FrontAccounting-2.4.7/C2/Setup-for-Sales-in-FrontAccounting/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 23:32, 28 May 2020 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | ఫ్రంట్‌అకౌంటింగ్‌లో సెటప్ ఫర్ సేల్స్ పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి.
Sales Types |
00:12 | Sales Persons |
00:14 | Sales Areas |
00:16 | Add and Manage Customers మరియు Customer Branches |
00:22 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04 |
00:30 | ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7 |
00:35 | ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్ ఇంకా
ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ |
00:45 | మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి. |
00:52 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
00:58 | మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి. |
01:04 | Sales అనేది అమ్మకానికి సంబంధించిన ఒక కార్యాచరణ. |
01:08 | ఇది ఒక నిర్దిష్ట వ్యవధిలో విక్రయించిన వస్తువులు లేదా సేవల మొత్తం. |
01:14 | ఇప్పుడు, మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం. |
01:19 | బ్రౌజర్‌ను ను తెరవండి.
localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
01:27 | login పేజీ కనిపిస్తుంది. |
01:30 | యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి. |
01:38 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది.
Sales టాబ్ పై క్లిక్ చేయండి. |
01:44 | Maintenance ప్యానెల్ అనేది Sales మరియు Customer వివరాల యొక్క setup కొరకు ఉపయోగించబడుతుంది. |
01:50 | ఇప్పుడు మనం Sales లో setup కొరకు దశలను చూద్దాం. |
01:56 | Step 1 - Setup Sales |
01:59 | Step2 -Setup Customers |
02:03 | Setup Sales లో, మనం ఈ క్రింది ఎంపికలను సెట్ చేయాలి. |
02:08 | Sales Types |
02:10 | Sales Persons మరియు Sales Areas
కనుక, అవి ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. |
02:18 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి మారండి. |
02:22 | Maintenance ప్యానెల్‌లో,Sales Types లింక్‌పై క్లిక్ చేయండి. |
02:27 | నిర్దిష్ట కస్టమర్ల కొరకు ధరల స్థాయిని నిర్వచించడానికి ఇది మనకు అనుమతిస్తుంది. |
02:33 | Sales Types గా మనం Retail మరియు'Wholesale లను చూడవచ్చు. |
02:39 | ఉదాహరణకు, మన వ్యాపారం యొక్క ఎక్కువ భాగం Retail.అని అనుకుని పరిశీలిద్దాం. |
02:45 | కనుక, మనం రిటైల్ ధరను Base ధర జాబితాగా ఉంచవచ్చు. |
02:51 | డిఫాల్ట్ గా, Tax included ఫీల్డ్ అనేది Yes కు సెట్ చేయబడింది. |
02:56 | tax ఎల్లప్పుడూsales లో చేర్చబడుతుంది అని దీని అర్థం. |
03:01 | Wholesale ను గుర్తించి, Edit ఐకాన్ పై క్లిక్ చేయండి. |
03:06 | Calculation Factor ఫీల్డ్‌కు వెళ్లండి. |
03:09 | ఒకవేళ మీరు కావాలనుకుంటే బేస్ ధరను సర్దుబాటు చేయడానికి Calculation factor లో టైప్ చేయండి. |
03:15 | మనం దానిని అలాగే ఉంచుతాము. |
03:18 | తరువాతిది Tax included ఫీల్డ్. |
03:22 | ఒకవేళ లెక్కింపు చేసేటప్పుడు taxes అనేవి ఒక ఫాక్టర్ గా ఉంటే ఈ బాక్స్ ను తనిఖీ చేయండి. |
03:28 | నేను Tax included చెక్-బాక్స్‌ను తనిఖీ చేస్తాను. |
03:32 | తరువాత విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్నUpdate బటన్ పై క్లిక్ చేయండి. |
03:37 | మనం ఒక సందేశాన్ని చూడవచ్చు, ఇది వివరాలు అప్ డేట్ చేయబడినవి అని సూచిస్తుంది. |
03:43 | ఫ్రంట్ ఆకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి రావడానికి Back లింక్‌పై క్లిక్ చేయండి. |
03:48 | ఇప్పుడు, మనం ఒక క్రొత్త Sales Person ను ఎలా జోడించాలో నేర్చుకుందాం. |
03:53 | Maintenance ప్యానెల్‌లో, Sales Persons లింక్‌పై క్లిక్ చేయండి. |
03:58 | ఇక్కడ, మనంసేల్స్ పర్సన్ కు సంబంధించినవి అవసరమైన సమాచారంలో నింపాలి. |
04:05 | ఇక్కడ చూపిన విధంగా వివరాలను నింపండి. |
04:09 | Provision ఫీల్డ్ అనేది Sales Person చేత వయోగించబడుతుంది. |
04:13 | వారు విక్రయించేవాటిపై అతను commission లేదా provision ను పొందుతాడు. |
04:18 | కనుక, నేను Provision ఫీల్డ్ లో commission గా 5% ని టైప్ చేస్తాను. |
04:25 | తరువాతిది Turnover Break Point Level. |
04:29 | ఇది సేల్స్ పర్సన్ కొరకు ఉపయోగించబడుతుంది. |
04:32 | ఈ మొత్తం అనేది బ్రేక్ పాయింట్ ను మించి ఉంటేనే అతనికి ప్రొవిజన్ లభిస్తుంది. |
04:37 | కనుక, Break point ఫీల్డ్‌లో, నేను ఒక లక్ష అని టైప్ చేస్తాను. |
04:42 | ఒకవేళ Sales Person బ్రేక్ పాయింట్ కు పైన విక్రయిస్తే, అతనికి 5% commission లభిస్తుంది. |
04:50 | మన విషయంలో ఇది ఒక లక్ష రూపాయలు. |
04:54 | ఒకవేళ Sales Person బ్రేక్ పాయింట్ కు క్రింద విక్రయిస్తే Provision 2 ఫీల్డ్ అనేది ఉపయోగించబడుతుంది. |
05:01 | ఇక్కడ నేను 3 నిటైప్ చేస్తాను.
అంటే, సేల్స్ పర్సన్ ఓవేళ 1 లక్ష కన్నా తక్కువ విక్రయిస్తే, అప్పుడు అతనికి 3% commission లభిస్తుంది అని అర్ధం. |
05:12 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి. |
05:17 | తరువాత ఫ్రంట్ ఆకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి రావడానికి Back లింక్‌పై క్లిక్ చేయండి. |
05:23 |
ఇప్పుడు, మనం ఒక కొత్త Sales Area ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. |
05:28 | Maintenance ప్యానెల్‌లో, Sales Areas లింక్‌పై క్లిక్ చేయండి |
05:33 | సేల్స్ ఏరియా ఆధారంగా, మనం సేల్స్ ఆర్డర్స్ ను సృష్టించవచ్చు మరియు dispatches ను చేయవచ్చు. |
05:40 | మనం సృష్టించాలనుకుంటున్న క్రొత్త Area Name ను టైప్ చేయండి.
నేను South Mumbai అని టైప్ చేస్తాను. |
05:47 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ మార్పులను సేవ్ చేయండి. |
05:53 | అప్ డేట్ అయిన ఎంట్రీతో టేబుల్ ను కూడా మనం చూడవచ్చు. |
05:58 | ఫ్రంట్ ఆకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి రావడానికి Back లింక్‌పై క్లిక్ చేయండి. |
06:03 | మనం ఒక Sales Order ను కోట్ చేయడానికి ముందు, వీటిని మనం set up చేయాలి: |
06:08 | Add and Manage Customers మరియు Customer Branches |
06:14 | కస్టమర్ అనేది వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసే ఒక వ్యక్తి లేదా ఒక వ్యాపారం. |
06:21 | మన ఉత్పత్తులను విక్రయించడానికి మనం కస్టమర్లను జోడించాలి. |
06:25 | ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి మారండి. |
06:29 | Maintenance ప్యానెల్ యొక్క దిగువభాగం వద్ద ఎడమ వైపున ఉన్న Add and Manage Customers పై క్లిక్ చేయండి. |
06:36 | చూపిన విధంగా కస్టమర్ యొక్క అవసరమైన అన్ని వివరాలను నింపండి. |
06:42 | Customer’s Currency డ్రాప్-డౌన్ బాక్స్‌లో, Indian Rupees ను ఎంచుకోండి. |
06:47 | Sales Type or Price List డ్రాప్-డౌన్ బాక్స్‌లో, Retail ను ఎంచుకోండి. |
06:53 | చూపిన విధంగా కస్టమర్ యొక్క సంప్రదింపు వివరాలను నింపండి. |
06:58 | Sales Person పేరుగా నేను ఇంతకు ముందు సృష్టించిన Rahul ను ఎంచుకున్నాను. |
07:05 | కుడి చేతి వైపున మనం Sales కాలమ్ ను చూడవచ్చు. |
07:09 | ఆ కస్టమర్ కొరకు వర్తించే Discount, Credit మరియు ఇతర షరతులను నింపండి. |
07:16 | నేను డిఫాల్ట్ సెట్టింగులను అలాగే ఉంచుతాను. |
07:20 | స్క్రోల్ చేయండి.
విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new Customer బటన్ పై క్లిక్ చేయండి. |
07:28 | ఆ డిఫాల్ట్ బ్రాంచ్ జోడించబడిందనే మెసేజ్ ను మనం చూడవచ్చు. |
07:33 | sales లేదా delivery orders ను జారీ చేయడానికి ఒక customer తప్పనిసరిగా ఒక customer branch ను కలిగి ఉండాలి. |
07:40 | మొదట, మనం ఈ మార్పులను కొత్త Sales Entry కొరకు వర్తింపజేయాలి.
స్క్రోల్ చేయండి. |
07:49 | విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Update Customer బటన్ పై క్లిక్ చేయండి. |
07:54 | విజయ సందేశం మనం కస్టమర్ వివరాలను అప్ డేట్ చేసినట్లు సూచిస్తుంది. |
08:00 | ఫ్రంట్ ఆకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి రావడానికి Back లింక్‌పై క్లిక్ చేయండి. |
08:05 | ఇప్పుడు, మనం డిఫాల్ట్ branch అనేది జోడించబడిందా లేదా అని చూద్దాం. |
08:11 | Maintenance ప్యానెల్‌లో, Customer Branches లింక్‌పై క్లిక్ చేయండి. |
08:16 | డిఫాల్ట్ branch Global అనేది customer కు జోడించబడిందని మనం చూడవచ్చు. |
08:22 | ఇచ్చిన entry లో మార్పులను చేయడానికి, కుడి వైపున ఉన్న Edit ఐకాన్ పై క్లిక్ చేయండి. |
08:28 | Sales ప్యానెల్‌లో, Sales Area డ్రాప్-డౌన్ బాక్స్‌పై క్లిక్ చేసి, South Mumbai ను ఎంచుకోండి. |
08:36 | ఇతర ఫీల్డ్ ఎంట్రీలను అలాగే ఉంచండి |
08:40 | Mailing address మరియు Billing address అనేవి customer address లాగానే ఉంటాయి. |
08:46 | ఒకవేళ మీకు వేరే address ఉంటే, మీరు దానిని ఇక్కడ మార్చవచ్చు. |
08:50 | ఈ మార్పును సేవ్ చేయడానికి విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Update బటన్ పై క్లిక్ చేయండి. |
08:56 | branch అప్‌డేట్ అవుతుంది మరియు ఎగువభాగం వద్ద విజయ సందేశం కనిపిస్తుంది. |
09:01 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
సారాంశం చూద్దాం. |
09:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని setup చేయడం నేర్చుకున్నాము:
Sales Types |
09:13 | Sales Persons |
09:15 | Sales Areas |
09:17 | Add and manage Customers మరియు Customer Branches |
09:23 | ఒక అసైన్మెంట్ గా, మరొక కస్టమర్ ను జోడించండి |
09:28 | క్రొత్త customer వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింక్‌ను చూడండి. |
09:34 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
09:42 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
09:52 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్.  లో పోస్ట్ చేయండి. |
09:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
10:02 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |