FrontAccounting-2.4.7/C2/Setup-in-FrontAccounting/Telugu
| |
|
| 00:01 | Setup in FrontAccounting పై ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
| 00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి: ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ |
| 00:12 | Setup టాబ్లోని వివిధ మాడ్యూల్స్ |
| 00:15 | అలాగే, మనం వీటిని ఎలా చేయాలో నేర్చుకుంటాము: మన స్వంత సంస్థను లేదా కంపెనీ ని సృష్టించడం |
| 00:21 | క్రొత్త వినియోగదారుల ఖాతాలను (యూజర్ అకౌంట్స్) సెటప్ చేయడం |
| 00:24 | యాక్సెస్ పర్మిషన్ లను సెటప్ చేయడం మరియు
డిస్ప్లే( ప్రదర్శన)ను సెటప్ చేయడం. |
| 00:29 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:
ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04 |
| 00:37 | ఫ్రంట్ అకౌంటింగ్ 2.4.7 |
| 00:41 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి మీకు హైయర్ సెకండరీ కామర్స్ పై అవగాహన మరియు అకౌంటింగ్ పరిజ్ఞానం ఉండాలి. |
| 00:50 | మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి. |
| 00:56 | మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం. |
| 01:00 | బ్రౌజర్‌ను తెరిచి, localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
| 01:07 | login పేజీ కనిపిస్తుంది. |
| 01:10 | ఇన్స్టాలేషన్ సమయంలో, మనం అడ్మిన్ యూజర్ ను సృష్టించామని గుర్తుచేసుకోండి. |
| 01:16 | యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ గా spoken ను టైప్ చేయండి. |
| 01:22 | తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి. |
| 01:25 | FrontAccounting విండో తెరుచుకుంటుంది. |
| 01:28 | ఫ్రంట్ అకౌంటింగ్లో ప్రామాణిక మాడ్యూల్స్ అందించబడ్డాయి. |
| 01:32 | మనం వీటిని గురించి నేర్చుకుంటాము
Sales Purchases (అమ్మకాలు కొనుగోళ్లు) |
| 01:38 | Items and Inventory (అంశాలు మరియు జాబితా) |
| 01:40 | బ్యాంకింగ్ అండ్ జనరల్ లెడ్జర్ మరియు సెటప్ మాడ్యూల్స్ గురించి రాబోయే ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాం. |
| 01:47 | ఫ్రంట్ అకౌంటింగ్ లోని Setup టాబ్‌తో మనం ప్రారంభిద్దాం. |
| 01:51 | Setup టాబ్ పై క్లిక్ చేయండి.
ఈ మాడ్యూల్ కంపెనీ సెట్టింగ్ కోసం ఉపయోగించబడుతుంది. |
| 01:57 | Company Setup లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కొత్త సంస్థను లేదా కంపెనీ ను సృష్టిద్దాం. |
| 02:04 | డిఫాల్ట్ గా నేమ్ ఫీల్డ్ లో, మనం కంపెనీ యొక్కపేరును company - ST Company Pvt Ltd అని చూడవచ్చు, |
| 02:12 | ఇలా ఎందుకంటే మనం ఇన్స్టాలేషన్ సమయంలో ఈ పేరును ఇచ్చాము కనుక. |
| 02:17 | ఏదేమైనా, మీరు నివేదికలలో పేరు ఎలా కనిపించాలని అనుకుంటున్నారో దాని ఆధారంగా మీరు పేరును మార్చుకోవచ్చు. |
| 02:23 | నేను అదే పేరును ఉంచుతాను.
స్క్రోల్ చేయండి. |
| 02:28 | Home currency ఫీల్డ్‌లో, డ్రాప్‌డౌన్ మెనుపై క్లిక్ చేయండి |
| 02:32 | ఎంపికల యొక్క ఒక జాబితా కనిపిస్తుంది. |
| 02:35 | కానీ Indian Rupees అనేది ఈ జాబితాలో అందుబాటులో లేదు. |
| 02:39 | మన కంపెనీ భారతదేశంలో ఉన్నందున, మనం home currency ను Indian Rupees (భారతీయ రూపాయిల) కు సెటప్ చేస్తాము. |
| 02:45 | ఇక్కడ ఉన్న జాబితాకు కొత్త కరెన్సీ ని ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం. |
| 02:50 | ఎగువన ఉన్న మెనూలోని Banking and General Ledger టాబ్ పై క్లిక్ చేయండి. |
| 02:55 | Maintenance ప్యానెల్ లో, Currencies లింక్ పై క్లిక్ చేయండి.
ఒక క్రొత్త విండో కనిపిస్తుంది. |
| 03:03 | Currency Abbreviation ఫీల్డ్ లో INR అని మరియు Currency Symbol ఫీల్డ్ లో Rs అని టైప్ చేయండి. |
| 03:11 | Currency Name ఫీల్డ్ లో Indian Rupees అని టైప్ చేయండి. |
| 03:15 | Hundredths Name ఫీల్డ్ లో Paise అని మరియు Country ఫీల్డ్ లో India అని టైప్ చేయండి. |
| 03:23 | ఇప్పుడు విండో యొక్క దిగువ బాదం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి. |
| 03:28 | New currency has been added అనే ఒక విజయ సందేశాన్ని మనం చూడవచ్చు. |
| 03:33 | Company setup పేజీకి తిరిగి వెళ్దాం.
దీని కోసం, ఎగువన ఉన్న మెనూలోని Setup టాబ్‌పై క్లిక్ చేసి, ఆపై Company Setup లింక్‌పై క్లిక్ చేయండి. |
| 03:43 | తరువాత, కంపెనీ యొక్క అడ్రస్ |
| 03:47 | నివాసం, ఫోన్ నం, ఇమెయిల్ అడ్రస్ మరియు Company GST నంబర్ లను
ఇక్కడ చూపిన విధంగా సంబంధిత ఖాళీలలో టైప్ చేయండి. |
| 03:58 | ఇప్పుడు, హోమ్ కరెన్సీ డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
| 04:02 | Indian Rupees ను ఎంచుకోండి. |
| 04:05 | తరువాత మనం ఆర్థిక సంవత్సరం (ఫిసికల్ ఇయర్) గురించి నేర్చుకుంటాము. |
| 04:09 | అప్రమేయంగా మునుపటి ఆర్థిక సంవత్సరం, అనగా 1 st జనవరి నుండి 31 st డిసెంబర్ 2018 వరకు మూసివేయబడినట్లు చూపబడింది. |
| 04:18 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేసే సమయంలో, తేదీ అనేది స్క్రీన్ పై చూపిన విధంగా ఉంది. |
| 04:24 | మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇది భిన్నంగా ఉండవచ్చు. |
| 04:28 | తేదీ ఫార్మాట్ అనేది MMDDYYYY లో ఉందని గమనించండి. |
| 04:35 | ఆర్థిక సంవత్సరం (ఫిసికల్ ఇయర్) అంటే ఏమిటి? |
| 04:37 | ఇది ఒక కంపెనీ అకౌంటింగ్ ప్రయోజనాల కొరకు మరియు ఆర్థిక నివేదికలను తయారుచేయడం కొరకు ఉపయోగించే కాలం.
ఇది వేర్వేరు దేశాలలో మారుతూ ఉంటుంది. |
| 04:47 | Fiscal Year setup (ఆర్థిక సంవత్సరాన్ని సెటప్ చేయడం)
ఫ్రంట్ అకౌంటింగ్ లో కొత్త కంపెనీ ని సృష్టించేటపుడు, Fiscal Year ని (ఆర్థిక సంవత్సరాన్ని )సరిగ్గా అమర్చాలి. |
| 04:56 | అప్రమేయంగా, ఫ్రంట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది fiscal year ని (ఆర్థిక సంవత్సరాన్ని) జనవరి నుండి డిసెంబర్ వరకు చూపిస్తుంది. |
| 05:03 | ఇది భారతదేశంలోని కంపెనీలకు మరియు సంస్థలకు తగినది కాదు. |
| 05:08 | మనము ఆ fiscal year (ఆర్థిక సంవత్సరం) కొరకు 1 st ఏప్రిల్ నుండి 31 st మార్చి వరకు fiscal year (ఆర్థిక సంవత్సరాన్ని) ను ఏర్పాటు చేయాలి. |
| 05:15 | ఇది ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం. |
| 05:19 | మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్కు తిరిగి వెళ్దాం. |
| 05:23 | ఎంట్రీలను సేవ్ చేయడానికి క్రిందికి స్క్రోల్ చేసి, Update బటన్ పై క్లిక్ చేయండి. |
| 05:28 | మనం Company setup has been updated అనే ఒక సందేశాన్ని చూడవచ్చు. |
| 05:33 | ఇప్పుడు, మనం Fiscal Year (ఆర్థిక సంవత్సరాన్ని) ని ప్రస్తుత Financial Yearకి (ఆర్థిక సంవత్సరానికి) మారుస్తాము. |
| 05:38 | ఫ్రంట్ అకౌంటింగ్ యొక్క Setup టాబ్ పై క్లిక్ చేయండి. |
| 05:42 | Fiscal Years లింక్ పై క్లిక్ చేయండి. |
| 05:45 | అప్రమేయంగా Fiscal Year (ఆర్థిక సంవత్సరం) అనేది 01 జనవరి 2018 నుండి 31 డిసెంబర్ 2018 వరకు ప్రారంభమవుతుందని మనం చూడవచ్చు. |
| 05:55 | కనుక మొదట, మనం 01 జనవరి 2019 నుండి 31 మార్చి 2019 వరకు 3 నెలల డమ్మీ (నకిలీ) కాలాన్ని సృష్టిస్తాము. |
| 06:05 | డమ్మీ (నకిలీ) కాలం ఎందుకు? ఇది ఎందుకంటే, Fiscal Year (ఆర్థిక సంవత్సరం) అంటే జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు మరియు ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉన్నFinancial Year (ఆర్థిక సంవత్సరం) కి మధ్యనున్న అంతరాన్ని మనం పూరించాలి కనుక. |
| 06:20 | మీరు ఈ ట్యుటోరియల్ ని సాధన చేస్తున్నప్పుడు మీరు వేరే ఆర్థిక సంవత్సరంలో ఉండవచ్చు. |
| 06:25 | అటువంటి సందర్భంలో,మీరు ప్రస్తుత financial year (ఆర్థిక సంవత్సరం) వరకు ఉన్న మునుపటి అన్ని సంవత్సరాల కొరకు fiscal year ( ఆర్థిక సంవత్సరం) ను ఏర్పాటు చేయాలి. |
| 06:33 | మీ అవగాహన కోసం ఇక్కడ ఒక నమూనా చూపబడింది. |
| 06:38 | మొదట, 3 నెలల డమ్మీ (నకిలీ) కాలాన్ని 01 జనవరి 2019 నుండి 31 మార్చి 2019 వరకు ఎంచుకోండి. |
| 06:47 | ఇప్పుడు, Add New బటన్ పై క్లిక్ చేయండి. |
| 06:51 | dummy period సృష్టించబడినట్లు మనం చూడవచ్చు. |
| 06:53 | New Fiscal year has been added అని ఒక సందేశం కనిపిస్తుంది |
| 06:58 | అప్పుడు, ప్రస్తుత financial year (ఆర్థిక సంవత్సరం) ను 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చి 2020 వరకు మనం చూడవచ్చు. |
| 07:07 | ప్రస్తుత financial year (ఆర్థిక సంవత్సరాన్ని) ను మనం అకౌంటింగ్ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తున్నందున Is closed ఎంపికను No గా ఉంచండి. |
| 07:15 | మళ్ళీ, Add New బటన్ పై క్లిక్ చేయండి. |
| 07:19 | ఇక్కడ, మీరు financial year (ఆర్థిక సంవత్సరం) సృష్టించబడిందని చూడవచ్చు. |
| 07:24 | 2018 జనవరి 1 నుండి 2018 డిసెంబర్ 31 వరకు ఉన్నfiscal year (ఆర్థిక సంవత్సరం) మూసివేసినట్లుగా మనం చూడవచ్చు. |
| 07:32 | మనము 1 st జనవరి 2019 నుండి 31 మార్చి 2019 వరకు డమ్మీ (నకిలీ) కాలాన్ని సృష్టించాము. |
| 07:39 | మనము Is Closed ఎంపికను Yes అని మారుస్తాము.
Edit icon పై క్లిక్ చేయండి |
| 07:46 | Is Closed డ్రాప్ డౌన్ మెనులో, Yes. ను ఎంచుకోండి. |
| 07:50 | ఒకవేళ మునుపటి financial years (ఆర్థిక సంవత్సరాలు) అవసరం లేకపోతే వాటిని మూసివేయడానికి అవే దశలను పునరావృతం చేయండి. |
| 07:57 | Update బటన్ పై క్లిక్ చేయండి. |
| 08:00 | Selected fiscal year has been updated అనే ఒక సందేశం కనిపిస్తుంది. |
| 08:05 | అదేవిధంగా మీరు మార్పులను చేయడానికి Edit బటన్‌ను ఉపయోగించవచ్చు |
| 08:10 | cross (X) sign సంవత్సరాన్ని తొలగించడం కొరకు
ప్రస్తుతం, మనము ఏ అడ్డు వరుసలను తొలగించము. |
| 08:17 | ఇప్పుడు, ఈ మార్పులను Company setup లో update చేయాల్సిన అవసరం ఉంది. |
| 08:22 | Setup టాబ్ పై క్లిక్ చేయండి.
తరువాత Company Setup లింక్ పై క్లిక్ చేయండి. |
| 08:28 | fiscal year (ఆర్థిక సంవత్సరం) ఫీల్డ్ లో,డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేయండి. |
| 08:32 | active గా చూపించబడుతున్న ప్రస్తుత Financial Year (ఆర్థిక సంవత్సరం) 1 st ఏప్రిల్ 2019 నుండి 31sup> st </sup> మార్చి 2020 వరకు ఎంచుకోండి. |
| 08:41 | స్క్రోల్ చేసి Login Timeout ఎంపికకు వెళ్ళండి. |
| 08:46 | మనము 6 లక్షల సెకన్లకు పెంచుతాము, దానివల్ల తరచుగా logout లేదా timeout లు రాకుండా నివారించవచ్చు. |
| 08:53 | Update బటన్ పై క్లిక్ చేయండి. |
| 08:56 | తరువాత మనం User Accounts (వినియోగదారుల ఖాతాలను) ను సెటప్ చేస్తాము. |
| 09:00 | మళ్ళీ Setup టాబ్ పై క్లిక్ చేయండి. |
| 09:03 | User Accounts Setup లింక్‌పై క్లిక్ చేయండి. |
| 09:06 | admin user login యొక్క సమాచారం Full Name, Email, Access Level, మొదలైనటువంటివాటిని మనం చూడవచ్చు |
| 09:15 | ఇన్స్టాలేషన్ సమయంలో ఈ సమాచారం ఎంటర్ చేయబడిందని గుర్తుచేసుకోండి. మనం ఒక కొత్త user login ను సృష్టిద్దాం. |
| 09:22 | ఇక్కడ చూపిన విధంగా నేను క్రొత్త యూజర్ వివరాలను టైప్ చేసాను.
అదేవిధంగా, మీ క్రొత్త యూజర్ వివరాలను ఎంటర్ చేయండి. |
| 09:30 | Access Level field ఫీల్డ్ లో డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేసి, Sub Admin ను ఎంచుకోండి. |
| 09:36 | Language field లో, అప్రమేయంగా, డ్రాప్-డౌన్ మెను ఎంపిక అనేది English. |
| 09:42 | ఇక్కడ, POS అంటే Point of Sale.
మేము డిఫాల్ట్ ఎంపికను ఉంచుతాము. |
| 09:49 | Printing option డ్రాప్ డౌన్ మెను లో, డిఫాల్ట్ ఎంపిక Browser printing support ను ఉంచండి. |
| 09:56 | తరువాత, అప్రమేయంగా, reports ఎంపిక కొరకు popup విండో కొరకు చెక్ బాక్స్ తనిఖీ చేయబడుతుంది. |
| 10:03 | Add new బటన్ పై క్లిక్ చేయండి.
A new user has been added అనే సందేశాన్ని మనం చూడవచ్చు. |
| 10:10 | కొత్త యూజర్ అడ్మిన్ క్రిందన ఉన్న ప్యానెల్లో జోడించబడిందని కూడా మనం చూడవచ్చు. |
| 10:16 | మళ్ళీ, Setup టాబ్ పై క్లిక్ చేయండి. |
| 10:20 | తరువాత మనం Access setup ను చూద్దాం. |
| 10:23 | Role డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేసి, Sub Admin ను ఎంచుకోండి. |
| 10:28 | ఉపయోగించడం కొరకు Sub Admin కు డిఫాల్ట్ access ఇవ్వబడింది మనం చూడవచ్చు.
స్క్రోల్ చేయండి. |
| 10:35 | సబ్ అడ్మిన్ కోసం అందుబాటులో ఉన్న అనుమతులను మనం చూడవచ్చు. |
| 10:39 | సబ్ అడ్మిన్ ఉపయోగించడం కొరకు అవసరమైన బాక్సులను మీరు కూడా చెక్ చేయవచ్చు లేదా అన్‌చెక్ చేయవచ్చు. |
| 10:46 | తరువాత Save Role బటన్ పై క్లిక్ చేయండి. |
| 10:49 | Security role has been updated అనే ఒక సందేశం కనిపిస్తుంది. |
| 10:54 | అదేవిధంగా, మీరు మీ అవసరానికి అనుగుణంగా కొందరు యూజర్ లను సృష్టించవచ్చు మరియు వారికి అవసరమైన అనుమతులు ఇవ్వవచ్చు. |
| 11:01 | మళ్ళీ, Setup టాబ్ పై క్లిక్ చేసి, ఆపై Display Setup లింక్ పై క్లిక్ చేయండి. |
| 11:07 | Display Setup అనేది Decimal Places (దశాంశ స్థానాలు),Date format and Separators (తేదీ ఆకృతి మరియు సెపరేటర్లు), ఇతర parameters(పారామితులను) ను మార్చడానికి ఉపయోగించబడుతుంది. |
| 11:16 | Prices/amounts (ధరలు /మొత్తాలు), Quantities (పరిమాణాలు),Exchange rate (మారకపు రేటు )మరియు Percentages (శాతాలు) కొరకు Decimal Places (దశాంశ స్థానాల) సంఖ్యను మనం చూడవచ్చు. |
| 11:27 | డ్రాప్-డౌన్ మెనుని ఎంచుకోవడం ద్వారా మనం డేట్ ఫార్మాట్ మరియు డేట్ సెపరేటర్స్ ను మార్చవచ్చు. |
| 11:33 | మనం Date format ను DDMMYYYY కు మారుస్తాము. |
| 11:41 | మనం వివిధ ఇతర సెట్టింగులను (Miscellaneous Settings) కూడా చూడవచ్చు. |
| 11:45 | మార్పులను సేవ్ చేయడానికి అప్డేట్ బటన్ పై క్లిక్ చేయండి.. |
| 11:49 | Display settings have been updated అనే ఒక సందేశాన్ని మనం చూడవచ్చు. |
| 11:54 | ఇప్పుడు మనం fiscal year (ఆర్థిక సంవత్సరం) date format ను తనిఖీ చేస్తాము.
Setup tab కు వెళ్ళండి. |
| 12:01 | Company Setup ప్యానల్ క్రింద, fiscal year (ఆర్థిక సంవత్సరం) లింక్ పై చేయండి. |
| 12:06 | date format అనేది DDMMYYYY ఫార్మాట్ కు మార్చబడిందని మనం చూడవచ్చు. |
| 12:14 | గుర్తుచేసుకోండి, ప్రారంభంలో మనం fiscal year (ఆర్థిక సంవత్సరాన్ని) ను జోడించినప్పుడు అది MMDDYYYY ఫార్మాట్. |
| 12:23 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం. |
| 12:28 | ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకున్నవి
ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ మరియు Setup టాబ్లోని వివిధ మాడ్యూల్స్ |
| 12:36 | అలాగే, మనం వీటిని ఎలా చేయాలో నేర్చుకున్నాం: మన స్వంత సంస్థను లేదా కంపెనీ ని సృష్టించడం |
| 12:42 | వినియోగదారుల ఖాతాలను (యూజర్ అకౌంట్స్) సెటప్ చేయడం
యాక్సెస్ పర్మిషన్ లను సెటప్ చేయడం మరియు డిస్ప్లే( ప్రదర్శన)ను సెటప్ చేయడం. |
| 12:50 | ఒక అసైన్మెంట్ గా,యూజర్ అకౌంట్స్ సెటప్ ను ఉపయోగించి ఒక కొత్త యూజర్ ను జోడించండి. |
| 12:55 | ఒక అకౌంటెంట్ గా యాక్సెస్ లెవెల్ ను ఇవ్వండి. |
| 12:59 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
| 13:06 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
| 13:15 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
| 13:19 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
| 13:24 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |