QGIS/C2/Coordinate-Reference-Systems/Telugu
| Time | Narration |
| 00:01 | QGIS లో Coordinate Reference System పై ఈ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం. |
| 00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి, |
| 00:10 | QGIS లో projections కు లేయర్స్ ను జోడించడం. |
| 00:15 | layers కొరకు metadata సమాచారాన్ని చూడడం. |
| 00:19 | ఎంచుకున్న ఫీచర్స్ ను ఒక layer నుండి ఒక కొత్త layer కు సేవ్ చేయడం. |
| 00:24 | వేర్వేరు ప్రొజెక్షన్స్ (స్క్రీన్ పైన ప్రదర్శనలు) ను కలిపి దానియొక్క డేటా లేయర్స్ ను రీ -ప్రాజెక్ట్ చేయడం మరియు ఓవర్ లే (అతివ్యాప్తి) చేయడం. |
| 00:30 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను,
Ubuntu Linux OS వర్షన్ 16.04, QGIS వర్షన్ 2.18 |
| 00:42 | ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు GIS ను గురించిన జ్ఞానం కావాలి. |
| 00:49 | దయచేసి ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్ని చూడండి. |
| 00:54 | Coordinate Reference Systems గురించి, |
| 00:57 | Coordinate Reference Systems అనేది రెండు రకాలు,
Geographic coordinate system, మరియు Projected Coordinate System |
| 01:06 | చాలా విస్తృతంగా ఉపయోగించే geographic coordinate system అనేది WGS 84. |
| 01:12 | బాగా ఎక్కువగా ఉపయోగించే projected coordinate system అనేది UTM. |
| 01:18 | ఇక్కడ నేను QGIS ఇంటర్ఫేస్ ను తెరిచాను. |
| 01:23 | canvas పైన, దేశ పరిపాలన సరిహద్దులతో ప్రపంచ పటం ప్రదర్శించబడుతుంది. |
| 01:30 | మ్యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు QGIS లో దాన్ని ఎలా చూపించాలి అనే ప్రదర్శన ముందస్తు అవసరాల పైన ట్యుటోరియల్ లో వివరించబడింది. |
| 01:39 | దయచేసి ముందస్తు అవసరరాల పై ట్యుటోరియల్ని చూడండి. |
| 01:43 | ఈ ఫైల్‌ను Code files లింక్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
| 01:48 | canvas యొక్క ఎడమ భాగం పైన, ఒక layer గా ప్రపంచ పటం యొక్క ఫైల్ పేరుతో Layers Panel ను మీరు చూస్తారు. |
| 01:57 | Layers Panel అనేది డిఫాల్ట్ గా ఇక్కడ ఎనేబుల్ అయింది. |
| 02:02 | ఒకవేళ కాకపోతే, మనం Layers Panel యొక్క View మెనుని ఉపయోగించి ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు. |
| 02:08 | menu బార్‌లోని View మెనుపై క్లిక్ చేయండి.
క్రిందికి స్క్రోల్ చేసి, Panels ఎంపికను ఎంచుకోండి. |
| 02:16 | సబ్ మెను అనేది panel పేర్ల యొక్క ఒక లిస్ట్ ను చూపిస్తుంది. |
| 02:21 | panel ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చెయ్యడానికి Layer Panel ఎంపికపై క్లిక్ చేయండి. |
| 02:27 | (బౌండరీ) సరిహద్దును లాగడం ద్వారా మనం panel యొక్క సైజ్ ను సర్దుబాటు చేయవచ్చు. |
| 02:32 | ఒకవేళ మీరు మ్యాప్ యొక్క రంగును మార్చాలనుకుంటే, Layers Panel లోని layer పేరుపైన రైట్ క్లిక్ చేయండి. |
| 02:39 | context menu కు స్క్రోల్ చేసి, Styles ఎంపికను ఎంచుకోండి. |
| 02:44 | సబ్ మెనూ అనేది ఒక కలర్ ట్రయాంగిల్ (రంగు త్రిభుజం) ను చూపిస్తుంది. |
| 02:48 | (రంగు త్రిభుజం) కలర్ ట్రయాంగిల్ యొక్క (వర్టెక్స) శీర్షాన్ని తిప్పడం ద్వారా (కలర్) రంగును ఎంచుకోండి. |
| 02:53 | కాంటెక్స్ట్ మెనుని మూసివేయడానికి canvas పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
| 02:58 | దిగువ-ఎడమ మూలలో, QGIS విండో యొక్క status బార్పైన, మీరు లేబుల్ Coordinate ను మరియు సంఖ్యలతో కూడిన ఒక టెక్స్ట్ బాక్స్‌ను గమనించవచ్చు. |
| 03:09 | దిగువ-ఎడమ మూలలో, QGIS విండో యొక్క status బార్ పైన, మీరు లేబుల్ Coordinate మరియు సంఖ్యలతో కూడిన ఒక టెక్స్ట్ బాక్స్‌ను గమనించవచ్చు. |
| 03:17 | కర్సర్‌ను మ్యాప్ మీదికి తరలించండి. |
| 03:20 | గమనించండి, X మరియు Y coordinates యొక్క విలువలు అనేవి కర్సర్ యొక్క స్థానంతో పాటు మారుతాయి. |
| 03:28 | డిఫాల్ట్ గా Render ఎంపిక అనేది status bar పై తనిఖీ చేయబడింది.
దానిని అలాగే వదిలేయండి. |
| 03:37 | దిగువ-కుడి మూలలో ఉన్నstatus bar పైన, మీరు మరొక లేబుల్ Current CRS ను చూస్తారు. |
| 03:44 | ఈ కోడ్ అనేది ప్రస్తుత Projection Coordinate Reference System ను సూచిస్తుంది. |
| 03:50 | ఒక layer’s projection ను నిర్ణయించడానికి, మనం metadata లోనికి చూడవచ్చు. |
| 03:56 | Layers Panel పైన, layer పేరుపై రైట్ క్లిక్ చేయండి. |
| 04:01 | కాంటెక్స్ట్ మెను నుండి, Properties ను ఎంచుకోండి.
Layer Properties డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
| 04:09 | డైలాగ్-బాక్స్‌లో, ఎడమ వైపు ప్యానెల్ పైన, Metadata ఎంపికపై క్లిక్ చేయండి. |
| 04:15 | Properties విభాగం కింద, స్లయిడర్‌ను క్రిందికి స్క్రోల్ చేయండి. |
| 04:20 | దిగువ భాగం వద్ద, Layer Spatial Reference System హెడింగ్ కిందన, మీరు ఈ ప్రొజెక్షన్ యొక్క నిర్వచనాన్ని చూస్తారు. |
| 04:29 | ఇది WGS84 ను geographic coordinate system గా చూపిస్తుంది. |
| 04:35 | డైలాగ్ బాక్స్ ను మూసివేయడానికి, దిగువ బాగా, వద్ద ఉన్నOk బటన్ పై క్లిక్ చేయండి. |
| 04:41 | ఇప్పుడు మనం మ్యాప్‌కు layers ను జోడించి, projection ను మార్చుదాం. |
| 04:47 | data layers గురించి. |
| 04:50 | సాధారణంగా geographical data అనేది layers లోని ఒక GIS వర్క్ స్పేస్ లో స్టోర్ చేయబడుతుంది. |
| 04:57 | ప్రతి layer దానియొక్క attribute table లో స్టోర్ చేయబడిన డేటాను కలిగిఉంటుంది. |
| 05:02 | చాలా layers ఒకే భౌగోళిక స్థానం యొక్క data ను సూచిస్తాయి. |
| 05:08 | QGIS ఇంటర్ఫేస్కు తిరిగి వెళ్ళండి. |
| 05:12 | ఇప్పుడు మనం layer’s projection ను మనం ఎలా మార్చవచ్చో చూద్దాం. |
| 05:17 | ఈ ఆపరేషన్‌ను Re-Projection అని అంటారు. |
| 05:21 | మొత్తం layer ను రీ ప్రొజెక్ట్ చేయడానికి బదులుగా, మనం కొన్ని ఫీచర్స్ ను మాత్రమే రీ ప్రొజెక్ట్ చేస్తాము. |
| 05:27 | టూల్ బార్ యొక్క కుడి-ఎగువ మూలలో, Select features by area or single click టూల్ పై క్లిక్ చేయండి. |
| 05:35 | ఈ టూల్ పక్కన ఉన్న బ్లాక్ ట్రయాంగిల్ పై క్లిక్ చేయండి. |
| 05:39 | డ్రాప్ డౌన్ నుండి Select features ను ఎంచుకోండి. |
| 05:44 | canvas పైన ప్రదర్శించబడుతున్న ప్రపంచ పటంలో, United States of America ఫీచర్ ని ఎంచుకోవడానికి దానిపై క్లిక్ చేయండి. |
| 05:52 | United States of America అనేది వేరే రంగులో చూపబడింది అని గమనించండి. |
| 05:58 | మనం ఇప్పుడు ఈ layer యొక్క projected coordinate system ను మార్చి సేవ్ చేస్తాము. |
| 06:04 | Layers Panel లోని layer పేరుపై రైట్ క్లిక్ చేయండి. |
| 06:08 | క్రిందికి స్క్రోల్ చెసి, Save As ఎంపికను ఎంచుకోండి. |
| 06:12 | Save Vector Layer as... డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
| 06:17 | డిఫాల్ట్ format ఎంపిక అనేది ESRI Shapefile.
దానిని అలాగే వదిలేయండి. |
| 06:26 | File name టెక్స్ట్ బాక్స్ కు పక్కన ఉన్న Browse button పై క్లిక్ చేయండి. |
| 06:31 | Save layer as... డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
అవుట్‌పుట్ layer కు USA-1.shp గా పేరును పెట్టండి. |
| 06:41 | సేవ్ చేయడానికి అనువైన స్థానాన్ని కనుగొనండి.
నేను దానిని Desktop పైన సేవ్ చేస్తాను |
| 06:48 | దిగువన భాగం వద్ద ఉన్నSave బటన్ పై క్లిక్ చేయండి. |
| 06:52 | Save Vector Layer as.... డైలాగ్-బాక్స్‌లో, file path అనేది File name టెక్స్ట్ బాక్స్‌లో కనిపిస్తుంది. |
| 06:59 | మనం ఈ layer కొరకు కొత్త projection ను ఎంచుకుంటాము. |
| 07:03 | CRS డ్రాప్ డౌన్ బాక్స్ కు పక్కన, Select CRS బటన్ పై క్లిక్ చేయండి. |
| 07:10 | Coordinate Reference System Selector లోని, Filter search box లో, North America ని ఎంటర్ చేయండి. |
| 07:17 | ప్రపంచం యొక్క Coordinate reference systems కిందన, Projected Coordinate System హెడింగ్ కింద, రిజల్ట్స్ ద్వారా స్క్రోల్ చేయండి. |
| 07:27 | North_America_Albers_Equal_Area_Conic (EPSG:102008) projection ను ఎంచుకోండి. |
| 07:37 | దిగువన భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి. |
| 07:41 | CRS డ్రాప్ డౌన్ బాక్స్‌లో, కొత్తగా ఎంచుకున్న CRS అనేది చూపబడుతుంది. |
| 07:47 | Save only selected features ఎంపికను తనిఖీ చేయడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
| 07:53 | ఇది ఎంచుకున్న feature మాత్రమే re-projected అయ్యి exported అవుతుందని నిర్దారిస్తుంది. |
| 08:00 | ఇక్కడ, డీఫాల్ట్ గా, Add saved file to map ఎంపిక అనేది తనిఖీ చేయబడింది. |
| 08:06 | ఒకవేళ కాకపోతే, ఈ ఎంపికను తనిఖీ చేయడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
| 08:11 | OK బటన్ పై క్లిక్ చేయండి. |
| 08:14 | re-projected layer అనేది ఒక వేరే రంగులో లోడ్ అవుతుంది. |
| 08:19 | ఈ రెండు layers అనేవి ఇప్పుడు వేర్వేరు projections లో ఉన్నాయి. |
| 08:24 | గమనించండి, Layers Panel పైన, మీరు ఇప్పుడు 2 ఎంట్రీలను చూడవచ్చు. |
| 08:30 | world map layer యొక్క ఎగువభాగం పైన కొత్త United States layer అనేది పూర్తిగా ఓవర్లే ఆవుతుందని గమనించండి. |
| 08:38 | ఇది ఎందుకంటే QGIS అనేది On-the-fly CRS transformation అని పిలువబడే ఒకfeature ని కలిగి ఉంది కనుక. |
| 08:45 | QGIS విండో యొక్క దిగువ-కుడి మూలవద్ద ఉన్న projection టెక్స్ట్ అనేది EPSG:4326కు పక్కన OTF అనే పదాలను కలిగిఉంది. |
| 08:56 | Layers Panel లోని United-States లేయర్ పై క్లిక్ చేయడం ద్వారా దానిని ఎంచుకోండి. |
| 09:02 | status బార్ యొక్క దిగువ-కుడి మూలలో ఉన్న Current CRS టెక్స్ట్, EPSG:4326 పై క్లిక్ చేయండి. |
| 09:11 | Project Properties CRS డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
| 09:16 | Enable on-the-fly CRS transformation ను మనం టర్న్ ఆఫ్ చేసి ఏమి జరుగుతుందో చూద్దాం. |
| 09:23 | Enable on the fly CRS transformation ను దానిపై క్లిక్ చేయడం ద్వారా అన్ చెక్ చెయ్యండి.
దిగువ భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి. |
| 09:34 | తిరిగి main QGIS విండోలో, ప్రపంచ పటం అదృశ్యమవుతుందని మీరు చూస్తారు. |
| 09:40 | కాన్వాస్ పైన మీరు United States మ్యాప్‌ను మాత్రమే చూస్తారు. |
| 09:45 | ఇది ఎందుకంటే ఈ layer కొరకు Projected CRS అనేది Albers Projection కు మార్చబడింది కనుక. |
| 09:52 | coordinates మరియు స్కేల్ అనేవి ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. |
| 09:56 | Layers Panel లోని United States layer పై రైట్ క్లిక్ చేయండి. |
| 10:01 | Zoom to Layer ఎంపికను ఎంచుకోండి. |
| 10:05 | ఇప్పుడు మీరు ఎంచుకోబడిన projection లో United States ను చూస్తారు. |
| 10:10 | మళ్ళీ, Project Properties డైలాగ్-బాక్స్ ను తెరవడానికి Current CRS టెక్స్ట్ పై క్లిక్ చేయండి. |
| 10:17 | Enable ‘on the fly’ CRS transformation ఎంపికను టర్న్ ఆన్ చెయ్యండి. |
| 10:23 | Recently used Coordinate Reference Systems, హెడింగ్ కిందన WGS 84 ను ఎంచుకోండి.
దిగువ భాగం వద్ద ఉన్న, OK బటన్ పై క్లిక్ చేయండి. |
| 10:35 | canvas లోని ప్రదర్శన అనేది ప్రపంచ పటంతో దానియొక్క మునుపటి స్థితికి చేరుకుంటుంది. |
| 10:41 | dataset నుండి vector layer ను తొలగించడానికి, Layers panel లోని పేరుపై రైట్ క్లిక్ చేయండి. |
| 10:48 | context menu నుండి, Remove ఎంపికపై క్లిక్ చేయండి. |
| 10:52 | ఈ చర్యను నిర్ధారించడానికి ఒక prompt కనిపిస్తుంది.
OK బటన్ పై క్లిక్ చేయండి. |
| 10:59 | dataset నుండి layer తొలగించబడింది అని గమనించండి. |
| 11:04 | సారాంశం చూద్దాం, |
| 11:07 | ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని నేర్చుకున్నాం
QGIS లో projections కు లేయర్స్ ను జోడించడం. |
| 11:15 | layers కొరకు metadata సమాచారాన్ని చూడడం. |
| 11:19 | ఎంచుకున్న ఫీచర్స్ ను ఒక layer నుండి ఒక కొత్త layer కు సేవ్ చేయడం. |
| 11:24 | వేర్వేరు ప్రొజెక్షన్స్ (స్క్రీన్ పైన ప్రదర్శనలు) ను కలిపి దానియొక్క డేటా లేయర్స్ ను రీ -ప్రాజెక్ట్ చేయడం మరియు ఓవర్ లే (అతివ్యాప్తి) చేయడం. |
| 11:30 | ఒక అసైన్మెంట్ గా:
United States ను North_America_Lambert_Conformal_Conic projection తో Project చేసి తేడాను గమనించండి. |
| 11:43 | మొత్తం వరల్డ్ మ్యాప్ layer ను World Mercator projection సిస్టమ్ లోనికి Re-project చేయండి. |
| 11:50 | మీరు పూర్తి చేసిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
| 11:55 | కింది లింక్‌లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
| 12:03 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది మరియు
ఆన్ లైన్ పరీక్షల్లో పాసైన వారికి సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి. |
| 12:15 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
| 12:19 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
| 12:31 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి, నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |