Health-and-Nutrition/C2/General-guidelines-for-Complementary-feeding/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:54, 14 August 2020 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:02 | పరిపూరకమైన ఆహరం కొరకు సాధారణ మార్గదర్శకాలపై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము. |
00:14 | 6నెలల వయస్సుగల శిశువులకు పరిపూరకమైన ఆహారాన్ని ప్రారంభించడం యొక్క ప్రాముఖ్యత |
00:19 | మరియు 6 నుండి 24 నెలల వయస్సు గల పిల్లల కొరకు పరిపూరక ఆహారాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు. |
00:27 | మనం ప్రారంభిద్దాం. |
00:29 | ఒక బిడ్డకు పుట్టిన సమయం నుండి 6 నెలల వయస్సు వరకు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వాలి. |
00:37 | 6నెలల వయస్సు అంటే శిశువు జీవితంలో 6 వ నెల యొక్క ప్రారంభం అనే అర్ధం కాదు. |
00:45 | ఆమె తన జీవితంలో 6 నెలలు పూర్తి చేసి, 7 వ నెలను ప్రారంభించింది అని అర్ధం. |
00:52 | ఈ వయస్సులో, ఒక బిడ్డకు ప్రత్యేకంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం సరిపోదు. |
00:59 | తల్లిపాలతో పాటు, పౌష్టికమైన ఇంట్లో వండిన ఆహారాన్ని శిశువుకు ఇవ్వాలి. |
01:06 | ఈ ఆహారాన్ని పరిపూరకమైన ఆహారం అంటారు. |
01:11 | దీనిని ఒక బిడ్డకు 6 నెలల వయస్సు నుండి 24 నెలల వయస్సు వరకు తప్పకుండా ఇవ్వాలి. |
01:18 | బిడ్డను పొడవుగా, ఆరోగ్యంగా మరియు తెలివైనవాడిగా చేయడంలో ఇది కీలక పాత్రను పోషిస్తుంది. |
01:26 | 6 నెలల వయస్సులో పరిపూరకమైన ఆహారాన్ని ప్రారంభించడం చాలా ముఖ్యం. |
01:33 | లేకపోతే, శిశువు యొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. |
01:39 | తరువాతి వయస్సులో శిశువు ఘనపదార్ధ ఆహారాన్ని తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. |
01:47 | గుర్తుంచుకోండి, పరిపూరకమైన ఆహారం అనేది తల్లి పాలివ్వడానికి సహాయం ఇస్తుంది. |
01:53 | అందువల్ల, కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తల్లి పాలివ్వడాన్ని కొనసాగించాలి. |
02:00 | రకం, |
02:02 | చిక్కదనం |
02:04 | మరియు పరిపూరకమైన ఆహారం యొక్క పరిమాణం అనేవి శిశువు యొక్క వయస్సుతో పాటు మారుతాయి. |
02:10 | ప్రతి వయస్సు వారి కొరకు నిర్దిష్టమైన సిఫార్సులు ఉన్నాయి. |
02:16 | ఇదే సిరీస్‌లోని మరొక ట్యుటోరియల్‌లో అవి వివరంగా చర్చించబడ్డాయి. |
02:23 | ఇప్పుడు, మనం అన్ని వయసులవారి కొరకు పరిపూరకమైన ఆహారం యొక్క ముఖ్యమైన మార్గదర్శకాలను చర్చిద్దాం. |
02:31 | ఏదైనా కొత్త ఆహారన్ని శిశువుకు మొదట విడిగా ఇవ్వాలి. |
02:37 | ఆ తరువాత దానిని ఇతర ఆహారాలతో కలిపి ఇవ్వాలి. |
02:42 | శిశువుకు ఒక నిర్దిష్ట ఆహారానికి సంబంధించి అలెర్జీ ఉందో లేదో అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది. |
02:48 | మంచి పోషకాలు పొందడానికి రకరకాల ఆహారాలు తినడం చాలా అవసరం. |
02:54 | ప్రతి 4వ రోజు, శిశువు యొక్క ఆహారంలో ఒక కొత్త రకం ఆహారాన్ని జోడించండి. |
03:01 | మునుపు ఇచ్చిన ఆహారంతో పాటు 1 టేబుల్ స్పూన్ కొత్త ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించండి. |
03:08 | క్రమంగా ప్రతిరోజూ దాని పరిమాణాన్నిపెంచండి. |
03:12 | మొత్తం 8 రకాల ఆహార వర్గాల నుండి పౌష్టికమైన ఆహారాన్ని క్రమంగా చేర్చాలి. |
03:20 | మొదటి ఆహార వర్గం అనేది ధాన్యాలు, వేర్లు (మూలాలు) మరియు దుంపలు. |
03:27 | చిక్కుళ్ళు, విత్తనాలు మరియు కాయలు అనేవి రెండవ వర్గం. |
03:32 | మూడవ వర్గం పాల ఉత్పత్తులు. |
03:37 | నాల్గవ వర్గం మాంసం, చేపలు మరియు చికెన్. |
03:42 | గుడ్డు అనేది ఐదవ వర్గం. |
03:46 | విటమిన్ ఎ అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు అనేవి ఆరవ వర్గం. |
03:52 | ఏడవ వర్గం అనేది ఇతర పండ్లు మరియు కూరగాయలు. |
03:57 | చివరగా, తల్లి పాలివ్వడం అనేది ఎనిమిదవ వర్గం కాని ఇది అతి ముఖ్యమైనది. |
04:04 | ఇది ఇతర ఆహార వర్గాలతో పాటు ప్రతిరోజూ తప్పనిసరిగా చేర్చబడాలి. |
04:11 | ఇంచుమించుగా, శిశువు యొక్క ఆహారంలో మొత్తం 8 ఆహార వర్గాలు ఉండాలి. |
04:17 | ఒకవేళ శిశువు యొక్క ఆహారంలో, ఈ వర్గాలలో 5 కన్నా తక్కువ ఉంటే, అది తీవ్రమైన సమస్య అవుతుంది. |
04:24 | దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలి. |
04:28 | కొంతమంది శిశువులు తల్లి పాలను పొందే అవకాశాన్నిఅస్సలు కలిగి ఉండరు. |
04:33 | ప్రతిరోజూ మిగిలిన 7 వర్గాల నుండి ఆహారాన్ని అటువంటి వారి ఆహారంలో చేర్చండి. |
04:40 | అలాగే, వారికి ఒక రోజుకు 500 మి.లీ జంతువుల పాలు మరియు అదనంగా 2 సార్లు భోజనాన్ని ఇవ్వండి. |
04:49 | జంతువుల పాలను శిశువుకు ఇచ్చే ముందు ఎల్లప్పుడూ వాటిని మరగబెట్టండి. |
04:55 | ఇప్పుడు, మనం ఒక శిశువు యొక్క ఆహారంలో కొత్త ఆహార వర్గాలను చేర్చే క్రమాన్ని చర్చిద్దాం. |
05:02 | తల్లి పాలివ్వడంతో పాటు, మొదటి 5 ఆహార వర్గాల నుండి పరిపూరకమైన ఆహారాన్ని ఇవ్వడాన్ని ప్రారంభించండి. |
05:09 | 6నెలల వయస్సు తర్వాత ఒక బిడ్డకు ఎక్కువ మొత్తంలో పోషకాలు అనేవి అవసరం. |
05:16 | ఏదేమైనా, ప్రారంభించిన మొదటి రోజుల్లో ఇవ్వగలిగే ఆహార పరిమాణం అనేది చాలా తక్కువ. |
05:24 | అందువల్ల, మొదటి 5 ఆహార వర్గాల నుండి పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వవచ్చు. |
05:31 | ఈ ఆహారాలలో ప్రోటీన్ మరియు మంచి కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. |
05:38 | శిశువు యొక్క ఎత్తు మరియు కండరాల పుష్టి పెరగడానికి అవి ముఖ్యమైనవి. |
05:45 | శిశువు యొక్క మెదడు అభివృద్ధికి మంచి కొవ్వులు అనేవి ముఖ్యమైనవి. |
05:50 | ఈ ఆహారాల తరువాత, కూరగాయలు మరియు పండ్లు ఇవ్వడం ప్రారంభించండి. |
05:57 | కూరగాయలు మరియు పండ్లలో వైటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. |
06:03 | అయినప్పటికీ, అవి మొదటి 5 ఆహార వర్గాల మాదిరిగా ప్రోటీన్ మరియు కొవ్వులు ఎక్కువగా కలిగి ఉండవు. |
06:11 | అందువల్ల, బరువు నిలిచిపోవడం లేదా తగ్గిపోవడాన్నినివారించడానికి వాటిని తరువాత ప్రారంభిస్తారు. |
06:18 | అలాగే, పండ్లు రుచికి తియ్యగా ఉంటాయి. |
06:23 | పిల్లలు తీపి రుచి కంటే ముందు వేరువేరు రకాల రుచులను ప్రయత్నించడం ముఖ్యం. |
06:31 | విభిన్న రుచులను ప్రయత్నించడం అనేది పిల్లలు ఎక్కువ రకాల ఆహారాలను ఇష్టపడటానికి సహాయపడుతుంది. |
06:37 | ఇది వారు తరువాత కాలంలో ఎంచుకుని (పిక్కీ) తినేవారిగా మారే అవకాశాలను తగ్గిస్తుంది. |
06:44 | అందువలన, అన్ని ఇతర రకాల ఆహారాలను చేర్చిన తర్వాతనే పండ్లు శిశువు యొక్క ఆహారంలో చేర్చబడతాయి. |
06:51 | తాజావి, కాలానుగుణంగా, స్థానికంగా లభించే పండ్లను రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఇవ్వడం మంచిది. |
06:59 | పండ్లను సాధారణ భోజనం తర్వాత ఫలాహారంగా (డెజర్ట్‌గా) ఇవ్వవచ్చు. |
07:05 | పండ్లతో చేసిన ప్యూరీని శిశువు యొక్క సాధారణ భోజనంతో కలపకూడదు. |
07:11 | ఈ వయస్సులో పిల్లలకు పండ్ల రసం సిఫారసు చేయబడలేదు. |
07:16 | ఇంట్లో తయారుచేసినవి మరియు రెడీమేడ్ గా దొరికే పండ్ల రసాలు రెండూ ఇందులోకే వస్తాయి. |
07:23 | గుర్తుంచుకోండి, 2 సంవత్సరాల వయస్సు వరకు తల్లి పాలివ్వడాన్ని కొనసాగించాలి. |
07:28 | హార్డ్ ఫుడ్స్ (గట్టి ఆహారాలు) ఇవ్వడాన్ని మానేయండి అవి శిశువును ఉక్కిరిబిక్కిరి చెయ్యవచ్చు. |
07:34 | పూర్తి గింజలు, ద్రాక్ష, శనగలు మరియు పచ్చి క్యారెట్ ముక్కలు అనేవి అటువంటి ఆహారాలకు ఉదాహరణలు. |
07:44 | తాజాగా వండిన ఇంట్లో తయారుచేసిన ఆహారం, పరిశుభ్రంగా తయారుచేయడం, శిశువుకు ఉత్తమమైనది. |
07:51 | ఒకవేళ శిశువు ఆహారాన్ని నిల్వ చేయవల్సివస్తే, దయచేసి సురక్షితంగా నిల్వచేయడం పై మా ట్యుటోరియల్ చూడండి. |
07:57 | శిశువు ఆహారాన్ని సురక్షితంగా తయారుచేయడం మరియు అందించడం కూడా అదే ట్యుటోరియల్‌లో చర్చించబడింది. |
08:06 | మరిన్ని వివరాల కొరకు దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
08:10 | ఆహారంతో పాటు, మరిగించి చల్లార్చిన నీటిని కూడా 6 నెలల శిశువుకు ఇవ్వవచ్చు. |
08:18 | రోజుకు రెండుసార్లు చొప్పున 30 నుండి 60 మి.లీ నీటితో ప్రారంభించండి. |
08:25 | ఇది వేడి వాతావరణంలో మరియు శిశువు యొక్క అవసరాన్ని బట్టి పెంచాలి. |
08:31 | తల్లి పాలు మరియు నీరు అనేవి ఒక శిశువుకు ఉత్తమమైన పానీయాలు. |
08:37 | అయితే, అవి సమయానుసారంగా సరిగ్గా ఉండాలి. |
08:42 | భోజనానికి ముందు శిశువుకు తల్లిపాలు లేదా నీళ్లు ఇవ్వకండి. |
08:48 | ఆకలితో ఉన్న శిశువు కొత్త ఆహారాల్ని ప్రయత్నించే అవకాశం ఎక్కువ ఉంటుంది. |
08:54 | బిడ్డకు భోజనానికి 20 నుండి 30 నిమిషాల ముందు లేదా తర్వాత తల్లిపాలు లేదా నీరు ఇవ్వవచ్చు. |
09:02 | శిశువు బాగా ఎదగడానికి తగిన పరిపూరకమైన ఆహారాన్ని ఇవ్వడం అవసరం. |
09:08 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |