Health-and-Nutrition/C2/Breastfeeding-latching/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:02 | స్తనపాన సమయంలో బిడ్డ తల్లి రొమ్మును పట్టుకునే తీరుపై ఈ స్పొకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటొరియల్ లో మనం, బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా అందుకుని పట్టుకునిఉండటానికి సరైన మెళకువలను, మరియు తల్లి ఎంత తరచుగా పాలను పట్టిస్తూఉండాలి అనేవాటిని గురించి నేర్చుకుంటాము. |
00:20 | మనం ప్రారంభించడానికి ముందు,స్తనపానం బాగా జరగడానికి, బిడ్డ స్తనాన్ని నోటితొ సరిగ్గా పట్టుకొవడం అనేది చాలా ముఖ్యం అని దయచేసి గమనించండి. |
0:29 | బిడ్డ తన నోటితో తల్లి రొమ్మును పట్టుకోవడం అనేది సరిగ్గా లేకపోతే అప్పుడు బిడ్డ చనుమొన దగ్గర నుండి మాత్రమే పాలను తాగగలదు. |
00:36 | దీనివల్ల బిడ్డకు చాలా తక్కువ పాలు లభిస్తాయి. |
00:40 | కనుక తల్లి రొమ్ము యొక్కచనుమొన చుట్టూ ఉన్న నల్లని పరిసరం దిగువ భాగాన్ని బిడ్డ తన నోటితో లోతుగా పట్టుకుంటే అది బిడ్డకు తగినన్ని పాలను ఇస్తుంది. |
00:50 | దయచేసి గమనించండి, అరియోలా అంటే చనుమొన చుట్టూ ఉన్న నల్లనిప్రాంతం. |
00:56 | ఇప్పుడు, ప్రారంభిద్దాం. ప్రారంభించడానికి,తల్లి తన బిడ్డను పాలివ్వడానికి తగిన విధంలో పట్టుకోవాలి. |
01:05 | ఇదే సిరీస్ యొక్క ఇతర వీడియోలలో ఈ పట్టుకునే విధానాలు వివరంగా వివరించబడ్డాయి. |
01:11 | ఈ టుటొరియల్ లో (క్రాస్ క్రెడల్ హొల్డ్) శిశువుని చేతితొ ఉయ్యాల లా పట్టుకొవడం గురించి వివరించబడుతుంది. |
01:16 | తల్లి పాలను చక్కగా పట్టించడానికి, బిడ్డ తల్లి రొమ్మును నోటితో బాగా పట్టుకోవడానికి, బిడ్డను సరైన పద్దతిలో పట్టుకోవడం అవసరం అని గుర్తుపెట్టుకోండి |
01:24 | ఈ చిత్రం లొ తల్లి శిశువుని క్రాస్ క్రెడల్ విధానం లొ సరిగ్గా పట్టుకు౦ది. |
01:31 | మరియు శిశువు స్తనపానం కొరకు స్తనాన్ని పట్టుకోవడానికి సిద్దంగా ఉంది. |
01:35 | బిడ్డ తల్లి రొమ్మును నోటిలో పెట్టుకోవడానికి ముందు, బిడ్డ తన నోటిని ఆవలించేటప్పుడు తెరిచినట్టుగా వెడల్పుగా తెరవాలి. |
01:42 | ఎందుకు? వడా పావ్ లేదా బర్గర్ ను పెద్దవాళ్ళు తినే విధానాన్ని చూడటం ద్వారా దీనిని అర్థం చేసుకుందాం. |
01:49 | వడా పావ్ లేదా బర్గర్ యొక్క పెద్ద ముక్కను కొరకడానికి మనం నోటిని వెడల్పు గా తెరుస్తాము. |
01:56 | అదేవిధంగా, నోటిని బాగా తెరిస్తే అది శిశువుకు తల్లి రొమ్ము యొక్క ఎక్కువ భాగాన్ని తన నోటిలోకి తీసుకోవడానికి సహాయపడుతుంది. |
02:04 | శిశివు నొరు బాగా తెరిచేటట్లు ప్రెరెపి౦చడానికి, శిశువు నోటిని బాగా తెరిచే వరకు తల్లి తన చనుమొనను శిశువు పై పెదవికి వ్యతిరేకంగా తేలికగా రుద్దుతూ ఉండాలి. |
02:16 | కొన్నిసార్లు, శిశువు నోటిని బాగా తెరవడానికి కొన్ని సెకన్ల నుండి 2 నిమిషాల సమయం పడుతుంది కనుక ఓర్పు తొ ఉండాలి. |
02:25 | ఏ విధానంలో పాలివ్వటానికైనా, తల్లి యొక్క వేళ్లు మరియు రొమ్మును పట్టుకున్న బొటనవేలు ఎల్లప్పుడూ శిశువు పెదాలకు సమాంతరంగా ఉండాలని గుర్తుంచుకోండి. |
02:36 | శిశువు నోటిని బాగా తెరిచినప్పుడు, బిడ్డ క్రింది పెదవి చనుమొన పరిసరం యొక్క కిందిభాగం వద్ద ఉండాలి. |
02:43 | మరియు చనుమొన అనేది బిడ్డ నోటి పైభాగానికి అందేలా ఉండాలి అంతేకాని నోటి మధ్యలోకి వచ్చేలా కాదు. |
02:50 | ఇప్పుడు, తల్లి త్వరగా తన స్తనాన్ని బిడ్డ నోటిలో ఉంచాలి. |
02:55 | ఆమె మొదట బిడ్డ యొక్క తలని కొద్దిగా బయటికి వంచి బిడ్డ గడ్డాన్ని స్వల్పంగా రొమ్ములోకి నొక్కాలి. |
03:02 | బిడ్డ నోటిలోకి స్తనాన్ని చేర్చడానికి ఆమె వెనుకకు వంగడం లేదా స్తనాన్ని నోటిలోకి నెట్టడం లాంటివి చేయకూదడదు. |
03:08 | శిశువు భుజాల వెనుక నుండి సున్నితంగా నెట్టడం ద్వారా శిశువును తల్లి రొమ్ము వద్దకు తీసుకురావాలి. |
03:15 | బిడ్డ తల్లి రొమ్మును నోటితో లోతుగా అందుకుని పట్టుకుని ఉండాలంటే ముఖ్యంగా తల్లియొక్క చనుమొన పరిసరం కిందిభాగం అనేది బిడ్డ నొటిలొ ఉండాలి. |
03:25 | ఇది చనుమొన అనేది శిశువు నోటిలోని సౌకర్యవంతమైన ప్రాంతానికి చేరుకోవడానికి సహాయపడుతుంది. |
03:31 | బిడ్డ తన నాలుకను తన క్రిందిపెదవి దగ్గర ఉన్న చనుమొన పరిసర భాగానికి వ్యతిరేకంగా నొక్కాలి. |
03:37 | ఇది పెద్ద పాల నాళాలపై ఒత్తిడి తెస్తుంది దానివల్ల ఎక్కువ పాలు బయటకు వస్తాయి. |
03:42 | తదుపరి దశ అనేది శిశువు తల్లి రొమ్మును లోతుగా పట్టుకునివుందో లేదో తనిఖీ చేయడం. |
03:48 | బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకుని ఉందని నిర్దారించుకోవడానికి, తల్లి ఈ క్రింది సంకేతాలను గమనించాలి: |
03:54 | బిడ్డ యొక్క నోరు బాగా తెరుచుకుని ఉంటుంది, |
03:57 | శిశువు యొక్క పై పెదవి దగ్గర కనిపించే చనుమొన పరిసరభాగం అనేది దిగువ పెదవి దగ్గర కనిపించేదానికంటే ఎక్కువ ఉంటుంది. |
04:06 | శిశువు యొక్క క్రింది గడ్డం పూర్తిగా తల్లి రొమ్ములో పొదిగి ఉంటుంది. |
04:11 | బిడ్డ పాలు మింగేటప్పుదు బిడ్డ దవడ వద్ద పాలచుక్కలు స్పష్టంగా ఉంటాయి. |
04:16 | మరియు, శిశువు యొక్క దిగువ పెదవి బయటి దిశలో వంకరగా ఉంటుంది. |
04:22 | అయినా నోటితో స్థనాన్ని లోతుగా పట్టుకున్న బిడ్డలో ఇది తల్లి రొమ్ములో దాగి పోతుంది. |
04:28 | అలాంటి సంధర్భాలలో, బిడ్డ క్రింది పెదవి దగ్గరగల స్తనాన్ని తేలికగా నొక్కి బిడ్డ యొక్క క్రింది పెదవి బయటి దిశలో వంకరగా ఉందో లేదో తనిఖీ చేయండి. |
04:41 | తరువాత, శిశువు యొక్క ముక్కును చూడండి.ఒకవేళ శిశువు యొక్క ముక్కు తల్లి రొమ్ముకు వ్యతిరేకంగా నొక్కితే, అప్పుడు- |
04:49 | తల్లి బిడ్డ యొక్క తలని కొద్దిగా బయటికి వంచవచ్చు, దానివల్ల శిశువు గడ్డం రొమ్ములోకి మరింత నెట్టబడుతుంది. |
04:58 | మరియు బిడ్ద ముక్కు ఇంకా నుదురు తల్లి రొమ్ము నుండి దూరం అవుతాయి. |
05:04 | ఇలా చేస్తే, బిడ్డ తల్లి రొమ్మును నోటితో పట్టుకోవడాన్ని మరింత లోతుగా ఉండేలా చేస్తుంది. |
05:09 | బిడ్డ యొక్క మొత్తం ముఖాన్ని రొమ్ము నుండి దూరంగా లాగవద్దు. |
05:13 | ఇది చనుమొన నుండి పాలను త్రాగటానికికారణమవుతుంది. |
05:16 | పాలను పట్టించడం అనేది తల్లికి సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకొండి. |
05:21 | ఆమెకు చనుమొనపై లాగినట్టు, గిల్లినట్లు లేదా రుద్దినట్లు అనిపించకూడదు. |
05:27 | ఒకవేళ పాలివ్వడం అనేది తల్లికి నొప్పిని కలిగిస్తే, అప్పుడు బిడ్డ తల్లి రొమ్మును లోతుగా పట్టుకోవడానికి అవ్వదు. |
05:35 | బిడ్డ తల్లి రొమ్మును సరిగ్గా పట్టుకొక పొవడానికి ఒక సాధారణ కారణాన్ని చూద్దాం. |
05:40 | చాలా మంది తల్లులు వారి చనుమొన పరిసరాన్ని నొక్కి, చనుమొనను మాత్రమే బిడ్డ యొక్కనోటి మధ్యలో పెడతారు. |
05:48 | ఇక్కడ, బిడ్డ యొక్కనోరు బాగా తెరచి ఉండదు. |
05:52 | బిడ్డకేవలం చనుమొనని మాత్రమే నోటిలో పెట్టుకొని ఉంటుంది. |
05:56 | ఇక్కడ, శిశువు యొక్క ఎగువ మరియు దిగువ పెదవి దగ్గర చనుమొన పరిసరం అనేది సమానంగా కనిపిస్తుంది. |
06:04 | బిడ్డ గడ్డం రొమ్ము నుండి బయటకు ఉంటుంది, |
06:07 | బిడ్డ పాలను త్రాగడానికి, ఆపకుండా త్వరత్వరగా రొమ్మును చీకే పద్దతి కలిగిఉంటుంది. |
06:14 | చీకేటప్పుడు బిడ్డ బుగ్గలు సొట్టలు పడి ఉంటాయి. |
06:17 | బిడ్డ పాలను మింగుతున్నట్లుగా దవడల నుండి పాలచుక్కలు స్పష్టంగా ఉండవు. |
06:23 | మరియు, చనుమొన అనేది బిడ్ద నోటిలోని గట్టి భాగానికి వ్యతిరేకంగా గిచ్చినట్టు, నొక్కినట్టు అవుతుంది. |
06:31 | ఇది తల్లికి చాలా నొప్పిగా ఉంటుంది మరియు చనుమొనకు గాయం కావొచ్చు. |
06:37 | అలాగే, చనుమొన నుండి మాత్రమే పాలని తాగేటప్పుడు, బిడ్డ అరియోలా క్రింద ఉన్న పెద్ద పాల నాళాల నుండి పాలను పొందలేదు. |
06:45 | అందువల్ల, బిడ్డకు తగినన్ని పాలు లభించవు. |
06:50 | ఒకవేళ బిడ్డకు చనుమొన నుండి మాత్రమే ఆహారాన్నిఇస్తున్నట్లయితే అప్పుడు- |
06:54 | తల్లి తన శుభ్రమైనచిటికెనవేలిని బిడ్డ నోటిచివరన మూలలో పెట్టాలి. |
06:59 | దీనిని ఆమె, చనుమొన పై లాగుతున్న బిడ్డనుండి విడిపించడానికి ఉపయోగించాలి. |
07:04 | తర్వాత ఆమె, బిడ్డ స్థనాన్ని లోతుగా పట్టుకోవడానికి బిడ్డను అదే రొమ్ముపై మళ్ళీ తిరిగి జతచేయాలి. |
07:11 | స్తనాన్ని సరిగ్గా పట్టించినతర్వాత, ముందుగా వచ్చే ఫొర్ మిల్క్ (నీళ్ళలాంటి పాలు) మరియు తర్వాత వచ్చె హైన్డ్ మిల్క్ (చిక్కటి పాలు) రెండూ బిడ్డకు తగినంతగా లభించేలా తల్లి చూసుకోవాలి. |
07:19 | ఫొర్ మిల్క్ అంటే స్తనానికి ముందు భాగం లో ఉండే నీళ్ళలాంటి పాలు. |
07:25 | ఇది ప్రొటీన్ మరియు నీళ్ళతో తయారవుతుంది. |
07:29 | ఇవి బిడ్డ పెరుగుదలకు మరియు బిడ్డ బలంగా ఎదగడానికి అవసరం. |
07:36 | హైన్డ్ మిల్క్ అంటే స్తనం యొక్క వెనుక భాగంలో ఉండే చిక్కటి పాలు. |
07:42 | ఇవి ప్రధానంగా కొవ్వు పదార్ధాలతో తయారవుతాయి. |
07:46 | ఇది బిడ్డ మెదడు పెరుగుదలకు మరియు బరువు పెరగడానికి అవసరం. |
07:53 | బిడ్డకు ఫొర్ మిల్క్ (నీళ్ళలాంటి పాలు) మరియు హైన్డ్ మిల్క్(చిక్కటి పాలు) రెండూ లభిస్తున్నాయని నిర్దారించుకోవడానికి- తల్లి మరొక స్తనం నుండి పాలను పట్టించే ముందు ఒక స్తనం నుండి వచ్చే పాలను పూర్తిగా బిడ్డకు పట్టించాలి. |
08:05 | ఆమె ఒక స్తనం నుండి వచ్చిన మొత్తం పాలను పూర్తిగా బిడ్డకు పట్టించిందో లేదో తనిఖీ చేయడానికి, తల్లి ఆ స్తనాన్ని తన చేతితో నొక్కి పాలు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. |
08:15 | ఒకవేళ ఆ రొమ్ము నుండి పల్చని నీళ్ళ లాంటి పాలు వస్తున్నట్లైతే, |
08:19 | లేదా ఒకవేళ ఆ రొమ్ము నుండి చిక్కటి హైన్డ్-మిల్క్ బాగా వస్తున్నట్లైతే, |
08:24 | అప్పుడు తల్లి తన బిడ్డకు అదే రొమ్ముతో తిరిగి పాలను పట్టించాలి. |
08:29 | చేతితో నొక్కిచూస్తే చిక్కని హైన్డ్ మిల్క్ రావడం అనేది కొన్ని చుక్కలకు తగ్గితే, |
08:35 | తల్లి ఆ రొమ్ము నుండి వచ్చిన పాలను పూర్తిగా బిడ్డకు పట్టించిందని దాని అర్థం. |
08:41 | కానీ,ఇంకొక స్తనం నుండి పాలిచ్చేముందు తల్లి బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టడం ద్వారా తేన్పు వచ్చేలా ప్రోత్సహించాలి, ఇప్పుడు బిడ్డ యొక్క మొండాన్ని కొద్దిగా ముందుకు వంచి, బిడ్డ దవడను తన చేతితో కప్పాలి. |
09:00 | బిడ్డకు 2 నుండి 3 నిముషాలలో తేన్పు రావాలి. |
09:04 | ఒకవేళ తరువాతి 5 నిముషాలలో తేన్పు రాకపొతే, |
09:08 | అంటే బిడ్డ తల్లి రొమ్మును చాల బాగా లోతుగా పట్టుకుందని. |
09:14 | బిడ్డ పాలను త్రాగేటపుడు ఎక్కువ గాలిని తన పొట్ట లోకి తీసుకోలేదు అని అర్ధం. |
09:21 | ఇప్పుడు, తల్లి తన మరొక స్తనాన్ని పాలని త్రాగేందుకు బిడ్డకు ఇవ్వాలి. |
09:26 | ఒకవేళ బిడ్డ కు కడుపు నిండితే, బిడ్డ ఇంకొ స్తనం నుండి పాలను తాగకపోవచ్చు. |
09:32 | కానీ తల్లి ఎప్పుడూ బిడ్డకు తన రెండు స్తనాల నుండి పాలను పట్టించాలి. |
09:39 | పాలను తాగాలా వద్దా అనే చివరి నిర్ణయాన్నిఆమె బిడ్డకు వదిలేయాలి. |
09:45 | తల్లి పాలిచ్చేటప్పుడు బిడ్డ నిద్రలోకి వెళితే, తల్లి బిడ్డ యొక్క అరిపాదాలను సున్నితంగా నొక్కడం ద్వారా తల్లి బిడ్డను నిద్రలేపాలి. |
09:55 | లేదా బిడ్డ యొక్క వెనుకవైపు మెల్లగా చక్కిలిగింత పెట్టాలి. |
09:59 | లేదా బిడ్డను తేన్పు రావడం కొరకు చూపిన విధంలో కూర్చోపెట్టాలి. |
10:04 | సరైన పద్దతితో పాటు, తల్లి బిడ్డకు తరచుగా పాలివ్వడం కూడా ముఖ్యం. |
10:12 | తల్లి తన బిడ్డకు 24 గంటల్లో కనీసం 12 సార్లు పాలివ్వాలి. |
10:17 | అందులో రాత్రి పూట కనీసం 2 నుండి 3 సార్లు తల్లి తన బిడ్డకు పాలివ్వాలి. |
10:24 | బిడ్డకు పాలను పట్టించడానికి, తల్లి బిడ్డయొక్క ఆకలి సంకేతాలు – కదలడం. |
10:32 | నోరు తెరవడం, తల తిప్పడం, తన చేతిని నోట్లొ పెట్టుకోవడం. |
10:37 | వేళ్ళను చీకడం మరియు వొళ్ళు విరవడం వంటివి చూడాలి. |
10:42 | ఒకవేళ బిడ్డ తల్లి పాలకోసం ఏడుస్తుంది అంటే అప్పుడు చాలా ఆలస్యం అయ్యిందని అర్థం. |
10:49 | దయచేసి గమనించండి- 2 వారాలు, 6 వారాలు మరియు 3 నెలల వయస్సులో శిశువు యొక్క పెరుగుదలలో వేగవంతమైన వృద్ధి ఉంటుంది. |
10:59 | కనుక బిడ్దకు ఇంకా ఎక్కువ పాలు అవసరం అవుతాయి. |
11:05 | అలాగే, ఒకవేళ తల్లి శిశువుకు ఎక్కువసార్లు పాలను పట్టిస్తుంటే తల్లి యొక్క పాలు కూడా పెరుగుతాయి. |
11:12 | అందువల్ల, ఇంత వేగంగా పెరుగుదల ఉన్న ఈ సమయంలో తల్లి ఇంకా ఎక్కువసార్లు పాలను పట్టిస్తూఉండాలి. |
11:19 | జీవితంలో మొదటి 6 నెలలు కొరకు బిడ్డకు తల్లి పాలే ఉత్తమమైన పోషకాహారం అని గుర్తుంచుకోండి. |
11:30 | మరియు తల్లి పరిపూర్ణంగా పాలివ్వటానికి మంచి అనుబంధం అనేది కీలకం. |
11:35 | ఇంతటితొ ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
11:37 | ఈ టుటొరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్రవంతి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |