STEMI-2017/C2/Search,-select-and-edit-a-patient-file/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:34, 31 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
NARRATION
00:00 నమస్కారము ఒక రోగి యొక్క ఫైల్ ని ఎలా శోధించడం , ఎంచుకోవడం మరియు సవరించడం అనేది తెలిపే ట్యుటోరియల్ కు స్వాగతం
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చు కునేది -

పరికరం లో ఇదివరకే సేవ్ చేసి ఉన్న రోగి ఫైల్ ని శోధించి ఎంచుకుంట.

00:17 ఇదివరకే సేవ్ చేసి ఉన్న రోగి యొక్క వివరాలను ఎడిట్ చేయుట.
00:22 ఈ ట్యుటోరియల్ను సాధన చేయడానికి, మీకు అవసరమైనవి -

స్టెమీ యాప్ ఇన్స్టాల్ చేసి ఉన్న ఒక అన్రొఇడ్ టాబ్లెట్ మరియు

00:30 ఒక పని చేస్తున్న ఇంటర్ నెట్ కనెక్షన్.
00:34 ఇప్పుడు మనము స్టేమీ హోం పేజీలో ఉన్నాము.
00:38 ఇక్కడ D Hospital user కనిపిస్తుందని గమనించండి.
00:43 మీరు ఎంచుకున్న ఆసుపత్రి ప్రకారం మీ లాగిన్ యూజర్ ఐడి భిన్నంగా ఉండవచ్చు.
00:50 సర్చ్ పేజీకి వెళ్ళడానికి సర్చ్ ట్యాబ్ని ఎంచుకోండి.
00:54 సర్చ్ పేజీ యొక్క ఎగువ ఎడమ చేతి వైపు ఒక మెనూ ట్యాబ్ ఉంది.
01:00 దాని లో ఆరు శోధన ప్రమాణాలు -

Patient ID, Patient Name, Admission From to End Date, STEMI Status, Type of Hospital, Hospital Cluster ఉన్నాయి.

01:17 అవి పేజీ ఎగువన అంతటా కనిపిస్తాయి.
01:22 ఇటీవల 14 ఎంట్రీలు కూడా ఇక్కడ క్రింద ప్రదర్శించబడ్డాయి.
01:27 ఎందుకంటే ఇప్పటికే నా స్టెమీ పరికరంలో 14 కన్నా ఎక్కువ ఎంట్రీలు ఉన్నాయి గనక
01:33 మీ స్టెమీ పరికరంలో 14 కంటే తక్కువ ఎంట్రీలు ఉంటే, మీరు దీనికన్నా చిన్న జాబితాని చూస్తారు.
01:41 కానీ మీ వద్ద 14 కంటే ఎక్కువ ఎంట్రీలు ఉం టే, ఇందులోని అత్యంత నూతన 14 ఎంట్రీలు ప్రదర్శించబడుతాయి.
01:49 సర్చ్ బటన్ పేజీ యొక్క దిగువన కుడి వైపు ఉంది.
01:54 ఇదివరకే సేవ్ చేసి ఉన్న ఒక రోగి ఫైల్ ని వెదకడానికి, మనము మన ప్రాధాన్యత గల సెర్చ్ క్రైటీరియాని ప్రవేశ పెట్టాలి.
02:03 తదుపరి పేజీ దిగువన ఉన్న సర్చ్ బటన్ ఎంచుకోవాలి.
02:08 మనము ఒక సమయంలో బహుళ శోధన ప్రమాణాలు ప్రవేశ పెట్టి కూడా పేషెంట్ ఫైల్ ని శోధించవచ్చు. ఇది శోధన ప్రక్రియని తగ్గిస్తుంది.
02:19 సర్చ్ ట్యాబ్ కింద, ఇదివరకు సేవ్ చేసిన ఫైళ్ళను మాత్రమే వెదుకవచ్చునని గమనించండి.
02:26 అదేమిటంటే -

మనం రోగి యొక్క వివరాలు ప్రవేశ పెట్టిన తరవాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ఎంచుకోక పొతే పేజి సేవ్ చెయ్యబడదు. మరియు ఆ పేజీని మనము తర్వాత వీక్షించలేము.

02:40 మనము కొన్ని ప్రమాణాల ఆధారంగా, కొన్ని సేవ్ చేసిన ఫైళ్ళను వెదుకుదాం .
02:46 మొదట, ఒక ప్రత్యేక పేషెంట్ ఐడితో ఒక రోగి యొక్క ఫైల్ని వెదుకుదాం.
02:51 కనిపించే జాబితా నుండి ఏ రోగి ఫైల్నైన ఎంచుకోండి.
02:56 మన పరికరం పై ఫైల్ తెరుచుకున్నది.
02:59 పేజీ ఎగువన కనిపించే పేషెంట్ ఐడిని గమనించండి.
03:05 నా పరికరంలో, నేను ఎంపిక చేసుకున్న రోగికి ఈ సంఖ్య చూపిస్తుంది.
03:12 మీరు మీ రోగి కోసం మీ పరికరంలో ఒక భిన్నమైన సంఖ్యని చూడవచ్చు.
03:17 ఈ సంఖ్య ను గుర్తుంచుకోండి. దానిని తరువాత ఉపయోగిద్దాం.
03:22 మనము రోగి వద్ద ఉన్న ఫైలు కవర్ మీద నుండి కూడా పేషెంట్ ఐడిని పొందవచ్చు.
03:28 డేటా ఎంట్రీ సమయంలో స్టెమీ పరికరం ద్వారా ఈ సంఖ్య స్వయంగా ఉత్పత్తి చెయ్య బడుతుంది.
03:35 ఇప్పుడు పేజీ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న మెను ట్యాబ్ని ఎంచుకోండి.
03:42 తదుపరి హోమ్ టాబ్ ఎంచుకోండి.
03:44 ఇప్పుడు మళ్ళీ హోం పేజీ లోని సర్చ్ ట్యాబ్ను ఎంచుకోండి.
03:49 మనము సర్చ్ పేజీ లో ఉన్నాము.
03:52 ఇక్కడ, పేషెంట్ ఐడి సెర్చ్ క్రైటీరియా లో పేషెంట్ ఐడిని ప్రవేశ పెట్టాలి .
03:59 నేను పేషెంట్ ఐడి సెర్చ్ క్రైటీరియాలో ఈ సంఖ్యని టైప్ చేస్తాను.

ఇది నేను ఇంతకు ముందు నోట్ చేసుకున్న ఫైలు సంఖ్య.

04:09 మీరు మీ పరికరం పై వ్రాయబడిన సంఖ్యను టైప్ చేయవలసి ఉంటుంది.
04:14 ఇప్పుడు, పేజీ యొక్క దిగువ కుడి వైపు ఉన్న సర్చ్ బటన్ ఎంచుకోండి.
04:19 టైప్ చెయ్యబడ్డ పేషెంట్ ఐడి కి సరిపోయే రోగి ఫైల్ తెరపై ప్రదర్శించబడుతుంది.
04:26 అందులోని కంటెంట్లను వీక్షించడానికి ఫైల్ను ఎంచుకోండి.
04:30 తరువాత, రమేష్ అనే రోగి పేరుతో ఒక రోగి ఫైలు వేదకుదాం
04:35 రమేష్ అనే పేరుతో రోగి ఫైలు పేజీపై ప్రదర్శించబడుతుంది.
04:40 ఫైల్ తెరిచి చూచుటకు ఫైల్ను ఎంచుకోండి మరియు కంటెంట్లను చూడండి.
04:45 ఈ పేజీ యొక్క ఎగువ కుడి వైపున 'EDIT' ఐకాన్ ని గమనించండి.
04:50 రోగి యొక్క వివరాలను ఎడిట్ చేయుటకు ఈ ఐకాన్ ని ఎంచుకోండి.
04:55 అన్ని మార్పులను సేవ్ చేయడం గుర్తుంచుకోండి.
04:59 ఇప్పుడు మనము ఒక నిర్దిష్ట తేదీ పరిధి మధ్య సేవ్ చెయ్యబడ్డ అన్ని రోగి ఫైళ్ళని వెదుకుదాం.
05:05 నేను ఫ్రొం డేట్ కోసం 1 Jan 2016 మరియు ఎండ్ డేట్ కోసం 9 Feb 2016 ఎంచుకుంటాను.
05:14 దయచేసి మీరు మీ పరికరంలో డేటా ఎంట్రీ చేసిన తేదీల ప్రకారం, తేదీ పరిధి ఎంచుకోండి.
05:22 పేజీ యొక్క దిగువ కుడివైపు సర్చ్ బటన్ ఎంచుకోండి.
05:27 Jan 1 2016 మరియు ఫిబ్రవరి 9 2016 మధ్య సేవ్ చెయ్యబడ్డ అన్ని రోగి ఫైళ్ళు ఫైళ్ళ లు, నా పేజీ పై ప్రదర్శించబడ్డాయి
05:38 మీరు మీ పరికరంలో ఇచ్చిన తేదీ పరిధి లో సేవ్ చేసిన రోగి ఫైళ్ళు చూస్తారు.
05:44 మీకు నచ్చిన ఏదయిన ఒక ఫైల్ను తెరిచి వీక్షించుటకు ఎంచుకోండి.
05:50 తరువాత, మనము STEMI status confirmed ఫైళ్ళ ను వెదుకుదాం .
05:55 స్టెమీ స్థితి శోధన వర్గీకరణ క్రింద, మా వద్ద ఈ క్రింది ఎంపికలు ఉన్నాయి-

ALL, Stemi Confirmed, Stemi Inconclusive, Stemi not Confirmed, Non Stemi.

06:11 నేను స్టెమీ ధృవీకరించబడిన అనగా STEMI Confirmed ఎంచుకోని ఆపై పేజీ దిగువ కుడివైపు సర్చ్ బటన్ ఎంచుకుంటాను.
06:18 పేజీ సేవ్ చెయ్య బడ్డ అన్ని స్టెమీ ధృవీకరించబడిన అనగా (STEMI Confirmed)రోగి ఫైళ్ళ ను చూపిస్తుం ది
06:24 నా స్టెమీ పరికరం పై, మీరు 14 పేషెంట్లను చూడగలరు.
06:28 ఈ జాబితా మీ స్టెమీ పరికరం పై ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు.
06:33 ఇది ఎందరు రోగులు స్టెమీ స్థితి ధృవీకరణ అనగా Confirmed ఎంపిక చేయబడి ఉన్నారో అనే దిని పై ఆధారపడి ఉంటుంది.
06:42 అదేవిధంగా, హాస్పిటల్ టైప్ శోధన ప్రమాణం కోసం మా వద్ద ఈ క్రింది ఎంపికలు ఉన్నాయి.

ALL EMRI A Hospital C Hospital మరియు D Hospital.

06:55 ఈ శోధన, పరికరం పై ఒక ప్రత్యేక రోగి ఫైలు మొట్టమొదట సారి ఎక్కడ ఉత్పత్తి చేయబడిందో దాని పై ఆధారపడి ఉంటుంది.
07:02 నేను D Hospital ఎంచుకొని ఆ పై సర్చ్ బటాన్ ను ఎంచుకుంటాను
07:07 మీరు వెదుకుతున్న రోగి ఫైల్, ఆధారంగా ఆసుపత్రి రకాన్ని ఎంచుకోవలసి ఉంటుంది.
07:14 నా పరికరంలో ఎంచుకున్న పేజీలో నా డి హాస్పిటల్ లోని అన్ని రోగి ఫైళ్ళను చూపిస్తుంది.
07:21 మీరు మీ ఆసుపత్రి నుండి బదిలీ అయినా రోగి ఫైళ్ళను వీక్షించడానికి ఈ సెర్చ్ క్రైటీరియాను ఉపయోగించవచ్చు.
07:29 మీ సందర్భంలో, మీ పరికరంలో యూసర్ ఐడి ప్రకారం ఉంటుంది.
07:34 అదే విధంగా, Type of Hospital Cluster కింద, మన ఎంపిక కు అణుగుణంగా సమూహం ఎంచుకోవచ్చు.
07:41 నేను కోవై మెడికల్ సెంటర్ మరియు హాస్పిటల్ ఎంచుకుంటాను.
07:45 మీ విషయంలో, మీరు మీకు నచ్చిన క్లస్టర్ని ఎంచుకోవాలి.
07:49 ఒక ప్రత్యేక క్లస్టర్ లో, హబ్ హాస్పిటల్ (అనగా A B హాస్పిటల్) ప్రకారం క్లస్టర్స్ పిలువబడుతాయి.
07:58 ఆపై పేజీ దిగువన కుడి వైపు ఉన్న సర్చ్ బటన్ ఎంచుకోండి..
08:02 ఇప్పుడు, మనము ఒక నిర్దిష్ట క్లస్టర్ క్రింద సేవ్ చేయబడిన ఫైళ్ళ ను చూడగలము.
08:08 ట్యుటోరియల్ సారాంశం.
08:09 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నది -

వివిధ శోధన ప్రమాణాలని ఉపయోగించి ఒక రోగి యొక్క ఫైల్ ని వెదికి ఎంచుకొనుట.

08:17 ఇదివరకే సేవ్ చేసిన రోగి యొక్క వివరాలను ఎడిట్ చేయుట.
08:21 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

08:34 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి Bombay NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది

మరిన్ని వివరాలకు http://spoken-tutorial.orgని సంప్రదించండి.

08:48 ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.

ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya