Health-and-Nutrition/C2/Importance-of-breastfeeding/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 22:32, 30 April 2021 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:00 తల్లి పాలివ్వడం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలిపే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని గురించి నేర్చుకుంటాము:
00:09 తల్లి పాలివ్వడం యొక్క ప్రాముఖ్యత.
00:12 తల్లి పాలివ్వడం వలన పిల్లలకు మరియు తల్లులకు కలిగే ప్రయోజనాలు.
00:17 తల్లి పాలివ్వడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ.
00:19 ఇది ఓక బిడ్డ పుట్టినప్పటి నుండి ప్రారంభమయ్యి బిడ్డ యొక్క రెండవ పుట్టినరోజు వరకు లేదా అంతకుమించి కొనసాగుతుంది.
00:26 తల్లి పాలివ్వడం అనేది శిశువుకు జీవితం యొక్క ఒక ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని ఇస్తుంది.
00:31 ఇది తల్లి మరియు బిడ్డ యొక్క తక్షణ మరియు భవిష్యత్తు ఆరోగ్యాన్నీ నిర్ణయిస్తుంది.
00:38 దాని యొక్క ప్రయోజనాలు అనేవి వారిద్దరికీ జీవితకాలం పాటు ఉంటాయి.
00:43 పోషకాహార లోపం ఉన్న తల్లులు కూడా తమ బిడ్డకు తల్లిపాలు ఇవ్వగలరు.
00:49 గర్భధారణ సమయంలో, రొమ్ము పరిమాణం అనేది పెరుగుతుంది.
00:53 పాలను ఉత్పత్తి చేసే కణజాలాల యొక్క సంఖ్య పెరగడమే దీనికి కారణం.
00:59 ఏమైనప్పటికి, రొమ్ముల యొక్క తుది పరిమాణం ఉత్పత్తి అయ్యే పాలమొత్తాన్ని ప్రభావితం చేయదు.
01:07 బిడ్డ పుట్టిన 1 గంటలోనే తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించాలి.
01:13 ఇది తల్లి పాల యొక్క సరఫరాను వృద్ధి చేస్తుంది.
01:17 అందువల్ల, ప్రత్యేకంగా తల్లి పాలివ్వడం అనేది కూడా మొదటి 6 నెలల్లోనే పెరుగుతుంది.
01:24 తల్లి పాలివ్వడాన్ని 2 సంవత్సరాలకు మించి కొనసాగించడానికి ఇది మరింత సహాయపడుతుంది.
01:31 పుట్టిన 1 గంటలోనే తల్లి పాలివ్వబడిన శిశువులలో, పుట్టిన నెలలోపలి (నియోనాటల్) మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుంది.
01:39 తల్లిపాలు ఇవ్వడాన్ని ఆలస్యం చేయడం అనేది నవజాత శిశువులలో వ్యాధుల యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది.
01:47 ఉదాహరణకు, డయాబెటిస్, ఊబకాయం మరియు అధిక రక్తపోటు వంటివి.
01:53 తల్లి పాలివ్వడాన్ని ముందుగా ప్రారంభించడం వల్ల శిశువు కొలొస్ట్రమ్ ను పొందుతుందని కూడా నిర్దారణ అవుతుంది.
02:00 కొలొస్ట్రమ్ అంటే ప్రసవించిన తరువాత తల్లి నుండి స్రవించే మొదటి పాలు.
02:07 శిశువుల కొరకు, ఇది శక్తి మరియు పోషకాల యొక్క ప్రాధమిక వనరు.
02:13 ముఖ్యంగా వారి జీవితాల యొక్క ప్రారంభ రోజుల్లో వారికి ఇది చాలా ముఖ్యం.
02:20 ఇది పెద్ద సంఖ్యలో వ్యాధి సంక్రమణ-పోరాట మూలకాలను కలిగి ఉంటుంది,
02:24 వైటమిన్ A మరియు
02:26 మంచి కొవ్వులు.
02:28 కొలోస్ట్రమ్ లో ఎదుగుదల మరియు రక్షణ కారకాలు కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి.
02:35 కొలొస్ట్రమ్ లో పాత మలాన్ని వేగంగా తొలగించడానికి సహాయపడే గుణం ఉంది.
02:42 కొలొస్ట్రమ్ యొక్క వివరణాత్మక ప్రయోజనాలు అనేవి మరొక ట్యుటోరియల్‌లో చర్చించబడ్డాయి.
02:48 మరిన్ని వివరాల కోసం దయచేసి వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి.
02:52 ప్రత్యేకంగా తల్లి పాలను మాత్రమే ఇవ్వడాన్ని మొదటి 6 నెలల వరకు చేయాలి అని గుర్తుంచుకోండి.
02:59 తల్లి పాలు అనేవి ఒక ప్రత్యేకమైన సహజసిద్ధ ఆహారం, ఇది నకిలీ చేయబడదు.
03:05 శిశువుకు 6 నెలలు పూర్తికాగానే, పరిపూరకరమైన ఆహారాన్నిఇవ్వడం తప్పకుండా ప్రారంభించాలి.
03:12 దాన్ని తల్లి పాలివ్వడంతో పాటుగా ఇవ్వాలి.
03:16 తల్లి పాలివ్వడాన్ని 2 సంవత్సరాలు వచ్చేవరకు లేదా అంతకు మించి కొనసాగించాలి.
03:22 శిశువులకు తల్లి పాలివ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
03:27 పోషకాలు మరియు తల్లి పాల యొక్క మేళనం అనేవి పిల్లలకు జీర్ణం కావడానికి అనువైనవి.
03:34 తల్లి పాల ద్వారా పిల్లలు యాంటీబాడీస్ ని పొందుతారు.
03:38 యాంటీబాడీస్ అనేవి శిశువు యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి మరియు అంటువ్యాధుల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
03:46 అంతేకాకుండా, ఇది శిశువులలో అలెర్జీ ప్రతిచర్యలను నివారిస్తుంది.
03:52 తల్లి పాలు ఎదుగుదల కారకాలను కూడా కలిగి ఉంటాయి.
03:56 శిశువు యొక్క ప్రేగు యొక్క లైనింగ్ అభివృద్ధిలోనూ ఇవి సహాయపడతాయి.
04:02 ఇది శిశువు యొక్కప్రేగులో మంచి బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను వృద్ధిచేస్తుంది.
04:08 ఆవిధంగా, ఇది ప్రేగుల్లో మంట మరియు అందువ్యాధి నుండి శిశువులను రక్షిస్తుంది.
04:16 అదేవిధంగా, ఇది శరీరంలోని అన్ని ఇతర అవయవాల యొక్క అభివృద్ధి లోను సహాయపడుతుంది.
04:22 తల్లిపాలు అతిసారం (డయేరియా) యొక్క ప్రమాదాన్నీ తగ్గిస్తాయి.
04:27 ఇంకా ఇతర ప్రయోజనాలు అనేవి చెవి ఇన్ఫెక్షన్లు
04:31 మరియు దంత క్షయం వంటివి రాకుండా నివారించడం.
04:33 దవడల అభివృద్ధి మరియు దంతాల యొక్క సరైన అమరిక అనేవి మరికొన్ని ఉదాహరణలు.
04:41 తరువాతి జీవితంలో కొన్ని వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం కూడా తగ్గుతుంది.
04:48 ఉదాహరణకు, డయాబెటిస్, ఊబకాయం, అధిక రక్తపోటు మరియు బ్లడ్ క్యాన్సర్.
04:56 ఉబ్బసం (ఆస్తమా), న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల యొక్క ప్రమాదం కూడా తగ్గుతుంది.
05:04 తల్లి పాలివ్వడం అనేది 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలను తగ్గిస్తుంది.
05:14 తల్లి పాలు తాగే శిశువులలో ఎటాపిక్ ఎగ్జిమా వచ్చే ప్రమాదం కూడా తక్కువే.
05:22 ఎగ్జిమా అనేది అనేది ఒక స్థితి అందులో చర్మం ఎర్రగా మారి, దురద మరియు కఠినమైన పాచెస్‌ను అభివృద్ధి చేస్తుంది.
05:30 తల్లిపాలు తాగే పిల్లలు అనారోగ్యం మరియు ఇన్ఫెక్షన్ల కొరకు ఆసుపత్రిలో చేరే అవకాశం కూడా తక్కువే.
05:39 తల్లిపాలు తాగే పిల్లలు వారి ఆకలిపై వారు మంచి నియంత్రణను కలిగి ఉంటారు.
05:44 తల్లి పాలు అనేవి ఆకలిని నియంత్రించే హార్మోన్లను కలిగి ఉంటాయి.
05:48 ఇటువంటి హార్మోన్లు అనేవి పిల్లలకు వారి శరీరం యొక్క ఆకలి మరియు సంతృప్తి సంకేతాలను వినడానికి సహాయపడతాయి.
05:57 తల్లి పాలు తాగని పిల్లలలో ఈ స్వీయ నియంత్రణ అనేది చెదిరిపోతుంది.
06:03 చివరికు ఇది అతిగా ఆహరం తీసుకోవడానికి దారితీస్తుంది,
06:07 ఊబకాయం

ఇంకా ఆ తర్వాత డయాబెటిస్.

06:11 తల్లి పాలివ్వడం అనేది మెదడు పైన కూడా ప్రభావాన్నిచూపుతుంది.
06:15 తల్లి పాలలో మెదడు అభివృద్ధికి మరియు పరిపక్వతకు సహాయపడే భాగాలు ఉన్నాయి.
06:23 తల్లిపాలను తాగిన పిల్లలకు ఎక్కువ ఐక్యూ మరియు ఇతర నైపుణ్యాలు ఉంటాయి.
06:28 తల్లి పాలు అనేవి నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.
06:34 రొమ్ము వద్ద పాలను పీల్చటం అనేది అటువంటి పిల్లలలో శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది.
06:40 ఇటవంటి పిల్లలకు ప్రేగుల్లో అంటువ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది.
06:47 ఉదాహరణకు: డయేరియా మరియు నెక్రోటైజింగ్ ఏంటిరోకోలైటీస్ దీనిని NEC అని పిలుస్తారు.
06:56 NEC అనేది అంటువ్యాధి మరియు ప్రేగులు దెబ్బతినడం వలన సంభవించే ఒక తీవ్రమైన పరిస్థితి.
07:05 తల్లిపాలు అనేవి నెలలు నిండకుండా పుట్టిన శిశువులను ఈ అంటువ్యాధి నుండి రక్షిస్తాయి.
07:11 నెలలు నిండకుండా పుట్టిన శిశువుల యొక్క తల్లుల నుండి వచ్చే పాలలో అందువ్యాధులతో పోరాడే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.
07:19 అవి పేగులను రక్షించి వృద్ధిని పెంపుచేసే కారకాలను కూడా కలిగి ఉంటాయి.
07:25 అధిక సాంద్రత కలిగిన నిర్దిష్ట అమైనో ఆమ్లాలు మరియు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది.
07:33 నెలలు నిండకుండా పుట్టిన శిశువులలో పెరుగుదల కొరకు ఈ అమైనో ఆమ్లాలు అనేవి అవసరం.
07:40 ఆవిధంగా, తల్లి పాలు అంటువ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడతాయి.
07:43 మరియు బరువు కూడా పెరుగుతుంది.
07:46 తల్లిపాలు నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం వలన కలిగే దీర్ఘకాలిక సమస్యలనూ తగ్గిస్తాయి.
07:52 ఉదాహరణకు, ఊరితిత్తులు మరియు కళ్ళ యొక్క సమస్యలు.
07:57 అందువల్ల, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు తల్లి పాలను ఎక్కువ మొత్తంలో పొందాలి.
08:04 కంగారూ మదర్ కేర్ దీన్ని KMC అని కూడా పిలుస్తారు, ఇది కూడా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ఉపయోగపడుతుంది.
08:12 ఇది వారిలో తల్లి పాలిచ్చే ఫ్రీక్వెన్సీని మరియు వ్యవధిని మెరుగుపరుస్తుంది.
08:18 KMC సమయంలో తల్లీబిడ్డల చర్మాలను తాకించడం అనేది శిశువు యొక్క శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది.
08:27 ఇది శిశువు యొక్క హృదయ స్పందన మరియు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది.
08:35 కంగారూ మదర్ కేర్ చేసే విధానం అనేది మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
08:42 పిల్లలకే కాకుండా, తల్లి పాలివ్వడం అనేది తల్లులకు కూడా మేలుచేస్తుంది.
08:48 ఈ ప్రయోజనాలు తక్షణమైనవి మరియు దీర్ఘకాలికమైనవి.
08:53 ప్రసవం తర్వాత వెంటనే తల్లి పాలివ్వడం వలన యోని రక్తస్రావాన్ని తగ్గించడానికి అది సహాయపడుతుంది.
08:59 అది శరీరంలో ఆగ్జిటోసిన్ హార్మోన్ యొక్క స్థాయిని పెంచుతుంది.
09:05 ఇది మావి శరీరం నుండి బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది.
09:09 దాని ఫలితంగా గర్భాశయ సంకోచాలు మెరుగుపడతాయి మరియు యోని రక్తస్రావం తగ్గుతుంది.
09:17 అలా, తల్లులలో రక్తహీనతను నివారించవచ్చు.
09:21 తల్లిపాలను ఇవ్వడం వలన తల్లులకు మానసిక ప్రయోజనాలూ ఉన్నాయి.
09:27 తరచుగా ఒకరి చర్మంతో మరొకరి చర్మాన్ని తాకించడం అనేది తల్లి మరియు ఆమె బిడ్డల మధ్య బంధాన్నిపెంచుతుంది.
09:35 ఈ బంధం అనేది తల్లిని పాలివ్వటానికి సిద్దమయ్యేలా చేస్తుంది.
09:39 అంతిమంగా, ఇది తల్లులలో ప్రసవానంతర ఒత్తిడి మరియు నిరాశను తగ్గిస్తుంది.
09:46 తల్లి పాలివ్వడం అనేది తల్లుల కొరకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.
09:51 ఇది తరువాతి వయస్సులో ఎముకలు బలహీనపడకుండా నిరోధిస్తుంది.
09:56 రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
10:02 గర్భధారణ సమయంలో, మహిళలకు అంతర్గత శరీర అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుంది.
10:08 పొట్ట, పేగులు మరియు కాలేయం వంటి వాటి చుట్టూ.
10:12 ఈ కొవ్వు అనేది బొడ్డు లేదా పొత్తికడుపు ప్రాంతంలో దాగి ఉంటుంది.
10:18 అధికంగా ఉండే ఈ కొవ్వు ఫలితం ఇన్సులిన్ నిరోధకత,
10:23 డయాబెటిస్ మరియు

ఊబకాయం.

10:26 తల్లిపాలివ్వడం అనేది మహిళల్లో ఈ కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
10:31 ఇది ఊబకాయం, రక్తపోటు మరియు గుండె జబ్బుల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
10:37 ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక సహజ జనన నియంత్రణగా పనిచేస్తుంది.
10:44 ఏమైనప్పటికీ, ప్రసవించిన 6 వారాల తర్వాత భార్యాభర్తలు గర్భనిరోధకాన్ని ఉపయోగించాలి.
10:50 ఇది రెండు గర్భధారణల మధ్య దూరాన్ని ఉంచడంలో సహాయపడుతుంది.
10:56 తల్లి పాలివ్వడం వల్ల కొన్ని ఆర్థిక ప్రయోజనాలూ ఉన్నాయి.
11:00 తల్లి పాలు ఉచితంగా లభిస్తాయి మరియు శిశువు కొరకు ఉత్తమమైనవి.
11:07 దీనికి ఫార్ములా పాలు, సీసాలు మరియు ప్లాస్టిక్ ఉరుగుజ్జులు (పాలపీకలు) కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని ఉండదు.
11:14 తల్లి పాలను తయారు చేయడానికి అదనపు సమయాన్ని కేటాయించాల్సిన పని కూడా లేదు.
11:20 తల్లి పాలను తయారు చేయడానికి వేడి నీరు, పాత్రలు మరియు కాచడానికి ఇంధనం అవసరం లేదు.
11:28 మురికి నీరు లేదా మురికిగా ఉండే పాల సీసాలు శిశువును అనారోగ్యానికి గురి చేస్తాయి.
11:35 ఈ రకంగా, భవిష్యత్తులో మున్ముందు రోజుల్లో తల్లి మరియు బిడ్డల ఆరోగ్య సంరక్షణ కొరకు ఖర్చులూ తక్కువగా ఉంటాయి.
11:42 తల్లి పాలివ్వడం వల్ల అనేక పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
11:47 మొదటగా, తల్లి పాలివ్వడంలో ఎటువంటి ప్యాకింగ్ చేయడం లేదా రవాణా చేయడం ఉండదు.
11:54 ఇది ఎటువంటి వ్యర్థాలను ఉత్పత్తి చేయదు,
11:57 పొగ లేదా

శబ్దం

12:00 ఇది ప్రపంచ వనరులను మరియు శక్తిని ఆదా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
12:06 అందువలన, తల్లిపాలివ్వడం అనేది ఉత్తమమైన ఎంపిక.
12:10 బిడ్డ పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు బిడ్డ తల్లిపాలు తాగేలా తల్లులు చూడాలి.
12:18 ఇది శిశువు మరియు అలాగే తల్లి యొక్క మంచి ఆరోగ్యం కోసం.
12:24 తల్లి పాలివ్వటానికి తల్లిపాలిచ్చే సరైన పద్దతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
12:30 దానితో పాటుగా, కుటుంబం నుండి తగిన సహాయం మరియు మార్గదర్శకత్వం కూడా అవసరం.
12:38 ఇవన్నీఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్ లో వివరించబడ్డాయి.
12:44 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Simhadriudaya