Advanced-Cpp/C2/Constructor-And-Destructor/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు కన్స్ట్రక్టర్స్ మరియు డిస్ట్రక్టర్స్ ఇన్ c++ కు స్వాగతం
00:07 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది.
00:09 కన్స్ట్రక్టర్స్ , కన్స్ట్రక్టర్స్ రకాలు
00:12 డిస్ట్రక్టర్స్ . దీనిని మనము కొన్ని ఉదాహారణలతో చేద్దాం.
00:17 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
00:20 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10
00:23 g++కంపైలర్ వర్షన్ 4.6.1
00:28 మనము కన్స్ట్రక్టర్స్ పరిచయముతో మొదలు పెడదాం.
00:31 కన్స్ట్రక్టర్అనునది ఒక మెంబర్ ఫంక్షన్
00:33 అది క్లాస్ పేరు ను తన పేరుగా కలిగి ఉంటుంది.
00:37 కన్స్ట్రక్టర్స్ ఎటువంటి విలువను రిటర్న్ చేయవు.
00:40 ఆబ్జక్ట్ సృష్టించబడినప్పుడు ఇది స్వయంచాలకంగా పిలువబడుతుంది.
00:44 కన్స్ట్రక్టర్స్ రకాలు
00:46 పరమైట్రైస్డ్ కన్స్ట్రక్టర్స్
00:49 కాపీ కన్స్ట్రక్టర్స్ మరియు
00:50 డీఫాల్ట్ కన్స్ట్రక్టర్స్
00:53 మనము డిస్ట్రక్టర్స్ గురించి చూద్దాం
00:56 డిస్ట్రక్టర్స్ అనేవి మెమొరీ కేటాయింపును రద్దుచేయుటకు ఉపయోగిస్తాము.
00:59 ఇవి ఆబ్జక్ట్ నాశనం అగునప్పుడు పిలువబడుతుంది.
01:02 డిస్ట్రక్టర్ ఎటువంటి పెరామీటర్లు తిసుకోదు మరియు ఎటువంటి రిటర్న్-టైప్ కలిగిఉండదు.
01:07 కన్స్ట్రక్టర్స్ మరియు డిస్ట్రక్టర్స్ లను ఒక ఉదాహరణ చూద్దాం.
01:11 నేను ఇప్పటికే ఒక ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచిన నా కోడ్ ను తెరుచుతున్నాను.
01:15 మన ఫైల్ పేరు cons hyphen dest dot cpp అని గమనించండి.
01:20 ఈ ప్రోగ్రాం నందు మనం కన్స్ట్రక్టర్స్ ను ఉపయోగించి రెండు సంఖ్యల కూడికను నిర్వహిస్తాము.
01:25 ఇప్పుడు ముందుగా కోడ్-ను వివరిస్తాను.
01:27 iostream అనేది మన headerfile
01:30 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
01:33 తరువాత మనకు a ,b అను integer వేరియబుల్స్ తో Addition అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్ కలదు.
01:38 ఇవి Addition అను క్లాస్ యొక్క ప్రైవేట్ మెంబర్స్ .
01:42 ఇక్కడ మనకు పబ్లిక్ specifier ఉన్నది.
01:44 తరువాత మనకు Addition అను కన్స్ట్రక్టర్ ఉంది.
01:47 కన్స్ట్రక్టర్ యొక్క పేరు క్లాస్ పేరు వలెనే ఉంటుంది.
01:52 మనము ఇక్కడ రెండు పేర్లు విలువలను పంపుతున్నాము.
01:54 ఇప్పుడు మనము ఒక డిస్ట్రక్టర్ నిర్వచించియున్నాము.
01:57 దీని కోసం మనము ఒక టిల్డ్ గుర్తు తరువాత డిస్ట్రక్టర్ పేరు వ్రాస్తాము.
02:02 add, ఇది ఒక పబ్లిక్ ఫంక్షన్
02:05 అది a మరియు b ల మొత్తంను రిటర్న్ చేస్తుంది.
02:08 ఇక్కడ మనము కన్స్ట్రక్టర్ ను స్కోప్ రెసొల్యూషన్ ఆపరేటర్ ను ఉపయోగించి పొందుతున్నాము.
02:12 a మరియు b లు ప్రైవేట్ మెంబర్స్
02:15 ప్రైవేట్ మెంబర్స్ ను పొందుటకు మనము x మరియు y లను ఉపయోగించుదుము.
02:19 తరువాత మనం డిస్ట్రక్టర్ ను access చేయుదుము.
02:21 ఇందులో మనం Memory Deallocation అని ప్రింట్ చేయుదుము.
02:25 ఇది మన main ఫంక్షన్
02:28 ఇక్కడ మనం Addition క్లాస్ కు ఒక ఆబ్జక్ట్ obj ను సృష్టిద్దాం.
02:32 తరువాత మనం 3 మరియు 4 అను రెండు ఆర్గుమెంట్స్ పంపుతాము.
02:36 3, x నందు మరియు 4, y నందు స్టోర్ (నిల్వ) చేయబడును.
02:40 అనగా a యొక్క విలువ 3 మరియు b యొక్క విలువ 4 అవుతుంది.
02:45 ఆర్గుమెంట్స్ కలిగినటువంటి కన్స్ట్రక్టర్ ను parameterized constructor అని అందురు.
02:50 కాబట్టి ఇది parameterized కన్స్ట్రక్టర్.
02:53 ఇక్కడ మనం add ఫంక్షన్ ను obj ను ఉపయోగించి పిలుస్తున్నాము.
02:58 మరియు మనం వాటి మొత్తం ను ప్రింట్ చేస్తున్నాం.
03:00 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్
03:02 ఇప్పుడు ప్రోగ్రాంను అమలు చేద్దాం.
03:05 Ctrl , Alt మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం.
03:12 కంపైల్ చేయుటకు g++ space cons hyphen dest dot cpp space hyphen o space cons అని టైప్ చెయ్యండి.
03:21 ఎంటర్ ను నొక్కండి.
03:23 dot slash cons అని టైప్ చెయ్యండి.
03:25 ఎంటర్ ను నొక్కండి.
03:27 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
03:29 Sum is 7 మరియు Memory Deallocation
03:33 ఇప్పుడు Default constructors ను ఒక ఉదాహరణ తో చూద్దాం.
03:37 తిరిగి ప్రోగ్రాం కు వద్దాం.
03:39 నేను ఇప్పటికే కోడ్ ను టైప్ చేసి ఉంచాను.
03:41 మన ఫైల్ పేరు default dot cpp అని గమనించండి.
03:45 ఒకవేళ క్లాస్ నందు కన్స్ట్రక్టర్ తెలియచేసి ఉండకపోతే ,
03:48 అప్పుడు కంపైలర్ డిఫాల్ట్ కంస్ట్రక్టర్ ను తీసుకొంటుంది.
03:53 ముందుగా కోడ్-ను వివరిస్తాను.
03:55 iostream అనేది మన headerfile
03:58 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
04:02 తరువాత Subtraction అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్ కలదు.
04:04 తరువాత మనకు public గా డిక్లేర్ చేయబడ్డ a ,b అను వేరియబుల్స్ కలవు.
04:08 ఇక్కడ మనకు sub అను ఫంక్షన్ కలదు.
04:10 తరువాత మనం int a మరియు int b అను రెండు ఆర్గుమెంట్స్ పంపాము.
04:15 ఇది a ,b లమధ్య వ్యత్యాసము ను రిటర్న్ చేస్తుంది.
04:19 ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్
04:22 ఇక్కడ మనము కన్స్ట్రక్టర్ ను స్కోప్ రెసొల్యూషన్ ఆపరేటర్ ను ఉపయోగించి పొందుతున్నాము.
04:27 ఇది మన main ఫంక్షన్
04:29 దీనియందు x అను వేరియబుల్ ను define చేసాము.
04:34 ఇక్కడ మనం Subtraction క్లాస్ కు s అనే ఆబ్జక్ట్ ను సృష్టించాం.
04:39 ఇక్కడ మనం sub ఫంక్షన్ ను s object ను ఉపయోగించి పిలుస్తున్నాము.
04:42 మరియు 8 మరియు 4 అను రెండు ఆర్గుమెంట్స్ ను పంపండి.
04:47 వచ్చిన సమాధానం x నందు నిల్వ చేయబడును.
04:51 మరియు ఇక్కడ డిఫరెన్స్ విలువ ను ప్రింట్ చేద్దాం.
04:54 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
04:56 ఇప్పుడు ప్రోగ్రాంను అమలు చేద్దాం.
04:58 తిరిగి టెర్మినల్ కు వెళ్దాం.
05:01 కంపైల్ చేయుటకు g++ space default dot cpp space hyphen o space def అని టైప్ చెయ్యండి.
05:09 ఎంటర్ ను నొక్కండి.
05:10 dot slash defఅని టైప్ చెయ్యండి.
05:12 ఎంటర్ ను నొక్కండి.
05:14 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
05:16 Difference is 4
05:18 తిరిగి ప్రోగ్రాం కు వద్దాం.
05:20 ఇక్కడ మనం ఒక ఫంక్షన్ కు పంపిన ఆర్గుమెంట్ లను చూడవచ్చు.
05:25 మరియు మన గత ఉదాహరణలో మనం object కు ఆర్గుమెంట్స్ పంపించాము.
05:30 మరియు ఇక్కడ object ను ఉపయోగించి ఆర్గుమెంట్స్ పంపించాము.
05:34 ఇప్పుడు మన స్లైడ్ కు తిరిగి వెళ్దాం.
05:38 ఇప్పటి వరకు మనం నేర్చుకొన్నవి సంగ్రహంగా,
05:41 కన్స్ట్రక్టర్ ఉదా Addition.
05:43 పరమైట్రైస్డ్ కన్స్ట్రక్టర్స్ ఉదా Addition obj(3,4);
05:48 డిస్ట్రక్టర్ ఉదా ~Addition
05:52 డీఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఉదా Subtraction
05:55 అసైన్మెంట్ గా Division పేరుతో ఒక క్లాస్ ను సృష్టించండి.
05:59 ఆ క్లాస్ కు కన్స్ట్రక్టర్ ను సృష్టించండి.
06:01 మరియు రెండు సంఖ్యల మధ్య భాగహారం కొరకు divide ఫంక్షన్ ను సృష్టించండి.
06:06 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
06:09 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
06:11 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:16 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం - స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
06:21 ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
06:25 మరిన్ని వివరాలకు , దయచేసి
06:27 contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
06:31 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
06:36 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
06:42 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
06:47 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india