BASH/C2/Nested-and-multilevel-if-elsif-statements/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం
00:12 Nested if-else మరియు
00:14 Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము.
00:17 దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము.
00:22 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:35 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:38 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:42 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:46 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.
00:52 మనం Nested if-else statement యొక్క execution ఫ్లోను అర్ధం చేసుకుందాం.
00:57 ఇక్కడ, ఒకవేళ condition1 True అయితే అప్పుడు condition2 మూల్యాంకనం జరుగుతుంది.
01:04 ఒకవేళ condition2 True అయితే, అప్పుడు statement1 అమలు అవుతుంది.
01:10 దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు అవుతుంది.
01:19 ఒకవేళ condition 1 False, అయితే అప్పుడు statement 3 అమలు అవుతుంది.
01:25 ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు అవుతుంది.
01:31 ఒక ఉదాహరణను చూద్దాం.
01:33 నేను కోడ్ ను nestedifelse.sh ఫైల్ లో వ్రాశాను.
01:38 నేను దానిని తెరుస్తాను.
01:40 ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:43 ఇది shebang line.
01:45 NAME వేరియబుల్ కు విలువ గా anusha ను కేటాయించాము.
01:50 PASSWORD వేరియబుల్ కు విలువ గా abc123 ను కేటాయించాము.
01:56 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
02:02 - (hyphen) p flag prompt ను ప్రదర్శిస్తుంది.
02:05 - (హైఫన్) p తరువాత string, terminal పై “Enter name:” అని ప్రదర్శించబడుతుంది.
02:11 myname, యూజర్ చే ఎంటర్ చేయబడు టెక్స్ట్, అంటే యూజర్ ఇన్ పుట్ ను నిల్వ చేసే వేరియబుల్.
02:18 మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్ myname మరియు NAME లను అంటే,
02:24 యూజర్ ఇన్ పుట్ మరియు Name వేరియబుల్ లో నిల్వ చేయబడిన విలువ అనగా anusha లను పోల్చుతుంది
02:31 ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు, if స్టేట్మెంట్ లోని మిగిలిన కోడ్ విశ్లేషించబడుతుంది.
02:38 read కమాండ్, ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదివి, mypassword వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
02:46 ఇక్కడ, - (hyphen) s flag silent mode కోసం.
02:49 అంటే, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శిపబడకుండా చేస్తుంది.
02:56 ఇక్కడ, మనకు కొన్ని if-else statement setలు ఉన్నాయి.
02:59 ఈ if-else statements మొదటి if లో వ్రాయబడ్డాయి.
03:05 రెండవ if స్టేట్మెంట్, mypassword మరియు PASSWORD వేరియబుల్స్ లను పోల్చుతుంది.
03:12 echo, if condition True అయినపుడు, terminal పై “Welcome” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
03:18 అంటే passwords ఒకదానినొకటి పోలిఉన్నవి
03:21 -e backslash escape యొక్క interpretation ను enable చేస్తుంది.
03:27 \n అంటే new line అని అర్ధం, అంటే Welcome స్ట్రింగ్ కొత్త లైన్ పై ముద్రించబడుతుంది.
03:35 if కండిషన్ True కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:42 అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:48 ఈ సందర్భంలో echo, “Wrong password” ను ప్రదర్శిస్తుంది.
03:53 fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
03:57 మన మొదటి if-else statement కు రండి.
04:01 ఒకవేళ myname మరియు NAME లోని విలువలు ఒకేలా లేకపోతే, అప్పుడు ఈ else స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
04:09 ఇది terminal పై “Wrong Name” అనే సందేశం ను echo చేస్తుంది.
04:14 fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
04:18 ఇప్పుడు, మీ కీబోర్డ్ నుండి ctrl + alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి, terminal window ని తెరవండి.
04:27 ఫైల్ ను executable చేయండి.
04:29 chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి.
04:38 dot slash nestedifelse.sh అని టైప్ చేయండి.
04:43 ఇది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు,
04:46 ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను
04:48 అంటే, Name మరియు Password లను వెరిఫై చేస్తుంది
04:52 ఇక్కడ prompt, Enter Name ను ప్రదర్శిస్తుంది
04:55 anusha అని టైప్ చేద్దాం.
04:57 ఈ condition True కాబట్టి, తరువాత if కండిషన్ అమలు చేయబడుతుంది.
05:02 ఇప్పుడు prompt Password అని ప్రదర్శిస్తుంది.
05:05 నేను పాస్ వర్డ్ గా abc123 ను టైప్ చేస్తాను.
05:10 పాస్ వర్డ్, PASSWORD వేరియబుల్ లోని విలువతో సరిపోతుంది.
05:15 కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:19 ఇప్పుడు script ను మళ్ళీ అమలు చేద్దాం.
05:21 up-arrow కీ ను నొక్కండి.
05:24 dot slash nestedifelse.sh కు వెళ్ళండి.
05:29 Enter నొక్కండి.
05:31 ఈ సారి, మనము అదే పేరును, వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేద్దాము.
05:37 కాబట్టి నేను పేరు గా anusha ను మరియు పాస్ వర్డ్ గా 123 ను ఎంటర్ చేస్తాను.
05:44 name విలువలు పోలిక కలిగి ఉంటాయి కానీ password విలువలు కావు
05:49 కాబట్టి, Wrong password అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
05:53 మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది.
06:01 మళ్ళీ ఒకసారి script ను execute చేద్దాం.
06:04 ఈ సారి మనము swati ను పేరుగా ఇస్తాము.
06:08 Wrong name అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
06:12 ఇది ఎందుకంటే swati పేరు కు, గతంలో డిక్లేర్ చేసిన విలువ anusha తో సరిపోయేలా లేదు.
06:19 control మొదటి if స్టేట్మెంట్ నుండి బయటకు వచ్చి, else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
06:25 ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది.
06:29 ఇప్పుడు మనం multilevel if-else statement ను చూద్దాం.
06:34 ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది,
06:40 ఒకవేళ condition1 False అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది.
06:46 ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది.
06:52 ఒకవేళ condition 2 False అయితే అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది.
06:58 ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది.
07:03 ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది.
07:10 ఒక ఉదాహరణని చూద్దాం.
07:12 నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉదాహరణ ఉంది.
07:14 నేను దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు multilevel hyphen ifelse dot sh అని గమనించండి.
07:23 కోడ్ ను చూద్దాం.
07:25 ఇది shebang line.
07:27 mystring అనేది యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేసే ఒక వేరియబుల్.
07:34 if కండిషన్, ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
07:39 - (hyphen) z string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
07:44 terminal పై man test అని టైప్ చేయండి. వివిధ string పోలికలను అన్వేషించండి.
07:51 ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే, ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది.
07:56 మొదటి elif కండిషన్ input string raj ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:03 కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో ప్రింట్ చేయబడుతుంది.
08:08 wildcard character, ఇన్పుట్ లో raj తో ఏదైనా పదం ఉంటే గుర్తించేలాచేస్తుంది.
08:15 తరువాత elif కండిషన్ input string jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:22 కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది.
08:27 పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది.
08:33 ఇది Sorry! Input does not contain either raj or jit అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:41 fi, multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది.
08:46 ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
08:48 తిరిగి మన terminal కు రండి.
08:51 chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి.
09:00 dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి.
09:06 ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ చేయబడతాం.
09:09 వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇచ్చి, ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం.
09:14 ముందుగా నేను ఏది టైప్ చేయకుండానే Enter నొక్కుతాను.
09:19 Nothing was Entered అనే సందేశం ప్రదర్శించబడింది.
09:22 control, multilevel if-else statement నుంచి బయటకు వస్తుంది.
09:28 నేను prompt ను క్లియర్ చేస్తాను.
09:30 వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
09:34 up-arrow కీ ని నొక్కండి.
09:36 dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి.
09:41 Enter నొక్కండి.
09:43 ప్రాంప్ట్ , Enter a Word అని ప్రదర్శిస్తుంది.
09:45 నేను abhijit అని టైప్ చేస్తాను.
09:48 “abhijit" contains word 'jit' అనే అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
09:53 ఇది మన కోడ్ లో control, మూడవ condition కు వెళ్ళిందని చూపిస్తుంది.
09:59 మొదటి రెండు కండిషన్ లు నిజం కాలేదు.
10:03 ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది.
10:07 వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి.
10:13 సారాంశం ను చూద్దాం.
10:15 ఈ ట్యుటోరియల్ లో మనం,
10:18 Nested if-else : Name మరియు Password లను వెరిఫై చేయడం గురించి మరియు
10:23 Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం.
10:28 ఒక అసైన్మెంట్ గా, సంఖ్య యొక్క వేర్వేరు విలువకు వేర్వేరు సందేశాలను అనగా
10:34 3 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ
10:37 లేదా 3 కు సమానం
10:39 లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు అవుట్ ఫుట్ ను ప్రదర్శించడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
10:42 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:45 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.
10:48 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:55 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:02 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:09 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:13 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:20 ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
11:26 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
11:31 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india