Health-and-Nutrition/C2/Non-vegetarian-recipes-for-6-month-old-babies/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:51, 14 August 2020 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:00 6 నెలల వయస్సున్నశిశువుల కొరకు మాంసాహార వంటకాలపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి - పిల్లలకు పరిపూరకమైన మాంసాహార ఆహారాన్ని పరిచయం చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు
00:17 ఇటువంటి పరిపూరకమైన మాంసాహార ఆహారాలను ఎలా తయారు చేయాలి -
00:22 ఎగ్ (గుడ్డు) ప్యూరీ (మెత్తని పేస్ట్),
00:24 ఫిష్ (చేప) ప్యూరీ (మెత్తని పేస్ట్),

అరటికాయ చేపతో జావ (గంజి),

00:27 చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్) ప్యూరీ మరియు చికెన్ (కోడి మాంసం) క్యారెట్ తో ప్యూరీ (మెత్తని పేస్ట్).
00:31 మనం ప్రారంభిద్దాం-

శిశువుకు 6 నెలల వయస్సు వచ్చిన తర్వాత, శిశువు యొక్క పోషక పోషకాల అవసరం అనేది చాలా పెరుగుతుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

00:42 పరిపూరకమైన ఆహారాల నుండి ఆమెకు 200 కేలరీల శక్తి అవసరం.
00:48 తల్లిపాలు ఇవ్వడంతో పాటు, పరిపూరకమైన ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించాలి.
00:53 ఇవి కాకుండా, క్రమంగా, శిశువు వయస్సు పెరిగేకొద్దీ - ఆహారం యొక్క పరిమాణం మరియు చిక్కదనాన్ని మార్చాలి.
01:03 దయచేసి గమనించండి బిడ్డకు ఆహారం ఇచ్చేటప్పుడు, కప్పులు మరియు స్పూన్లు ఉపయోగించి ఆహారం పరిమాణాన్ని కొలవాలి.
01:12 ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో ఇది వివరించబడింది.
01:18 శిశువుకు 6 నెలలు పూర్తి అయిన తరువాత -ప్రారంభంలో రోజుకు రెండుసార్లు 1టేబుల్‌స్పూన్‌తో ప్రారంభించండి, తరువాత క్రమంగా రోజుకు రెండుసార్లు 4 టేబుల్‌స్పూన్ల వరకు వెళ్లండి.
01:29 ఇంకా, బాగా ఉడికించిన, ప్యూరీగా చేసిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి.
01:35 ఇప్పుడు, పిల్లలకు మాంసాహారం ఎలా ముఖ్యమో మనం చూస్తాం.
01:40 మాంసాహార ఆహారాలన్నీ మంచి కొవ్వులు, ప్రోటీన్ మరియు అనేక ఇతర సూక్ష్మపోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
01:48 శిశువుల యొక్క సరైన పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఇంకా వారి మెదడు అభివృద్ధికి ఈ పోషకాలు అనేవి అవసరం.
01:57 పంజరంలో పెట్టకుండా పెంచిన కోళ్ల (నాటు కోళ్లు) ను శిశువులకు ఆహారాలుగా ఇవ్వమని సిఫార్సు చేయబడింది.
02:02 గుడ్లు, మాంసం ఇంకా గుల్లలు లేదా పెంకులు ఉన్న చేపలు తప్ప మిగిలిన అన్ని రకాల చేపలు పెట్టవచ్చు వాటిని 1 సంవత్సరం వయస్సు తర్వాత పెట్టాలి.
02:12 మాంసాహార ఆహారాలను పరిచయం చేసేటప్పుడు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోండి.
02:18 ఎలాంటి ప్రాసెస్ చేసిన మాంసం మరియు పచ్చి ఆహారాన్ని శిశువుకు ఇవ్వవద్దు.
02:23 దీన్ని పూర్తిగా ఉడికించాలి.
02:26 మరియు చాలా ముఖ్యంగా, శిశువు యొక్క ఆహారాన్ని వండేటప్పుడు - మైక్రోవేవ్ ఓవెన్ వాడకుండా ఉండండి.
02:34 మనం 6 నెలల వయస్సున్న శిశువు కొరకు పరిపూరకరమైన మాంసాహార ఆహారాల యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత గురించి చర్చించాము.
02:43 ఈ పరిపూరక మాంసాహార ఆహారాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.
02:48 మనం మన మొదటి వంటకమైన ఎగ్ (గుడ్డు) ప్యూరీ (మెత్తని పేస్ట్) తో ప్రారంభిద్దాం.
02:53 ఈ ఎగ్ (గుడ్డు) ప్యూరీ ని తయారు చేయడానికి, మనకు అవసరమైనవి-

1 గుడ్డు మరియు ½ అర టీస్పూన్ నెయ్యి లేదా వెన్న.

03:01 దీన్ని తయారు చేయడానికి, గుడ్డును తీసుకుని ఒక గిన్నెలో దాన్ని వేసి బాగా గిలకొట్టండి.
03:06 తరువాత, ఒక స్టీల్ తపేలాలో నెయ్యి వేసి వేడి చేయండి.

గిలకొట్టిన గుడ్డును ఈ స్టీల్ తపేలాలో పోసి తక్కువ మంట మీదపెట్టి కలపడం ప్రారంభించండి.

03:15 ఆపకుండా ఉడికిస్తూఉంటే ఎగ్ ప్యూరీ (మెత్తని పేస్ట్) మాడిపోవచ్చు కనుక మధ్యమధ్యలో దాన్ని మంట మీదనుండి తీసేస్తూఉండండి.
03:21 ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి ఇంకా అది చిక్కబడే వరకు దాన్ని ఉడికించండి.
03:25 మంటను ఆపివేయండి.ఇంకా, (గుడ్డు) ఎగ్ ప్యూరీ (మెత్తని పేస్ట్) సిద్ధంగా ఉంది.
03:30 కొంచంసేపు దాన్నిచల్లారనివ్వండి తరువాత అది శిశువుకు తినిపించండి.
03:34 మనం చూసే రెండవ వంటకం ఫిష్ (చేప) ప్యూరీ (మెత్తని పేస్ట్).
03:37 దీని కొరకు, మనకు అవసరమైనవి - స్థానికంగా లభించే ఏవైనా ఇటువంటి చేప ముక్కలు 2-

బ్లాక్ పోమ్‌ఫ్రేట్(నల్ల చందువాచేపలు), బాంబే డక్(వనమట్టాలు), వైట్ పోమ్‌ఫ్రేట్(తెల్ల చందువాచేపలు) మరియు స్క్విడ్(కాముతు సంచులు).

03:50 శుభ్రంచేసి కడిగిన రెండు చేప ముక్కలను ఒక స్టీల్ తపేలలో తీసుకోండి.
03:54 చేపముక్కలు మునిగే వరకు అందులో నీరు పోయండి. ఈ స్టీల్ తపేలాను ప్రెజర్ కుక్కర్‌లో ఉంచండి.
04:00 ఇంకా దాన్ని 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ప్రెజర్ కుక్ చేయాలి.
04:04 దానిని కొద్దిసేపు చల్లారనివ్వండి తర్వాత ఆ చేపముక్కలను బయటకుతీసి ఒక ప్లేటులో ఉంచండి.
04:10 ఇప్పుడు, జాగ్రత్తగా ముళ్ళన్నిటిని తీసేయండి.
04:13 ఈ చేపల ముళ్ళు శిశువును ఉక్కిరిబిక్కిరి చేయగలవు కనుక శిశువుకు ఆహారం ఇవ్వడానికి ముందే ఇలాచేయడం చాలాముఖ్యం.
04:22 ఇప్పుడు, ఒక మిక్సర్లో, ఉడికించిన చేపలను ప్యూరీ చేసి శిశువుకు తినిపించండి.
04:28 మూడవ వంటకం అరటికాయ, చేపతో (జావ) గంజి.
04:32 దీనిని తయారు చేయడానికి, మనకు అవసరమైనవి 2 టేబుల్ స్పూన్ల అరటికాయపొడి, బాంబే డక్ (వనమట్టాలు) చేప లేదా ఏదయినా స్థానికంగా లభించే చేప 4చిన్న ముక్కలు.
04:41 మొదట, మనం అరటికాయ పొడి తయారీతో ప్రారంభిస్తాము.
04:46 మీ ప్రాంతంలో స్థానికంగా లభించే ఏదైనా రకానికి చెందిన 2 అరటికాయలు తీసుకోండి.
04:51 పీలర్ ఉపయోగించి వాటి తొక్కను తీసేయండి.ఇప్పుడు, ఈ అరటికాయలను పల్చని బల్లలుగా కట్ చేసుకోండి.
04:58 ఈ ముక్కలను గలగలలాడే వరకు 1 నుండి 2 రోజులు నీడలో ఆరబెట్టండి.
05:05 తరువాత ఈ ఎండిన అరటికాయ ముక్కలను మిక్సర్లో వేసి పొడి తయారుచేయండి.
05:10 ఈ పొడిని జల్లించి విత్తనాలను తీసేయండి.
05:13 అరటికాయ పొడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది.
05:17 తరువాత, చేపల (ఫిష్) ప్యూరీ (మెత్తని పేస్ట్) ని తయారు చేయడానికి- మునుపటి వంటకంలో పేర్కొన్న సూచనలను అనుసరించండి.
05:24 ఆ తరువాత, ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల అరటికాయ పొడిని తీసుకోండి.
05:29 అందులో 3 టీస్పూన్ల నీళ్లు వేసి ఉండలు కట్టకుండా ఉండటానికి దానిని బాగా కలపండి.
05:35 ఒకవేళ అవసరమైతే మరికొంచం నీళ్లు వేయండి.
05:38 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 5 నుండి 7 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
05:43 ఆ తరువాత, వండిన చేపల ప్యూరీ (మెత్తని పేస్ట్) ని అందులో వేయండి.
05:47 ఈ మిశ్రమాన్నిఆలా కలుపుతూ తక్కువ మంట మీద మరో 4-5 నిమిషాలు ఉడికించండి.
05:53 అరటికాయ, చేపతో (జావ) గంజి సిద్ధంగా ఉంది.దీన్నికొద్దిసేపు చల్లారనివ్వండి, తరువాత బిడ్డకు తినిపించండి.
06:01 ఇప్పుడు మనం నాల్గవ వంటకానికి వచ్చాము-చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్) ప్యూరీ (మెత్తని పేస్ట్).
06:06 దీన్ని తయారు చేయడానికి, మనకు అవసరమైనవి 1 చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్).
06:09 తయారీ విధానం: ఒక స్టీల్ తపేలాలో కడిగిన చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్) ను తీసుకొని తయారీని ప్రారంభించండి.
06:15 అది మునిగేంత వరకు నీళ్లు పోయండి.
06:18 ఇప్పుడు ఈ స్టీల్ తపేలాను ప్రెజర్ కుక్కర్లో ఉంచండి.
06:21 3 నుండి 4 విజిల్స్ వచ్చేవరకు దాన్నిప్రెజర్ కుక్కర్ లో ఉడికించాలి.
06:25 చల్లారిన తరువాత, దాన్ని తీసి ఒక ప్లేట్ లో ఉంచండి.
06:29 మిక్సీలో వేసి ఉడికించిన చికెన్ లివర్ (కోడి మాంసం కార్జమ్) యొక్క ప్యూరీ (మెత్తని పేస్ట్) ని తయారు చేసి శిశువుకు తినిపించండి.
06:37 ఇప్పుడు మనం ఐదవ వంటకం - చికెన్ (కోడి మాంసం) క్యారెట్ ప్యూరీ (మెత్తని పేస్ట్) ని చూస్తాము.
06:43 మనకు అవసరమైనవి: 4-5 చిన్న ముక్కలు చికెన్ బ్రెస్ట్ లేదా బోన్‌లెస్ చికెన్ మరియు 1 క్యారెట్,
06:50 కడిగిన చికెన్ ముక్కలను ఒక స్టీల్ తపేలాలో తీసుకొని తయారీని ప్రారంభించండి.

తరువాత అది మునిగేవరకు నీళ్లు పోయండి.

07:00 ఇప్పుడు, ఈ స్టీల్ తపేలాను ప్రెజర్ కుక్కర్లో ఉంచి 3 నుండి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
07:07 దీన్నికొద్దసేపు చల్లారనివ్వండి.ఆపైన చికెన్ ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వండి.
07:15 తరువాత, క్యారెట్‌ను 10 నిమిషాలు ఆవిరిలో ఉడికించి దాన్ని చల్లారనివ్వండి.
07:20 మిక్సర్ లో వేసి ఉడికించిన చికెన్ ముక్కలు మరియు ఉడికించిన క్యారెట్ యొక్క ప్యూరీ (మెత్తని పేస్ట్) ని తయారు చేయండి.
07:26 ఈ వంటకాలలోని పోషక పదార్ధాల విషయానికి వస్తే - ఈ వంటకాలన్నీ వీటితోసమృద్ధిగా ఉన్నాయని గమనించండి.-

ప్రోటీన్,

07:36 DHA & EPA ఇవి ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్,
07:42 కొలిన్,
07:45 విటమిన్ A,
07:49 విటమిన్ D,
07:52 విటమిన్ B3,
07:57 విటమిన్ B6,
08:01 ఫోలేట్,
08:04 విటమిన్ B12,
08:08 జింక్,
08:11 మెగ్నీషియం,
08:14 ఐరన్,
08:18 ఫాస్ఫరస్,
08:21 కాపర్ మరియు సెలీనియం.
08:28 ఈ పోషకాలు మాంసాహార ఆహార వనరులలో సులభంగా లభిస్తాయి.
08:33 అందువల్ల అవి శిశువు యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి, అభివృద్ధి చేయడానికి మరియు బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
08:40 ఇది 6 నెలల వయస్సున్న శిశువుల కొరకు మాంసాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి మనల్ని తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Simhadriudaya