండ్ ఎండ్ పాయింట్స్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము URL ప్యాటర్న్లు మరియు మెనూ మానేజ్మెంట్ ల గూర్చి నేర్చుకుంటాము.
00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నాది: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.
00:29 ఈ ట్యుటోరియల్ లో, మనం వెబ్సైట్ కోసం సరైన URL పాత్లను సృష్టించే ప్రక్రియ గురించి చేర్చిద్దాం.
00:36 Endpoints మరియు aliases- Endpoints, ఒక ప్రత్యేక కంటెంట్ని ప్ర దర్శించే URL పాతాలు.
00:45 అప్రమేయంగా ద్రుపల్ లో నోడ్ యొక్క ఎండ్ పాయింట్ నోడ్ స్లాష్ నోడ్ ఐడి (node/[node:id])
00:53 దీనిని సర్వర్ కి పంపితే, నోడ్ యొక్క విషయాలు ప్రదర్శింప బడుతాయి. ఐడి లోని సంఖ్య మానవులు చదువ లేరు.
01:02 దీనిని మనము సులభంగా ఒక ప్రత్యేక కంటెంట్కి అనుబంధించలేము అనగా నోడ్ స్లాష్ ( /) 278162.

మానవులు చదువ గలిగే ఎండ్ పాయింట్ ఒక అలియాస్ సృష్టించడం ద్వారా అందుబాటులో ఉంటుంది.

01:19 అలియాస్ ఆంటే కంటెంట్ కోసం ఒక ప్రత్యామ్నాయ URLపాత్. మనము అదే కంటెంట్ని ప్రదర్శించడానికి అసలు లేదా అనేక ఇతర అలియాస్స్ లను కూడా ఉపయోగించవచ్చు.
01:34 ఉదాహరణకు, నోడ్ స్లాష్ /278162 మరియు కంటెంట్/ ద్రుపల్- క్యాంపు- ముంబయి -2015.
01:47 రెండు ఒకే కంటెంట్ని తిరిగిస్తాయి. రెండవది గుర్తుంచుకోవడానికి సులభం.
01:54 మనకున్న అన్ని కంటెంట్లకు వర్తించే URL పాటర్న్ లను సృష్టిద్దాం.
01:59 URL పాత్ లను సెట్ చేయుటకు మూడు మాడ్యూల్స్ కావాలి.
02:04 ఆ మాడ్యూల్స్ Pathauto, Token మరియు CTools.
02:13 Pathauto మాడ్యూల్ ని మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయండి.
02:18 Pathauto ప్రాజెక్ట్ పేజీకి తిరిగి రండి. ఇక్కడ Pathauto కోసం టోకన్ మరియు CTools కావాలని మీరు గమనించగలరు.
02:27 Token మరియు CTools ఇన్స్టాల్ చేయండి. ఈ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసిన తరవాత వాటిని ఆన్ చేయండి.
02:37 ఇప్పుడు వాటిని వాడుటకు మనము సిద్ధంగా ఉన్నాము.
02:40 Configuration పై క్లిక్ చేయండి. క్రిందికి వెళ్తే, మీకు ఎడమ వైపు SEARCH AND METADATA విభాగం క్రింద, URL అలియాస్స్ కనిపిస్తాయి.
02:52 అప్రమేయంగా URL aliases అందుబాటులో లేవు.
02:58 Patterns ట్యాబ్ పై క్లిక్ చేయండి. Add Pathauto pattern బటన్ పై క్లిక్ చేయండి.
03:05 Pattern type డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి.
03:09 ఇక్కడ ఫోరమ్, కంటెంట్, టక్సన్యోమి టర్మ్ మరియు యూసర్ కోసం ప్రత్యేక నమూనాలను సృష్టించవచ్చు.
03:17 ఉదాహరణకు నేను కంటెంట్ ఎంచుకుంటాను. పాత్ పాటర్న్ ఫీల్డ్ లో నమూనా టెంప్లేట్ అందించాలి.
03:27 టెంప్లేట్ వేరియబుల్స్ని టోకెన్స్ అంటారు. అవి ప్రతి ఎంటిటి కోసం డైనమిక్ గా ఉత్పత్తి చెయ్యబడుతాయి.
03:36 ఈ వేరియబుల్స్ని టోకన్ మాడ్యూల్ అందిస్తుంది. మీరు Browse available tokensని ఏ ఇన్పుట్ రూపం లోనైనా చుస్తే, పూర్వనిర్వచిత టోకెన్లను చేర్చగలరు.
03:49 ఎక్కడైతే మీకు టోకెన్ చేర్చేదుందో, అక్కడ Path pattern బాక్స్ పై క్లిక్ చేయండి.
03:55 కంటెంట్/స్లాష్ టైప్ చేసి, Browse available tokens లింక్ పై క్లిక్ చేయండి.
04:02 Available tokens చూపించడానికి ఒక పాపప్ విండో తెరుచుకుంటుంది.
04:07 మనకు content/[title of the page] ఇలాంటి పాటర్న్ కావలిస్తే, పేజీ యొక్క శీర్షిక కోసం టోకన్, నోడ్స్ విభాగం క్రింద ఉంది.
04:18 నోడ్స్ విభాగంలో కుడి బాణం బటన్ క్లిక్ చేయండి.
04:23 token [node:title] ఎంచుకోండి ఏడైతే పేజీ యొక్క శీర్షిక అనగా టైటిల్ తో మార్చ బడుతుంది.
04:32 ఇది [node:title]ని ఫామ్ బాక్స్ లో కర్సర్ యొక్క స్థానం లో చేర్చుతుంది.
04:38 అది జరగక పొతే, అవసరానికి తగిన విధంగా బాక్స్ మరియు కర్సర్ యొక్క స్థానం పై క్లిక్ చేయుట నిర్ధారించుకోండి.
04:49 కంటెంట్ టైప్ క్రింద, మనం ఈ నమూనా ఏ ఎంటిటి టైప్ కి వర్తిస్తుందో ఎంచుకోవచ్చు.
04:56 మనం అన్ని టైప్స్ని ఎంచుకుందాం, అందువలన ఈ నమూనా వాటన్నిటికి అప్రమేయంగా వర్తిస్తుంది.
05:04 ఈ సెట్టింగ్ని ఒక నిర్దిష్టమైన టైప్ కోసం ఓవర్రైడ్ చెయ్యవచ్చు.

ఉదాహరణకు, ఒక యూసర్ గ్రూప్ స్లాష్ /[node:title]ని సృష్టించవచ్చు మరియు దానిని యూసర్ గ్రూప్స్ కి మాత్రమే వర్తిపచేయవచ్చు.

05:18 లేబుల్ ఫీల్డ్ లో కంటెంట్ title అని టైప్ చేయండి. తదుపరి సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం సృష్టించిన కొత్త పాటర్న్ ని తనిఖీ చేయవచ్చు.
05:31 ఈ పాటర్న్ కొత్త గా జోడించిన కంటెంట్ లకు URL aliasesలను ఉత్పత్తి చేయుటకు వర్తిస్తుంది. కానీ అది ఇప్పటికే ఉన్న కంటెంట్ లకు URL aliases సృష్టించదు.
05:45 ఇప్పటికే ఉన్నకంటెంట్ లకు అప్లై చేయుటకు Bulk generate ట్యాబ్ పై క్లిక్ చేయండి. కంటెంట్ టైప్ ఎంచుకొని అప్డేట్ బటన్ పై క్లిక్ చేయండి.
05:58 అది URL aliases ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. దానికి ఇప్పటికే ఉన్న కంటెంట్ ల సంఖ్యను బట్టి కొంత సమయం పడుతుంది.
06:08 లిస్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. మనం మన కంటెంట్ కోసం URL aliasesని చూడవచ్చు.
06:15 మన సైట్ పై ఉన్న ప్రతి నోడ్ కొరకు ఒక సిస్టం పాత్ స్లాష్ నోడ్ స్లాష్ నోడ్ ఐడి(/నోడ్/నోడ్ ఐడి)ఉంది.
06:24 కొత్తగా ఉత్పత్తి చేసిన URL alias మొదటి Alias కాలంలో ఉంది.
06:30 అన్ని aliases ఒకే పాటర్న్ ని అనుసరిస్తాయని చూడవచ్చు. మీరు కొత్త కంటెంట్ టైప్ సృష్టించిన ప్రతి సరి ఇది మీరు చేయాలి.
06:41 పాటర్న్ లను సృష్టించడానికి క్రింది నియమాలను ఉపయోగించాలి- లోయర్ కేసు పదాలను ఉపయోగించండి, పదాల మధ్య స్పేస్ ఇవ్వకండి.
06:52 పదాలను వేరు చేయుటకు హైఫన్ ని వాడండి అండర్ స్కోర్ వద్దు.

శోధన ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) కోసం URLలో అర్థవంతమైన, మానవలు చదవగలిగే పదాలు ఉపయోగించండి.

07:07 సంయానుసారంగా వర్గీకరించబడే కంటెంట్స్ కోసం డేట్ టోకన్స్ వాడండి.
07:12 ఎక్కడ సెట్టింగ్స్ ట్యాబ్ లో URL alias పాటర్న్ లను నియంత్రించడానికి మర్రిన్ని ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

ఇక్కడ మనం అప్రమేయ సెపరేటర్, లెన్త్ మొదలైనవి చూడవచ్చు.

07:26 అప్రమేయంగా అనేక సాధారణ పదాలు నమూనా నుండి తీసివెయ్యబడినవని మనం చూడవచ్చు. ఇది ఎండ్ పాయింట్ ని సంక్షిప్తంగా మరియు అర్ధవంతము చేయుటకు.
07:38 సారాంశం చూద్దాం.

Pathauto మరియు Token మాడ్యూల్స్, URL పాటర్న్స్ సెట్ చేయుటకు,

07:46 Delete aliases మరియు Bulk generate aliases చేయుటకు ఏ సమయంలోనైనా అనుమతిస్తాయి.
07:52 ఇక మీదట నుండి, ప్రతి కొత్త నోడ్ మనము స్థాపించిన నమూనాలను ఉపయోగిస్తుంది.
07:59 మేనుస్ గూర్చి నేర్చుకుందాం.
08:03 మనము మన సైట్ పై యాదృచ్ఛిక క్రమంలో మెనూ లను వ్యూస్ మరియు బేసిక్ పేజీల ఆధారాంగా జోడిస్తున్నాము.
08:10 మెనూ సిస్టం ని ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం.
08:15 స్ట్రక్చర్ కి వెళ్ళి స్క్రోల్ చేసి Menus క్లిక్ చేయండి.
08:21 ఇక్కడ అప్రమేయంగా ద్రుపల్ తో వచ్చే వివిధ మెనూ లు ఉన్నాయి. మా వద్ద ఖచ్చితంగా ఆరు మెనూలు, ఉన్నాయి.
08:31 మాకు మెయిన్ నావిగేషన్ మెనూ పై ఆసక్తి ఉంది. ఎడిట్ మెనూ పై క్లిక్ చేద్దాం.
08:38 ఇక్కడ, క్లిక్ మరియు డ్రాగ్ పద్దతి లో మెనూ లింక్ లను క్రమపర్చగలం.
08:44 హోమ్ మరియు Upcoming Eventsని అన్నిటి కన్న పైకి డ్రాగ్ చేద్దాం.
08:49 మీరు మీకు కావలసిన విధంగా మళ్ళీ క్రమపర్చవచ్చు. క్రమపర్చడం పూర్తి కాగానే సేవ్ క్లిక్ చేయండి.
08:56 మన వద్ద ఇవెంట్స్ మరియు అప్ కమింగ్ ఇవెంట్స్(Upcoming Events) ఉన్నవి.

మనము ఇవెంట్స్ అన్నిటికన్న పైకి మరియు అప్ కమింగ్ ఇవెంట్స్(Upcoming Events)ని కుడి వైపుకి డ్రాగ్ చేద్దాం.

09:07 ఇది ఒక సబ్ మెనూని సృష్టిస్తుంది.
09:10 ఇది చాలా తేలిక. సేవ్ క్లిక్ చేసి ఫ్రంట్ పేజీ వద్దకు చూడండి.
09:15 నాలుగు మెనూ లు ఉన్నాయని గమనించండి.
09:19 ఇవెంట్ యొక్క సబ్ మెనూ ఎక్కడ ఉంది?
09:23 గుర్తుంచుకోండి ద్రుపల్ లో అన్ని థీమ్స్ సబ్ మెనూస్ లేదా డ్రాప్ డౌన్స్ కి మద్దతు ఇవ్వవు. Bartik థీమ్ వాటిల్లో ఒకటి.
09:32 ఇప్పటి కోసం స్ట్రక్చర్ మరియు మెనూస్ కి వెళ్ళి, మెయిన్ మెనూ ని ఎడిట్ చేయండి. Upcoming Eventని ఇక్కడకి డ్రాగ్ చేసి సేవ్ క్లిక్ చేయండి.
09:44 ఒక ప్రత్యేక నోడ్ లేదా మన సైట్ యొక్క ఒక నిర్దిష్ట విభాగానికి ఒక లింక్ అవసరం ఉంటే ఏమి చేయాలి?
09:51 ఉదాహరణకు, నా ఫోరమ్స్ కి ఒక మెనూ లింక్ కావాల్సి ఉంటే, నేను మొదట నా సైట్ కి వెళ్తాను.
09:58 ఫోరమ్స్ పేజీ కి వెళ్ళి, అసలు URL అనగా స్లాష్ ఫోరమ్(/forum) ని కాపీ చేస్తాను.
10:05 ఆపై వెనక్కి వచ్చి ఎడిట్ మెనూ ఆ తరవాత Add link పై క్లిక్ చేయండి.
10:12 దానికి ఒక టైటిల్, ఫోరమ్ అని ఇచ్చి, కాపీ చేసి లింక్ ని పేస్ట్ చేయండి.
10:17 మీరు కంటెంట్ యొక్క నిర్దిష్ట భాగాన్ని శోధీస్తుంటే, కేవలం అక్షరాలు F లేదా G టైప్ చేయండి. ఆ అక్షరంతో మొదలయ్యే అన్ని నోడ్స్ చూపబడతాయి.
10:28 ఉదాహరణకు, మనము 'a' టైప్ చేస్తే, శీర్షిక లో 'a' ఉన్న అన్ని నోడ్స్ చూడవచ్చు.
10:38 కేవలం మనం శోధిస్తున్న దానిని ఎంచుకుంటే, అది మనకు దాని నోడ్ ఐడి సంఖ్య ఒకటని చూపిస్తుంది.
10:46 మనకు ఒక అంతర్గత పాత్ కావాలిస్తే, అనగా ఒక నోడ్ని జోడించే సామర్థ్యం ఉంటే అది / నోడ్ /యాడ్ ( /node/add) ఉండాలి.
10:56 దానిని హోమ్ పేజీకి లింక్ చేయాల్సి ఉంటే, అది front అవుతుంది. కానీ మనకు ఇక్కడ / ఫోరమ్ కావాలి, ఏదైతే ఫోరం కోసం ఒక లింక్ గా ఉండి.
11:08 సేవ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన వద్ద ఫోరమ్ కోసం ఒక లింక్ ఉంది.
11:14 సేవ్ క్లిక్ చేయండి. అది పని చేస్తుందా తెలుసుకొనుటకు రెండు సార్లు తనిఖీ చేయండి. అది నిజంగానే పని చేస్తుంది.
11:21 దానిని అర్థం చేసుకోవడానికి, దాని పై మరింత పని చేయండి.

దీనితో, మన మెనూ సిస్టం లో ఒక వ్యూని లేదా ఒక కంటెంట్ టైప్ కోసం మెనూ ఐటమ్ సృష్టించుట చాల తేలిక.

11:34 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
11:38 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: URL పాటర్న్ లను సెట్ చేయుట మరియు మెనూలను నిర్వహించుట.
11:59 ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
12:09 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
12:17 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
12:26 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
12:39 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig