Synfig/C2/Create-a-star-animation/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 20:14, 8 November 2020 by Simhadriudaya (Talk | contribs)
00:01 | Synfig ను ఉపయోగించి Star animation పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని సృష్టించడం నేర్చుకుంటాము: గ్రేడియంట్ కలర్ యానిమేషన్, |
00:12 | గ్రూప్ లేయర్స్ మరియు స్టార్ యానిమేషన్. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ 14.04 OS, |
00:22 | Synfig వర్షన్ 1.0.2 |
00:26 | మనం Synfig ను తెరుద్దాం. |
00:28 | నేను నా Documents ఫోల్డర్‌లో ఒక బ్రాంచ్ ఇమేజ్‌ని సృష్టించాను. |
00:33 | ఆ చిత్రం మీకు Code files లింక్‌లో అందించబడింది. దాన్నిమనం import చేద్దాం. |
00:38 | File కు వెళ్లండి. Import పై క్లిక్ చేయండి. బ్రాంచ్ ఇమేజ్ ని ఎంచుకోండి. |
00:44 | Layers panel కు వెళ్లండి. Branch layer ని ఎంచుకోండి. |
00:48 | ఇప్పుడు handle కనిపిస్తుంది. |
00:51 | నారింజరంగు బిందువుపై క్లిక్ చేసి, చూపిన విధంగా ఇమేజ్ ను రీసైజ్ చెయ్యండి. |
00:55 | ఆకుపచ్చరంగు బిందువుపై క్లిక్ చేసి, దానిని canvas యొక్క దిగువభాగానికి తరలించండి. |
01:00 | ఇప్పుడు మనం మన ఫైల్ ను save చేద్దాం. File కు వెళ్లండి. Save పై క్లిక్ చేయండి.
నేను ఫైల్‌ను Desktop లో సేవ్ చేస్తాను. |
01:08 | డిఫాల్ట్ పేరును Star hyphen animation కు మార్చండి.
Save పై క్లిక్ చెయ్యండి. |
01:15 | తరువాత, మనం కొన్ని నక్షత్రాలను సృష్టిద్దాం. |
01:18 | ఇప్పుడు Tool box కు వెళ్లండి. Star too పై క్లిక్ చేయండి. |
01:22 | canvas లో బ్రాంచ్ కు పైన ఉన్న ఖాళీ ప్రదేశంలో 10 నక్షత్రాలను సృష్టించండి. |
01:31 | Layers panel కు వెళ్లండి. shift కీని ఉపయోగించి అన్ని స్టార్ layers ను ఎంచుకోండి. |
01:37 | ఇప్పుడు వాటిని గ్రూప్ చేయడానికి దిగువభాగం వద్ద ఉన్న group icon పై క్లిక్ చేయండి. |
01:41 | గ్రూప్ లేయర్ కు Stars అని పేరు మార్చండి. Stars group layer ఎంపికను తీసివేయడానికి canvas బయట క్లిక్ చెయ్యండి. |
01:49 | తరువాత, మనం ఒక గ్రేడియంట్ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం.
Tool box కు వెళ్లండి. Gradient tool పై క్లిక్ చేయండి. |
01:56 | Tool options panel లో, Create a linear gradient ఎంపిక అనేది ఎంచుకోబడిందో లేదో తనిఖీ చేయండి. |
02:03 | canvas యొక్క పైభాగంలో ఉన్న mouse పై క్లిక్ చేసి, దాన్నిదిగువభాగం వరకు లాగండి. |
02:08 | ఒక బ్లాక్ అండ్ వైట్ (నలుపు మరియు తెలుపు) gradient అనేది canvas పైన కనిపిస్తుందని గమనించండి. |
02:14 | Parameters panel కు వెళ్లండి.
Gradient value పై డబల్ క్లిక్ చేయండి. ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
02:21 | ఇక్కడ దిగువభాగం వద్ద ఉన్నబాక్స్ లో ప్రతి చివర వద్ద 2 Color stop icons అనేవి ఉన్నాయని గమనించండి. |
02:27 | ఈ ఐకాన్స్ గ్రేడియంట్ యొక్క 2 రంగులను సూచిస్తాయి. |
02:31 | ఎడమవైపు Color stop icon అనేది default చేత ఎంపిక చేయబడింది. రంగును లేత నీలం రంగులోకి మార్చండి. |
02:38 | తరువాత, కుడివైపు Color stop icon ను ఎంచుకోండి. రంగును తెలుపురంగుకు మార్చండి.
డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
02:46 | canvas లో రంగు మార్పును గమనించండి. |
02:50 | Animation panel లో, Turn on Animate editing mode ఐకాన్ పై క్లిక్ చెయ్యండి. |
02:55 | తరువాత 25th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel లో ఒక కొత్త keyframe ను జోడించండి. |
03:01 | Parameters panel కు వెళ్ళండి.
Gradient parameter విలువ పై క్లిక్ చెయ్యండి. |
03:08 | ఎడమవైపు రంగును నలుపుకు మరియు కుడివైపు రంగు ముదురు నీలం రంగులోకి మార్చండి. |
03:15 | Time track panel పైన waypoints అనేవి సృష్టించబడ్డాయని గమనించండి. |
03:20 | canvas లో రంగు మార్పును గమనించడానికి సున్నామరియు 25th ఫ్రేమ్‌ల మధ్య Time cursor ను లాగండి. |
03:28 | మన ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
03:32 | మనం గ్రేడియంట్ బ్యాక్ గ్రౌండ్ ను దిగువభాగానికి తరలించాలి. |
03:36 | కనుక, Layers panel కు వెళ్లండి. Lower layer బటన్ పై రెండుసార్లు క్లిక్ చేయండి. |
03:41 | తరువాత మనం నక్షత్రాల యొక్క ఆల్ఫా విలువను యానిమేట్ చేద్దాం. కనుక, Stars group layer ను ఎంచుకోండి. |
03:48 | సున్నా ఫ్రేమ్‌కు వెళ్లండి. |
03:51 | Parameters panel లో, Amount parameter యొక్క విలువ పై డబల్ క్లిక్ చెయ్యండి. |
03:56 | విలువను సున్నాకి మార్చండి. Enter ను నొక్కండి. |
04:00 | నక్షత్రాలు అనేవి ఇప్పుడు కనిపించవని గమనించండి. |
04:04 | తరువాత 25th ఫ్రేమ్‌కు వెళ్లండి. మళ్ళీ Amount parameter విలువను 0 కి మార్చండి. |
04:10 | తరువాత 40th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel లో ఒక కొత్త keyframe ను జోడించండి. |
04:17 | Parameters panel లో, Amount parameter విలువను 1 కి మార్చండి. |
04:23 | తరువాత 55th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel లో, 25th ఫ్రేమ్‌ను ఎంచుకోండి. Duplicate icon పై క్లిక్ చేయండి. |
04:32 | తరువాత 70th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel లో, 40th ఫ్రేమ్‌ను ఎంచుకోండి. Duplicate icon పై క్లిక్ చేయండి. |
04:41 | మన ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి. |
04:45 | చివరగా మనం ఇప్పుడు మన యానిమేషన్ ను రెండర్ చేస్తాము. |
04:49 | File కు వెళ్లండి. Render పై క్లిక్ చేయండి. |
04:53 | extension ను avi కి మార్చండి. టార్గెట్ ను ffmpeg కు మార్చండి.
Render పై క్లిక్ చెయ్యండి. |
05:03 | ఇప్పుడు మనం Desktop కి వెళ్లి, ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించి యానిమేషన్‌ను ప్లే చేద్దాం. |
05:10 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
సారాంశం చూద్దాం. |
05:15 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని సృష్టించడం నేర్చుకున్నాము: గ్రేడియంట్ కలర్ యానిమేషన్,
గ్రూప్ లేయర్స్ మరియు స్టార్ యానిమేషన్. |
05:24 | మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్.
సన్ రైజ్ యానిమేషన్‌ను సృష్టించండి. Code files లింక్‌లో ఈ ఇమేజ్ మీకు అందించబడుతుంది. |
05:33 | మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
05:37 | కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి. |
05:45 | మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
05:52 | దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
05:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
06:02 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |