C-and-Cpp/C2/First-C-Program/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00.01 | ఫస్ట్ C ప్రోగ్రాం పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00.05 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00.08 | ఒక సరళమైన C ప్రోగ్రాంను ఎలా రాయాలి ? |
00.11 | ఎలా కంపైల్ చెయాలి? |
00.13 | ఎలా ఎక్సెక్యూట్ చెయాలి? సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరివివరిస్తాను. |
00.18 | ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు ఉపయోగించినవి |
00.21 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం వర్షన్ 11.10 మరియు ఉబంటు పై gcc కంపైలర్ వర్షన్ 4.6.1 |
00.31 | ఈ తరగతిని అభ్యసించుటకు, |
00.33 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం మరియు ఎడిటర్ గురించితెలిసిఉండాలి. |
00.38 | విమ్(vim) మరియు జీఎడిట్(gedit) లాం టి ఎడియర్లు కలవు . |
00.42 | నేను ఈ తరగతిలో జీఎడిట్ని(gedit) ఉపయోగిస్తున్నాను. |
00.45 | తత్సంబంధిత తరగతుల కొరకు క్రింద ఇవ్వ బడిన మా వెబ్ సియిట్ను సంప్రదించగలరు. |
00.51 | C ప్రోగ్రామ్ ను ఎలా రాయాలో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను |
00.55 | Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం . |
01.07 | టెక్స్ట్ ఎడిటర్ను తెరచుటకు , ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి, |
01.12 | జీఎడిట్ స్పేస్ టాక్ డాట్ c స్పేస్ & గుర్తు (gedit talk.c &). |
01.20 | అంపె ర్సాండ్ (ampersand &) ప్రాంప్ట్ ని ఫ్రీ చేయుటకు ఉపయోగపడును. |
01.24 | అన్ని C ఫైల్లకు dot c(.c) అనే ఎక్స్ టెన్షన్ ఉంటుందని గమనించండి. |
01.30 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
01.32 | టెక్స్ట్ ఎడిటర్ తెరుచుకున్నది. |
01.36 | ఒక ప్రోగ్రాం రాయడాన్ని ప్రారంబిద్దాం. |
01.39 | డబుల్ స్లాష్ // స్లాష్ (Double slash space) టైప్ చేసి |
01.42 | My first C program అని టైప్ చేయండి. |
01.48 | ఇక్కడ డబల్ స్లాష్ , ఒక వరుస ను కామెంట్ చేయుటకు ఉపయోగిస్తారు. |
01.52 | కామెంట్లను ప్రోగ్రాం ఒరవడిని అర్థం చేసుకోనుటకు ఉపయోగిస్తారు. |
01.56 | ఇది డాక్యుమెంటేషన్ కొరకు ఉప్యోగపడుతుంది. |
01.58 | ఇది మనకు ప్రోగ్రాంగురించి విషయాలను తెలియచేస్తుంది. |
02.01 | డబల్ స్లాష్ ని (Slash) సింగల్ కామెంట్ లైన్ (Single Comment line) అంటారు. |
02.07 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
02.09 | హ్యాష్ (hash) #ఇన్-క్లూడ్(#include) స్పేస్ ఓపనింగ్ బ్రాకెట్, క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేయండి. |
02.17 | ముందుగా బ్రాకెట్లను పూర్తి చేసి తరువాత బ్రాకెట్లలో రాయడం అలవాటుచేసుకొనుట మంచిది. |
02.24 | ఇప్పుడు బ్రాక్సెట్ లో ఎస్ టి డి ఐ ఓ డాట్ హెచ్ (stdio.h) టైప్ చేయండి. |
02.30 | ఎస్ టి డి ఐ ఓ .హెచ్(stdio.h) ఒక హెడర్ ఫైల్. |
02.33 | ప్రతి ప్రోగ్రామ్ లో ఈ హెడర్ ఫైల్ ఉండాలి, ఎందుకంటే ప్రోగ్రామ్ స్టాండర్డ్ ఇన్పుట్/ఔట్పుట్ క్రియలను ఉపయోగిస్తుంది. |
02.41 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
02.43 | ఇంట్ స్పేస్ మెయిన్ ఓపనింగ్ బ్రాకెట్, క్లోసింగ్ బ్రాకెట్ int main() టైప్ చెయండి. |
02.50 | main ఒక విశేషమైన క్రియ. |
02.52 | ఇది, ఈ వరసనుండి ప్రోగ్రాం నెరవేర్చపడుతుందని సూచిస్తుంది. |
02.58 | ఓపనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్లను పరేంథసిస్(parenthesis) అంటారు. |
03.04 | వినియోగదారునకు main ఒక క్రియ అని తెలియపరుచుటకు మెయిన్ తరువాత పరేంథసిస్ (parenthesis) అనుసరిస్తుంది. |
03.11 | ఇక్కడ ఇంట్ మెయిన్ ఫంక్షన్ (int main function) ఆర్గ్యుమెంట్ (argument) లను స్వీకరించదు. |
03.15 | ఇది పూర్ణాంక (Integer) విలువను తిరిగిస్తుంది. |
03.18 | మనం డాటా టైప్ ల (Data Type) గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం. |
03.23 | main క్రియ గురించి ఇంకా ఎక్కువ తెలియపరిచే స్లయిడ్లను చూద్దాం. తదుపరి స్లయిడ్ కు వెళ్దాం. |
03.29 | ప్రతీయొక్క ప్రోగ్రాంకు main క్రియ ఉండితీరాలి. |
03.33 | ఒకటి కన్నా ఎక్కువ main క్రియ ఉండ రాదు |
03.36 | లేకపోతే కంపైలర్ ప్రోగ్రాం ఆరంభాన్ని కనిపెట్టలేదు. |
03.41 | ఖాళీ పరేంథసిస్, main కు ఆర్గ్యుమెంట్స్ (arguments) లేకపోవడం సూచిస్తాయి. |
03.46 | ఆర్గ్యుమెంట్స్ ఉద్దేశం గురించి వచ్చే తరగతులలో వివరంగా చర్చిద్దాం. |
03.52 | మరలా మన ప్రోగ్రాంకు తిరిగి వద్దామ్. |
03.55 | ఎంటర్ నొక్కండి. |
03.58 | కర్లి బ్రాకెట్ ను తెరవండి { |
04.00 | తెరుచుకొని ఉన్న కర్లి బ్రాకెట్ main క్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. |
04.04 | తదుపరి క్లోసింగ్ కర్లి బ్రాకెట్ } టైప్ చెయండి. |
04.08 | క్లోసింగ్ కర్లి బ్రాకెట్ main క్రియ ముగింపు ను సూచిస్తుంది. |
04.13 | ఇప్పుడు బ్రాకెట్ లో రెండు సార్లు ఎంటర్ నొక్కండి. |
04.16 | కర్సర్ను ఒక్క వరస పైకి తీసుకొనివెళ్ళండి. |
04.20 | ఇండెంటేషన్ కోడెను(code) చదవడానిక అనుకూలంగా చేస్తుంది. |
04.23 | ఇది త్వరగా తప్పులను కనిపెట్టడానికి సహాయప్డుతుంది. |
04.25 | అందుకె ఇక్కడ మూడు స్పేస్లు ఇద్దాం. |
04.29 | తరువాత printf ఓపెనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్ () టైప్ చేయండి. |
04.34 | printf, అవుట్పుట్ను టెర్మినల్ పై ముద్రిచుటకు ఉపయోగించే ఒక ప్రామాణిత క్రియ. |
04.39 | ఇక్కడ బ్రాకెట్స్ లోపు , డబల్ కొట్స్ లో, |
04.43 | printfలోని డబల్ కొట్స్ లో ఉన్నవన్నీ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతాయి. |
04.50 | టాక్ టు ఏ టీచర్ బ్యాక్ స్లాష్ ఎన్ ("Talk to a Teacher \n") అని టైప్ చేయండి. |
04.59 | బ్యాక్ స్లాష్ (\n ) కొత్త వరసను సూచిస్తుంది. |
05.03 | ఫలితంగా, printf క్రియ ఎక్జిక్యూషన్ అయిన తరువాత, కర్సర్ తదుపరి వరసకు వెళ్తుంది. |
05.10 | ప్రతిఒక C వాక్యము సెమీకోలన్ తోనే ముగించాలి. |
05.15 | అందుకే , దీన్ని వరస చివరిలో లో టైప్ చేయండి. |
05.19 | సెమికాలన్ ఒక వాక్యాన్ని ముగిస్తుంది. |
05.24 | ఇప్పుడు ఎంటర్ నొక్కి ఇక్కడ మూడు స్పేస్ లను ఇవ్వండి. |
05.27 | మరియు return స్పేస్ 0 సెమీకోలన్ (semicolon) టైప్ చేయండి.(return 0;) |
05.34 | ఈ వాక్యము పూర్ణ సంఖ్య (Integer) సున్నాను తిరిగి ఇస్తుంది. |
05.38 | ఈ క్రియ ఇంట్ (int) రకం కాబట్టి ఈ క్రియకు పూర్ణ సంఖ్యను తిరిగి ఇవ్వాలి. |
05.45 | రిటర్న్ వాక్యం, ఎక్సెకుటబల్ స్టేట్మెంట్ల ముగింపు సూచిస్తుంది. |
05.51 | తిరిగి ఇవ్వపడే విలువల గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం. |
05.55 | ఫైల్ సవే చేయుటకు Save బట్టన్ పై క్లిక్ చేయగలరు . |
06.00 | తరచుగా ఫైల్లను సేవ్ చేసే అలవాటు మంచిది. |
06.03 | ఇది ఆకస్మికంగా అయ్యే విద్యుత్ వైఫల్యాల నుండి రక్షిస్తుంది. |
06.05 | అప్లికేషన్ (application) క్రాష్(crash) అయ్యే సంధర్భంలో ఉపయోగపడుతుంది. |
06.10 | ప్రోగ్రాం ను కంపైల్ చేయుటకు టెర్మినల్కు తిరిగి రాగలరు. |
06.15 | gcc స్పేస్ talk.c స్పేస్ హైఫాన్ ఓ - o స్పేస్ myoutput (gcc talk.c -o myouput)అని టైప్ చేయండి. |
06.24 | gcc ఒక్ కంపైలర్. |
06.27 | talk.c మన ఫైల్ పేరు. |
06.30 | |
06.37 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
06.39 | ప్రోగ్రాం కంపైల్ అయిందని కనిపిస్తుంది. |
06.42 | ls స్పేస్ హైఫన్ lrt (ls -lrt) టైప్ చేస్తే , myoutput అనేది సృష్టించబడిన చివరి ఫైల్ అని తెలుస్తుంది. |
06.54 | ప్రోగ్రాం ను ఎక్సెక్యూట్ చేయుటకు డాట్ స్లాష్ మయ్ ఔట్ పుట్ (./myoutput) అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07.01 | ఇక్కడ ఔట్పుట్ Talk To a Teacher ప్రదర్శిపబడినది. |
07.06 | నేను ఇంతకు ముందు చేప్పినట్టు ఎక్సెక్యూట్ అయ్యే చివరి వాక్యం రిటర్న్. |
07.10 | రిటర్న్ స్టేట్మెంట్ తరువాత ఇంకేమీ ఎక్సెకూటే కాదు. పరీక్షించి చిచూద్దాం. |
07.15 | మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం, |
07.17 | రిటర్న్ వాక్యం తరువాత ఇంకొక printf వాక్యమును జతచేద్దాం. |
07.22 | ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి printf ఓపెనింగ్ బ్రాకెట్, క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేయండి. |
07.27 | బ్రాకెట్ లో డబల్ కొటేషన్ లో వెల్కం బ్యాక్ స్లాష్ ఎన్ టైప్ చేసి,చివరిలో సెమీకోలన్ టైప్ చేయండి. ("Welcome \n"); |
07.35 | సేవ్ (save) పై క్లిక్ చేయండి. |
07.37 | టెర్మినల్ కు వెనకొచ్చి కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
07.41 | అప్ యారో ఉపయోగించి ఇదివరకు ఉపయోగించిన కమాండ్స్ తెలుసుకోగలరు. |
07.46 | నేను ఇప్పుడు చేయబోయేది అదే. |
07.51 | రెండవ వాక్యము Welcome ఎక్సెక్యూట్ కాలేదని కనిపిస్తున్నది. |
07.58 | మన ప్రోగ్రాంకు తిరిగొద్దాం. |
08.00 | వెల్ కామ్ వాక్యని రిటర్న్ వాక్యము పైనరాద్దాం. |
08.06 | సేవ్ పైన క్లిక్ చేయండి |
08.09 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం, |
08.15 | రెండవ ప్రింట్ఎఫ్ (printf) వాక్యము వెల్కం (welcome) కూడా ఎక్సిక్యూట్ చేయపడినది. |
08.23 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం. |
08.29 | ఇక్కడ stdio.h లో డా ట్ పెట్ట లేదనుకోండి సవే పై క్లిక్ చేయండి. |
08.36 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం. |
08.41 | మనకిలా కనిపిస్తుంది. మన talk.c ఫైల్ లోని రెండవ వరసలో తీవ్రమైన తప్పుంది. |
08.48 | కంపైలర్ కు stdioh అనే పేరున్న హెడ్డర్ ఫైల్ దొరకలేదు. అందుకే no such file or directory ఎర్రర్ సూచన ఇస్తుంది. |
08.59 | మరియు కంపైలేషన్ ఆగిపోతుంది. |
09.03 | ఇప్పుడు తప్పును సరి చేయుటకు ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళి డాట్ (.) పెట్టండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
09.11 | కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చేద్డాం. చూశారా సరిపోయింది. |
09.19 | ఇంకొక సాధారణ తప్పు చూపిస్తాను. |
09.22 | ప్రోగ్రాంకు వెళ్దాం. |
09.25 | ఇక్కడ వాక్యం అత్యంలో సెమీ కోలన్ లేదనుకోండి. |
09.31 | సేవ్ పై క్లిక్ చేయండి. కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం. |
09.41 | మన talk.c ఫైల్ లో ఆరవ వరసలో తప్పుందని కనిపిస్తున్నది. ప్రింట్ ఎఫ్ (printf) ముందు సెమీకోలన్ ఆశిస్తుందని చూపిస్తుంది. |
09.51 | మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం. |
09.54 | నేను ముందే చేప్పినట్టు సెమీ కోలన్ వాక్యమును ముగించుటకు ఉపయోగపడుతుంది. |
09.58 | అందుకే ఐదవ వరస చివరిలో మరియు ఆరవ వరస ముందు వెతుకుతుంది. |
10.06 | ఇది ఆరవ వరస. |
10.09 | ఇది సెమీకోలన్(Semicolon) వేయుటకు చివరి స్థానం. |
10.12 | కంపైల ర్ ఆరవ వరసలో కూడా ఎర్రర్ సందేశాన్ని(Error message) ఇస్తుందని గుర్తుంచుకోండి. |
10.18 | ఇక్కడ సెమీకోలన్ పెడితే ఎమౌతుందని చూద్దాం. |
10.23 | సేవ్ పై క్లిక్ చేయండి. |
10.26 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
10.30 | చూశారా సరిపోయింది. |
10.32 | ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ఇక్కడ ఈ వరస చివర సెమీకోలన్ పెద్దాం. |
10.40 | సెమీ కోలన్ వరస చివర పెట్టుట అలవాటు కాబట్టి ఇలా చేద్దాం. |
10.46 | సేవ్ పై క్లిక్ చేయండి. |
10.49 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. పనిచేస్తున్నది. |
10.54 | ఇప్పుడు మన స్లైడ్స్ కి తిరిగి వెళ్దాం. |
10.57 | ఒక అసైన్మెంట్ లా |
10.59 | Welcome to the World of C ప్రదర్శింపబడుటకు ప్రోగ్రాం రాయండి. |
11.02 | printf లో \n స్లాష్ ఎన్ లేకపోతే పరిణామము ఎమౌతుందో చూడండి. |
11.08 | ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాము. |
11.12 | ఈ లింక్ వద్ద ఉన్న వీడియో చూడగలరు |
11.15 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ సరమ్శమును ఇస్తుంది. |
11.18 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
11.22 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, |
11.24 | స్పోకన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
11.28 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది. |
11.31 | మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org)కు రాయండి. |
11.38 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
11.42 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో నిర్వహించపడినది . |
11.47 | ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro )లో చూడగలరు. |
11.51 | ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి సెలవు తెసుకున్తున్నాను . |