Synfig/C2/E-card-animation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 23:25, 15 November 2020 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Synfig ను ఉపయోగించి E-card animation పై ఈ Spoken Tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌లో, మనం కొన్ని png ఇమేజెస్ ను ఉపయోగించి ఒక E-card animation ను సృష్టించడం నేర్చుకుంటాము.
00:11 ఇక్కడ, మనం వీటిని కూడా నేర్చుకుంటాం- png ఫార్మాట్ ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేయడం,
00:16 ఆ ఇమేజెస్ ను యానిమేట్ చేయడం,
00:18 టెక్స్ట్ యానిమేషన్ చేయడం,
00:20 యానిమేషన్ ని ప్రివ్యూ చేయడం,
00:22 యానిమేషన్ ని avi ఫార్మాట్ లో రెండర్ చేయడం.
00:25 ఈ ట్యుటోరియల్ కొరకు, నేను ఉపయోగిస్తున్నాను: ఉబుంటు లైనక్స్ 14.04 OS,
00:32 Synfig వర్షన్ 1.0.2
00:35 మనం Synfig ను తెరుద్దాం.
00:38 డాష్ హోమ్ కు వెళ్లి, Synfig అని టైప్ చేయండి.
00:42 లోగో పై క్లిక్ చేయడం ద్వారా మీరు Synfig ను తెరవవచ్చు.
00:47 ఇప్పుడు, మనం ఇ-కార్డ్ యానిమేషన్ ను సృష్టించడం ప్రారంభిద్దాం.
00:52 మొదట మనం మన Synfig ఫైల్ ను save చెయ్యాలి.
00:56 File కు వెళ్లి, Save పై క్లిక్ చేయండి.
00:59 సేవ్ చేయవలసిన ఫోల్డర్‌ను ఎంచుకోండి.
01:02 ఫైల్ పేరును E-card-animation అని టైప్ చేసి, Save బటన్ పై క్లిక్ చేయండి.
01:07 మొదట మనం Toolbox కు వెళ్లి, Rectangle టూల్ పై క్లిక్ చేస్తాము.
01:12 ప్రదర్శించినట్లుగా canvas పై ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
01:17 import చేసిన ఇమేజ్ అనేది canvas లోపలికి సరిపోయే విధంగా మనం సెట్టింగులను మారుస్తాము.
01:23 అలా చేయడానికి, Edit కు వెళ్లండి. Preferences పై క్లిక్ చేసి, ఆపై Misc పై క్లిక్ చెయ్యండి.
01:30 Scaling new imported image to fix canvas ఎంపికపై క్లిక్ చేయండి.
01:35 ఇప్పుడు, Ok పై క్లిక్ చేయండి. ఈ ఎంపిక అనేది canvas లో సరిపోయే ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేస్తుంది.
01:44 దయచేసి గమనించండి: మనం png ఫార్మాట్‌లోని ఇమేజెస్ నే దిగుమతి చేసుకోవాలి.
01:49 ఇది ఎందుకంటే jpg / jpeg వంటి ఇతర ఇమేజ్ ఫార్మట్ లు అనేవి Synfig canvas ‌పై భిన్నంగా ప్రవర్తిస్తాయి.
01:58 అలాగే, రెండరింగ్ చేసిన తరువాత, అవుట్పుట్ క్వాలిటీ అనేది png ఇమేజెస్ ను ఉపయోగించినప్పుడు బాగుంటుంది.
02:05 మనం Synfig ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వద్దాం.
02:09 File కు వెళ్లి, Import పై క్లిక్ చేయండి.
02:12 నేను అవసరమైన ఇమేజ్ లను, నా Documents ఫోల్డర్‌లోపల E-card-animation folder లో సేవ్ చేసాను.
02:20 ఈ ఇమేజ్ లు ఈ వెబ్‌పేజీలోనే Code files లింక్‌లో అందించబడ్డాయి.
02:26 దయచేసి Code files లింక్ ను కనుగొని ఆ ఇమేజెస్ ను మీ మెషీన్‌లో save చెయ్యండి.
02:31 ఇప్పుడు, నాతో పాటు ప్రాక్టీస్ చేయండి.
02:34 Bg ఇమేజ్ ను ఎంచుకుని, Import పై క్లిక్ చేయండి.
02:37 మనం canvas పైన Bg ఇమేజ్ ను పొందుతాము.
02:41 ఆ ఇమేజ్ ను resize చేయాలంటే - Bg ఇమేజ్ ను canvas కు సరిపోయేలా చేయడానికి, మొదట నారింజరంగు బిందువును లేదా నారింజరంగు డక్ ను పట్టుకుని, చూపినవిధంగా mouse ను లోపల లేదా బయట కదపండి.
02:55 ఇప్పుడు, ఫోల్డర్‌లోని Cake ఇమేజ్ ను ఎంచుకుని, Import పై క్లిక్ చెయ్యండి.
03:00 మనం మన canvas పైన Cake ఇమేజ్ ను పొందుతాము. అదే విధంగా, మిగిలిన అన్ని ఇమేజెస్ ను కూడా import చెయ్యండి.
03:08 గమనించండి, మనం - Cake, Flowers మరియు Balloons అనే పేర్లుగల మూడు కొత్త లేయర్స్ ను కలిగియున్నాము.
03:14 ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ ను resize చేద్దాం. Layers panel కు వెళ్లండి.
03:19 మొదట Cake లేయర్ ను ఎంచుకోండి. ఎంపికచేసుకున్నదానిపై, రీసైజ్ హ్యాండిల్స్ అనేవి canvas పైన కనిపిస్తాయి.
03:27 నారింజరంగు బిందువు పై క్లిక్ చేసి, Cake ఇమేజ్ ను రీసైజ్ చెయ్యండి.
03:32 అదే విధానాన్ని పునరావృతం చేసి మిగిలిన రెండు ఇమేజెస్ ని కూడా రీసైజ్ చెయ్యండి.
03:38 ఇప్పుడు, ఇమేజెస్ ను కదిపి, ప్రదర్శించినట్లుగా వాటిని canvas కు బయట ఉంచండి.
03:45 తర్వాత Animation panel ప్యానెల్‌కు వెళ్లండి. Turn on animate editing mode icon పై క్లిక్ చేయండి.
03:52 Time cursor ను 30th ఫ్రేమ్‌లో ఉంచండి.
03:56 Cake లేయర్ ను ఎంచుకోండి.
03:58 చూపిన విధంగా, Cake ఇమేజ్ ను canvas యొక్క ఎడమవైపు దిగువభాగానికి తరలించండి.
04:05 తరువాత, Balloons లేయర్ ను ఎంచుకోండి.
04:08 Time cursor ను 30th ఫ్రేమ్‌లో ఉంచండి.
04:11 Keyframes panel కు వెళ్లి Add a keyframe పై క్లిక్ చెయ్యండి.
04:16 ఇప్పుడు, Time cursor ను 48th ఫ్రేమ్‌లో ఉంచండి.
04:21 Keyframes panel కు వెళ్లి Add a keyframe పై క్లిక్ చెయ్యండి.
04:27 Balloons ఇమేజ్ ను canvas యొక్క మధ్య- ఎడమభాగం వైపుకు తరలించండి.
04:31 మళ్ళీ, Time cursor ను 60th ఫ్రేమ్‌లో ఉంచండి.
04:36 Keyframes panel కు వెళ్లి Add a keyframe పై క్లిక్ చెయ్యండి.
04:41 Flowers ఇమేజ్ ను canvas యొక్క కుడి దిగువభాగానికి తరలించండి.
04:47 తరువాత, ఈ యానిమేషన్‌తో వెళ్ళడానికి మనం టెక్స్ట్ యొక్క ఒక లైన్ ని జోడిస్తాము.
04:52 దీనికంటే ముందు, నన్ను యానిమేషన్‌ను స్విచ్ ఆఫ్ చేయనివ్వండి.
04:57 అలా చేయడానికి, Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:02 మనం టెక్స్ట్ ని జోడిద్దాం. డిఫాల్ట్ Fill colour అనేది తెలుపు ఉంది కాబట్టి, తెలుపురంగు బాక్గ్రౌండ్ పైన టెక్స్ట్ మనకి కనిపించదు.
05:12 కనుక, నేను ఈ రంగును నలుపుకు మారుస్తాను.
05:16 ఇప్పుడు, Toolbox కు వెళ్లి, Text Tool ‌పై క్లిక్ చేయండి.
05:20 తరువాత canvas పైన ఎక్కడైనా క్లిక్ చేయండి. మనం ఒక Input text డైలాగ్ బాక్స్ ను పొందుతాము.
05:27 ఇక్కడ, మనం Happy Birthday అనే టెక్స్ట్ ను టైప్ చేస్తాము.
05:32 Ok పై క్లిక్ చేయండి.
05:36 ఇప్పుడు canvas పైన టెక్స్ట్ ని మనం చూడగలమని గమనించండి.
05:40 ఇప్పుడు, Layers ప్యానెల్‌కు వెళ్లి, text layer ని ఎంచుకోండి.
05:45 తరువాత Parameters panel కు వెళ్లి, Size పై క్లిక్ చెయ్యండి.
05:51 దానియొక్క విలువను 80 పిక్సెల్స్ కు మార్చండి, ఆపై colour విలువను వైలెట్‌ కు మార్చండి.
05:57 Toolbox కు వెళ్లి, Text Tool పై క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి canvas ‌పై క్లిక్ చేయండి.
06:04 మనకు మరొక Input text డైలాగ్ బాక్స్ వస్తుంది.
06:09 ఈ టెక్స్ట్ బాక్స్ లో, Have a wonderful, happy, healthy birthday now and forever అని టైప్ చేయండి.
06:21 ఆపై Ok పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం canvas పైన ఈ టెక్స్ట్ ను కూడా చూడవచ్చు.
06:27 Parameters panel కు వెళ్లి, Size పై క్లిక్ చేయండి.
06:32 విలువను 30 పిక్సెల్స్ కు మార్చండి మరియు colour ను నలుపుకు మార్చండి.
06:38 ఇప్పుడు, మనం Layers panel కు వెళ్దాం.
06:41 మొదటి text layer పై క్లిక్ చేసి, ఆ layer పేరును Happy Birthday కు మార్చండి.
06:48 అదేవిధంగా, మరొక text layer పై క్లిక్ చేసి, ఆ layer పేరును Now and Forever కు మార్చండి.
06:56 లేయర్స్ కు తగినట్లుగా పేరును పెట్టడం అనేది మంచి అలవాటు.
07:01 భవిష్యత్తులో వాటిని సులభంగా గుర్తించడానికి ఇది మనకు సహాయపడుతుంది.
07:06 ఇప్పుడు, ప్రదర్శించిన విధంగా text layers ను canvas వెలుపలకు తరలించండి.
07:13 Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి.
07:18 తర్వాత, Layers panel కి వెళ్లండి. Happy Birthday లేయర్ ను ఎంచుకోండి.
07:24 ఇప్పుడు, Time cursor ను 72 వ ఫ్రేమ్‌ పై ఉంచండి.
07:29 Keyframes panel కు వెళ్లి, Add a keyframe పై క్లిక్ చేయండి. ప్రదర్శించిన విధంగా టెక్స్ట్ ను తరలించండి.
07:37 తరువాత, Layers panel కు వెళ్లి, Now and forever లేయర్ ను ఎంచుకోండి.
07:44 తర్వాత Time cursor ను 90th ఫ్రేమ్‌ పై ఉంచండి.
07:48 మరొకసారి Keyframes panel కు వెళ్లి, Add a keyframe పై క్లిక్ చేయండి.
07:55 ఇప్పుడు, canvas కు వెళ్లి, ప్రదర్శించిన విధంగా Now and forever టెక్స్ట్ ను తరలించండి.
08:02 ఇప్పుడు మన Synfig ఫైల్ ను save చేద్దాం.
08:05 File కు వెళ్లి Save పై క్లిక్ చెయ్యండి.
08:09 ఇప్పుడు మనం ను preview తనిఖీ చేద్దాం. File కు వెళ్లి, ఆపై Preview పై క్లిక్ చేయండి.
08:15 quality ను 0.5 గా మరియు Frame per second ను 24 గా సెట్ చేయండి.
08:24 Preview బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత Play బటన్ పై క్లిక్ చేయండి.
08:29 మనం యానిమేషన్ యొక్క ప్రివ్యూను screen పైన చూడవచ్చు.
08:33 Preview విండోను మూసివేయండి.
08:35 చివరగా, మన యానిమేషన్‌ను రెండర్ చేద్దాం.
08:38 అలా చేయడానికి, File పై క్లిక్ చేసి, ఆపై Render పై క్లిక్ చేయండి.
08:43 Render setting విండోకు వెళ్ళండి.
08:46 Choose పై క్లిక్ చేయండి. Save render as విండోను తెరవండి.
08:50 Document పై క్లిక్ చేయండి. E-card-animation folder ‌పై క్లిక్ చేయండి.
08:55 పేరును E-card-animation.avi కు మార్చండి.
09:00 Target డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేయండి. extension ను ffmpeg గా ఎంచుకోండి.
09:06 Time టాబ్‌పై క్లిక్ చేసి, End time ను110 కు మార్చండి. తర్వాత Render పై క్లిక్ చెయ్యండి.
09:20 మన యానిమేషన్‌ను తనిఖీ చేద్దాం. Documents కు వెళ్లండి.
09:24 E- card-animation ఫోల్డర్‌పై డబల్ క్లిక్ చెయ్యండి.
09:26 E- card-animation.avi ను ఎంచుకోండి.
09:30 రైట్ క్లిక్ చేసి Firefox వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి యానిమేషన్‌ను ప్లే చెయ్యండి.
09:39 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
09:44 సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్‌లో, మనం E-card యానిమేషన్‌ను సృష్టించడం నేర్చుకున్నాము.
09:50 మనం ఇవి కూడా నేర్చుకున్నాము: ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేయడం,
09:54 ఇమేజెస్ ను యానిమేట్ చేయడం, టెక్స్ట్ యానిమేషన్ ను చేయడం,
09:57 యానిమేషన్‌ను ప్రివ్యూ చేయడం మరియు యానిమేషన్‌ను .avi ఫార్మట్ లో రెండర్ చేయడం.
10:04 మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్. Code files లింక్‌లో అందించబడిన Flower ఇమేజ్ ను కనుగొనండి.
10:11 ఈ ఫ్లవర్ ఇమేజెస్ ను ఉపయోగించి, ఇదేవిధమైన ఒక యానిమేషన్‌ను సృష్టించండి.
10:16 కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని చూడండి.
10:23 మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
10:31 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
10:35 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
10:42 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya