Health-and-Nutrition/C2/Non-vegetarian-recipes-for-6-month-old-babies/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:53, 14 August 2020 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:00 | 6 నెలల వయస్సున్నశిశువుల కొరకు మాంసాహార వంటకాలపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి - పిల్లలకు పరిపూరకమైన మాంసాహార ఆహారాన్ని పరిచయం చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు |
00:17 | ఇటువంటి పరిపూరకమైన మాంసాహార ఆహారాలను ఎలా తయారు చేయాలి - |
00:22 | ఎగ్ (గుడ్డు) తో ప్యూరీ (మెత్తని పేస్ట్), |
00:24 | ఫిష్ (చేప) తో ప్యూరీ (మెత్తని పేస్ట్),
అరటికాయ, చేపతో జావ (గంజి), |
00:27 | చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్) ప్యూరీ మరియు చికెన్ (కోడి మాంసం) క్యారెట్ తో ప్యూరీ (మెత్తని పేస్ట్). |
00:31 | మనం ప్రారంభిద్దాం-
శిశువుకు 6 నెలల వయస్సు వచ్చిన తర్వాత, శిశువు యొక్క పోషక పోషకాల అవసరం అనేది చాలా పెరుగుతుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. |
00:42 | పరిపూరకమైన ఆహారాల నుండి ఆమెకు 200 కేలరీల శక్తి అవసరం. |
00:48 | తల్లిపాలు ఇవ్వడంతో పాటు, పరిపూరకమైన ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించాలి. |
00:53 | ఇవి కాకుండా, క్రమంగా, శిశువు వయస్సు పెరిగేకొద్దీ - ఆహారం యొక్క పరిమాణం మరియు చిక్కదనాన్ని మార్చాలి. |
01:03 | దయచేసి గమనించండి బిడ్డకు ఆహారం ఇచ్చేటప్పుడు, కప్పులు మరియు స్పూన్లు ఉపయోగించి ఆహారం పరిమాణాన్ని కొలవాలి. |
01:12 | ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో ఇది వివరించబడింది. |
01:18 | శిశువుకు 6 నెలలు పూర్తి అయిన తరువాత -ప్రారంభంలో రోజుకు రెండుసార్లు 1టేబుల్స్పూన్తో ప్రారంభించండి, తరువాత క్రమంగా రోజుకు రెండుసార్లు 4 టేబుల్స్పూన్ల వరకు వెళ్లండి. |
01:29 | ఇంకా, బాగా ఉడికించిన, ప్యూరీగా చేసిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. |
01:35 | ఇప్పుడు, పిల్లలకు మాంసాహారం ఎలా ముఖ్యమో మనం చూస్తాం. |
01:40 | మాంసాహార ఆహారాలన్నీ మంచి కొవ్వులు, ప్రోటీన్ మరియు అనేక ఇతర సూక్ష్మపోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. |
01:48 | శిశువుల యొక్క సరైన పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఇంకా వారి మెదడు అభివృద్ధికి ఈ పోషకాలు అనేవి అవసరం. |
01:57 | పంజరంలో పెట్టకుండా పెంచిన కోళ్ల (నాటు కోళ్లు) ను శిశువులకు ఆహారాలుగా ఇవ్వమని సిఫార్సు చేయబడింది. |
02:02 | గుడ్లు, మాంసం ఇంకా గుల్లలు లేదా పెంకులు ఉన్న చేపలు తప్ప మిగిలిన అన్ని రకాల చేపలు పెట్టవచ్చు వాటిని 1 సంవత్సరం వయస్సు తర్వాత పెట్టాలి. |
02:12 | మాంసాహార ఆహారాలను పరిచయం చేసేటప్పుడు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోండి. |
02:18 | ఎలాంటి ప్రాసెస్ చేసిన మాంసం మరియు పచ్చి ఆహారాన్ని శిశువుకు ఇవ్వవద్దు. |
02:23 | దీన్ని పూర్తిగా ఉడికించాలి. |
02:26 | మరియు చాలా ముఖ్యంగా, శిశువు యొక్క ఆహారాన్ని వండేటప్పుడు - మైక్రోవేవ్ ఓవెన్ వాడకుండా ఉండండి. |
02:34 | మనం 6 నెలల వయస్సున్న శిశువు కొరకు పరిపూరకరమైన మాంసాహార ఆహారాల యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత గురించి చర్చించాము. |
02:43 | ఈ పరిపూరక మాంసాహార ఆహారాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. |
02:48 | మనం మన మొదటి వంటకమైన ఎగ్ (గుడ్డు) ప్యూరీ (మెత్తని పేస్ట్) తో ప్రారంభిద్దాం. |
02:53 | ఈ ఎగ్ (గుడ్డు) ప్యూరీ ని తయారు చేయడానికి, మనకు అవసరమైనవి-
1 గుడ్డు మరియు ½ అర టీస్పూన్ నెయ్యి లేదా వెన్న. |
03:01 | దీన్ని తయారు చేయడానికి, గుడ్డును తీసుకుని ఒక గిన్నెలో దాన్ని వేసి బాగా గిలకొట్టండి. |
03:06 | తరువాత, ఒక స్టీల్ తపేలాలో నెయ్యి వేసి వేడి చేయండి.
గిలకొట్టిన గుడ్డును ఈ స్టీల్ తపేలాలో పోసి తక్కువ మంట మీదపెట్టి కలపడం ప్రారంభించండి. |
03:15 | ఆపకుండా ఉడికిస్తూఉంటే ఎగ్ ప్యూరీ (మెత్తని పేస్ట్) మాడిపోవచ్చు కనుక మధ్యమధ్యలో దాన్ని మంట మీదనుండి తీసేస్తూఉండండి. |
03:21 | ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి ఇంకా అది చిక్కబడే వరకు దాన్ని ఉడికించండి. |
03:25 | మంటను ఆపివేయండి.ఇంకా, (గుడ్డు) ఎగ్ ప్యూరీ (మెత్తని పేస్ట్) సిద్ధంగా ఉంది. |
03:30 | కొంచంసేపు దాన్నిచల్లారనివ్వండి తరువాత అది శిశువుకు తినిపించండి. |
03:34 | మనం చూసే రెండవ వంటకం ఫిష్ (చేప) ప్యూరీ (మెత్తని పేస్ట్). |
03:37 | దీని కొరకు, మనకు అవసరమైనవి - స్థానికంగా లభించే ఏవైనా ఇటువంటి చేప ముక్కలు 2-
బ్లాక్ పోమ్ఫ్రేట్(నల్ల చందువాచేపలు), బాంబే డక్(వనమట్టాలు), వైట్ పోమ్ఫ్రేట్(తెల్ల చందువాచేపలు) మరియు స్క్విడ్(కాముతు సంచులు). |
03:50 | శుభ్రంచేసి కడిగిన రెండు చేప ముక్కలను ఒక స్టీల్ తపేలలో తీసుకోండి. |
03:54 | చేపముక్కలు మునిగే వరకు అందులో నీరు పోయండి. ఈ స్టీల్ తపేలాను ప్రెజర్ కుక్కర్లో ఉంచండి. |
04:00 | ఇంకా దాన్ని 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ప్రెజర్ కుక్ చేయాలి. |
04:04 | దానిని కొద్దిసేపు చల్లారనివ్వండి తర్వాత ఆ చేపముక్కలను బయటకుతీసి ఒక ప్లేటులో ఉంచండి. |
04:10 | ఇప్పుడు, జాగ్రత్తగా ముళ్ళన్నిటిని తీసేయండి. |
04:13 | ఈ చేపల ముళ్ళు శిశువును ఉక్కిరిబిక్కిరి చేయగలవు కనుక శిశువుకు ఆహారం ఇవ్వడానికి ముందే ఇలాచేయడం చాలాముఖ్యం. |
04:22 | ఇప్పుడు, ఒక మిక్సర్‌లో, ఉడికించిన చేపలను ప్యూరీ చేసి శిశువుకు తినిపించండి. |
04:28 | మూడవ వంటకం అరటికాయ, చేపతో (జావ) గంజి. |
04:32 | దీనిని తయారు చేయడానికి, మనకు అవసరమైనవి 2 టేబుల్ స్పూన్ల అరటికాయపొడి, బాంబే డక్ (వనమట్టాలు) చేప లేదా ఏదయినా స్థానికంగా లభించే చేప 4చిన్న ముక్కలు. |
04:41 | మొదట, మనం అరటికాయ పొడి తయారీతో ప్రారంభిస్తాము. |
04:46 | మీ ప్రాంతంలో స్థానికంగా లభించే ఏదైనా రకానికి చెందిన 2 అరటికాయలు తీసుకోండి. |
04:51 | పీలర్ ఉపయోగించి వాటి తొక్కను తీసేయండి.ఇప్పుడు, ఈ అరటికాయలను పల్చని బల్లలుగా కట్ చేసుకోండి. |
04:58 | ఈ ముక్కలను గలగలలాడే వరకు 1 నుండి 2 రోజులు నీడలో ఆరబెట్టండి. |
05:05 | తరువాత ఈ ఎండిన అరటికాయ ముక్కలను మిక్సర్‌లో వేసి పొడి తయారుచేయండి. |
05:10 | ఈ పొడిని జల్లించి విత్తనాలను తీసేయండి. |
05:13 | అరటికాయ పొడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. |
05:17 | తరువాత, చేపల (ఫిష్) ప్యూరీ (మెత్తని పేస్ట్) ని తయారు చేయడానికి- మునుపటి వంటకంలో పేర్కొన్న సూచనలను అనుసరించండి. |
05:24 | ఆ తరువాత, ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల అరటికాయ పొడిని తీసుకోండి. |
05:29 | అందులో 3 టీస్పూన్ల నీళ్లు వేసి ఉండలు కట్టకుండా ఉండటానికి దానిని బాగా కలపండి. |
05:35 | ఒకవేళ అవసరమైతే మరికొంచం నీళ్లు వేయండి. |
05:38 | ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 5 నుండి 7 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. |
05:43 | ఆ తరువాత, వండిన చేపల ప్యూరీ (మెత్తని పేస్ట్) ని అందులో వేయండి. |
05:47 | ఈ మిశ్రమాన్నిఆలా కలుపుతూ తక్కువ మంట మీద మరో 4-5 నిమిషాలు ఉడికించండి. |
05:53 | అరటికాయ, చేపతో (జావ) గంజి సిద్ధంగా ఉంది.దీన్నికొద్దిసేపు చల్లారనివ్వండి, తరువాత బిడ్డకు తినిపించండి. |
06:01 | ఇప్పుడు మనం నాల్గవ వంటకానికి వచ్చాము-చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్) ప్యూరీ (మెత్తని పేస్ట్). |
06:06 | దీన్ని తయారు చేయడానికి, మనకు అవసరమైనవి 1 చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్). |
06:09 | తయారీ విధానం: ఒక స్టీల్ తపేలాలో కడిగిన చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్) ను తీసుకొని తయారీని ప్రారంభించండి. |
06:15 | అది మునిగేంత వరకు నీళ్లు పోయండి. |
06:18 | ఇప్పుడు ఈ స్టీల్ తపేలాను ప్రెజర్ కుక్కర్లో ఉంచండి. |
06:21 | 3 నుండి 4 విజిల్స్ వచ్చేవరకు దాన్నిప్రెజర్ కుక్కర్ లో ఉడికించాలి. |
06:25 | చల్లారిన తరువాత, దాన్ని తీసి ఒక ప్లేట్ లో ఉంచండి. |
06:29 | మిక్సీలో వేసి ఉడికించిన చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్) యొక్క ప్యూరీ (మెత్తని పేస్ట్) ని తయారు చేసి శిశువుకు తినిపించండి. |
06:37 | ఇప్పుడు మనం ఐదవ వంటకం - చికెన్ (కోడి మాంసం) క్యారెట్ ప్యూరీ (మెత్తని పేస్ట్) ని చూస్తాము. |
06:43 | మనకు అవసరమైనవి: 4-5 చిన్న ముక్కలు చికెన్ బ్రెస్ట్ లేదా బోన్‌లెస్ చికెన్ మరియు 1 క్యారెట్, |
06:50 | కడిగిన చికెన్ ముక్కలను ఒక స్టీల్ తపేలాలో తీసుకొని తయారీని ప్రారంభించండి.
తరువాత అది మునిగేవరకు నీళ్లు పోయండి. |
07:00 | ఇప్పుడు, ఈ స్టీల్ తపేలాను ప్రెజర్ కుక్కర్లో ఉంచి 3 నుండి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. |
07:07 | దీన్నికొద్దసేపు చల్లారనివ్వండి.ఆపైన చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. |
07:15 | తరువాత, క్యారెట్‌ను 10 నిమిషాలు ఆవిరిలో ఉడికించి దాన్ని చల్లారనివ్వండి. |
07:20 | మిక్సర్ లో వేసి ఉడికించిన చికెన్ ముక్కలు మరియు ఉడికించిన క్యారెట్ యొక్క ప్యూరీ (మెత్తని పేస్ట్) ని తయారు చేయండి. |
07:26 | ఈ వంటకాలలోని పోషక పదార్ధాల విషయానికి వస్తే - ఈ వంటకాలన్నీ వీటితోసమృద్ధిగా ఉన్నాయని గమనించండి.-
ప్రోటీన్, |
07:36 | DHA & EPA ఇవి ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్, |
07:42 | కొలిన్, |
07:45 | విటమిన్ A, |
07:49 | విటమిన్ D, |
07:52 | విటమిన్ B3, |
07:57 | విటమిన్ B6, |
08:01 | ఫోలేట్, |
08:04 | విటమిన్ B12, |
08:08 | జింక్, |
08:11 | మెగ్నీషియం, |
08:14 | ఐరన్, |
08:18 | ఫాస్ఫరస్, |
08:21 | కాపర్ మరియు సెలీనియం. |
08:28 | ఈ పోషకాలు మాంసాహార ఆహార వనరులలో సులభంగా లభిస్తాయి. |
08:33 | అందువల్ల అవి శిశువు యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి, అభివృద్ధి చేయడానికి మరియు బలోపేతం చేయడానికి సహాయపడతాయి. |
08:40 | ఇది 6 నెలల వయస్సున్న శిశువుల కొరకు మాంసాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి మనల్ని తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |