FrontAccounting-2.4.7/C2/Overview-of-FrontAccounting/Telugu
Time | Narration |
00:01 | Overview of FrontAccounting పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము:
FrontAccounting |
00:11 | FrontAccounting యొక్క ఫీచర్లు మరియు |
00:14 | ఈ సిరీస్ లోని వివిధ ట్యుటోరియల్‌లలో అందుబాటులోఉన్న కంటెంట్ |
00:19 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04 మరియు ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7 |
00:31 | ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ |
00:40 | ఫ్రంట్ అకౌంటింగ్ అనేది ఓపెన్ సోర్స్, వెబ్ ఆధారిత అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ |
00:45 | చిన్న నుండి మధ్య తరహా సంస్థలకు ఇది అనువైనది. |
00:49 | ఇది లైనక్స్, విండోస్ మరియు మాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల పై పనిచేస్తుంది |
00:54 | ఇది అకౌంటింగ్ పనులను ఆటోమేట్ చేస్తుంది |
00:57 | ఇది ఎర్రర్ యొక్క అవకాశాలను తగ్గిస్తుంది |
01:00 | ఫ్రంట్ అకౌంటింగ్ అనేది ప్రొఫెషనల్ అవుట్పుట్ ను ఇస్తుంది |
01:03 | ఇది ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక రిపోర్ట్స్ ను కలిగిఉంది |
01:07 | ఇది వ్యాపారం యొక్క అన్ని అంశాలను (ఆస్పెక్ట్స్) నిర్వహించడానికి (మానేజ్ చేయడానికి) సహాయపడుతుంది
అనగా ఉద్యోగ వ్యయం నుండి జాబితా నిర్వహణ వరకు ఆర్థిక నివేదికల వరకు |
01:16 | FrontAccounting అనేది వీరి చేత ఉపయోగించబడవచ్చు
అకౌంటెంట్లు, ఫైనాన్స్ నిపుణులు |
01:21 | కామర్స్ టీచర్స్ మరియు స్టూడెంట్స్ |
01:24 | ఇప్పుడు, మనం ఈ సిరీస్‌లోని ఒకోక్క ట్యుటోరియల్‌ల ద్వారా క్లుప్తంగా వెళ్తాము. |
01:30 | ఈ సిరీస్ లోని మొదటి ట్యుటోరియల్ వీటిని వివరిస్తుంది-
ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో FrontAccounting యొక్క ఇన్స్టాలేషన్ |
01:38 | ఇన్స్టాలేషన్ కు అవసరమైన Apache, PHP5 మరియు MySQL సర్వర్ వంటి ముందస్తు అవసరాలు |
01:46 | FrontAccounting కొరకు ఒక డేటాబేస్ ను ఎలా సృష్టించాలి |
01:50 | ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
01:54 | Default Language గా English ను ఎంచుకోండి. Install బటన్ పై క్లిక్ చేయండి. మనం మన స్క్రీన్ పైన FrontAccounting ERP విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడింది అనే చివరి సందేశాన్ని చూడవచ్చు. |
02:10 | తరువాతి ట్యుటోరియల్ విండోస్ OS పై ఫ్రంట్ అకౌంటింగ్ యొక్క ఇన్స్టాలేషన్ |
02:16 | ఈ ట్యుటోరియల్ వీటిని ఎలా చేయాలో వివరిస్తుంది
ఫ్రంట్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడం |
02:21 | FrontAccounting కొరకు ఒక డేటాబేస్ ను సృష్టించడం మరియు విండోస్ OS లో ఫ్రంట్ అకౌంటింగ్ ను ఇన్స్టాల్ చేయడం |
02:28 | మనం ఈ ట్యుటోరియల్ ను చూద్దాం |
02:32 | అడ్రస్ బార్ లో localhost/account అని టైప్ చేసి Enter నొక్కండి.
Step 1: System Diagnostics అని చూపించే FrontAccounting వెబ్ పేజీని మనం చూడవచ్చు Step 1: System Diagnostics అని చూపించే FrontAccounting వెబ్ పేజీని మనం చూడవచ్చు Select install wizard language అనేది English అని నిర్ధారించుకోండి. స్క్రోల్ చేసి పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేయండి. |
02:54 | తరువాతి ట్యుటోరియల్ Setup in FrontAccounting |
02:58 | ఇక్కడ మనం వీటిని నేర్చుకుంటాం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ |
03:03 | Setup టాబ్‌లోని వివిధ మాడ్యూల్స్ |
03:06 | మన స్వంత సంస్థను లేదా కంపెనీ ని సృష్టించడం |
03:10 | యూజర్ అకౌంట్స్ ను సెటప్ చేయడం |
03:13 | యాక్సెస్ పర్మిషన్ లను మరియు
డిస్ప్లే( ప్రదర్శన)ను సెటప్ చేయడం. |
03:19 | ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
03:23 | తరువాత, కంపెనీ యొక్క అడ్రస్
నివాసం, ఫోన్ నం, ఇమెయిల్ అడ్రస్ మరియు Company GST నంబర్ లను ఇక్కడ చూపిన విధంగా సంబంధిత ఖాళీలలో టైప్ చేయండి. |
03:38 | తరువాతి ట్యుటోరియల్ ఫ్రంట్ అకౌంటింగ్‌లో Banking and General Ledger |
03:43 | ఇది వీటిని ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది |
03:46 | General Ledger Classes (జనరల్ లెడ్జర్ క్లాసులు) |
03:49 | General Ledger Groups (జనరల్ లెడ్జర్ గ్రూప్ లు) |
03:52 | మరియు General Ledger Accounts (జనరల్ లెడ్జర్ అకౌంట్ లు). |
03:55 | ఈ ట్యుటోరియల్ ను ప్లే చేద్దాం. |
03:58 | Maintenance ప్యానెల్‌లోని GL Account Classes లింక్‌పై క్లిక్ చేయండి.
ఇక్కడ, అప్రమేయంగా Class Name మరియు Class Type అనేవి ఇలా నిర్వచించబడ్డాయి: Assets (ఆస్తులు), Liabilities (బాధ్యతలు), Income (ఆదాయం) మరియు Expense (ఖర్చు). |
04:15 | తరువాతి ట్యుటోరియల్ ఫ్రంట్ అకౌంటింగ్‌లో Journal Entry and Balance sheet |
04:20 | ఇక్కడ, మనం వీటిని నేర్చుకుంటాము
ఒక Journal Entry ను పాస్ చేయడం |
04:24 | Balance Sheet మరియు Void a transaction లలోఅది ఎలా ప్రతిబింబిస్తుందో చూడటం. |
04:30 | ఈ ట్యుటోరియల్ ను ప్లే చేద్దాం. |
04:34 | ఇప్పుడు, ఈ Journal Entry యొక్క నేరేషన్ (కథనం) కోసం Memo ఫీల్డ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ, ఈ టెక్స్ట్ Being capital introduced in the business ను టైప్ చేయండి. entry ను సేవ్ చేయడానికి, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Process Journal Entry బటన్ పై క్లిక్ చేయండి. ఎగువభాగం వద్ద మీరు Journal entry has been entered అని చెప్పే ఒక సందేశాన్ని (మెసేజ్) ను చూడవచ్చు. |
04:57 | తరువాతి ట్యుటోరియల్ అనేది ఫ్రంట్‌అకౌంటింగ్‌లో ఐటమ్స్ అండ్ ఇన్వెంటరీ
ను వివరిస్తుంది |
05:02 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని సెట్ చేయడం నేర్చుకుంటాము
Units of Measure, Items |
05:08 | Item Category మరియు
Sales Pricing |
05:12 | మనం ఈ ట్యుటోరియల్ ను చూద్దాం. |
05:15 | Item Categories అనేవి మనము కొనుగోలు చేసేవి మరియు విక్రయించే items ను గ్రూప్ చేయడానికి మనకు సహాయపడతాయి. Item Categories లింక్‌పై క్లిక్ చేయండి. మనము ఇక్కడ కొన్ని డిఫాల్ట్ Item categories ను చూడవచ్చు - Charges, Components, Services మరియు Systems. |
05:36 | తరువాతి ట్యుటోరియల్ ఫ్రంట్‌అకౌంటింగ్‌లో టాక్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ |
05:41 | ఇక్కడ, మనం వీటిని నేర్చుకుంటాము
ఒక కొత్త Tax ను జోడించడం |
05:45 | Bank Accounts ను సెటప్ చేయడం |
05:47 | Deposits ను జోడించడం |
05:49 | నగదును Bank Account లోకి బదిలీ చేయడం మరియు |
05:52 | Bank Account ను తిరిగి సరిచేసుకోవడం |
05:55 | ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
05:58 | నేను డిస్క్రిప్షన్ ను GST కు మరియు పర్శంటేజ్ ను 12 కు మారుస్తాను. నేను Sales GL account మరియు Purchase GL Account లను Sales tax గా ఉంచుతాను. విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Update బటన్ పై క్లిక్ చేయండి. మనం డిఫాల్ట్ ఎంట్రీ Tax ను GST కు విజయవంతంగా మార్చాము. |
06:22 | తరువాతి ట్యుటోరియల్ అనేది ఫ్రంట్‌అకౌంటింగ్‌లో సెటప్ ఫర్ సేల్స్ గురించి |
06:27 | ఇది వీటి యొక్క సెటప్ ను వివరిస్తుంది
Sales Types |
06:31 | Sales Persons
Sales Areas |
06:35 | Add and Manage Customers మరియు Customer Branches |
06:40 | ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
06:43 | Sales Types గా మనం Retail మరియు'Wholesale లను చూడవచ్చు. ఉదాహరణకు, మన వ్యాపారం యొక్క ఎక్కువ భాగం Retail.అని అనుకుని పరిశీలిద్దాం. కనుక, మనం రిటైల్ ధరను Base ధర జాబితాగా ఉంచవచ్చు. |
07:01 | తరువాతి ట్యుటోరియల్ అనేది
ఫ్రంట్‌అకౌంటింగ్‌లో ప్లేస్ సేల్స్ ఆర్డర్ గురించి |
07:06 | ఇక్కడ, మనం వీటిని చేయడం నేర్చుకుంటాము: Sales Quotation Entry
Sales Order Entry |
07:14 | Make Delivery మరియు
Sales Order Inquiry |
07:19 | ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
07:22 | - కనుక, Make Sales OrderAgainst This Quotation అనే లింక్‌పై క్లిక్ చేయండి. Sales Order Entry కొరకు ఒక విండో తెరుచుకుంటుంది. ఆ item ను వివరించే వివరాలను ఇక్కడ చూడవచ్చు. స్క్రోల్ చేయండి.
విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Place Order బటన్ పై క్లిక్ చేయండి. |
07:43 | తరువాతి ట్యుటోరియల్ అనేది ఫ్రంట్‌అకౌంటింగ్‌లో Purchases and Reports ను వివరిస్తుంది |
07:49 | ఇక్కడ మనం నేర్చుకునేవి
Suppliers ను జోడించడం |
07:53 | ఒక Purchase Order Entry ను చేయడం |
07:56 | Suppliers invoice ను సృష్టించడం మరియు
transactions పైన వివిధ reports ను రూపొందించడం |
08:04 | ఈ ట్యుటోరియల్ ను చూద్దాం |
08:07 | విండోలో, Receive Items on this Purchase Order లింక్‌పై క్లిక్ చేయండి. మన Purchase Order కొరకు రిసీవ్ చేసుకున్న items యొక్క వివరాలను మనం చూడవచ్చు. విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నProcess Receive Items బటన్ పై క్లిక్ చేయండి. |
08:24 | ఈ ట్యుటోరియల్స్ యొక్క జత అనేవి అకౌంటింగ్ యొక్క ప్రాథమిక అంశాలను కవర్ చేస్తాయి. |
08:29 | భవిష్యత్తులో, మేము ఈ సిరీస్ కు మరిన్ని టాపిక్స్ ను జోడించవచ్చు. |
08:34 | అవి FrontAccounting లోని కొన్ని అధునాతన స్థాయి కార్యకలాపాలను కవర్ చేయగలవు. |
08:39 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం. |
08:44 | ఈ ట్యుటోరియల్‌లో, మేము FrontAccounting గురించి నేర్చుకున్నాము మరియు ఈ సిరీస్‌లోని వివిధ ట్యుటోరియల్‌ల ద్వారా వెళ్ళాము. |
08:52 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
08:59 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
09:07 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?
దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి. |
09:12 | మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి
మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి |
09:19 | మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు. |
09:22 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్. |
09:27 | దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. |
09:32 | ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.
తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు. |
09:41 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |