Digital-Divide/D0/First-Aid-on-Snake-Bite/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:00, 15 April 2014 by Chaithaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time' Narration


00:02 మీలో చాలా మందికి మీ గ్రామంలోని ఈ దృశ్యం తెలిసి వుండాలి. ఒక బహిరంగ ప్రదేశంలో పిల్లల గుంపు ఒకటి ఆడుకుంటుంది
00:11 ఈ బాలుడిని గమనించండి. బంతి వెంట తరుముతూ


00:13 దగ్గరలోని దట్టమైన ప్రదేశంలో ప్రవేశించాడు
00:16 ఒక పామును చూసాడు
00:18 చాల తక్కువ సమయంలో అది దాగి వున్న ప్రదేశం నుండి బయటకు వచ్చింది
00:22 భయంతో ఆ బాలుడు ఒక రాయిని విసిరి ఆ పామును తరమడానికి ప్రయత్నించాడు
00:27 ఆ పాము అక్కడి నుండి వెళ్ళలేదు


00:30 అందుకు బదులుగా ఆ బాలుడి పాదం పై కాటు వేసింది
00:34 ఆ బాలుడు సహాయం కోసం కేకలు వేసాడు


00:36 సాయం చేయడానికి వచ్చిన స్నేహితులు ఆ బాలుడి పాదం ఫై రెండు ఎర్రని మచ్చలను గమనించి
00:43 బాలుడి ని పొదలోంచి బయటకు తీసుకొచ్చారు
00:46 అంతా గందరగోలంగా వుంది


00:48 ప్రథమ చికిత్స గురించి ఒక్కొక్క బాలుడు ఒక్కో విదంగా అభిప్రాయము ఇస్తున్నాడు
00:53 పాము కాటు పై ప్రథమ చికిత్స తెలిసివుండడం ఎంత ముక్యమో ఇక్కడ వస్తుంది
00:58 పాము కాటు పై ప్రథమ చికిత్స గురించి చెప్పే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
01:03 ఈ ట్యుటోరియల్ లో,
01:05 * ప్రథమ చికిత్స యొక్క ప్రాముక్యతను, మరియు
01:08 * పాముకాటు లో సరైన ప్రథమ చికిత్స ఎలా ఇవ్వాలో చూద్దాం


01:12 ప్రథమ చికిత్స యొక్క ఆదేశం లను చెప్పే ముందు,


01:16 పిల్లల గుంపు బాలుడి బతికించడానికి ఏమి చేసారో పునర్విచారణ చేద్దాం
01:20 బాలుడి ని పడుకో పెట్టారు


01:23 బాలుడి ని ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి పెద్దల సహాయం కోరారు


01:29 తర్వాత వాళ్ళు గాయం చుట్టూ ఒక గుడ్డను కట్టారు
01:33 ఇది సరైన ప్రథమ చికిత్స నా ?
01:36 అవును ! ఒక కోణం లో ఇది సరైనదే


01:40 ఈ సందర్భం లో ఆస్పత్రి దూరం లో లేదు
01:43 అందువల్ల ఆ బాలుడి కి వైద్యసంబంధమైన చికిత్స కావాల్సిన సమయంలో లభించినది
01:47 పాముకాటు కు ఇచ్చే సరైన ప్రథమ చికిత్స -
01:52 సమమైన ఉపరితలము పై పడుకో పెట్టాలి
01:56 ప్రభావం అయిన ప్రదేశాన్ని గుడ్డతో చుట్టాలి


02:00 ఈ ప్రథమ చికిత్స యొక్క ముక్య ఉద్దేశం విషం శరీరమంతా వ్యాపించకుండా అడ్డుకోవడం
02:08 మరి మనం గాయం చుట్టూ గుడ్డను ఎలా చుట్టాలి ?
02:11 కాలు యొక్క పై భాగం నుండి గుడ్డను చుట్టడం మొదలు పెట్టి కింది వరకు రావాలి
02:16 ఆ వ్యక్తిని ,ఇంకా చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రి కి తొందరగా తరలించండి
02:21 ఈ విధంగా, సరైన సమయంలో ఇచ్చే ప్రథమ చికిత్స చాల నష్టములను నివారించును
02:27 గుర్తుపెట్టుకోండి, తప్పైన ప్రథమ చికిత్స స్థితి ని ఇంకా చెడ్డది గా చేస్తుంది
02:32 పాముకాటు లో చేయవలసినవి
02:35 - ముందుగా బాధితుడిని పడుకో పెట్టాలి
02:38 - గుడ్డను చుట్టే టపుడు కొంచెం వొత్తాలి


02:42 పాము కాటు లో చేయకుడనివి
02:45 - గాయం చుట్టూ చర్మాన్ని లేదా మాంసమును కోయకూడదు
02:50 - గాయం పై కానీ దాని చుట్టూ కానీ మంచు గడ్డ పెట్టకూడదు
02:53 - మనిషిని విద్యుచ్ఛక్తిచే అఘాతము కల్పించ కూడదు
02:57 - కాటు నుంచి రక్తమును లేక విషము ను కానీ పీల్చకూడదు. మరియు
03:03 - గుడ్డను చాలా గట్టిగా కట్టకూడదు. ఇది మాంసమును కుళ్ళజేయును
03:07 ఈ వీడియో, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ లోని డిజిటల్ డివైడ్ ప్రథమ యత్నం వారధి లో ఒక భాగం
03:13 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి
03:16 http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి
03:22 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగా చెప్పును
03:25 ఒక వేల మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు
03:29 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది
03:34 ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది
03:38 మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి
03:44 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
03:48 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
03:55 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
04:02 ఆనిమేషన్ లో తోడ్పడిన వారు ఆర్తి. ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .

ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya