Health-and-Nutrition/C2/Breast-crawl/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | తొలిసారి ముర్రుపాలు పట్టించటం పై ఈ స్పొకన్ టుటొరియల్ కి స్వాగతం. |
00:05 | ఈ టుటొరియల్ లొ మనము మొదటి సారి స్తనపానం చేయించడం, |
00:10 | ముర్రుపాలు పట్టించే విధానం మరియు |
00:13 | బ్రెస్ట్ క్రాల్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. |
00:18 | ముందుగా బ్రెస్ట్ క్రాల్ అంటె ఏమిటి? అని తెలుసుకుందాం. |
00:23 | ఒక బిడ్డ పుట్టుకతోనే తల్లిపాలను సేవించే గుణాన్ని కలిగిఉంటుంది. |
00:28 | ప్రసవం జరిగిన వెంటనే తల్లి రొమ్ముకు దగ్గరగా పొట్టపైన బిడ్డను బోర్లా పడుకొపెడితె ఆ బిడ్డ తల్లి రొమ్ముని గుర్తించి పాలను త్రాగడం ప్రారంభిస్తుంది. |
00:40 | ఈ మొత్తం ప్రక్రియను బ్రెస్ట్ క్రాల్ అంటారు. |
00:46 | ఈ పూర్తి ప్రక్రియను నార్మల్ డెలివరీ ద్వారా లేదా సిజేరియన్ డెలివరీ ద్వారా పుట్టిన ప్రతి ఆరొగ్యవంతమైన బిడ్డ మరియు |
00:58 | పుట్టిన వెంటనే బాగా ఏడ్చిన బిడ్డ చేయగలదని గమనించాలి. |
01:03 | ఈ ప్రక్రియను అనారోగ్యంతొ పుట్టిన బిడ్డలకు మరియు పుట్టుకతో తక్కువ బరువు ఉన్న బిడ్డలకు చెయ్యకూడదు; చేయిస్తే వారు ఊపిరి అందకపోవడం వంటి సమస్యలతో బాధపడవచ్చు. |
01:15 | ఇప్పుడు, మనం స్తనపాన విధానాన్ని ఆ తరువాత దానియొక్క యొక్క ప్రాముఖ్యతను గురించి నేర్చుకుంటాము. |
01:22 | ముందు, కాన్పుచేసే గది ఉష్ణోగ్రత దాదాపుగా 26 డిగ్రీల సెల్సియస్ ఉంది అని నిర్ధారించుకోండి. |
01:29 | తరువాతది బిడ్డను తల్లి పొత్తికడుపుపై పడుకోపెట్టి శుభ్రపరచడం. |
01:35 | బిడ్డ చేతులు తప్ప పూర్తి శరీరాన్ని శుభ్రమైన పొడిగుడ్డతొ బాగా శుభ్రం చేయాలి. |
01:42 | బిడ్డ చేతులు మాత్రం తడిగానే ఉంచాలని గుర్తుపెట్టుకోండి. |
01:46 | శుభ్రం చేసేటప్పుడు బిడ్డ చర్మంపై ఉన్న తెల్లని రక్షణ పొరను తొలగించవద్దు. |
01:53 | ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే అది శిశువును రక్షిస్తుంది. |
01:56 | బిడ్డను శుభ్రం చేసిన తరువాత తడిగుడ్డను తీసేయండి. |
02:01 | బిడ్డను తుడిచిన తరువాత, ప్రసవం చెసేవ్యక్తి బొడ్డునాడి కొట్టుకోవడాన్ని గమనించాలి. |
02:08 | బొడ్డునాడి కొట్టుకోవడం ఆగిన తరువాత ఆమె బొడ్డుతాడు ను కత్తిరించాలి. |
02:13 | తరువాత, బిడ్డని తన కడుపుతో తల్లి కడుపుని తాకే విధంగా తల్లి యొక్క పొత్తికడుపుపై మరోసారి పడుకోపెట్టండి. |
02:22 | బిడ్డ తలను తల్లి యొక్క కడగని రొమ్ముల మధ్య ఉంచాలి. |
02:26 | బిడ్డనోరు తల్లి రొమ్ము క్రింద ఉండేలా చూసుకొండి. |
02:30 | ఇప్పుడు బిడ్డ మొదటిసారి ముర్రుపాలు త్రాగే౦దుకు తయారుగా ఉంచబడినది. |
02:37 | నవజాత శిశువుకు ముందుకు పాకడం అనేది చాలా సహజం కనుక, బిడ్డ సులభంగా ప్రాకుతూ తల్లి రొమ్ము వైపు చేరుకోగలదు. |
02:46 | తరువాత చేయవలసిన విషయం ఏమిటంటే-తల్లి బిడ్డలను వెచ్చగా ఉంచడానికి వారిద్దరిని శుభ్రమైన పొడి వస్త్రంతో కప్పండి. |
02:54 | బిడ్డ తలపై ఒక టోపీని ఉంచండి |
02:57 | దయచేసి గమనించండి- మేము తరువాతి చిత్రాలలో టోపీ మరియు వస్త్రాన్ని చూపించలేదు. |
03:04 | మొదటిసారి జరిగే స్తనపాన సమయంలో బిడ్డను ఎలా పడుకోబెట్టాలి అని స్పష్టంగా గమనించడానికి ఇది మనకు సహాయపడుతుంది. |
03:10 | బిడ్డను గుడ్దతో కప్పిన తరువాత, బిడ్డ వీపుకి తల్లి చేతులతో ఆసరా ఇవ్వాలి. |
03:18 | మొదటిసారి స్తనపానం చేయడంలో సహాయపడే బిడ్డకుగల సామర్థ్యాలను చర్చిద్దాం. |
03:24 | ప్రసవం తరువాత బిడ్డ చాలా అప్రమత్తంగా మరియు సహజంగా ఉంటుంది.. |
03:29 | తన శుభ్రపరచని చేతి వాసన తన నోటిలో లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. |
03:35 | అలాగే, తనకు ఉన్న పరిమిత దృష్టితో బిడ్డ, తన తల్లి ముఖాన్ని మరియు చూచుకాన్ని చూడవచ్చు |
03:43 | చూచుకము అనగా చనుమొన చుట్టూ ఉన్న నల్లనిప్రదేశం. |
03:47 | చివరికి, బిడ్డ తన చేతులు మరియు కాళ్ళను ఉపయోగించి కదలడం ప్రారంభిస్తుంది. క్రమంగా తన తల్లి రొమ్ము వైపు పాకుతుంది. |
03:57 | అయితే, కొంతమంది పిల్లలు వెంటనే ప్రాకడం ప్రారంభిస్తారు మరికొందరు ప్రాకడానికి కొంత సమయం తీసుకుంటారు. |
04:04 | స్తనాలను చేరుకొన్న తరువాత బిడ్డ ముందుగా తన చేతులతో స్తనాలను పట్టుకునే౦దుకు ప్రయత్నిస్తుంది. |
04:12 | ఈ సమయంలో బిడ్డ మొదటి స్తనపాలను తీసుకునే వరకు తల్లిబిడ్డలకు ఏ ఆటంకం కలిగించవద్దు. |
04:20 | ఈ ప్రక్రియలొ ప్రసవం చేసినవారు మరియు తల్లి ఇద్దరూ ఓర్పుతో ఉండాలి. |
04:27 | మొదటి స్తనపానం కొరకు బిడ్డ తన తల్లి రొమ్ము వరకు చేరుకోవడానికి 30-60 నిమిషాలు పట్టవచ్చు |
04:35 | తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించేటప్పుడు, బిడ్డ తన నోటిని వెడల్పుగా తెరిచి, తల్లి రొమ్మును లోతుగా నోటిలోనికి తీసుకుంటుంది. |
04:45 | పాలను పట్టడం పూర్తయిన తరువాత, బిడ్డను ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు అదే స్థితిలో ఉండనివ్వండి. |
04:52 | అలా చేయడం, తల్లి మరియు బిడ్డల మధ్య బంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. |
04:58 | అయితే, తల్లి ఏదైనా మందులు తీసుకుంటే దయచేసి వైద్యుడిని సంప్రదించండి. |
05:05 | కొన్నిసార్లు ప్రసవం తరువాత ఇలా జరుగవచ్చు,తల్లి ప్రసవించిన గదినుండి మరొకగదికి వెళ్ళవలసి రావచ్చు. |
05:13 | అలాంటి సందర్భాల్లో, తల్లిని వేరే గదికి మార్చిన తరువాత, తల్లిబిడ్డలను ఒకరి చర్మాన్ని ఒకరు తాకేలా చెయడానికి ముందుగా చర్చించినట్లుగా బిడ్డను వెంటనే తల్లి పొత్తికడుపుపై ఉంచండి. |
05:29 | ఇప్పుడు, సిజెరియన్ అయినప్పుడు బిడ్డకు తొలిసారి తల్లిపాలను ఎలా పట్టించాలి అనేదాని గురించి చర్చించుకుందాం.. |
05:35 | అలా చేయడానికి, బిడ్డను తల్లి పొత్తికడుపుకు బదులుగా ఎదపై ఉంచాలి- శిశువు యొక్క కాళ్ళు తల్లి తల వైపు ఉండాలి. |
05:47 | బిడ్డ ఎద మరియు పొట్ట తల్లిభుజాలపై మరియు బిడ్డనోరు తల్లి స్తనాలపై ఉండాలి. |
05:54 | బిడ్డను తల్లిస్తనాలను ఎంతసేపు ఐతే అంతసేపు చీకేందుకు వీలుగా ఆపరేషన్ థియేటర్ లోనే ఉంచండి. |
05:59 | గుర్తుంచుకోండి, ప్రసవించిన వెంటనే, నవజాత శిశువుల సంరక్షణ కంటే తల్లీబిడ్డల చర్మాలు తాకించడం అనేది చాల ముఖ్యమైనది. |
06:09 | .మొదటిసారి స్తనపానం పూర్తయిన తర్వాత మాత్రమే, ప్రసవం తర్వాత చేయాల్సిన నవజాత స౦రక్షణ ప్రక్రియలను చేయాలి. |
06:17 | ఇప్పుదు మొదటిసారి స్తనపానం వల్ల నవజాత శిశువుకు కలిగే ప్రయోజనాలగురించి తెలుసుకుందాం. |
06:23 | Breast crawl అనేది కొలోస్ట్రుం అని పిలువబడే తల్లి యొక్క మొదటి పాలను బిడ్డ పొందేలా చేస్తుంది |
06:29 | ఇది పసుపురంగు కలిగిన మందమైన ద్రవం. |
06:33 | ప్రసవం తరువాత, తల్లి పాలిచ్చే ప్రతిసారి బిడ్డ తీసుకునే కొలొస్ట్రమ్ పరిమాణం క్రమంగా పెరుగుతుందని గమనించండి |
06:43 | బిడ్డ మొదటిరోజు 5 మిల్లిలీటర్లు త్రాగుతుంది. |
06:47 | రెండోవరోజు 10 మిల్లిలీటర్లు, |
06:50 | మూడొవరోజు 25 మిల్లిలీటర్లు, |
06:53 | నాల్గొవరోజు 40 మిల్లిలీటర్లు, ఐదవరోజు 55 మిల్లిలీటర్లు, ఇలా ప్రతిసారి స్తనపాన సమయంలో ప్రతి రొమ్ము నుండి పెరుగుతూ పోతుంది. |
07:05 | ఇది నవజాత శిశువుకు సరిపోతుంది. |
07:09 | అందువల్ల శిశువుకు కొలొస్ట్రమ్ కాకుండా వేరే ఆహారం ఏది ఇవ్వకూడదు. |
07:15 | ముర్రుపాలలోని కొలోస్ట్రం నవజాత శిశువుకి మొదటి వ్యాక్సినేషన్లా పరిగణించబడుతుంది. ఇది క్రిములతొ పొరాడే మాంసకృత్తులు కలిగిఉంటుంది; అందువల్ల శిశువులొ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. |
07:27 | తల్లి ప్రసవించిన తరువాత ఇది బిడ్డకు శక్తిని ఇచ్చే మొదటి వనరు. |
07:33 | ముర్రుపాలు (కొలోస్ట్రం) రక్తంలొ గ్లూకొస్ తగ్గకుండా అపుతుంది. |
07:37 | ఇది శిశువు యొక్క ఇతర శరీర ప్రక్రియలను నిర్వహించడానికి సహాయపడుతుంది. |
07:42 | ఇది ఆరోగ్యవంతంగా మెదడుపెరుగుదలకు సహాయపడుతుంది. |
07:46 | ఇది శిశువుకు సౌఖ్యంగా మొదటి మలవిసర్జనకు సహాయపడుతుంది. |
07:50 | Breast crawl వల్ల తల్లిచర్మం తాకటంవల్ల శిశువుకు కావల్సిన వెచ్చదనం లభిస్తుంది. |
07:57 | బిడ్డ తల్లి రొమ్మును ఎలా లోతుగా అందుకోవాలో స్వయంగా నేర్చుకుంటుంది. |
08:04 | Breast crawl వల్ల తల్లిలోని ఆరొగ్యకరమైన సూక్ష్మజీవులు శిశువుకి అందుతాయి. |
08:08 | ఈ సూక్ష్మజీవులు శిశువు పేగులొచేరి రొగాణువులతొ పోరాడుతాయి. |
08:13 | దీనివలన శిశువుయొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. |
08:18 | Breast crawl తల్లిబిడ్డల మధ్య ప్రేమ మరియు భద్రతాభావాలు పెంచి తల్లిబిడ్దల బాంధవ్యాన్ని పెంపొందిస్తుంది. |
08:29 | బ్రెస్ట్ క్రాల్ నుండి తల్లులకు కూడా ప్రయోజనం ఉంటుంది. |
08:34 | శిశువు యొక్క కాలు కదలికలు తన తల్లి గర్భంపై ఒత్తిడి తెస్తాయి. ఈ పీడనం గర్భాశయ సంకోచానికి మరియు మావిని బయటకి పంపే౦దుకు సహాయపడుతుంది. |
08:45 | తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించడం అనేది తల్లి శరీరంలో ఆక్సిటోసిన్ని పెంచుతుంది. |
08:51 | ఆక్సిటోసిన్ పెరుగుదల అనేది మావిని తొలగించడానికి సహాయపడుతుంది. |
08:56 | అందువలన breast crawl అనేది తల్లిలో రక్తస్రావం తగ్గించి అనీమియా కలగనివ్వదు. |
09:03 | అనీమియా అంటె రక్తంలో ఎరుపు రక్తకణాలు తగ్గిపోవడం. |
09:08 | ఇది తల్లిలో అలసట మరియు బలహీనతకు దారితీస్తుంది. |
09:13 | అందువల్ల, స్తనపానం అనేది తల్లి మరియు ఆమె బిడ్డకు అత్యంత ప్రయోజనకరమైన సహజ ప్రక్రియ. |
09:21 | ఇంతటితో breast craw పై ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
09:24 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి, మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద తీసుకుంటున్నాను పాల్గొన్నందుకు ధన్యవాదములు. |